Monday, September 20, 2021
Sunday, September 19, 2021
Saturday, September 18, 2021
Wednesday, September 8, 2021
మహిళా జగతిలో సయ్యిదా ఆయిషా (ర.అ) అంతస్తు
మహిళా జగతిలో సయ్యిదా ఆయిషా (ర.అ) అంతస్తు
సిద్దే కుబ్రా, ఉమ్ముల్ మోమినీన్ సయ్యిదా ఆయిషా (ర.అ) పవిత్ర జీవితంలోని ఒక్కొక్క అక్షరాన్ని మీరు చదివారు. ఆమె ఆదర్శ జీవితంలోని ఒక్కొక్క సంఘటన మీ కళ్ల ముందు కదలాడింది. ప్రపంచంలో ప్రసిద్ది చెందిన వందలాది మంది మహిళల స్థితిగతుల గురించి మీకు తెలిసి ఉండవచ్చు. కాని ఎప్పుడయినా మీరు వారి ఘనకార్యాలపై తులనాత్మక అధ్యయనం చేశారా?
ప్రపంచంలో ప్రసిద్ది చెందిన ముస్లిమేతర మహిళామణుల జాబితాలో చోటు సంపాదించుకున్న వారిలో చాలామంది ఎలాంటివారంటే, వారు తమ స్థాయికన్నా కొంచెం ఉన్నతమైన ఒక ఘనకార్యం చేసి ఉంటారు. అదే వారి కీర్తికి కలికితురాయి అయిపోయింది. ఒక స్త్రీ ఉద్వేగంగా ఒక సభలో ప్రసంగించింది. ఒకానొక ఉపాయంతో శత్రువుల కుట్రను భగ్నం చేసింది. ఈ తక్షణ కారణాలు ఆమెను చరితార్డు రాలిగా చేశాయి. కాస్త ఆలోచించండి! ఏదైనా ఒక వ్యవస్థలో సుదీర్ఘకాలం నిలిచి, ఎల్లకాలం ఉపయోగపడే సేవల్ని అందించిన వారితో వీళ్లను పోల్చటం సరైనదేనా? ఒక అందాల రాశి కళ్లు చెదిరే సౌందర్యంతో రాకుమారుణ్ణి మంత్ర ముగ్ధుణ్ణి చేసి, తరువాత పట్టపురాణిగా అంతఃపురంలో ప్రవేశించి కీలక అధికారాలను చేజిక్కిం చుకున్న సంఘటనలు కూడా చరిత్రలో ఉన్నాయి. కాని అలాంటి వారు తృటిలో వెలిగి, కీర్తి శిఖరాల అంబరాలు చుంబించినప్పటికీ వైఫల్యమే వారి అంతిమ పరిణామం అయిందని చరిత్ర చాటి చెబుతోంది. ఈజిప్టు, ఈరాన్, రోము చరిత్రల విశేషాలు మీ ముందు ఉన్నాయి. వాటిని ఒక విజయవంతమైన, పవిత్రమైన, సౌశీల్యవంతమైన జీవితంతో పోల్చటం న్యాయమేనా?
సరే, ఈ సర్వసాధారణమైన స్థానాలను వేరుపరచి ధార్మిక, నైతిక కోణాలను ముందుకు తీసుకువచ్చినప్పుడు సుబోధకమయ్యేదేమంటే, మహిళా అంతరిక్షంలోని ఒక్క నక్షత్రం కూడా ఆకాశపుటంచున ఉదయించే అర్హత కలిగిలేదు. మన దేశంలోని అమాయికలైన సతీమణులెందరో ముందుకు వచ్చి, ఈ విషయంలో తమ యోగ్యతను చాటుకోవచ్చు.
కాని మీరు వారిని అడగండి - 'అమ్మా శీలవతులారా! మీ నైజంలోని పవిత్రత, పాతివ్రత్యానికి సంబంధించిన తిరుగులేని ఆధారాలను మినహాయిస్తే మరేదయినా యోగ్యతాపత్రం మీ వద్ద ఉన్నదా? అని. ఒక్క సిద్దీఖి అక్బర్ పుత్రిక తప్ప ప్రపంచంలోని ఏ మహిళ ఆధ్యాత్మిక, వైజ్ఞానిక, ధార్మిక, రాజకీయ, సామాజిక రంగాలలోని కీలకమైన విధులు నెరవేర్చాలో చెప్పండి. ఆమె తన జీవితపు విజయ వంతమైన కార్యకలాపాల ద్వారా, దైవదాస్యపు ఆదర్శాల ద్వారా, నైతికపు క్రియాత్మక ఆదర్శాల ద్వారా, ఆధ్యాత్మికమైన పవిత్ర బోధనల ద్వారా, దీన్, షరీఅత్, శాసనాంగ పరమ రహస్యాలను విశదీకరించటం ద్వారా సుమారు పదికోట్ల' మంది మహిళల కొరకు సమగ్ర జీవితపు సంపూర్ణ ఆదర్శాలను వదలి పెట్టారు. ఆమె బ్రహ్మాండమైన మహిళా జనవాహినికి ధార్మికంగా, సామూహికంగా, వైజ్ఞానికంగా మహోపకారాలు చేశారు.
ముస్లిం మహిళా చరిత్రలో ఒక్క ప్రవక్త సతీమణులు, పవిత్ర స్త్రీ మూర్తులు (రజిఅల్లాహు అహున్న) తప్ప సయ్యిదా ఆయిషా(ర.అ)జీవితాన్ని మరెవరితోనయినా పోల్చతరమా? ఇస్లాంలో సయ్యిదా ఖదీజతుల్ కుబ్రా, సయ్యిదా ఫాతిమా జహ్రా, సయ్యిదా ఆయిషా సిద్దీఖా (రజిఅల్లాహు అహున్న) మాత్రమే మహిళలందరిలోకీ శ్రేష్ఠులు అన్న విషయంలో ఇస్లామీయ విద్వాంసుల మధ్య ఏకాభిప్రాయం ఉంది. అత్యధికమంది విద్వాంసులు మొదట సయ్యిదా ఫాతిమా పేరును, తరువాత సయ్యిదా ఖదీజా పేరును, ఆ తరువాత సయ్యిదా ఆయిషా (రజిఅల్లాహు అహున్న) పేరును ప్రస్తావించారు. అయితే ఈ క్రమబద్దీకరణకు షరీఅత్ పరంగా గానీ, హదీసులపరంగా గానీ ఎలాంటి మూలాధారాలు లేవు. కాకపోతే విద్వాంసులు తమ అంచనా (ఖియాస్), పర్యాలోచన (ఇత్తెహాద్), అధ్యయనం ఆధారంగా ఈ నిర్ణయానికి వచ్చారు.
