Wednesday, November 19, 2014
Friday, September 26, 2014
Thursday, September 4, 2014
Saturday, August 30, 2014
Thursday, August 28, 2014
Wednesday, August 27, 2014
vishva janeena dharmam islam - goal of life
ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు
vishva janeena dharmam islam - goal of life
ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు
vishva janeena dharmam islam - goal of life
ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు
vishva janeena dharmam islam - goal of life
ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు
Monday, August 4, 2014
Friday, July 18, 2014
nishedhita shirk kaaryaalu
ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు
Wednesday, June 18, 2014
మాన్యుడవు అసామాన్యుడవు
శాంతి ప్రియ
లోక కళ్యాణార్థం వేల సంఖ్యలో
వచ్చిన ప్రవక్తల వలె ఆవిర్భవించె
మళ్ళీ ఒక కరుణ కలువ
విరబూసింది మానవ వసంతాన
ఆయన దేశకాలాలకు పరిమితమైన
ప్రవక్త కాదు, వినిర్మల హృదయ
విశ్వనాయకుడు అచ్చమైన
అక్షరాల అంతిమ దైవ ప్రవక్త (లి)
ఆయన పలుకులలో తేనెలొలికెను
అంతః కుహరాల తమస్సులు తొలిగెను
తపశ్శక్తులై ఉషస్జ్యోతులై వెలిగెను
మతుల మైల కడిగి మానవత్వం
నాటెను ఆయన దయా దృష్టి వీక్షణల
దివ్యత్వము కాపురముండెను
రుధిర విపాస వెర్రి తలలు వేసిన
మృగ సమాజ మతోన్మాదులు ఆయన
పలుకుల స్వాతిముత్య చినుకుల తాకిడిచె
మానవ ముత్యాలైపోయిరి
బహు విచిత్రమాయన హితోక్తి
వినగానే ధరావతులు ధనాన్వితులు
దళిత నిరువేదల్ని గుండెలకు హత్తుకొనిరి
'సయ్యిదీ' అంటూ గౌరవించిరి
గుండెకాయని నమిలి మింగలేక
ఉమ్మేసినట్టి వారిని చేరదీసి నిజం
ఇదని నచ్చజెవ్పి మెలమెల్లగా మనిషిగా
మలచిన నీవు ముమ్మాటికీ మహా మనీషివే!
కర్కశ హృదయాల్లో కరుణ రసాల్ని పండించి
కుఫ్ర్ కారడవిని ఈమాన్ కాంతి వనంగా
మలచి మమతల ముత్యాలు జల్లిన
నీవు నిస్సందేహంగా జగద్గురువువే
నెత్తురు వొడిన నేలలో నీతి
అత్తరులను చిల్కించితివె
సతులు చితికి ఆహుతయ్యే భూమిలో
తల్లి పాదాల చెంత స్వర్గమంటివె
ఈ జగాన జీవించిన నీవు
మాన్యుడవు అసామాన్యుడవు
భౌతిక జీవితం పరలోక పంట
పొలం అన్న మహిమాన్వితుడవు
మనిషికీ - అభిమతానికి మధ్య జరిగిన
భీకర పోరులో కులానికి కాదు
గుణానికే దిగ్విజయమ్మని
చాటిన ధర్మప్రభాకరుడవు
Sunday, March 30, 2014
అనుమాన భూతం
సయ్యిద్ అబ్డుస్సలాం ఉమ్రీ
దాంపత్య జీవితం - - అది నమ్మకం అనే బీజంతో ఎదిగే మహా వృక్షం.
