Sunday, March 29, 2015
Wednesday, March 25, 2015
Tuesday, March 24, 2015
ఇస్లాం విహాంగ వీక్షణం
by- syed abdussalam umri
అజ్ఞానం, అంధకారంలో మునిగి ఉన్న ఆ సమాజం జ్ఞాన కాంతులతో ప్రకాశించింది.
నామోషిగా భావించి ఆడకూతుళ్ళను సజీవ సమాధి చేసిన తల్లి దండులే ఆమె పుట్టుకను శుభవార్తగా, స్వర్గానికి సోపానంగా, నరకాగ్ని నుండి కాపాడే రక్షక కవచంగా భావించి తలెత్తుకు తిరిగారు.
కుమా రులతోపాటు కుమార్తెలకు సయితం ఆస్తి హక్కు ఇవ్వడం తమ విధిగా గుర్తించారు.
శతాబ్దాల పాటు మద్యం మత్తులో జోగిన ఆ జాతి – ఇక ప్రళ యం వరకు ఒక్క చుక్క మద్యం కూడా ముట్టేది లేదని శపథం చేసింది.
తన స్థాయి, ఆత్మగౌరవాన్ని మరచిపోయి అగుపించిన ప్రతి వస్తువును దైవంగా తలంచి పూజించనవారు, నిజ సృష్టికర్త ఒక్కడేనని, సకల ఆరాధనలకు, సమస్త స్తోత్రాలకు, ఉపసనా రీతులకు ఆయన ఒక్కడే అర్హుడని అర్థం చేసుకున్నారు.
ఊడిగం, వెట్టి చాకిరి చెయ్యడానికే వీరు పుట్టారు అనుకునే తమ బాని సలను నాయకులుగా, అధినాయకులుగా నియమించుకోవడానికి సిద్ధ మయ్యారు ఆ జాతి పెద్దలు. వారిలో వచ్చిన ఈ మార్పుకి, వారి ఈ సత్ప్రవర్తనకు, పరివర్తనకు కార ణం ఒక్కటే – అదే ఇస్లాం! ఇస్లాం మనిషి ఇహపరాల సౌభాగ్యానికి, సిసలయిన సంతోషానికి, అసలయిన సంతృప్తికి పూచీ వహిస్తుంది. అదెలా అంటే?
నిజ సృష్టికర్త అయిన అల్లాహ్ యెడల దాసుడు విశ్వాసం కలిగి ఉండటం ద్వారా దీన్ని సాధించుకోగలడు అంటుంది, ఇస్లాం. దాసునికి మరియు దేవునికి మధ్య గల ఈ అనుబంధం వల్లనే మనిషికి అసలయిన సంతోషం, సిసలయిన సంతృప్తి సాధ్యమవుతుంది. ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది: ”విశ్వసించిన వారి సంరక్షకునిగా స్వయంగా అల్లాహ్‌ా ఉంటాడు. ఆయన వారిని చీకట్ల నుండి వెలుగు వైపునకు తీసుకుపోతాడు. కాగా అవిశ్వాసుల నేస్తాలు షైతానులే. వాళ్ళు వారిని వెలుగు నుండి చీకట్ల వైపు లాక్కు పోతారు. వారు నరక వాసులు, కలకాలం అందులోనే పడి ఉంటారు”. (బఖరహ్: 257) ఈ మేరకు మానవతా ధర్మమయిన ఇస్లాం మానవాళికి ఇచ్చే రక్షణ గురించి, శిక్షణ గురించి తెలుసుకుందాం!
ధర్మ పరిరక్షణ
మనిషి పుట్టుకతోనే స్వేచ్ఛాజీవి. తనకు సంబంధించిన ప్రతి విషయం లోనూ పూర్తి స్వేచ్ఛ కలిగి జీవించాలని కోరుకుంటాడు. అదే స్వేచ్ఛ తాను అవలంబించే మతధర్మం విషయంలో సయితం తనకు దక్కాలని అభిలషిస్తాడు. అతని ఈ సహజ భావనకనుగుణంగానే సర్వలోక సృష్టి కర్త అతన్ని పుట్టించి, వినే, అనే, కనే శక్తిని అనుగ్రహించి, సత్యా సత్యాల వ్యత్యాసాన్ని విడమరచి చెప్పడంతోపాటే, బాటను అనుసరిం మాటను అనుసరించే సేచ్ఛను మాత్రం అతనికి ప్రసాదించాడు. ఇలా అన్నాడు: ”అసాంతం సత్యం (కూడుకున్న ఈ ఖుర్‌ఆన్) మీ ప్రభువు తరఫు నుంచి వచ్చిందని ప్రకటించు. ఇక కోరిన వారు దీన్ని విశ్వసించ వచ్చు మరియు కోరిన వారు నిరాకరిమచవచ్చు”. (దివ్యఖుర్‌ఆన్-18:29)
ధర్మం – ఎంతటి మహత్తు గలదంటే, అల్లాహ్‌ా ప్రజలన్ని దాని కోసమే పుట్టించాడు. దాన్ని సమస్త మానవాళికి చేరవేయడానికి, దాన్ని సంరక్షించడానికి ప్రవక్తల్ని ప్రభవింపజేశాడు. గ్రంథాల్ని అవతరింపజేశాడు. ఇలా సెలవిచ్చాడు: ‘మేము ప్రతి సముదాయంలోనూ ప్రవక్తను ప్రభవింపజేశాము. అతని ద్వారా (ప్రజలారా!) ”అల్లాహ్‌ాను మాత్రమే ఆరాధించండి. ఆయన తప్ప ఇతరత్రా మిథ్యా దైవాలకు దూరంగా ఉండండి” అని బోధ పర్చాము’. (అన్నహ్ల: 36)
మతధర్మాన్ని ఎంచుకునే పూర్తి స్వేచ్ఛ మనిషికి ఉన్నప్పటికీ అతను సత్యధర్మాన్నే అనుసరించినట్లయితే దానికి బదుసు స్వర్గసీమను ప్రసాది స్తానని శుభవార్తను అందజేయడంతోపాటు, ఒకవేళ ఆ సేచ్ఛను దుర్వి నియోగ పరచి మిథ్యావాదాలను, అసత్యాలను, అర్థ సత్యాలను నమ్మి బతికినట్లయితే నరక యాతనలు తప్పవు అని హెచ్చరించాడు కూడా. అయితే మత స్వేచ్ఛ మాత్రం అతని శ్వాస ఆగేంత వరకు అతనికుం టుంది. ఆ విషయంలో ఎలాంటి బలవంతం, బలాత్కారం లేదు అన్నాడు అల్లాహ్: ”ధర్మం విషయంలో బలవంతం ఏమీ లేదు. సన్మార్గం అపమార్గం నుండి ప్రస్పుటమయింది”. (బఖరహ్: 256)
మేధో రక్షణ
మనిషి మస్తిష్కాన్ని పాడు చేసే ప్రతి విధమయినటువంటి విషయా న్నుండి ఇస్లాం వారిస్తుంది. ఎందుకంటే, మనిషికి ప్రాప్తమయి ఉన్న ఇతర భౌతికానుగ్రహాలు ఓ ఎత్తయితే విచక్షణా జ్ఞానం, తెలివీతేటలు ఓ ఎత్తు.అతనికి ప్రాప్తమయి ఉన్న ఈ మేధోశక్తి ఆధారంగానే ఇతర సృష్టి తాలలో అతనికి ఓ ప్రత్యేక గుర్తింపు.అట్టి మేధోశక్తికి నీరుగార్చే మత్తు పానీయాలను, మాదకద్రవ్యాలను, వెకిలి చేష్టలను ఇస్లాం సంపూర్ణంగా నిషేధిస్తుంది:”ఓ విశ్వసించిన ప్రజలారా!నిశ్చయంగా సారాయి,జూదం, దైవేతరాలయాలు, పాచికల జోస్యం-ఇవన్నీ పరమ జుగుప్సాకరమయి న విషయాలు, షైతాన్ చేష్టలు. కాబట్టి వాటికి దూరంగా ఉండండి. తద్వారా మీరు సాఫల్యం పొందవచ్చు”. (మాయిదహ్: 90)
ప్రాణ రక్షణ
అల్లాహ్, ఏ ప్రాణినయినా లేదా స్వయాన్నయినా సరే హాని కలిగించ డాన్ని, హత్య చేయడాన్ని నిషేధించాడు. ఇలా అన్నాడు: ”చేజేతులా మిమ్మల్ని మీరు వినాశనం పాలు చేసుకోకండి”. (అల్ బఖరహ్‌ా: 195)
వ్యక్తులు ఎవరయినా, ఏ మత ధర్మానికి చెందిన వారయినా సరే అన్యాయంగా ఒకరిపై దౌర్జన్యానికి ఒడిగట్టే వారి ఆట కట్టించే నిమిత్తం సరి హద్దులను, శిక్షలను కేటాయించాడు. ఇలా అన్నాడు: ”ఓ విశ్వసిం చిన ప్రజలారా! హతుల విషయంలో ప్రతీకార న్యాయం (ఖిసాస్) మీ కొరకు విధిగా నిర్ణయించబడింది”. (అల్ బఖరహ్: 178)
”ఓ బుద్ధి జీవుల్లారా! ఈ ప్రతీకార న్యాయంలోనే మీ జీవనం ఉంది – ఇలా ఉంటేనే మీరు (అమానుషాల నుండి) ఆగి ఉంటారు”. (అల్ బఖరహ్: 179)
ఒక్క మాటలో చెప్పాలంటే ఇస్లాం మనిషి ప్రాణానికి ఇచ్చినంత విలువ మరే మతధర్మం ఇవ్వలేదు: ”ఎవరయితే అన్యాయంగా ఒక మనిషిని చంపాడో అతను సకల మానవులను చంపినట్లే. మరెవరయితే ఒక ప్రాణాన్ని కాపాడాడో అతను సకల మానవుల ప్రాణాలను కాపాడి నట్లే”. (మాయిదహ్:32)
సంతాన సంరక్షణ
సంతాన రక్షణ కోసం ఇస్లాం గట్టి చర్యలే చేపట్టింది. ఏ కుటుంబ పట్టునయితే పిల్లలు పెరిగి పెద్దవుతారో ఆ కుటుంబ పునాదిని ఇస్లాం పవిత్ర బంధం పునాదిగా నిర్మించగోరుతుంది. వారి హక్కుల్ని పెద్దలకు బోధించడమే కాకుండా వారి మధ్య న్యాయంగా వ్యవహరించమని హితవు పలుకుతుంది. ఇస్లాం ధర్మసమ్మతమయిన రీతిలో వివాహం చేసుకోవాలని అభిలషిస్తుంది. అందులో వెకిలి చేష్టలకు, దుబారా ఖర్చుకు, అతికి పాల్పడకూడదంటుంది. ఇస్లాం అక్రమ సంబంధాలపై, అధర్మ వావివరసలపై, అశ్లీలం, అనైతికాలపై తన శిక్షా కొరడాను ఝుళిపిస్తుంది.