ఈ ముగ్గురు మహిళామణుల వేర్వేరు శ్రేష్ఠతలు, మహిమోన్నతలు హదీసులలో పేర్కొనబడ్డాయి. అందుచేతనే పండితులు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా, ఆచితూచి మాట్లాడుతారు. ఒక్క అల్లామా ఇబ్నె హజ్ (రహ్మ) మాత్రం విద్వాంసులందరి దృక్పథానికి వ్యతిరేకంగా - బాహాటంగా - ఇలా ప్రకటించారు : “దైవప్రవక్త (స) తరువాత సయ్యిదా ఆయిషా (ర.అ) ప్రవక్త కుటుంబీకులలోనే కాదు, సమస్త మహిళా జగతిలోనే కాదు, ప్రవక్త సహచరమాన్యులలో కూడా అందరికన్నా గొప్పవారు.” తాను చేసిన ఈ ప్రకటనకు సాక్ష్యాధారాలుగా ఆయన ఎన్నో విషయాలను సమర్పించారు. ఆసక్తి ఉన్నవారు "అల్ మలర్ వన్నహల్”లో సహాబా మహిమోన్నతలు అన్న శీర్షికన జరిగిన చర్చను అధ్యయనం చేయగలరు. మా మటుకు మేము ఈ వ్యవహారంలో అల్లామా ఇబ్నె తైమియా (రహ్మ), ఆయన శిష్యులు హాఫిజ్ ఇబ్నె ఖయ్యిమ్ (రహ్మ)లు వెలిబుచ్చిన అభిప్రాయంపై గట్టి నమ్మకంతో ఉన్నాము. వారిలా వ్రాశారు : ఒకవేళ వంశపారంపర్యం దృష్ట్యా చూసినపుడు సయ్యిదా ఫాతిమా జహ్రా (ర.అ) అందరికన్నా గొప్పవారు. ఇక 'గొప్పతనం' అనేది పరలోక అంతస్తు రీత్యా అయివుంటే, దాని గురించి అల్లాహ్ కు మాత్రమే తెలుసు. కాని ప్రాపంచికంగా చూసినపుడు, వాస్తవానికి వారిలో ఎవరి గొప్పతనం వారిది. ఒక్కొక్కరు ఒక్కో కోణం నుండి గొప్పవారుగా దర్శనమిస్తారు. విశ్వసించటంలో ముందంజవేసి, కష్టకాలంలో దైవప్రవక్త (స)కు ఆదరువుగా ఉండి, ఓదార్పు నివ్వటంలోనూ, ఆర్థికంగా దైవప్రవక్త (స)కు అండగా నిలబడి మీకు తోడుగా నేనున్నాను అని చెప్పటం దృష్ట్యాను చూసినపుడు సయ్యిదా ఖదీజతుల్ కుట్రా (ర.అ) గొప్పతనం అందరినీ మించినది. కాని విద్యా విషయిక సేవలను, ధార్మిక సేవలను, ప్రవక్త మహనీయుల (స) బోధనల, ఉపదేశాల పరివ్యాప్తిలో పోషించిన పాత్రను చూసినపుడు సయ్యిదా ఆయిషా (ర.అ) సిద్దీఖాకు సాటి రాగల వారెవరూ లేరు (షరహ్ మవాహిబుద్దునియా, జుర్బానీ - 3/ 269).
సయ్యిదా మర్యమ్ (అలైహస్సలామ్) గొప్పతనం గురించి మనకేమన్నా తెలిసిందంటే, అది ఇస్లాం ద్వారానే సుమండి! ఇంజీల్ కథనాలను తరచి చూసినపుడు, అవి ఆ మహాతల్లికి ఏమాత్రం ఔన్నత్యం ప్రసాదించలేదని అర్ధమవుతుంది. ఫిరౌన్ భార్య సయ్యిదా ఆసియా (అలైహస్సలామ్) కూడా ఇస్లాంలో వైశిష్ట్యానికి పాత్రురాలిగా ఖరారయింది. కాని తౌరాత్ గ్రంథం మాత్రం ఆమె గొప్పతనం గురించి ఏమీ అభివ్యక్తం చేయకుండా మౌనం వహించింది. అందువల్ల సైద్ధాంతికంగా మేము ఆ పుణ్య స్త్రీల ఔన్నత్యాన్ని కాదనలేము. కాని సంఘటనల రీత్యా, చారిత్రక వివరాల దృష్ట్యా మౌనమే సమాధానం అవుతుంది. కాబట్టి 'వహీ' (దైవవాణి) నిష్పక్షపాతంగా, నిజాయితీగా ఇచ్చిన తీర్పుకన్నా సత్యమైన తీర్పు మరేదీ కాజాలదు.
((عن أبي موسى الأشعري قال رسول الله في كل من الجال كثير ولم يكمل من النساء إلا مريم بنت عمران و اييه إمرأة فرعون و فضل عائشة على النساء كفضل الثريد على سائر الطعام))
మహనీయ అబూ మూసా అష్ అరీ (రజి) ఉల్లేఖనం ప్రకారం మహాప్రవక్త ముహమ్మద్ (స) ఇలా ప్రవచించారు : "పురుషులలో పరిపూర్ణులైన వారు ఎందరో గడిచారు. కాని స్త్రీలలో ఇమ్రాన్ పుత్రికయగు మర్యమ్, ఫిరౌన్ భార్యయగు ఆసియా కన్నా పరిపూర్ణులెవరూ పుట్టలేదు. ఇక ఆయిషా అంటారా, 'సరీద్' * వంటకానికి ఇతర వంటకాలపై ఎలాంటి ప్రాధాన్యత ఉందో మహిళలపై ఆయిషాకూ అలాంటి ప్రాధాన్యత ఉంది.” (సహీహ్ బుఖారీ – హ.నెం. 3769; సహీహ్ ముస్లిం - హ.నెం. 2431).