దాంపత్య జీవితం -
అది కేవలం అనుమానం అన్న విష వైరస్‌తో పుటుక్కుమని తెగిపోయే పచ్చి దారం. కాబట్టి ఆలుమగలు తాము, కట్టుకునే అనురాగ గోపురంలో విష వాయువులు ప్రవేశించకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే
రాను రాను అవి పెనుభూతాలుగా మారి ఏకంగా ఇద్దరి జీవితాల్ని మింగేసే ప్రమాదముంది. భార్యాభర్తల
మధ్య అన్యోన్నత, అనురాగం మూడు పూలు
ఆరు కాయలుగా వర్ధిల్లాలంటే వారు షరీయతు సూచించిన హద్దులను గౌరవిస్తూ ఎవరి పరిమితుల్లో
వారుండాలి. ఒకవైపు వేరుగా బ్రతకలేము అని చెబుతూనే భార్య మీద భర్త, భర్త మీద భార్య ఫిర్యాదు చేస్తూ తిరగటం నిరర్థకం,
నిర్హేతుకం. ఒకరిలో ఉన్న లోపాలను
ఇంకొకరు పెద్ద మనస్సుతో మన్నించాలి. ఏదేని విషయంలో మనిషి తీవ్ర సందిగ్ధానికి లోనైనప్పుడు
ఖుర్‌ఆన్ వచనాల, ప్రవక్త (స) వారి
ప్రవచనాల వెలుగులో పరిష్కారం చూపే పండితులను, వివేచనాపరులను, స్థితప్రజ్ఞులను సంప్రదించటం ఎంతో ఉత్తమం. ఆ మేరకు ఉపయోగపడే దైవ ప్రవక్త (స) వారి
రెండు ప్రవచనాలను ఇక్కడ పొందుపరుస్తున్నాము.
ఓ పల్లెటూరి వ్యక్తి
దైవ పవ్రక్త (స) వారి సన్నిధికి వచ్చి - ''యా రసూలల్లాహ్! నేను తెల్లన, నా భార్య తెల్లన. కాని మాకిద్దరికి పుట్టిన పిల్లాడు
నల్లన'' అని భార్య మీద తనకున్న
అనుమానాన్ని వ్యక్తపర్చాడు. అది విన్న ఆదర్శ పవ్రక్త (స) ''రెండు ఎరన్రి ఒంటెలకు బూడిద రంగు ఒంటె పుట్టడం నీవు
గమనించి ఉంటావు కదా! అది ఎలా సాధ్యం అయ్యిందంటావు?'' అని ఎదురు పశ్న్ర వేశారు. అందుకా వ్యక్తి ''బహుశా వాటి తాతముత్తాతలలో ఎవరి పోలికయినా వచ్చి
ఉంటుంద''ని సమాధానమిచ్చాడు.
''అదే విధంగా నీ కొడుక్కి కూడా
నీ వంశస్థుల్లోని ఎవరి రంగయినా వచ్చి ఉంటుంది'' అని దైవ పవ్రక్త (స) సెలవిచ్చారు. (ముస్లిం)
హజత్ర్
ఆయిషా (ర) కథనం - ఒక రోజు దైవ పవ్రక్త (స) సంతోషాతిశయంతో నా దగ్గరకు వచ్చారు. ఆయన
ముఖారవిందం పక్రాశిస్తూ ఉంది. నన్నుద్దేశ్యించి ఆయన ఇలా అన్నారు: ''నీకు తెలుసా! ముజజ్జిజ్ ముద్‌లజీ ఇప్పుడే జైద్
బిన్ హారిసా మరియు ఉసామా (ర)ను చూసి ''ఈ కాళ్ళు పరస్పరం పోలికలు గలవి'' అని అన్నారు (బుఖారీ, ముస్లిం)
అంటే - ఆ సమయంలో వారిరువురి ముఖాలపై దుప్పటి ఉంది.
పాదాలు మాత్రం కన్పిస్తున్నాయి. కేవలం పాదాలు చూసి ముఖ సాముద్రిక విద్యలో నిష్ణాతుడైన
ముద్లిజ్ తెగకు చెందిన ముజజ్జిజ్ నిదురిస్తున్న వారిద్దరూ ఒకే వంశ వృక్షానికి చెందినవారని చెప్పడం మహా ప్రవక్త
(స) వారికి ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఎందుకంటే అప్పటికే ఉసామా బిన్ జైద్ (ర)
నలుపు రంగుపై కొంత మంది చెవులు కోసుకుంటున్నారు. ఉసామా గారి తండ్రి జైద్ బిన్ హారిసా
(ర) తెల్లగా ఉండటం వారి సంశయానికి అసలు కారణం. ప్రస్తుతం రక్త పరీక్ష వల్ల ఈ పని సులువైపోయినప్పటికీ ఆ సౌకర్యం లేని,
దాని గురించి తెలియని ప్రదేశాల్లో
నివసించే ప్రజలకు ఇందులో అనేక నిదర్శనాలున్నాయి.