మాన రక్షణ:
ఇస్లాం మనిషి మానం మర్యాదలకు పెద్ద పీట వేస్తుంది. ప్రజల పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లకుండా, వారి వంశాన్ని తూల నాడే చర్యలకు పాల్పడకుండా ఉండాలని నొక్కి వక్కాణిస్తుంది. అలా చేయడాన్కి ఘోరపాపంగా పరిగణిస్తుంది. ఇస్లాం మనిషి (స్త్రీపరుషుల) గౌరవ మర్యాదల్ని కాపాడమంటుంది. ”ఏ వ్యక్తయితే తన పరువును, పరివారాన్ని కాపాడుతూ హత్య చెయ్యబడతాడో అతను షహీద్” అంటుంది.
ధన సంరక్షణ
ఇస్లాం ధర్మసమ్మతమయిన జోవనోపాధి కొరకు పరిశ్రమించాలని ఉపదేస్తుంది. ధర్మ రీతిలో వ్యాపారాన్ని అనుమతిస్తుంది. వడ్డీ, దోపిడి, దొంగతనాన్ని నిషేధిస్తుంది. ఎందుకంటే, వడ్డీ వ్యాపారం, జూదం, మట్కా వంటి వాటి వల్ల ఒకరి సొమ్ము అన్యాయంగా దోచుకోవడం జరుగుతుంది గనక. ఇవి ఒక ఆరోగ్య సమాజానికి గొడ్డలి పెట్టుగా ఉంటాయి గనక. వీటి ద్వారా ప్రజల మధ్య ఉండాల్సిన ప్రేమాను రాగాలు పోయి రాగధ్వేషాలు చోటు చేసుకుంటాయి గనక. ఒక్క మాట లో చెప్పాలంటే, ”ఏ వ్యక్తయితే తన ధనాన్ని కాపాడుతూ హత్య చెయ్యబడతాడో అతను షహీద్. ఏ వ్యక్తయితే తన పరువును, పరివా రాన్ని కాపాడుతూ హత్య చెయ్యబడతాడో అతను షహీద్. ఏ వ్యక్తయితే తన ధర్మాన్ని కాపాడుతూ హత్య చెయ్య బడతాడో అతను షహీద్. ఏ వ్యక్తయితే తన ప్రాణాన్ని, కాపాడుతూ హత్య చెయ్యబడతాడో అతను షహీద్” అంటుంది ఇస్లాం. (తిర్మిజీ). ఇక ఇస్లాం మనిషికిచ్చే శిక్షణ గురించి తెలుసుకుందాం!
శుచీశుభ్రతలు
పరిశుద్ధత, పరిశుభ్రత, పవిత్రత అనేది మానవ నైజం వాంఛించే, మానవ సమాజం కాంక్షించే సుగుణం, సహజ గుణం. దీనికి భిన్నంగా అపరిశుద్ధతను, అపవిత్రతను మానవ నైజం, మానవ సమా జం సహించదు, ఇష్ట పడదు. ఈ కారణంగా ప్రతి విధమయినటు వంటి అశుధ్దాల నుండి దూరంగా ఉండాలని, శుధ్ధి పొందాలంటుంది ఇస్లాం. మనిషి మలమూత్రాలు, నిషిద్ధ జంతువుల మల మూత్రాలు, కుక్క, పంది వంటి నిషిద్ధ జంతువులకు దూరంగా ఉండాలని కోరుకుం టుంది. మలమూత్ర విసర్జనాననంతరం శుద్ధి పొందాలని, వుజూ చేయాలని, స్నానమాచరించాలని, నీరు లేని పక్షంలో తయమ్ముమ్ చేయాలని ఉపదేశిస్తుంది.
అప్పగింతల పట్ల అప్రమత్తత
ఇస్లాం బోధించే నైతిక ప్రమాణాలలో ఉన్నత నైతిక ప్రమాణం అమానతు. అంటే, నిజాయితీ-సచ్చీలత. వ్యాపారంలోగానీ, వ్యవహారం లోగానీ, మాటలోగానీ, బాటలోగానీ, నడకలోగానీ, నడవడికలోగానీ నిజాయితీగా మసలుకోవాలంటుంది. ”ఎవరి అమానతులను (అప్పగిం తలను) వారికి అప్పగించండి. ప్రజల మధ్య తీర్పు చేెసేటప్పుడు న్యాయంగా తీర్పు చేయండి అని అల్లాహ్‌ా మిమ్మల్ని గట్టిగా తాకీదు చేస్తున్నాడు”. (అన్నిసా: 58)
సత్య సంధత
సత్యం-సత్యమే సదా సాపల్య ద్వారం. సత్యమే సమున్నతికి సోపానం – ఇహంలోనూ, పరంలోనూ అన్నది ఇస్లాం ఉపదేశం. కాబట్టి మనిషి సదా సత్యానికి కట్టుబడి ఉండాలంటుంది. అసత్యానికి, అధర్మానికి, అవినీతికి, అన్యాయానికి, అక్రమానికి మనిషి ఆమడ దూరం ఉండా లంటుంది. సత్యప్రవక్త అయిన ముహమ్మద్ (స) ఇలా ఉపదేశించారు: ”మీరు సత్యాన్ని అట్టి పెట్టుకు ఉండండి. దానికే కట్టుబడి జీవించండి. ఎందుకంటే, సత్యం మంచికి మార్గం చూపుతుంది, మరి మంచి మనిషి ని స్వర్గానికి దారి చూపుతుంది.అసత్యం చెడుకై పురిగొల్పుతుంది. మరి చెడు మనిషిని నరకం పాలు చేసి గాని వదలదు”. (ముస్లిం)
స్థితప్రజ్ఞత
మనిషి చేపట్టే ఏ కార్యమయినా సరే అందులో తాను స్థితప్రజ్ఞత స్థాయిని సాధించాలని అభిలషిస్తుంది ఇస్లాం. మనిషి చేసే పని ఏద యినా పూర్తి ప్రావీణ్యం కలిగి పని చేయడం హర్షనీయం అంటుంది. ప్రవక్త ముహమ్మద్ (స) ఇలా సెలవిచ్చారు: ”మనిషి తలపెట్టే ఏ మంచి పనయినా పూర్తి నాణ్యతతో, ప్రావీణ్యం కలిగి పూర్తి చేయడాన్ని అల్లాహ్‌ా ఇష్ట పడతాడు”. (తబ్రానీ)
సంస్కారవంతమయిన వస్త్రధారణ
ఇస్లాంలో వస్త్రధారణం అందంగా, పరిశుభ్రంగా, సంస్కారవంతంగా ఉండాలి. పురుష పోలికలు గల దుస్తులు స్త్రీలు, స్త్రీల పోలికలు గల దుస్తులు పరురుషులు తొడగరాదంటుంది ఇస్లాం. అలాగే గర్వం, అహంకారం, అహంభావం ప్రదర్శితమయ్యే దుస్తుల్ని సయితం ఇస్లాం నిషేధిస్తుంది. వస్త్రధారణ విషయంలో దుబారా ఖర్చును అది సహిం చదు. దుస్తులు మరి పొడవాటివిగా-(పరుషులకు చీలమండలానికి క్రింది వరకు) ఉండటం, మరీ పొట్టి (కనీస కప్పి ఉంచాల్సిన ప్రదేశాల ను బహిర్గత పర్చే) దుస్తుల్ని స్త్రీపరుషులిరువురూ తొడగడాన్ని అది గర్హి స్తుంది. అల్లాహ్‌ా ఖుర్‌ఆన్‌లో ఇలా సెలవిస్తున్నాడు: ”ఓ ఆదం సంతతి వారలారా! మేము మీ కోసం దుస్తుల్ని దించాము. అవి మీ మర్మాస్థానా లను కప్పి ఉంచడమే గాకుండా, మీ శరీరానికి శోభాయమానంగా కూడా ఉంటాయి”. (ఆరాఫ్: 26)
పెద్దల పట్ల గౌరవం, పిన్నల పట్ల వాత్సల్యం