'సరీద్' అనేది అరబీ వంటకం. చారు మాదిరిగా వండిన కూరలో రొట్టె ముక్కలు నానబెట్టి దీనిని తయారు చేస్తారు. దైవప్రవక్త (స) కాలంలో ఈ వంటకం అరబ్బులలో స్వాదిష్టమైన, శ్రేష్ఠమైన, రుచికరమైన భక్ష్యంగా పరిగణించబడేది. ఈ మధ్య కాలంలో అరబ్బు రాజ్యాలలో దీనిని 'తషీ'గా కూడా వ్యవహరిస్తున్నారు.
Monday, September 6, 2021
Tuesday, August 10, 2021
అరుదైన ఆణిముత్యం అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ (స)
అరుదైన ఆణిముత్యం అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ (స)
ఆయా కాలాలను బట్టి వివిధ జాతుల్లో, వివిధ భాషల్లో దైవ ప్రవక్తలు వచ్చారన్న విషయం విదితమే. లోక కళ్యాణార్ధం వచ్చిన ప్రవక్తలందరూ, ప్రజలకు స్వచ్చమైన జీవన విధానాన్ని చూపించి, స్వేచ్చావాయువుల్లో విహరింపజేసే 'లా ఇలాహ ఇల్లల్లాహ్' అన్న సద్వచనం మీద మానవాళిని సమైక్యపరచడానికి ప్రయత్నించారు. అలా విశ్వ శాంతి నిమిత్తం వచ్చిన ప్రవక్తలలో ముహమ్మద్ (స ) చిట్టచివరివారు.
మేము నిన్ను శుభవార్త అందజేసేవానిగా, భయపెట్టేవానిగా చేసి సత్యాన్నిచ్చి పంపాము. ప్రతిజాతిలోనూ హెచ్చరించేవాడు ఆవిర్భవించాడు. (ఫాతిర్: 23,24)
చరిత్రను తిరగేస్తే...... .
నాడు - హజ్రత్ ఇబ్రాహీమ్ (అ) ప్రవక్తల పితామహుడు. మొక్కవోని సాహసమూర్తి. సహన శీలి. నాటి - ఆ సమాజం, సభ్యతాసంస్కారాలకు సమాధి కట్టి, నీతినిజాయితీలకు నిప్పు పెట్టి, దురాచారాలను ప్రవేశపెట్టి, పచ్చి నిజాలను మంటల్లో నెట్టి, జన మోసాలకు, ధన మోహాలకు, విగ్రహ వ్యామోహాలకు శ్రీకారం చుట్టి, న్యాయ శాస్త్రాలకు పాడె కట్టి, ధరలోభాలకు పట్టం కట్టి, షిర్క్ అడుసు తొక్కి, చర్మ చక్షువులకు కర్రి మబ్బుల గంతలు కట్టి, సందుల్లో, బొందుల్లో శిలాప్రతిమల్ని నిలబెట్టి, జన నమ్మకాలను కొల్లగొట్టి, హరామ్ అనే హాలాహలానికి అమృతం అన్న లేబల్ చుట్టి, చెట్టు, పుట్ట, పాము-పశువు, వాగు-వంక, సూర్యచంద్ర నక్షత్రాలకు తల వంచి, ఆత్మనే వంచించి, కటిక చీకట్లలో కొట్టుమిట్టాడే ఆ గాఢాంధకార సమాజంలో సత్య జ్యోతి వెలిగించడానికి నడుం బిగించారు ప్రవక్త ఇబ్రాహీమ్ (అ).
నిన్న- అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ (స ). ప్రవక్తలందరి నాయకుడు. మహా గొప్ప విప్లవకర్త, విశ్వకారుణ్యమూర్తి. నిన్నటి - ఆ సమాజంలోని- ధరావతుల, ధనాన్వితుల దారుణ హింసా చర్యలను నిరశించి, తిండిలేక ప్రజలు కొన ఊపిరితో చావు బ్రతుకుల మధ్య ఊగిసలాడుతుంటే, ధాన్యాగారాలను నిల్వబెట్టి, ప్రజల కళ్ళు గప్పి, వంచనలకు, లంచాలకు, చక్ర బారు వడ్డీలకు చక్రాలు తిప్పే విద్రోహ శక్తుల్ని నియంత్రించి, సత్య ధర్మాద్వేషులని, సంఘంలో నక్కిన గుంట నక్కల్ని, సమాజంలో దాగిన విష ఖడ్గాలని, పాలు పోసి మరీ పెంచబడిన భయద భయంకర సర్పాలనీ, హంతకులని, నియంతలని, స్వార్థపరులని, దుర్మార్గులని, ధూర్తులని గర్జించి, బానిసత్వ సంకెళ్ళను తెంచి, అనవసర ఆంక్షల బరువులను దించి, మంచిని పెంచి చెడును త్రుంచి, మానవ నిర్మాతయి, సౌజన్య ప్రదాతయి, సాత్విక దాతయి నిలిచారు మహా ప్రవక్త ముహమ్మద్ (స).
ఆయన చేపట్టిన మహోద్యమం కారణంగా ప్రతి హృదయం జ్యోతిర్మయం అవగా, ప్రతి నేత్రం మందారం వలె విరియగా, ప్రతి వదనం సౌహార్ద ప్రతిబింబంగా వెలియగా, ప్రతి పలుకు మలయ మారుతంలా మారగా, మనో సీమల్లో మమతల మల్లెలు పూయగా, ఆత్మ బలం గుభాళింపగా విజయ ఢంకా మ్రోగించారు, హృదయాల విజేత అన్పించారు.