Saturday, March 1, 2014
అద్భుతాల్లోకెల్లా అద్భుతం దివ్య ఖుర్‌ఆన్ మహత్యం
సయ్యిద్ అబ్దుస్సలామ్ ఉమ్రీ
మానవాళికి విశ్వ ప్రభువు చేసిన మేళ్ళు అగణ్యం. మనిషికి ఆయన ప్రసాదించిన వరానుగ్రహాలు అసంఖ్యాకం. సృష్టిరాసుల పట్ల ఆయనకు గల ప్రేమ అనంతం. ఆయన మనిషి జీవికకు అన్న పానీయాలను అనుగ్రహించడమేకాక, మనో భావాల్ని ప్రకటించే శక్తియుక్తులను కూడా ప్రసాదించాడు. ఇంకా మనిషి సంస్కృతీ నాగరికతల పురోభివృద్ధికి, క్రమవికాసానికి దోహదపడే సామగ్రిని అవనిలో పుష్కలంగా పొందుపరిచాడు.
అనన్య భౌతికానుగ్రహాలను మానవాళికి అందించిన ఆ పరమోన్నత ప్రభువు సర్వ విధాల మానవతపై దయదలచి సన్మార్గం చూపే, వారి ఆధ్యాత్మిక తృష్ణ తీర్చే, వారి ఆత్మలకు శక్తినిచ్చే ఏర్పాటు కూడా చేశాడు. అపురూప అనుగ్రహ ప్రదాత అయిన అల్లాహ్‌ా ప్రవక్తలనే శ్రేష్ఠ గణం ద్వారా సమస్త మానవాళికి మార్గదర్శక నియమావళిని ప్రసాదించాడు. దైవప్రవక్తలందరికీ ఆయా కాలాలను బట్టి, అవసరాలను బట్టి గ్రంథాలను, ప్రవర్తనా నియమావళులను పంపుతూ వచ్చాడు. ప్రజల జీవితాలను తీర్చి దిద్దేవారు. దైవభీతి, పరలోక భావనల ప్రాతిపదికగా మానవులందరినీ ఏకత్రాటిపై తీసుకువచ్చి వారిలో నైతిక విప్లవాన్ని నూరి పోసేవారు. శాంతి సాధనకు వారు సమిధులయ్యేలా వారిని సమాయత్త పర్చేవారు.
ఈ మార్గదర్శక గ్రంథాలలో చిట్ట చివరి గ్రంథం పవిత్ర ఖుర్‌ఆన్. ఖుర్‌ఆన్‌కు పూర్వం దైవ గ్రంథాలెన్నో అవతరించాయి. వాటి సంరక్షణా బాధ్యత అల్లాహ్‌ా ఆయా సముదాయాల వారికి అప్పగించాడు. కానీ ఆ గ్రంథావలంబీకులు వాటి పట్ల ప్రదిర్శించిన అలసత్వం కారణంగా, ఆ మతాధిపతులు స్వప్రయోజనాల కోసం వాటిలో మార్పుచేర్పులకు పాల్పడిన కారణంగా అవి తమ నిజ స్థితిని కోల్పోయాయి. దైవప్రోక్తంలో మానవ కల్పితాలు చోటు చేసుకున్న కారణంగా మానవాళి సహజంగానే వక్ర భాష్యాలకు పోయి శృతి మించి అపమార్గాన పడింది. మానవత అలా మార్గభ్రష్టత్వానికి లోనయిన ప్పుడల్లా మమతానురాగాలకు నిలయుడైన ఆ మాధవుడు మరో ప్రవక్తను, మరో జీవన విధానాన్ని పంపి, మరచిపోయిన పాఠాలను జ్ఞాపకం చేసే ఏర్పాటు చేసేవాడు.