ఇస్లాం, ఉత్తమ రీతిలో తల్లిదండ్రుల సేవ చేయాల్సిందిగా,వారి తుది శ్వాస ఆగేంత వరకూ ధర్మసమ్మతమయిన వారి ప్రతి మాట వినాల్సిం దిగా తన అనుయాయుల్ని కోరుతుంది. ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది: ”నీ ప్రభువు స్పష్టంగా ఆజ్ఞాపించాడు-మీరు ఆయనను తప్ప మరొకరెవరినీ ఆరాధించకూడదు. తల్లిదండ్రుల యెడల ఉత్తమంగా వ్యవహరించాలి. నీ సమక్షంలో వారిలో ఒకరుగాని, ఇద్దరుగానీ వృద్ధాప్యానికి చేరుకొని ఉంటే వారి ముందు విసుగ్గా ‘ఉఫ్’ అని కూడా అనకు. వారిని కసురు కుంటూ మాట్లాడకు. పైగా వారితో మర్యాదగా మాట్లాడు”. (బనీ ఇస్రాయీల్: 23)
బంధుత్వ సంబంధాల రక్షణ;
ఇస్లాం బంధుత్వ సంబంధాలను పటిష్ఠ పరచమంటుంది. అమ్మానాన్నల తరఫు నుండి ఏర్పడే సంబంధాలను బల పర్చాలంటుంది. ఒకరు మనతో మంచిగుంటే మనం వారితో మంచిగుండటం కాదు, వారి మన పట్ల అనుచితంగా వ్యవహరించినా మనం వారి పట్ల ఉత్తంగా వ్యహరించడం, వారు మన నుండి తెగత్రెంపులు చేసుకున్నా మనం మాత్రం వారితో కలిసే ఉండటం సిసలయిన బంధుప్రీతి అంటుంది.
స్త్రీ రక్షణ;
ఇస్లాం, ఆస్తిలో న్యాయబద్ధమయిన స్త్రీ వాటాను ప్రత్యేకంగా పేర్కొంటుంది. ఆమె హోదా, ఆమె బాధ్యతల దృష్ట్యా ఆమెకు దక్కాల్సిన హక్కును ఆమెకు ఇస్తుంది.
ఇస్లాం, స్త్రీపరుషుల మధ్య అన్ని విషయాలలో న్యాయబద్ధంగా వ్యహరిస్తుంది.
ఇస్లాం, స్త్రీకి తన జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే పూర్తి స్వేచ్ఛను ఇస్తుంది. పిల్లల అసలు పోషణ అమ్మ ఒడిలోనే సాధ్యం అంటుంది. అదే విధమయినటువంటి బాధ్యతల్ని ఆమెపై మోపుతుంది.
ప్రవక్త ముహమ్మద్ (స) ఇలా ఉపదేశించారు: ”మీలోనీ ప్రతి ఒక్కరూ కాపలాదారుడే…..స్త్రీ తన ఇంటికి కాపలాదారు. తన సంరక్షణలో ఉన్న వారి గురించి ఆమె జవాబుదారీ”. (బుఖారీ)
స్త్రీపురుషుల మధ్య గల సంబంధం పరస్పరం ఒండొకరిని బల పర్చేదిగా ఉండాలంటుంది ఇస్లాం, స్త్రీ రహిత పురుష సమాజ అభివృద్ధిగాని, పురుడు లేకుండా మహిళా సమాజ అభ్యుదయంగానీ పరిపూర్ణమవ్వదు అంటుంది. ఒక ఆరోగ్యకరమయిన సమాజానికి స్త్రీపురుషులిరువురి సహకారం, శ్రమ అవసరం అంటుంది.
భూత దయ:
ఇస్లాం, సకల ప్రాణుల యెడల సాత్విక ప్రేమ, క్షమ, ఉపకార భావం ప్రతి వ్యక్తి మాటలోనూ, నడకలోనూ, నడవడికలోనూ కలిగి ఉండాలని ఉత్బోధిస్తుంది.ఇస్లాం, మూగ జమతువుల పట్ల మెతక వైఖరి, దయాభావం కలిగి ఉండాలంటుంది. ప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు: ”ప్రతి ప్రాణిలోనూ మీకు పుణ్యం ఉంది”. (బుఖారీ)
పర్యావరణ పరిరక్షణ:
ఇస్లాం, మొక్కల్ని పెంచమంటుంది. భూమి పచ్చని పొలాలలో కళకళలాడాలంటుంది.బంజరు భూముల్ని పంట పొలాలుగా మార్చాలని హితవు పలుకుతుంది.”ప్రళయం ఇంకాసేపట్లో ముంచుకొస్తుందని నీకు తెలుస్తున్నా నీ చేతిలో మొక్క ఉంటే దాన్ని నాటెయ్యి”అంటుంది. దీనికి భిన్నంగా భూమిని బంజరు నేలగా మార్చే ప్రక్రియల్ని, చర్యల్ని, లేదా భూమిని చెడు ఉత్పాదనల కోసం వినియో గించడాన్ని అది గర్హిస్తుంది. ఏ విషయంలోనయినా సరే దుబారా ఖర్చు కు దూరంగా ఉండమంటుంది. ప్రవక్త (స) ఇలా ఉపదేశించారు: ”నువ్వు ప్రవహించే నది ఒడ్డున ఉన్నా సరే దుబారా ఖర్చు చేయకు” (ముస్నద్ అహ్మద్)
ఇస్లాం, దౌర్జన్యం, దుర్మార్గం, దురాక్రమణ, దమన నీతి, మరణించిన శత్రు శరాన్ని ముక్కలుగా నరకడం నుండి వారిస్తుంది. అది ప్రతి విషయంలోనూ న్యాయానికి, ధర్మానికి, క్షమకి, విశాల భావానికి కట్టుబడి ఉండాటలంటుంది. సమాజంలోని పెద్దలు, వృద్ధులు, పిల్లలు, స్త్రీల పట్ల మర్యాద పూర్వకంగా మసలుకోవాలని అబిలషిస్తుంది.
ఇస్లాంలో దైవప్రవక్తలు
ఇస్లాం, ప్రవక్తలందరి పట్ల విశ్వాసం కలిగి ఉండాలంటుంది. వారి మధ్య వివక్షకు తావు కల్పించకూడదంటుంది. వారిలో కొందరిని నమ్మి మరికొందరిని విశ్వసించకపోవడాన్ని అది అవిశ్వాస చర్యగా పరిగణిస్తుంది. ప్రతి జాతి వైపునకు అల్లాహ్‌ా ప్రవక్తను పంపాడని, అలా వేర్వేరు కాలాల్లో, వేర్వేరు జాతుల్లో వచ్చిన ఆ ప్రవక్తలందరూ సత్యప్రవక్తలని, దైవభీతిపరులని, నిజాయితీపరులని, మార్గదర్శకులని, వారి ఇవ్వబడి సందేశాలను సంపూర్ణంగా ఆయా జాతులకు అందజేశారు:
”మేము ప్రతి సముదాయంలోనూ ప్రవక్తను ప్రభవింపజేశాము. అతని ద్వారా (రపజలారా!) అల్లాహ్‌ాను మాత్రమే ఆరాధించండి. ఆయన తప్ప ఇతరత్రా మిథ్యా దైవాలకు దూరంగా ఉండండి”. (నహ్ల్: 36)
ఏ ఒక్క ఆదేశాన్ని వారు దాచి పెట్టలేదని, మరే ఒక్క ఆదేశంలో హెచ్చు తగ్గులకు పాల్పడరాదని, తమ స్వయానికి లోబడి వారు ఏ మాట పలుక లేదని స్వయంగా అల్లాహ్‌ాయే కితాబు ఇచ్చాడు: ”కనుక ప్రవక్తల బాధ్యత మా సందేశాన్ని స్పష్టంగా అందజేయడం తప్ప మరొకటి లేదు”. (అన్నహ్ల్; 35)
|ఈ ప్రవక్తల పరంపరలో చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ (స). కట్టకడపటి గ్రంథం ఖుర్‌ఆన్.ప్రయళం వరకూ వచ్చే ప్రజలందరికీ ఖుర్‌ఆన్ గ్రంథం మార్గదర్శకం, ప్రవక్త (స) వారి జీవితమే ఆదర్శం.