ఫలితం - ద్వేషం మొలచిన పాదుల స్నేహ వల్లి వెల్లి విరిసింది. కక్షలు, కార్పణ్యాలు పెరిగిన తావుల కారుణ్యం కురులు విప్పింది. దౌర్జన్యం, దౌష్ట్యం మోహరించిన చోటల్లా స్వేచ్ఛా పూవు విరబూసింది. వర్గ, వర్ణ, కుల, గోత్ర, మత, ప్రాంత విభేదాలు తొలగి, వైషమ్యాలు, వైరాలు, నేరాలు, ఘోరాలు సద్దు మణిగి, బర్బరత్వం అంతరించి, మృగత్వం మెడలు వంచి, మానవత్వం జయించింది. శాంతి తంత్రి నినదించింది. దానవత్వం, దమన నీతి, దారుణత్వం అణగారింది. సాత్విక దృష్టి సౌమ్యతా మొగ్గలు తొడిగింది. శ్రమకి,
శ్రామికునికి ఫలితం సకాలంలో లభించింది. స్త్రీకి హక్కు దక్కింది. లోభం, మోహం, మోసం, క్రౌర్యం, కామం, మదం, మత్సర్యం, దురహంకారం చరమ సంధ్యలో తుది శ్వాస వదిలింది. జగమంతా కుటుంబం మనది అన్న భావన వికసించింది. జనులంతా సుందర
భాస్కర సుమనోహర కిరణాలవగా, విశ్వం మొత్తం శాంతి శ్రేయాలు వర్ధిల్లగా, అందరి కళ్ళ నుంచి ఆనంద భాష్పాలు జలఝరి వలె రాలగా, అందరికీ వీడ్కోలు పలికి పరమపదించి పరమోన్నత మిత్రుని సన్నిధికి పయనమయ్యారు ప్రవక్త (స ).
మరి నేడు - ముస్లింలు. ప్రజా సంక్షేమం కోసం, లోక కళ్యాణం కోసం ఉనికిలో తేబడ్డ శ్రేష్ఠ సముదాయం. కాని... ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు - అలనాటి దర్గాలు, దుర్గాలు, దురాచారాలు, దమన నీతులు నేడూ మన మధ్యనే మసలుతూ, కొత్త రంగులు పులుముకొని, అందంగా ఆకర్షణీయంగా ముస్తాబయి దర్జాగా చెలామణి అవుతున్నాయి. మానవుడు సాధించని ప్రగతి అంటూ ఏదీ లేదు నేడు. విద్యుత్ దీపాలతో నగర పల్లె వీధులు వెలిగిపోతున్నాయి. కానీ, హృదయ సీమలు సుహృద్భావ లేమితో, మానవత్వం, దైవభీతి కరువై బీటలు వారుతున్నాయి. మనసున పూసిన మందారాలు వాడిపోతున్నాయి. కరుణ, ప్రేమ, జాలి, ఆప్యాయత, అనురాగాలు కనుమరుగైపోతున్నాయి. అరచేతిలోని అంతర్జాలం ఒక వైపు అద్భుతనాల్ని ఆవిష్కరిస్తుంటే, మరో వైపు పూడ్చ సాధ్యం కానీ అనర్థాల్ని సృష్టిస్తున్నది. సత్యం, ధర్మం, న్యాయం కోసం సద్వినియోగించుకోవాల్సిన ఈ పరికరాలను ముఖ్యంగా యువత - అశ్లీలం, విచ్చలవిడితనం, స్వీయ నగ్న చిత్రీకరణ, నీతి రాహిత్య సంభాషణ కోసం దారుణంగా దుర్వినియోగ పరుస్తున్నారు. నేటి మన దుస్థితికి కారణం, కారకులు ఎవరు? మనం కాదా? ప్రజా బాహుళ్యంలో విద్యా గంధాన్ని, ప్రేమ మరిమళాన్ని వెదజల్లే బాధ్యత మన మీద లేదా? ఆత్మ స్తుతిని మాని ఆత్మ విమర్శ, ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన, ఆలోచించాల్సిన కర్తవ్యం మనది కాదా? ఏమిటి మనం మేల్కోవాల్సిన సమయం ఆసన్నం కాలేదా?
విశ్వాసుల హృదయాలు అల్లాహ్ ప్రస్తావనతో ద్రవించే సమయమింకా రాలేదా? ఆయన పంపిన సత్యం ముందు లొంగిపోయే వేళ ఆసన్నం కాలేదా? గతంలో కొందరికి గ్రంథం ఇవ్వబడింది. కాని ఓ సుదీర్ఘకాలం గడచిన తర్వాత వారి హృదయాలు కఠినమై పోయాయి. ఈనాడు వారిలో చాలామంది దుర్మార్గులై ఉన్నారు. మీరలా కాకూడదు సుమా!
వినండి! భూమి మృతప్రాయమైన తర్వాత అల్లాహ్ దానికి తిరిగి జీవం పోస్తున్నాడు. (అలాగే మృతప్రాయమైన మానవతక్కూడా ప్రవక్తల ద్వారా జీవం పోస్తున్నాడు.) మీరు విషయం గ్రహిస్తారని మాసూక్తులు మీకు విడమరచి చెబుతున్నాం. (అల్ హదీద్:16-17)
Thursday, August 5, 2021
పుణ్య కాలానికి చెందిన పురుషోత్తములు సహాబహ్
సంక్లిష్ట స్థితిలో సత్యాన్ని విశ్వసించ సాహసించిన సత్యబాంధవులు సహాబహ్. సత్యం కోసం సర్వస్వాన్ని తృణప్రాయంగా త్యాగం చేసిన ధన్య జీవులు సహాబహ్. సత్యధర్నాన్ని సమస్త మానవాళి కొరకు చేరవేసేందుకు స్వప్రాంతాలను, స్వీయ కుటుంబాలను వీడిన మన్య జీవులు సహాబహ్. సత్యధర్మ కేతనాన్ని సర్వత్రా ఎగుర వేెసేంత వరకు కునుకు తియ్యము అని కంకణం కట్టుకున్న కార్య సాధకులు, కారణ జన్ములు సహాబహ్. వారు ముందువారు ముందున్న వారు. ఈ వ్యాస మాధ్యమంగా ఆ మాహాత్ముల గురించి తెలుసుకుందాం!