ఈ మార్గదర్శక పరంపరలో కట్టకడపటి గ్రంథమే పవిత్ర ఖుర్‌ఆన్. కాలానుగుణంగా అవతరించిన ఆ గ్రంథాలు పరిమిత ప్రాంతా నికి, పరిమిత జీవన విధానానికి చెందినవి. కానీ ఖుర్‌ఆన్ గ్రంథం అన్ని విధాల పరిపూర్ణ మైనది. అది వచ్చిందే మానవాళిని కర్రి మబ్బుల నుండి వెలికి తీసి వెలుగు ముగ్గుల లో విహరింపజేసేందుకే. అఖండ జ్యోతీశ్వ రుడైన అల్లాహ్‌ా ఇలా సెలవిస్తున్నాడు:
”మిమ్మల్ని కారు చీకట్ల నుంచి వెలిక తీసి కాంతి వైపు తీసుకుపోవడానికి తన దాసునిపై తేటతెల్లమైన ఆయతులను (వచనాలను) అవ తరింపజేసినవాడు అల్లాహ్‌ాయే. నిశ్చయంగా ఆయన మీ యెడల మృదుస్వభావి, దయాశీలి.” (హదీద్: 9)
పవిత్ర ఖుర్‌ఆన్ మానవాళి పాలిట ఓ మహా దానుగ్రహం. ప్రపంచంలోని మరే అను గ్రహం దీనికి సరితూగదు. ఈ గ్రంథంలో భూత, భవిష్య, వర్తమానానికి సంబంధించిన సమాచారమూ ఉంది. సృష్టి, సృష్టి నిర్మాణం, సూర్యచంద్రనక్షత్ర భ్రమణ వివరాలూ ఉన్నాయి. గత జాతుల, ప్రవక్తల ఆదర్శాలూ ఉన్నాయి. విశ్వాసుల మధుర ఫలం స్వర్గం, అవిశ్వాసుల దుష్ఫలం నరక ప్రస్తావనలూ ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మనిషి ఇహపరాల సాఫల్యాలు, సభ్యతా సంస్కా రాలు, గౌరవోన్నతులు, నీతినడవడికలు-అన్నీ ఈ ఉద్గ్రంథంతోనే ముడిపడి ఉన్నాయి. రాజా ధిరాజు అయిన అల్లాహ్‌ా ఈ గ్రంథరాజం గురించి ఇలా సెలవిస్తున్నాడు: ”ఓ ప్రవక్తా! మేము ఈ గ్రంథాన్ని నీపై అవ తరింపజే శాము. అందులో ప్రతీ విషయం విశదీక రించబడింది. విధేయత చూపేవారికి ఇది మార్గదర్శకం, కారుణ్యం, శుభవార్త”.(నహ్ల్:89)
పవిత్ర ఖుర్‌ఆన్ ఓ మహా సాగరం. ఈ గ్రంథాన్ని విజ్ఞులు, వివేచనాపరులు, పండి తులు శోధించినకొద్దీ వారి తృష్ణ పెరుగు తూనే ఉంటుంది.
దాని లోతుల్లోకి పోయిన కొద్దీ ముత్యాలు, పగడాలు, మణిమాణిక్యాలు దొరుకుతూనే ఉంటాయి. అదో అంతం కాని జ్ఞానఖని. విజ్ఞానగని. ఈ గ్రంథంలో అల్లాహ్‌ా పవిత్ర నామాలు, గుణగణాలతోపాటు, అల్లాహ్‌ను, ఆయన దూతలను, ఆయన ప్రవక్తలను, ఆయన గ్రంథాలను విశ్వసించండి అన్న పిలుపు కూడా ఉంది.