ప్రవక్త ఈసా-యేసు (అ) పట్ల ముస్లింల విశ్వాసం
నిశ్చయంగా ఆయన పుణ్య స్త్రీ అయిన మర్యమ్ కుమారుడు. ఆమె సద్గుణవతి, దైవబీతిపరురాలు, సత్యవతి, సౌశీలవతి, అల్లాహ్‌ా విధేయురాలయిన కన్య. ప్రవక్త ఈసా (అ) పురుష సంపర్కం లేకుండానే అల్లాహ్‌ా ఆజ్ఞ మేరకు ఆమె కడుపున జన్మించారు అని ప్రతి ముస్లిం విశ్వసిస్తాడు.
ప్రవక్త ఈసా (అ) మరియు అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ (స) మధ్య మరే ప్రవక్తా లేడు అని ప్రతి ముస్లిం నమ్ముతాడు.
ముస్లిం అయిన ప్రతి వ్యక్తి, ప్రవక్త ఈసా (అ) వారి చేతుల మీదుగా జరిపించిన మహత్కార్యాల్ని, మహిమల్ని – పుట్టు గుడ్డిని బాగు చేయడం, కుష్టు రోగిని బాగు చేయడం, మృతులను బతికించడం, ప్రజలు వారి వారి ఇళ్ళల్లో ఏమి కూడ బెడతారో, ఏమి తింటారో తదితర విషయాల గురించి అల్లాహ్ ఆజ్ఞతో తెలయజేయడం వంటి వాటిని నమ్ముతాడు.
ప్రవక్త ఈసా (అ) వారు హత్య చెయబడలేదు, శిలువా ఎక్కించబడలేదు అని, వాస్తవంగా అల్లాహ్‌ా ఆయన్ను కాపాడి సజీవంగా, సశరీంగా తన వైపునకు ఎత్తుకున్నాడని నమ్మడంతోపటు, ఆయన్ను హతమార్చాలని కుట్ర పన్నిన యూదులు అపోహకు గురి చేయబడ్డారని, వేరెవరినో హత్య చేసి ప్రవక్త (స)ను హత్య చేసినట్లు భ్రమకు గురి చెయ్యబడ్డారని నమ్ముతాడు.
ఇస్లాం స్వీకరించాలంటే ఏం చేయాలి?
వ్యక్తి ఎవరయినా, ఏ భాష, ఏ రంగు, ఏ ప్రాంతానికి చెందినవాడయినా మనసా, వాఛా, కర్మణా సాక్ష్య వచనాలు పలికి ఇస్లాం ఛత్రఛాయల్లోకి రావచ్చు. ”అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్‌ా వ అష్హదు అన్న ముహమ్మదర్రసూలుల్లాహ్” – అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడెవడూ లేడని నేను సాక్ష్యమిస్తున్నాను. ముహమ్మద్ (స) అల్లాహ్‌ా ప్రవక్తని సాక్ష్యమిస్తున్నాను”.
ఈ వచనాల్ని మనస్ఫూర్తిగా పలికి మీదట సదరు వ్యక్తి గతం పట్ల పశ్చాత్తాపం చెంది, జీవితంలో మళ్ళి గతించిన నిర్వాకాల జోలికి వెళ్లబొనని ప్రతీన బూని స్నానమాచరించాలి. ఆనక ఇస్లాం మూలాధారాలయి అయిదు విషయాలను క్రియా రూపం ఇచ్చేందుకు కంకణం కట్టుకోవాలి.
1) ”అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్‌ా వ అష్హదు అన్న ముహమ్మదర్రసూలుల్లాహ్‌ా” అని సాక్ష్యమివ్వడం.
2) నమాజును స్థాపించడం
3) జకాతును చెల్లించడం,
4) రమజాను పూర్తి మాసపు ఉపవాసాలు ఉండటం,
5) స్థోమత కలిగిన వ్యక్తి హజ్జ్ చేయడం.
”ఇస్లాం ఉపమానం వాన వంటది. దాన్ని స్వీకరించి సత్కర్మలు చేసిన వ్యక్తి సారవంతమయిన నేలను పోలి ఉంటాడు. దాన్ని తిరస్కరించిన వ్యక్తి వాన కురిసినా ఎలాంటి పంటను అందించని రాతి నేలను పోలి ఉంటాడు” అన్నారు ప్రవక్త (స).
మహా హక్కు మహత్తు
by- syed abdussalam umri
ఈ ప్రపంచంలో హక్కులు అనేకం. తల్లిదండ్రుల హక్కులు, భార్యా పిల్లల హక్కులు, బంధుమిత్రుల హక్కులు, ఇరుగుపొరుగు వారి హక్కులు, ముస్లింల హక్కులు, ముస్లిమేతరుల హక్కులు… వీటిలోని ప్రతి ఒక్కటి ముఖ్యమయినదే. కానీ, ఈ హక్కులన్నింటిలోకెల్లా మహా హక్కు – మనందరి సృష్టికర్తకు, నిజ ఆరాధ్యునికి మనమీదున్న హక్కు. ఎందు కంటే,
ఈ హక్కు మనకు ఉనికిచ్చిన వాని హక్కు, అధికారులకు అధికారి, రాజులకు రాజు అయిన అల్లాహ్‌ా హక్కు. అతల, వితల, సుతల తలా తల, రసాతల, మహాతల, పాతాల, భూలోక, భువర్లోక, స్వర్లోక, మహా లోక, జనోలోక, తపోలోక, సత్యలోక-14 లోకాలుగా చెప్పబడుతున్న ఇవే కాదు ఇంకెన్ని లోకాలున్నా అన్నింటికి అధిపతి, యజమాని (రబ్బుల్ ఆలమీన్) అల్లాహ్‌ా హక్కు. ఆయనే ప్రతి వస్తువు నిర్మాత. ఆయనే శూన్యం నుండి సృష్టి మొత్తాన్ని సృష్టించిన వాడు. ఆయనే మనల్ని అల్పమయిన బిందువుతో పట్టించి నఖ,శిఖ పర్యంతం అందంగా తీర్చిదిద్దినవాడు. మూడు చీకట్ల్ల లోపల తల్లి గర్భంలో మన యోగక్షేమా ల్ని చూసిన వాడు. భూమి మీద మనం అడుగు పెట్టక ముందే మనక్కా వాల్సిన వస్తువు సామగ్రినంతటిని సమకూర్చి పెట్టినవాడు. అంతటి ఘనాఘనుడు, మహిమాన్వితుడు, మహోన్నతుని హుక్కు ఎంత మహత్తర మయినదయి ఉంటుందో ఆలోచించండి! ఖుర్‌ఆన్ తెర లేపుతున్న ఈ యదార్థం ఎంత గొప్పదో యోచించండి! ”మరియు ఆయనే మిమ్మల్ని మీ మాతృ గర్భాల నుండి, మీకేమి తెలియని స్థితిలో బయటికి తీశాడు. మీ కొరకు చెవులను, కళ్లను, హృదయాలను తయారు చేసింది ఆయనే. మీరు కృతజ్ఞులుగా వ్యవహరిస్తారని”. (అల్ ఇమ్రాన్:6)
మనం పుట్టినప్పుడు మనకెలాంటి లోక జ్ఞానం లేదు. అదృష్టదురదృ ష్టాలంటే ఏమిటో కూడా మనకు తెలియదు. ప్రస్తుతం మనం అనగలుగు తున్నాం, వినగలుగుతున్నాం, కనగలుగుతున్నాం, మనుగడ సాగించగలు తున్నాం. అయినా మనం ఆయన పట్ల కృతజ్ఞులుగా మనగలగ లేక పోతున్నాం!? ఇదే విషయాన్ని అల్లాహ్‌ా ఇలా ప్రశ్నిస్తున్నాడు: ”ఓ మానవుడా! పరమ దాత అయిన నీ ప్రభువును గూర్చి ఏ విషయం నిన్ను మోసంలో పడ వేసింది?”. (ఇన్ఫితార్: 6)
మరో చోట ఇలా ఉంది: ”వాస్తవానికి ఆకాశాలను, భూమిని సృష్టించడం, మానవులను సృష్టించడం కంటే ఎంతో ఘనాఘన విష యం. కానీ చాలా మంది ప్రజలకు ఇది తెలియదు”. (గాఫిర్: 57)