సహాబీ అంటే:
భాషా పరంగా – సహాబీ అంటే సహచరుడు, సహవాసి అని అర్థం. శాస్త్ర పరంగా-స్త్రీ అయినా, పురుషుడయినా, పాపయినా, పిల్లాడయినా అల్లాహ్ అంతిమ ప్రవక్త ముహమ్మద్ (స)వారిని విశ్వసించి, ఒకే ఒక్క చూపు అయినా సరే ఆయన్ను దర్శించి, ఇస్లాం ధర్మం మీదే మరణించిన వ్యక్తిని- పురుషుడయితే సహాబీ, స్త్రీ అయితే సహాబియహ్‌ా అంారు.వారి పేరు తర్వాత పురుషుడయితే ‘రజియల్లాహు అన్హు’-అల్లాహ్‌ా ఆయనతో రాజీ అయ్యాడు అని, స్త్రీ అయితే ‘రజియ ల్లాహు అన్హా ‘- అల్లాహ్‌ా ఆమెతో రాజీ అయ్యాడు అని ప్రస్తావించడం ఆనవాయితి.
సదరు వ్యక్తి సుదీర్ఘ సమయం కొరకు ప్రవక్త(స) వారి సమావేశంలో పాల్గొన్నా, స్వల్ప సమయం కొరకు పాల్గొన్నా, ఆయన నుండి కథనాలు ఉల్లేఖించినా, ఉల్లేఖించక పోయినా, ఆయనతోపాటు యుద్ధ్దంలో పాల్గొన్నా, పాల్గొ నక పోయినా, ఏదో కారణంగా ఆయన్ను చూడక పోయినా-ఉదాహరణకు – అంధత్వం – ఆ వ్యక్తిని సహాబీగా పరిగణించడం జరుగుతుంది.
గమనిక:
ఒకవేళ ప్రవక్త (స)ను చూసి విశ్వసించిన తర్వాత ఏదోక కారణంగా ధర్మభ్రష్టుడయి మళ్ళీ కనువిప్పు కలిగి ధర్మం మార్గం మీద నిలకడగా జీవించి మరణించినట్లయితే అలాంటి వ్యక్తిని సయితం సహాబీగా ఎంచడం జరుగు తుంది. ఉదాహరణకు-తల్హా బిన్ ఖువైలద్ (ర). (ఇమామ్ ఇబ్బు హజర్ (ర).
”ఒక ఏడాది కోసం లేదా ఒక నెల కోసం లేదా ఒక రోజు కోసం లేదా ఒక ఘడియ కోసమయినా సరే విశ్వాస స్థితిలో ఆయన సాంగత్యం పొంది ఉంటే, ఆయన్ను (స) చూసి ఉంటే ఆ వ్యక్తిని సహాబీ అనడం జరుగుతుంది. హాఁ, సహచర్యం సుదీర్ఘమయినదా, స్వల్పమయినదా అన్న దాన్ని బట్టి శుభం, శ్రేష్ఠత ఉంటుంది” అన్నారు ఇమామ్ అహ్మద్ బిన్ హంబల్ (ర).
సహాబహ్ ఘనత:
సహాబీ బహు వచనం సహాబహ్‌ా, సహాబియహ్‌ా బహు వచనం సహాబియాత్. రజియల్లాహు అన్హు బహు వచనం ‘రజియల్లాహు అన్హుమ్. రజియల్లాహు అన్హా బహువచనం రజియల్లాహు అన్హుహున్న. సహా బహ్‌ాకు మనం ఇచ్చే కనీస మర్యాద వారి నామాంతరం ఈ దీవెన పలుకుల్ని ప్రస్తావించడం. ఎందుకంటే ప్రవక్త (స) వారి సముదాయంలో ఉత్తమ గణం సహాబహ్‌ా. అల్లాహ్‌ాను మరియు ఆయన ప్రవక్త ముహమ్మద్ (స) వారిని విశ్వసించడంలో ఆద్యులు సహాబహ్‌ా. ధర్మమార్గంలో మొక్కవోని సాహసం కనబర్చిన సహనమూర్తులు సహాబహ్. ప్రవక్త (స) వారి పవిత్ర ప్రత్యక్ష సాంగత్యాన్ని పొందిన సౌభాగ్యవంతులు సహాబహ్.
ప్రవక్త (స) వారి ఆదేశం మేరకు హిజ్రత్ చేసిన శ్రేష్ఠ జనం సహాబహ్. ఆపద సమయంలో ఆయన్ను ఆశ్రయమిచ్చిన ఉత్కృష్ట దళం సహాబహ్. అల్లాహ్ స్వయంగా ముహాజిర్లు, అన్సార్లు అని కొనియాడిన సత్య సేనా నులు సహాబహ్. అవసరం వచ్చినప్పుడు ప్రాణ త్యాగానికి వెనుకాడని వెన్నుముక వ్యక్తిత్వం గల సైన్యం సహాబహ్‌ా. నాయకులు, అధినాయకులు, ఖలీపాలు సహాబహ్. ధర్మాన్ని తొలూత పాటించిన పుణ్యాత్ములు సహాబహ్. ‘తన సంప్రదాయాన్ని, తన సహాబహ్ సంప్రదాయాన్ని గ్టిగా పట్టుకోండి’ అన్న కితాబు కారుణ్యమూర్తి (స) ద్వారా పొందిన కరదీపికలు సహాబహ్‌ా. వారి తర్వాత వచ్చినవారు ఎవరయినా, ఎంతి వారలయినా, ఎన్ని పుణ్య కార్యాలు చేసిన వారలయినా వారి స్థాయికి చేరుకోవడం కష్ట సాధ్యం కాదు అసంభవం.