”తన ప్రభువు తరపున అవతరింపజేయబ డిన దానిని ప్రవక్త విశ్వసించాడు. దాన్ని విశ్వాసులు కూడా సత్యమని నమ్మారు. వారం తా అల్లాహ్‌ాను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలను విశ్వసిం చారు.’మేము ఆయన పంపిన ప్రవక్తల మధ్య ఎలాంటి వివక్ష, భేదభావాన్ని పాటించము’ అనంటారు. అలాగే ”మేము విన్నాము విధే యులయ్యాము మా ప్రభూ! మేము నీ క్షమా భిక్షను అర్థిస్తున్నాము, కడకు మేము మరలి రావలసింది నీ వద్దకే” (అని దీనాతిదీనంగా వేడుకుంటారు.) (బఖరా:285)
విజ్ఞానం శృతి మించి వినాశనం సృష్టిస్తున్న నేటి తరుణంలో, మతం మతి తప్పి మారణ హోమం రగలిస్తున్న నేటి యుగంలో, అస్పృశ్యత, అంటరానితనం, నిమ్నోన్నతా భావం అపశృతులు పలికిస్తున్న నేటి ఆధుని కంలో, ఉన్మాదం, ఉగ్రవాదం వెర్రి తలలు వేస్తున్న నేటి కలికాలంలో, మారణాస్త్ర నిర్మూ లనమే సమస్త మానవ వికాసమనీ, అఖిల మానవాభ్యుదయమే విశ్వాస దళ ధ్యేయమని వక్కాణిస్తుంది ఖుర్‌ఆన్.
ఈ కారణంగానే మేము ఇస్రాయీల్ సంతతి వారికి ఇలా ఉత్తర్వు జారీ చేశాము: ”ఎవరైనా ప్రతీకార హత్య (శిక్ష)గా లేక ధరణిపై కల్లో లం రేకెత్తించినందుకు శిక్షగా తప్ప ఏ మనిషి నైనా చంపితే అతను యావత్తు మానవాళినీ చంపినట్లే. అలాగే ఎవరైనా ఒక మనిషి ప్రాణం కాపాడితే అతను యావత్తు మానవాళి ని కాపాడినట్లే”. (మాయిదా:32)
అందరినీ ప్రేమించడమే ఇస్లాం అభిమత మ్మని, అదే సుమా ఎప్పటికీ దైవసమ్మతం అని ఉద్ఘాటిస్తుంది. అందుకు భక్తి మార్గమే అన్ని విధాల శ్రేయస్కరమని నొక్కి చెబు తుంది. పుట్టుకరీత్యా ఎవరూ అల్పులు కారని, అందరూ దైవ దాసులేనని, దైవభీతి పరులే దైవానికి ప్రియులని హితవు పలుకుతుంది. ”మానవులారా! మేము మిమ్మల్ని ఒకే పురు షుడు, ఒకే స్త్రీ నుంచి సృజించాము. తర్వాత మీరు ఒకరినొకరు పరిచయం చేసుకునేం దుకు మిమ్మల్ని జాతులుగా, తెగలుగా చేశాము. వాస్తవానికి మీలో అందరికంటే ఎక్కువ భయభక్తులు కలవాడే అల్లాహ్ దృష్టిలో ఎక్కువ గౌరవానికి అర్హుడు. నిశ్చ యంగా అల్లాహ్ సర్వ జ్ఞానం కలవాడు. సకల విషయాలు తెలిసినవాడు”. (అల్‌హుజురాత్: 13)
పవిత్ర ఖుర్‌ఆన్ ఒక అద్భుత కళాఖండం. అది తన పఠితులను ఉర్రూతలూగించడమే కాక, సృష్టి, సృష్టి రహస్యాల గురించి, తన ఆయతుల గురించి ఆలోచించమని పురిగొల్పు తుంది. వారిలో జిజ్ఞాసను పెంచుతుంది.
ఓ ప్రవక్తా! వారికి చెప్పు: ”ఆకాశాలలో, భూమిలో ఏ వస్తువులైతే ఉన్నాయో వాటిని కాస్త (నిశిత దృష్టితో) చూడండి”. (యూనుస్:101)
మరో చోట ఇలా ఉంది: ”ఏమిటి, వారు ఖుర్ ఆన్ గురించి లోతుగా ఆలోచించరా? లేక వారి హృదయాలపై తాళాలు పడి ఉన్నా యా?”. (ముహమ్మద్:24)
Subscribe to:
Comments (Atom)



.jpg)