మరో చోట ఇలా ఉంది: ”వాస్తవానికి ఆకాశాలను, భూమిని సృష్టించడం, మానవులను సృష్టించడం కంటే ఎంతో ఘనాఘన విష యం. కానీ చాలా మంది ప్రజలకు ఇది తెలియదు”. (గాఫిర్: 57)
అల్లాహ్ మనకు ప్రసాదించిన ఈ తెలివీతేటలు, శక్తియుక్తులు ఎందు కోసం? మనం మన జీవితాన్ని ఆయనకు అంకితం చేయ డానికి, ఆయన్ను మాత్రమే ఆరాధించడానికి. ”యాదార్థం – నేను మానవులను, జిన్నాతులను పుట్టించింది కేవలం వారు నన్ను ఆరాధించడానికే”. (జారియాత్: 56)
ధర్మం నాలుగు పాదాల నడవాలని,శాంతి, సుస్థిరతల వాతావరణం నెలకొనాలని, ఎలాంటి భయం, ఆందోళనకర పరిస్థితులు ఉండ కూడదని, ప్రతి ఒక్కరూ సజావుగా వారి మనుగడ కొనసాగించగలిగే వాతావరణం నెలకొనాలని మనలోని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తారు. దానికి మనం ఏం చేయాలో మనందరి ప్రభువయిన అల్లాహ్‌ా సెలవి స్తున్నాడు: ”వారు నన్ను మాత్రమే ఆరాధించాలి. నాకు సహవర్తులు గా ఎవరినీ కల్పించకూడదు”. (అన్నూర్: 55)
(ఇలా గనక మనం చేస్తే) ”మీలో విశ్వసించి, సత్కార్యాలు చేసే వారితో అల్లాహ్‌ా చేస్తున్న వాగ్గానం – ‘వారి పూర్వీకుల్ని భూమికి ఉత్తారాధికారులుగా చేసినట్లే వారికి కూడా తప్పకుండా ప్రాతినిథ్యం వొసగుతాడు. తాను వారి కోసం సమ్మతించి ఆమోదించిన ధర్మాన్ని వారి కోరకు పటిష్టం చేసి, దానికి స్థిరత్వాన్ని కల్పిస్తాడు. వారికున్న భయాందోలనల స్థానే శాంతిభద్రతలను కల్పిస్తాడు”. (అన్నూర్: 55)
అయితే మనిషి చేస్తున్నదేమిటి? దయానిధి అయిన అల్లాహ్‌ా సన్నిధిని వదలి చెట్టు, పుట్ట, రాయి, రప్ప, వాగు, వంకను మ్రొక్కు తున్నాడు. అవి సంతృప్తి ఇవ్వకపోతే ‘తానే స్వయంభువు’ అని బీరాలు పోతున్నాడు. ”ఏమిటి, నిన్ను మట్టితో తర్వాత వీర్య బిందు వుతో పుట్టించిన, ఆ తర్వాత నిన్ను సంపూర్ణ మానవుడిగా తీర్చి దిద్దిన ఆయన్నే (అల్లాహ్‌ానే) ధిక్కరిస్తున్నావా?” (కహఫ్: 37)
ఒక రూపాయి, అర్థ రూపాయి సహాయానికే మనం కృతజ్ఞతల్ని కోరుకుంటామే, మరి మనకు అపార అనుగ్రహాలతో సత్కరించన ఆపద్బాంధవుని యెడల ఎందుకీ కృతఘ్నత? చేసిన సహాయన్ని మరచిపోవడం మిత్ర ద్రోహం అయితే, అల్లాహ్ చేసిన అగణ్య మేళ్లను మరచి జీవించడం దైవద్రోహం కాదా? ఆయన్ను వదలి అన్యులను ఆశ్రయించడం, ఆరాధించడం మహాపరాధం కాదా?
సహీహ్ ముస్లిం మరియు బుఖారీలోని ఓ హదీసులో హజ్రత్ మఆజ్ బిన్ జబల్ ఇలా అంటున్నారు: ”నేనో దినం ప్రవక్త (స) వారి వెనకాల సవారీ అయి ఉన్నాను. ఆయన నన్నుద్దేశించి – ”ఓ మఆజ్!” అన్నారు. ‘ఓ దైవప్రవక్తా నేను హాజరయు ఉన్నాను’ అన్నాను. అప్పుడాయన (స) – ”నీకు తెలుసా? దాసులపై అల్లాహ్‌ాకు గల హక్కు ఏమిటో? అల్లాహ్‌ాపై ఆయన దాసులకు గల హక్కు ఏమిటో?”. నేనన్నాను – ‘అల్లాహ్‌ా మరియు ఆయన ప్రవక్తకే బాగా తెలుసు’. అందుకాయాన-”దాసులపై అల్లాహ్‌ాకు గల హక్కేమిటంటే, వారు ఆయన్ను మాత్రమే ఆరాధించాలి. ఆయనతోపాటు ఇంకె వ్వరినీ సాటి కల్పించరాదు. మరియు అల్లాహ్‌ాపై ఆయన దాసులకు గల హక్కు ఏమిటంటే, ఆయన్ను మాత్రమే ఆరాధించి, ఆయనతో పాటు ఇతరులెవ్వరినీ సాటి కల్పించకుండా జీవితం గడిపిన వారిని ఆయన శిక్షించడు”. (ముత్తఫఖున్ అలైహి)
ఆయన దాసులమయిన మనం ఆయన ఆదేశాల హద్దుల్లోనే, ఆయన ప్రవక్త (స) బోధనల పద్దుల్లోనే జీవించాలి. ఆయన మనకు ప్రసాదిం చిన అనుగ్రహాలకుగాను క్రియాత్మకంగా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అల్లాహ్‌ా ఇలా అంటున్నాడు:”ఒకవేళ మీరు గనక కృతజ్ఞులుగా మసలు కుంటే నేను మీకు మరింత సమృద్ధిని కలుగజేస్తాను. ఒకవేళ మీరే గన కృతఘ్నతకు పాల్పడితే నిశ్చయంగా నా శిక్ష చాలా కఠినంగా ఉం టుంది”. (ఇబ్రాహీమ్:7)
క్రియాత్మకంగా ఆయనకు కృతజ్ఞతలు చెల్లించే ఓ విధానాన్ని ఆయనే స్వయం హదీసె ఖుద్సీలో తెలియజేస్తున్నాడు: ”నా దాసుడు నా సామీ ప్యం పొందడానికి పాటించే పద్ధతుల్లో నేను అతనిపై విధిగావించిన వాటి(ఫరాయిజ్)ది ప్రథమ స్థానం.ఇవే కాక అతను నఫిల్ (స్వచ్ఛంద) ఆరాధనల ద్వారా కూడా నా సామీప్యాన్ని పొందే ప్రయత్నం చేస్తుం టాడు. కడకు నేనతన్ని ప్రేమించసాగినప్పుడు అతను వినే చెవినయి పోతాను. అతను కనే కంటినయి పోతాను. అతను పట్టుకునే చేయి నయి పోతాను. అతను నడిచే కాలినయి పోతాను. అతను కోరిందల్లా అతనికనుగ్రహిస్తాను. అతను శరణ కోరిన వాటి నుండి అతన్ని కాపా డుతాను”.(బుఖారీ)
అంటే, అల్లాహ్‌ను అంతలా ఆరాధించే దాసుడు, అల్లాహ్‌ా ప్రేమను పొంది ఏ స్థాయికి చేరుకుంటాడంటే, ఆయన అనమన్నదే అంటాడు. ఆయన వినమన్నదే వింటాడు. ఆయన కనమన్నదే కంటాడు. ఆయన తినమన్నదే తింటాడు. ఆయన నడవమన్న దారినే నడుస్తాడు. ఆయన చేయమన్న కార్యాలే చేస్తాడు. ఆయన అభీష్టానికి వ్యతిరేకంగా ఒక్క అడుగు కూడా వెయ్యడు. ”అస్లిమ్-విధేయత చూపు” అని అల్లాహ్‌ా ఆదేశించినప్పుడల్లా ‘అస్లమ్తు-విధేయుణ్ణయ్యాను’ అంటూ క్రియా పరంగా తాను నిజ ముస్లిం అని నిరూపించుకుంటాడు.