ప్రవక్త (స) ఇలా అన్నారు: ”ప్రజలందరిలోకెల్లా ఉత్తములు నా తరానికి చెందినవారు. పిదప వారి తర్వాత వచ్చేవారు, ఆనక వారి తర్వాత వచ్చే వారు”. (బుఖారీ)
వేరోక సందర్భంలో-”మీలోని ఒక వ్యక్తి ఉహద్ పర్వతం అంతి బంగా రాన్ని దానం చేసినా నా సహాబహ్‌లోని ఒక వ్యక్తి చేసిన గుప్పెడు ధాన్యానికి కూడా అది సరి తూగదు. దాని సగానికి కూడా సరిపోదు”. (ముస్లిం)
అలాగే ప్రవక్త (స) తన తర్వాతి మూడు తరాలకు జమానతు ఇచ్చారు: ”ప్రజల్లోని ఓ సముహం యుద్ధం చేెస్తుంది. అప్పుడు వారు – ‘మీలో ప్రవక్త (స) వారిని చూసిన వారున్నారా?’ అని అడుగుతారు. ”ఉన్నారు” అన్న సమాధానం ఇవ్వబడుతుంది. వారిని విజయం వరిస్తుంది.ఆ తర్వాత కొంత కాలానికి ప్రజల ఓ సమూహం యుద్ధం చేెస్తుంది. అప్పుడు వారు- ‘మీలో ప్రవక్త (స) వారిని సహరులను చూసిన వారున్నారా?’ అని అడు గుతారు. ”ఉన్నారు” అన్న సమాధానం ఇవ్వబడుతుంది. వారిని విజయం ప్రాప్తిస్తుంది. ఆ తర్వాత మరి కొంత కాలానికి ప్రజల ఓ సమూహం యుద్ధం చేెస్తుంది. అప్పుడు వారు – ‘మీలో ప్రవక్త (స) వారి సహాబహ్ సహచర్యానికి నోచుకున్న వారిని చూసిన వారున్నారా?’ అని అడుగుతారు. ”ఉన్నారు” అన్న సమాధానం ఇవ్వబడుతుంది. వారిని విజయం దక్కు తుంది”. అన్నారు ప్రవక్త (స). (ముస్లిం)
భువన నక్షత్రాలు సహాబహ్:
”నక్షత్రాలు ఆకాశానికి రక్ష. అవి రాలి పడ్డాయంటే ఆకాశంలో సంభవించా ల్సింది సంభవించి తీరుతుంది. నేను నా సహాబహ్‌కు రక్ష. నేను గనక ఈ ప్రపంచ వేదిక నుండి నిష్క్రమిస్తే నా సహాబహ్‌ాకు చెయ్యబడిన వాగ్దానం నెర వేరుతుంది. నా సహాబహ్ నా సముదాయానికి రక్ష. వారు గనక నిష్క్రమిస్తే వారికి వాగ్దానం చెయ్యబడిన విషయాలు సంభవించి తీరతాయి”. అన్నారు మహనీయ ముహమ్మద్ (స). ( ముస్లిం)
సహాబహ్ యెడల ప్రేమ విశ్వాసానికి ప్రమాణం:
అబ్దుల్లాహ్ బిన్ మస్‌వూద్ (ర) ఇలా అభిప్రాయ పడ్డారు: ”నిశ్చయంగా అల్లాహ్ ముహమ్మద్ (స) వారి హృదయాన్ని చూశాడు. దాసులందరి హృదయాలలోకెల్లా ఆయన హృదయం మేలిమి స్థితిలో ఉండటం గమనించాడు. ఆయన్ను తన దౌత్య కార్యం కోసం ఎన్నుకున్నాడు.పవక్త (స) వారి హృదయం తర్వాత ప్రజలందరి హృదయాలను వీక్షించాడు. వాటిలో ప్రవక్త (స) వారి సహచరుల హృదయాలు మేలిమి స్థితిలో ఉండటం గమనించాడు. వారిని ప్రవక్త (స) వారి సహచర్యం కోసం ఎన్నుకున్నాడు. కాబట్టి విశ్వాసులు ఒక విషయాన్ని మంచిగా భావిస్తే అది అల్లాహ్ దగ్గర కూడా మంచిదయి ఉంటుంది. మరియు వారు దేన్నయితే చెడ్డదిగా పరిగణిస్తారో అల్లాహ్ దగ్గర సయితం అది చెడ్డదిగానే ఉంటుంది”. (ముస్నద్ అహ్మద్) ఇక్కడ విశ్వాసులు అంటే సహాబహ్ అని పండితులు అభి ప్రాయ పడ్డారు.
ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది: ”వారి తర్వాత వచ్చినవారు ఇలా వేడుకుాంరు: ”మా ప్రభూ! మమ్మల్ని క్షమించు.మాకన్నా ముందు విశ్వసించిన మా సోదరు లను కుడా క్షమించు. విశ్వాసుల యెడల మా హృదయాలలో ఎలాంటి ద్వేష భావాన్ని కలిగించకు. మా ప్రభూ! నిశ్చయంగా నీవు మృదు స్వభావం కలిగిన వాడవు, కనికరించేవాడవు”. (అల్ హష్ర్: 10)
పై ఆయతు దృష్ట్యా ఇమామ్ మాలిక్ (ర) ఇలా అభిప్రాయ పడ్డారు: ”దైవ ప్రవక్త ప్రియ శిష్యులను తూలనాడే రాఫిజీలకు ‘ఫై’ సొమ్ములో నుంచి వారికి ఇవ్వ బడదు. ఎందుకంటే (‘ఫై’ సొమ్ము నేపథ్యంలో) అల్లాహ్, ప్రవక్త ప్రియ సహచరులను కొనియాడగా వీరు వారిని తూలనాడుతున్నారు” అన్నారు. అంటే ప్రవక్త (స) వారి ప్రియ శిష్యుల యెడల ఆంతర్యంలో వైర భావం లేశ మయినా కలిగి ఉంటే అతను షైతాన్ విసిరిన విష విలయానికి గురయినట్లే.
విశ్వాసుల మాతృమూర్తి ఆయిషా (ర.అ) ఇలా అన్నారు: ”దైవ ప్రవక్త (స) వారి ప్రియ సహచరుల కోసం ప్రార్థించమని మీకు ఆజ్ఞాపించ బడింది. కాని మీరేమో ఆ మహనీయులను తూలనాడుతున్నారు. ”ఈ సముదాయంలోని తర్వాతి వారు సజ్జనులయిన తమ ముందు తరాల వారిపై శాపనార్థాలు పెట్టనంత వరకూ ఈ ఉమ్మత్ రూపుమాప బడదు” అని మీ ప్రవక్త (స) చెప్పగా నేను విన్నాను’. (ఇబ్ను కసీర్)
ఈ నేపథ్యంలో ప్రవక్త (స) చేసిన హెచ్చరిక గమనార్హం; ”నా సహచరులను దూషించిన వానిపై అల్లాహ్ అభిశాపం, దైవదూతల అభిశాపం మరియు ప్రలందరి అభిశాపం పడుగాక!” (తబ్రానీ)
ప్రముఖుల దృష్టిలో సహాబహ్:
”సహాబహ్ అందరూ న్యాయవంతులే. వారు అల్లాహ్ ప్రియతమ దాసులు, ఆయనచే ఎన్నుకోబడిన వారు. దైవప్రవక్తల తర్వాత సృష్టి మొత్తంలో శ్రేష్టులు. ఇదే అహ్లుస్సున్నహ్ వల్ జమాఅహ్ విశ్వాసం. దీని పైనే ముస్లిం సముదా యం మరియు ముస్లిం పండితులు ఏకాభిప్రాయం కలిగి ఉన్నారు” అన్నారు ఇమామ్ ఖుర్తుబీ (రహ్మ).