ఇక అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించాలి అంటే, కేవలం నమాజు, రోజా, హజ్జ్, జకాత్-ఇవి మాత్రమే కాదు. మన జీవితానికి సంబం ధించిన ప్రతి అంగం, ప్రతి రంగం ఆయన రంగులో రంగరించాలి. దుఆ చేయడం కూడా అల్లాహ్ ఆరాధనే. మొకుబడి చెల్లించడం కూడా అల్లాహ్‌ా ఆరాధనే. భయ పడటం, ఆశలు పెట్టుకోవడం కూడా అల్లాహ్‌ా ఆరాధనే. అల్లాహ్‌ా మాటల్లో చెప్పాలంటే: ”ఇలా ప్రకటించు – నిశ్చయంగా నా నమాజు, నా సకల ఉపాసనా రీతులు (ఖుర్బానీ), నా జీవితం, నా మరణం సమస్త లోకాలకు ప్రభువయిన అల్లాహ్‌ా కొరకే”. (అన్‌ఆమ్:162)
విశ్వ ప్రభువయిన అల్లాహ్ మహా హక్కు మహత్తు గురించి తెలిసి కూడా ఎవరయినా షిర్క్‌కి పాల్పడినట్లయితే, ఆయనతోపాటు ఇతరుల్ని సాటి కల్పించి పూజించినట్లయితే వారు ఓ విషయం తెలుసకోవాలి! క్షమించరాని నేరం షిర్క్: ‘నిశ్చయంగా అల్లాహ్ తనకు భాగస్వా మిని కల్పించటాన్ని (షిర్క్‌ని) ఎన్నటికీ క్షమించడు. అది తప్ప దేన్న యినా తాను కోరిన వారిని క్షమిస్తాడు. అల్లాహ్‌కు సాటి కల్పించిన వాడే, వాస్తవంగా మహాపరా ధానికి పాల్పడినవాడు”. (అన్నిసా:48) ఎందుకంటే, ”నిశ్చయంగా అల్లాహ్‌ాకు భాగస్వాముల్ని కల్పించడం (షిర్క్) ఘోరాతిఘోరమయిన దౌర్జన్యం”. (లుఖ్మాన్: 13)
సర్వ కర్మ వినాశిని షిర్క్:
”ఒకవేళ నీవు బహుదైవారాధన (షిర్క్) చేసినట్లయితే నీ కర్మలన్ని వ్యర్థమయి పోతాయి. మరియు నీవు నష్టాని కి గురయిన వారిలో చేరిపోతావు”. (అజ్జుమర్: 65)
స్వర్గ అధిరోహణకి అవరోధం షిర్క్:
”వాస్తవానికి ఇతరులను అల్లాహ్‌కు భాగస్వాముల్ని చేసేవారికి, నిశ్చయంగా అల్లాహ్ స్వర్గాన్ని నిషేధించాడు. మరియు వారి నివాసం నరకాగ్నియే!”. (మాయిదహ్: 72)
ప్రియ పాఠకుల్లారా! మనం బాల్యం నుండి తౌహీద్ మరియు షిర్క్ అన్న పదాలు తరచూ వింటూనే ఎదిగాము. అయితే ఆ రెండు పదాల వాస్తవ అర్థం తెలియని కారణంగా మనలోని చాలా మంది తౌహీద్‌కు దూరంగా, షిర్క్‌కి అతి దగ్గరగా జీవిస్తున్నారు. ఒక విధంగా చెప్పా లంటే షిర్క్‌నే తౌహీద్‌గా భావిస్తున్నారు. కాబట్టి మన వైఖరి మారాలి. మనలో మార్పు రావాలి. ఇలా జరగాలంటే తౌహీద్ మరియు షిర్క్ గురించి ఖచ్చితమయిన జ్ఞానం మనకుండాలి. ఈ మార్గంలో షైతాన్ పన్నే కుట్రలు, వేసే ఎత్తుగడలు, విసిరే విష వలయాలు నుండి మనం కడు అప్రమత్తంగా ఉండాలి. అందుకు అల్లాహ్‌ా ఆదేశం మనందరికి శిరోధార్యం అవ్వాలి.
ప్రియ పాఠకుల్లారా! మనం బాల్యం నుండి తౌహీద్ మరియు షిర్క్ అన్న పదాలు తరచూ వింటూనే ఎదిగాము. అయితే ఆ రెండు పదాల వాస్తవ అర్థం తెలియని కారణంగా మనలోని చాలా మంది తౌహీద్‌కు దూరంగా, షిర్క్‌కి అతి దగ్గరగా జీవిస్తున్నారు. ఒక విధంగా చెప్పా లంటే షిర్క్‌నే తౌహీద్‌గా భావిస్తున్నారు. కాబట్టి మన వైఖరి మారాలి. మనలో మార్పు రావాలి. ఇలా జరగాలంటే తౌహీద్ మరియు షిర్క్ గురించి ఖచ్చితమయిన జ్ఞానం మనకుండాలి. ఈ మార్గంలో షైతాన్ పన్నే కుట్రలు, వేసే ఎత్తుగడలు, విసిరే విష వలయాలు నుండి మనం కడు అప్రమత్తంగా ఉండాలి. అందుకు అల్లాహ్‌ా ఆదేశం మనందరికి శిరోధార్యం అవ్వాలి.
”ఓ విశ్వసించిన ప్రజలారా! మీరు కర్తవ్య పాలనగా అల్లాహ్‌ా యెడల భయభక్తులు కలిగి ఉండండి. మరియు మీరు (అల్లాహ్‌కు) విధేయులుగా (ముస్లింలుగా) ఉన్న స్థితిలో తప్ప మీకు మరణం రాకూడదు”. (ఆల్ ఇమ్రాన్: 102)
ప్రవక్తలందరూ తమ సంతానానికి చేసిన అంతిమ హితవు మనందరి కి ఆచరణీయం అవ్వాలి:
”నా బిడ్డలారా! నిశ్చయంగా అల్లాహ్ మీ కొరకు (ఇస్లాం) ధర్మాన్నే ఎన్నుకున్నాడు. కాబట్టి మీరు (అల్లాహ్‌ాకు) విధేయులుగా (ముస్లింలుగా) ఉన్న స్థితిలో తప్ప మీకు మరణం రాకూడదు సుమా!”. (అల్ బఖరహ్:132)
వెలుగుల్ని పంచుదాం!
by-yed abdussalam umri
ఖుర్‌ఆన్ మహా గ్రంథాన్ని పఠించేవారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. ఏదోక దేశంలో, ఏదోక ఖండంలో, ఏదోక భూభాగంలో కాదు – ప్రపంచ దేశాలన్నింటిలోనూ ఉన్నారు. వారిలో తెల్లవారూ ఉన్నారు, నల్లవారూ ఉన్నారు, అరబ్బులూ ఉన్నారు, ఆరబ్బేతరులు ఉన్నారు, ఆ విషయానికొస్తే 170 కోట్ల మంది ముస్లింలలో 25 శాతం మంది అరబ్బు ముస్లింలయితే 75 శాతం మంది అరబ్బేతరులే. ఒక్క మాటలో చెప్పాలంటే ఖుర్‌ఆన్ చదవకుండా ప్రపంచంలో ఒక్క క్షణం కూడా గడవదు. ఏదోక చోట, ఏదోక రూపంలో అనునిత్యం ఖుర్‌ఆన్ పఠనం సాగుతూనే ఉంటుంది. ఖుర్‌ఆన్ ఆవతరించి 1435 సంవత్సరాలకు పై చిలుకు ఆవుతున్నా నాటి నుండి నేటి వరకు అది భిన్న జాతుల్ని, భిన్న సంస్కృతుల్ని, భిన్న మనస్తత్వాలు గల వ్యక్తుల్ని ప్రభావితం చేస్తూనే ఉంది. ప్రళయం వరకూ చేస్తూనే ఉంటుంది.
దాన విధానాన్ని తీసుకొచ్చి అనేక ప్రతిపాదనల్ని ప్రవక్త (స) వారి ముందు పెట్టి ధర్మ కార్యాన్ని మానుకోవాల్సిందిగా కోరిన ఉత్భా ముందు ఖుర్‌ఆన్ సూక్తులు చదివి విన్పించడం జరిగింది. సాంతం ప్రశాంతంగా విన్న ఉత్బా తన తెగ వారి వద్దకు వెళ్ళి ఇలా అభిప్రాయ పడ్డాడు: ‘సాహితీ పరంగా నాకన్నా బాగా తెలిసిన వాడు మీలో ఎవరూ లేరు. పద్యాన్ని, గద్యాన్ని, భాషా నుడికారాల్ని నేను ఎరిగినం తగా ఎవరు ఎరిగి లేరు అన్నదీ స్పష్టమే. నేను ముహమ్మద్ (స) నుండి విన్నది మనిషి అన్న మాట కానే కాదు. మనిషి అలాంటి వచనాల్ని చెప్పలేడు కూడా.”దైవసాక్షి! ఆ వాణిలో మధురామృతం జాలువారుతూ ఉంది. అందులో ఏదో తెలియని ఆకర్షణా శక్తి ఉందనిపిస్తుంది. దాని పై భాగం ఫలవంతం అయితే, దాని క్రింది భాగం శాంతిభరితంగా గోచరిస్తుంది. అది విజయానికి చిరునామా. దానిపై విజయం ఎవరి వల్ల సాధ్య పడని అంశం”.