అబుల్ హసన్ అల్ అష్‌అరీ (రహ్మ) ఇలా అన్నారు: ”ఖుర్‌ఆన్‌లో పలు చోట్ల ముహాజిర్లను, అన్సార్లను అల్లాహ్ కొనియాడాడు. వారు ఇస్లాం స్వీకరించ డంలో, త్యాగాలు చెయ్యడంలో ముందు వారు ముందే ఉంారు అన్నాడు. బైఅత్ రిజ్వాన్‌లో పాల్గొన్న వారిని ప్రశంసించాడు:
”నిశ్చయంగా అల్లాహ్ చెట్టు క్రింద నీతో ప్రమాణం చేస్తున్నప్పుడు విశ్వాసుల యెడల ప్రసన్నుడ య్యాడు”. (అల్ ఫత్హ్: 18) (అల్ ఇబానహ్ అన్ ఉసూ లిద్దియానహ్)
అబూ జర్‌అహ్ (రహ్మ) ఇలా అన్నారు: ”దైవ ప్రవక్త (స) వారి ప్రియ సహచ రుల్ని తూలనాడుతూ, దూషిస్తూ గనక నువ్వెరినయినా చూస్తే వారు ధర్మ భ్రష్టులని తెలుసుకో! ఎందుకంటే ముహమ్మద్ (స) మన వద్ద సత్య ప్రవక్త, ఖుర్‌ఆన్ మన వద్ద సత్య గ్రంథం. ఖుర్‌ఆన్ గ్రంథాన్ని, ప్రవక్త (స) వారి సంప్రదాయల్ని మన వరకూ చేరవేసిన పుణ్య జనులు సహాబహ్. ఇలాంటి విపరీత బుద్ధీకి ధర్మ భ్రష్టులు ఎందుకు పాల్పడుతున్నారంటే, మన నుండి మన సాక్ష్య ప్రమాణాలను తారుమారు చేసి ఖుర్‌ఆన్ మరియు హదీసులో జోక్యం చేసుకుని, వాటిని తప్పు పట్టడానికే. వీరు ముమ్మాటికీ ధర్మభ్రష్టులే. వీరికి ఇస్లాంతో ఎలాంటి సంబంధం లేదు”. (అల్ కిఫాయహ్ లిల్ ఖతీభ్)
అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (ర) ఇలా అన్నారు: ”ముహమ్మద్ (స) వారి సహచరుల్ని తూలనడకండి. వారి స్థానం ఎలాిందంటే మీలోని ఒక వ్యక్తి 40 సంవత్సరాలు ఆరాధన చేెసినా వారు అల్లాహ్ మార్గంలో గడిపిన ఒక్క ఘడి యకు సరితూగదు”.
హసన్ బస్రీ (రహ్మ) ఇలా అన్నారు: ”ముహమ్మద్ (స) వారి ప్రియ సహచ రులు మేలిమి గుణాలు గలవారు. సత్కర్మలు చేశారు. పరిశుద్ధమయిన ఆహారం భుజించారు.మిగిలిన దాన్ని పంచారు. ప్రాపంచిక వ్యామోహ పరులతో వారు పోటీ పడలేదు. ప్రాపంచిక పాడు విషయాల జోలికి వారు వెళ్ళ లేదు. ప్రపంచం నుంచి వారు స్వచ్ఛమయిన వాటినే తీసుకున్నారు. పనికి మాలిన వాిని వదిలేశారు. వారు ఎన్ని మంచి కార్యాలు చేెసినా ఎన్నడూ బీరాలు పోలేదు. వారు చిన్న పాటి తప్పును కూడా మామూలుగా భావించ లేదు. వారిని ప్రేమించే వారిని మేము ప్రేమిస్తాము. వారిని ద్వేషించే వారిని మేము కూడా ద్వేషిస్తాము. వారి ప్రేమ మా ధర్మం, విశ్వాసం, అదే మా జీవన సంవిధానం”.
గమనిక:
సహాబహ్ స్థాయి, ప్రవక్త (స) వారి సతీమణుల స్థాయి తెలియని చాలా మంది బురద బుద్ధి ప్రబుద్దులు వారిని తూలనాడే వారితో స్నేహం చేయడం మనం గమనిస్తాము. ఇది ముమ్మాటికీ ఒక ముస్లింకు శోభించని విషయం. ముస్లిం వేష ధారణ కలిగిన ఈ కుత్సిత బుద్ధులు అనేక నామాల తో పిలువ బడతారు. కాబట్టి వారి విషయంలో కడు అప్రమత్తంగా ఉండా ల్సిన ఆవశ్యకత ఎంతయినా ఉంది. ఇక్కడ ఉదార ధోరణి ఏ మాత్రం పనికి రాదు. నిన్న మొన్ని అలగా జనాలు, పుట్ట గొడుగు వ్యక్తిత్వం, చెదలు పట్టిన ఆలోచన కలిగిన కలహాకారులు అలనాి ఉత్తముల్ని దూషించ దుస్సాహసం చేయడం గర్హనీయం!