ఇది నిజం, కఠోర సత్యం! – ”ఆయనే తన ప్రవక్తకు సన్మార్గాన్ని, సత్య ధర్మాన్ని ఇచ్చి పంపాడు-దాన్ని మతధర్మాలన్నింటిపై ఆధిక్యం వహిం చేలా చేయడానికి. ఈ విషయం బహుదైవారాధకులకు ఎంత సహించ రానిదయినా సరే”. (అస్సఫ్:9)
సేల్స్ టాక్స్ డిప్యూటి కమిష్నర్ దగ్గర పని చేసే ఓ ముస్లిం చఫ్రాసీ ఆయన ద్వారా ప్రమోషన్ అందుకున్న సంతోషంలో ఆయనకో గిప్టు ఇవ్వాలనుకున్నాడు. తానేమో పేదవాడు, ఏం గిప్టు ఇస్తే బాగుంటుంది అని తర్జన భర్జన పడ్డాడు. చివరికి ఆయన దగ్గరకు వెళ్ళి- ”సర్, నేను మీకు ఇవ్వబోతున్న గిఫ్ట్‌కు సరితూగ గలిగే వస్తువేది విశ్వం మొత్తంలో లేదు” అంటూ ఓ గిప్టు ప్యాకు అందించాడు. ఆఁ అంత పెద్ద గిప్టు ఇతను నాకేమివ్వగలడు అనుకొని తీసుకెళ్ళి అల్మారాలో పెట్టి మరచి పోయాడు ఆ అధికారి. కాని పడకపై మేను వాల్చగానే ఛప్రాసీ మాటలు గుర్తుకొచ్చాయి. మరచి నిద్ర పోదామనుకుంటే నిద్ర పట్టడం లేదు. అలానే మూడో వంతు రాత్రి గడిచి పోయింది. రాత్రి చివరి ఝామున లేచి ఆ గిప్ట ప్యాక్ తెరచాడు. అది హిందీ భాషలో ఉన్న ఖుర్‌ఆన్. ఏం రాయబడి ఉందో చదువుదాం అని తెవరబోయి ఆగి పోయాడు. పైన కవరుపై హిందిలో వ్రాయబడి ఉంది ‘పరిశుద్ధులే దాన్ని ముట్టుకుంటారు’ అని. వెళ్ళి స్నానం చేసి వచ్చి చదవనారంభిం చాడు. ఆ రోజు మొదలయి ఆయన ఖుర్‌ఆన్ గ్రంథ పారాయణం చాలా రోజుల వరకు సాగింది. చివరికి ఇస్లాం స్వీకరించాడు. అప్పుడర్థ మయ్యింది-గిఫ్టు ఇస్తూ ఛప్రాసీ చెప్పి మాట ఎంత వాస్తవమో. అతను ఆ గిఫ్టు తనకిచ్చి ఉండకపోతే తాను ఎంతటి మహా భాగ్యాన్ని కోల్పో యేవాడో!
అల్‌హమ్దులిల్లాహ్ మనం దివ్యఖుర్‌ఆన్ పారాయణం చేస్తున్నాము, స్వయంగా పారాయణం చేయడమే కాక సుస్వరకర్తల స్వరంలో ఖురాన్ స్వర్ణకార ధ్వనిని వింటున్నాము. అయితే అన్నీ ఉపద్రవాల నుండి మాన వాళిని కాపాడే ఉద్గ్రంథంగా మనం విశ్వసిస్తున్న ఈ గ్రంథరాజాన్ని ఇతరుల వరకు చేరవేసే ప్రయత్నం చేశామా? మనం అందజేసే ఈ గిఫ్టు ఎందరి జీవితాల్ని మార్చగలదో ఎప్పుడయినా ఆలోచించామా? ఏ విషయంలో ఎలా ఉన్నా ఈ విషయంలో మాత్రం –
ఆలస్యం అమృతం విషం!
ఆలస్యం అమృతం విషం!
ఖురాన్ ఘనత
by - syed abdussalam umri
ఇది సర్వలోక ప్రభువు అవతరింపజేసిన (అద్భుత) వాణి. దీన్ని తీసుకొని నమ్మకస్తుడయిన దైవదూత స్పష్టమయిన అరబీ భాషలో నీ హృదయఫలకంపై అవతరింప జేశాడు, (షు అ రా : 192)
ఖుర్‌ఆన్ అనే ఈ జ్ఞాన సాగరాన్ని వర్ణించడం ఎవరి తరమూ కాదు. ఈ గ్రంథ రాజం తెలియపర్చే యదార్థాల వరకు,అద్భుత విషయాల వరకు చేరుకోవడానికి మనకి ఎన్ని యుగాలు అవసరమో తెలియదు. ఈ గ్రంథ విశిష్ఠత గురించి కలం కదిలించి వ్రాయడం అంటే- కొన్ని కోణాలను మనిషకి తెలిసిన జ్ఞానం, అనుభవం కొద్దీ గ్రహించి చెప్పడమే అవుతుంది. ఈ గ్రంథ జ్ఞానాన్ని ఏ కలం, మరే పుస్తకం ద్వారానూ ఇనుమడింప జేయలేము. ‘ఇమామ్ ఫఖ్రుర్రాజీ (ర)’ ఇలా అభిప్రాయాపడ్డారు: ”ఖుర్‌ఆన్ అనే ఈ విజ్ఞాన భాండాగారమే గనక లేక పోయినట్లయితే ప్రపంచం మూడు వందల ప్రయో జనకర విద్యలను కోల్పోయి ఉండేది”.
ఆ మాటే పరమ పవిత్రుడైన అల్లాహ్ తెలియజేస్తున్నాడు: ”భూ మండలంలోని వృక్షాలన్నీ కలములుగా, సముద్రాలన్నీ సీరాగా మారినా, ఆపై వాటికి జతగా మరో ఏడు మహా సాగారాలను సీరాగా చేసినా అల్లాహ్‌ా వాక్యాలు పూర్తి కావు. నిస్సందేహంగా అల్లాహ్ సర్వాధికుడు, వివేక వంతుడు”. (లుఖ్మాన్: 27) మచ్చుకు కొన్నింటిని ఇక్కడ పేర్కొనడం జగుతుంది.
అది వచ్చింది –
”మిమ్మల్ని కారు చీకట్ల నుంచి వెలిక తీసి కాంతి వైపు తీసుకుపోవడానికి తన దాసునిపై తేటతెల్లమైన ఆయతులను (వచనాలను) అవ తరింపజేసినవాడు అల్లాహ్‌యే. నిశ్చయంగా ఆయన మీ యెడల మృదుస్వభావి, దయాశీలి.” (హదీద్: 9)
పవిత్ర ఖుర్‌ఆన్ మానవాళి పాలిట ఓ మహా దానుగ్రహం. ప్రపంచంలోని మరే అను గ్రహం దీనికి సరితూగదు. ఈ గ్రంథంలో భూత, భవిష్య, వర్తమానానికి సంబంధించిన సమాచారమూ ఉంది. సృష్టి, సృష్టి నిర్మాణం, సూర్యచంద్రనక్షత్ర భ్రమణ వివరాలూ ఉన్నాయి. గత జాతుల, ప్రవక్తల ఆదర్శాలూ ఉన్నాయి. విశ్వాసుల మధుర ఫలం స్వర్గం, అవిశ్వాసుల దుష్ఫలం నరక ప్రస్తావనలూ ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మనిషి ఇహపరాల సాఫల్యాలు, సభ్యతా సంస్కా రాలు, గౌరవోన్నతులు, నీతినడవడికలు-అన్నీ ఈ ఉద్గ్రంథంతోనే ముడిపడి ఉన్నాయి. రాజా ధిరాజు అయిన అల్లాహ్ ఈ గ్రంథరాజం గురించి ఇలా సెలవిస్తున్నాడు: ”ఓ ప్రవక్తా! మేము ఈ గ్రంథాన్ని నీపై అవ తరింపజే శాము. అందులో ప్రతీ విషయం విశదీక రించబడింది. విధేయత చూపేవారికి ఇది మార్గదర్శకం, కారుణ్యం, శుభవార్త”.(నహ్ల్:89)
ఖురాన్ కొన్ని ప్రత్యెకతలు
1)అది సమస్త మానవాళి కోసం వచ్చిన గ్రంథం – యావత్తు ప్రపంచవాసులను హెచ్చరించే నిమిత్తం ఈ ఫుర్ఖాన్ (గీటురాయి)ని తన దాసునిపై అవతరింపజేసినవాడు ఎంతో శుభదాయకుడు. (ఫుర్ఖాన్ -1)
2) సవ్యమైన బాట వైపు తీసుకెళ్ళే గ్రంథం – నిశ్చయంగా, ఈ ఖుర్ఆన్ పూర్తిగా, సరిఅయిన (సవ్యమైన) మార్గం వైపునకు మార్గదర్శకత్వం చేస్తుంది. మరియు సత్కా ర్యాలు చేస్తూఉండే విశ్వాసులకు తప్పక గొప్ప ప్రతిఫల ముందని శుభవార్తనూ అందజేస్తుంది. (ఇస్రా: 9 -10)
3) జాతుల భవితవ్యం ఖురాన్ – “నిశ్చయంగా ఈ గ్రంథ ఆధారంగా కొన్ని జాతులను కీర్తి శిఖరాల మీద కూర్చోబెడితే మరికొందరిని అధఃపాతాళానికి నెట్టి వేస్తాడు” అన్నారు ప్రవక్త (స). (ముస్లిం)
4) ఇది మనందరి కోసం, మానవులందరి కోసం వచ్చిన అంతిమ ధర్మ శాస్త్రం. ఇది కాల్పనిక సిద్ధాంతం కాదు ఈ రోజు పాటించి రేపు వేదిలేయడానికి. ఇది సమస్త లోకాల ప్రభువు సమస్త మానవాళికి అనుగ్రహించిన శాశ్వత ధర్మ శాస్త్రం.
నిశ్చయంగా, మేమే ఈ జ్ఞాపిక (ఖుర్ఆన్)ను అవతరింపజేశాము మరియు నిశ్చయంగా మేమే దీనిని కాపాడేవారము. (హిజ్ర్: 9)
”ఖురాన్ ను స్వతహాగా చదవడం నేర్చుకొని ఇతరులకు నేర్పించే వాడు మీలో ఉత్తముడు” అన్నారు ప్రవక్త (స)
“మీరు ఖురాన్ చదవండి. అది రేపు ప్రళయ దినాన తన్ను చదివే వ్యక్తి తరఫున సిఫారసు చేస్తుంది” అన్నారు ప్రవక్త (స) (బుఖారీ)
“రేపు ప్రళయ దినాన ఖురాన్ చదివే వ్యక్తితో – ఖురాన్ చదువుతూ వెళ్ళు. .. స్వర్గ అంతస్థులు అధిరోహిస్తూ వెళ్ళు… నువ్వెలాగైతె ప్రపంచంలో పారాయణం చేసే వాడివో అలానే పారాయణం చెయ్యి. నీ ఆఖరి అంతస్థు నువ్వు చదివే ఆఖరి ఆయతు దగ్గర ఉంటుంది” అన్నారు ప్రవక్త (స)
ఖుర్‌ఆన్ మహా గ్రంథాన్ని పఠించేవారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. ఏదోక దేశంలో, ఏదోక ఖండంలో, ఏదోక భూభాగంలో కాదు – ప్రపంచ దేశాలన్నింటిలోనూ ఉన్నారు. వారిలో తెల్లవారూ ఉన్నారు, నల్లవారూ ఉన్నారు, అరబ్బులూ ఉన్నారు,ఆరబ్బేతరులు ఉన్నారు, ఆ విషయానికొస్తే 160 కోట్ల మంది ముస్లింలలో 25 శాతం మంది అరబ్బు ముస్లింలయితే 75శాతం మంది అరబ్బేతరులే. ఒక్క మాటలో చెప్పాలంటే ఖుర్‌ఆన్ చదవకుండా ప్రపంచంలో ఒక్క క్షణం కూడా గడవదు. ఏదోక చోట, ఏదోక రూపం లో అనునిత్యం ఖుర్‌ఆన్ పఠనం సాగుతూనే ఉంటుంది. ఖుర్‌ఆన్ ఆవతరించి 1435సంవత్సరాలకు పై చిలుకు ఆవుతున్నా నాటి నుండి నేటి వరకు అది భిన్న జాతుల్ని, భిన్న సంస్కృతుల్ని, భిన్న మనస్తత్వాలు గల వ్యక్తుల్ని ప్రభావితం చేస్తూనే ఉంది. ప్రళయం వరకూ చేస్తూనే ఉంటుంది. మచ్చుకు కొన్ని గాథలు.
అరబ్బు దేశమయిన అబూ దాబీని సందర్శించే నిమిత్తం వచ్చిన ప్రాన్స్ దేశస్తుడైన జొల్యాన్ అనే వ్యక్తి టాక్సీలో వెళుతూ తన జీవితంలో మొదటి సారి ఖుర్‌ఆన్ విన్నాడు. అతనికి భాష అర్థం కాకాపోయినా ఖుర్‌ఆన్ పారా యణం అతని హృదయాన్ని తాకుతున్నట్లు అనిపించి – ‘ఏమిటిది? అని’ ప్రశ్నించగా ‘అది అల్లాహ్ గ్రంథమయిన ఖుర్‌ఆన్’ అని బదులివ్వ డంతో పాటే – చూడండి సర్! మీరు మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యుల్ని నరకాగ్ని నుండి కాపాడుకోవాలంటే ఇస్లాం స్వీకరించండి! అని అన్నాడు ఆ టాక్సీ డ్రైవర్. జొల్యాన్ అంటున్నాడు: అతని ఆ మాట నాకో హెచ్చరికలా అనిపించింది. చివరికి నేను పూర్తి అన్వేషణ జరిపి ఇస్లాం స్వీకరించేలా చేసింది.
అలాగే ఓ పెద్ద అధికారి, సెల్స్ టాక్స్ డిప్యూటి కమిష్నర్ దగ్గర పని చేసే ఓ ముస్లిం చఫ్రాసీ ఆయన ద్వారా ప్రమోషన్ అందుకున్న సంతో షంలో ఆయనకో గిప్టు ఇవ్వాలనుకున్నాడు. తానేమో పేదవాడు, ఏం గిప్టు ఇస్తే బాగుంటుంది అని తర్జన భర్జన పడ్డాడు. చివరికి ఆయన దగ్గరకు వెళ్ళి – ”సర్, నేను మీకు ఇవ్వబోతున్న గిఫ్ట్‌కు సరితూగ గలిగే వస్తువేది విశ్వం మొత్తంలో లేదు” అంటూ ఓ గిప్టు ప్యాకు అందిం చాడు. ఆఁ అంత పెద్ద గిప్టు ఇతను నాకేమివ్వగలడు అనుకొని తీసు కళ్ళి అల్మారాలో పెట్టి మరచి పోయాడు ఆ అధికారి. కాని పడకపై మేను వాల్చగానే ఛప్రాసీ మాటలు గుర్తుకొచ్చాయి. మరచి నిద్ర పోదా మనుకుంటే నిద్ర పట్టడం లేదు. అలానే మూడో వంతు రాత్రి గడిచి పోయింది. రాత్రి చివరి ఝామున లేచి ఆ గిప్ట ప్యాక్ తెరచాడు. అది హిందీ భాషలో ఉన్న ఖుర్‌ఆన్. ఏం రాయబడి ఉందో చదువుదాం అని తెవరబోయి ఆగిపోయాడు. పైన కవరుపై హిందిలో వ్రాయబడి ఉంది ‘పరిశుద్ధులే దాన్ని ముట్టుకుంటారు’ అని. వెళ్ళి చేతులు కాళ్ళు కడిగి వచ్చి చదవానారంభించాడు. ఆ రోజు మొదలయి ఆయన ఖుర్‌ఆన్ గ్రంథ పారాయణం చాలా రోజుల వరకు కొనసాగింది. గిఫ్టు ఇస్తూ ఛప్రాసీ చెప్పి మాట ఎంత వాస్తవమో ఆయనకు బోధ పడింది. అతను ఆ గిఫ్టు తనకిచ్చి ఉండకపోతే తాను ఎంతటి మహా భాగ్యాన్ని కోల్పోయేవాడో తనకర్థమయింది.
దివ్య ఖుర్‌ఆన్ పారాయణం చేస్తున్నాము, స్వయంగా పారాయణం చేయడమే కాక సుస్వరకర్తల స్వరంలో ఖురాన్ స్వర్ణకార ధ్వనిని వింటున్నాము. అల్‌హమ్దులిల్లాహ్ అయితే అన్ని ఉపద్రవాల నుండి మానవాళిని కాపాడే ఉగ్రంథంగా మనం విశ్వసి స్తున్న ఈ గ్రంథరాజాన్ని ఇతరుల వరకు చేరవేసే ప్రయత్నం చేశామా? మనం అందజేసే ఈ గిఫ్టు ఎందరి జీవితాల్ని మార్చగలదో ఎప్పుడ యినా ఆలోచించామా? ఏ విషయంలో ఎలా ఉన్నా ఈ విషయంలో మాత్రం ఆలస్యం అమృతం విషం.
అల్లాహ్ మనందరికి ఆయన గ్రంథాన్ని ఆయన దాసుల వరకు చేరవెసే సద్బుద్ధిని ప్రసాదించాలని, ఖుర్‌ఆన్‌ను మన మనో వసంతం గా చేయాలని, ఆత్మ జ్యోతిగా, సకల సమస్యల్ని దూరం చేసే దివ్య ఔషధిగా చేయాలని కోరుకుంటూ…
Tuesday, March 3, 2015
illu aanandaala harivillu - ఇల్లు ఆనందాల హరివిల్లు
ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు
Subscribe to:
Comments (Atom)