సహాబహ్ స్థాయిని గురించి స్వయంగా అల్లాహ్ ఖుర్‌ఆన్‌లో ఇలా తెలియజేస్తున్నాడు: ”మీలో (మక్కా) విజయానికి పూర్వం దైవమార్గంలో ఖర్చు చేసినవారు మరియు పోరాడిన వారు ఇతరులు సమానులు కాజాలరు. వారు (మక్కా) విజయానంతరం ఖర్చు చేసిన, పోరాడిన వారికంటే మహోన్నత స్థాయి గలవారు”. (అల్ హదీద్: 10)
Tuesday, August 3, 2021
Sunday, July 25, 2021
Thursday, April 15, 2021
దైవగ్రంథం ఖుర్ఆన్ దివ్య మాసం రమజాన్
దివ్యఖుర్ఆన్ రమజాన్ మాసాన్ని ప్రేమిస్తుంది. రమజాన్ మాసం దివ్య ఖుర్ ఆన్ ను అభిమానిస్తుంది. ఈ రెండిటి దీ ఆత్మీయబంధం. అల్లాహ్ ఇలా ప్రబోధించాడు: రమజాను నెల "ఖుర్ఆన్ అవతరింపజేయబడిన నెల. అది మానవులందరికీ మార్గదర్శకం. అందులో సన్మార్గంతో పాటు, సత్యాసత్యాలను వేరుపరచే స్పష్టమైన నిదర్శనాలు ఉన్నాయి. కనుక మీలో ఎవరు ఈ నెలను చూస్తారో వారు ఉపవాసాలుండాలి.
(ఖుర్ఆన్ 2 : 185) “లౌహే మహ పూజ్” అనబడే సురక్షిత ఫలకంలో నుండి దివ్యఖుర్ఆన్ మొత్తం భూమిపై గల మొదటి ఆకాశంపైకి ఈ నెలలోనే అవతరింపజేయబడింది. దివ్య ఖుర్ఆన్ అవతరించటం ఈ నెలకు దైవికంగా ప్రాప్తించిన ఒక మహా గౌరవం.
అందుకే దైవప్రవక్త (స) ప్రత్యేకించి రమజాన్ నెలలో జిబ్రయీల్ దూతతో కలిసి ఖుర్ఆన్ అధ్యయనం చేసేవారు. ఆయన ఖుర్ఆన్ శ్రద్ధగా ఆలకించేవారు. దాని భావం గురించి యోచించేవారు. పారాయణం చేసేవారు. దాని పిలుపులకు స్పందించే వారు.
రమజాన్ నెలలో ఉపవాసం పాటిస్తూ ఖుర్ఆన్ పారాయణం చేసే వ్యక్తి ఆ నెల సాంతం మహోన్నతమైన గ్రంథంతోపాటు జీవిస్తాడు. ఆ గ్రంథ ఔన్నత్యం గురించి అల్లాహ్ ఇలా ప్రకటించాడు:
“ఇదొక శుభప్రదమైన గ్రంథం. ప్రజలు దీని వాక్యాలపై చింతన చేసేటం దుకు, బుద్ధిజీవులు దీని ద్వారా గుణపాఠం నేర్చు కునేందుకు మేము దీనిని నీ వైపుకు పంపాము.”
(ఖుర్ఆన్ 38:29) “ఏమిటి, వారు ఖుర్ఆన్ గురించి లోతుగా ఆలోచించరా? లేక వారి హృదయాలపై తాళాలు పడి ఉన్నాయా?" (ఖుర్ఆన్ 47 : 24)
“ఏమిటీ, వారు ఖుర్ఆన్ గురించి యోచన చేయరా? ఒకవేళ ఇది గనక అల్లాహ్ తరఫు నుంచిగాక ఇంకొకరి తరఫు నుంచి వచ్చి ఉంటే అందులో వారికి ఎంతో వైరుధ్యం కనపడేది.” (ఖుర్ఆన్ 4 : 82)
రమజాన్ నెలలో ఖుర్ఆన్ పారాయణానికి ఉండే ఆ రుచి, ఆ మాధుర్యమే వేరు! ఆ నెలలో ఖుర్ఆన్ పారాయణం మనిషిలో నూతనోత్తేజాన్ని నింపుతుంది. మౌఢ్యం కాని విశ్వాసాన్ని అతనిలో జాగృతపరుస్తుంది. అంతేకాదు, పారాయణ కర్తకు వినూత్న శక్తిని ప్రసాదిస్తుంది. ఇస్లాం ప్రారంభంలో ఖుర్ఆన్ అవతరణకు సంబంధిం చిన సర్వ స్మృతులనూ అది జ్ఞాపకంలోకి తెస్తుంది. సామూహికంగా ఖుర్ఆన్ పారాయణం చేసిన సంఘటనలు, సదాచార సంపన్నులైన మన పూర్వీకులు ఖుర్ఆన్ పట్ల ఆకర్షితులై, దాని పారాయణం కోసం అత్యధిక సమయాన్ని వినియోగించటం
మొదలగు తీపి జ్ఞాపకాలన్నీ కూడా మన మనోసీమలో మెదలుతాయి. దైవప్రవక్త (స) ఒకసారి తన సహచరులకు ఉపదేశిస్తూ, “ఖుర్ఆన్ పఠించండి. నిశ్చయంగా అది రేపు తీర్పు దినాన దైవసన్నిధిలో మీకోసం సిఫారసు చేస్తుంది” అన్నారు. “ఖుర్ఆన్ నేర్చుకొని ఇతరులకు నేర్పించేవారు మీలో అందరికంటే ఉత్తములు” అని కూడా ప్రవక్త (స) ప్రబోధించి ఉన్నారు. “అల్ బఖర మరియు ఆలి ఇమ్రాన్ అనే పుష్పద్వయాన్ని పారాయణం చేస్తూ ఉండండి. తీర్పు దినాన అవి రెండు మేఘాల రూపంలోనో లేక పక్షుల గుంపు రూపంలోనో వచ్చి తమ చదువరులకు నీడను కల్పిస్తాయి” అన్న మాట కూడా దైవప్రవక్త (స) ప్రబోధించినదే.
ఆయన ఇంకా ఇలా ప్రబోధించారు: "ఖుర్ఆన్ పండితుడై ఉండి దాన్ని పఠించే వ్యక్తి (తీర్పుదినాన) గౌరవనీయులు, పుణ్యాత్ములైన దైవదూతల వెంట ఉంటాడు. ఖుర్ఆన్ ను పఠించటంలో తడబడుతూ, శ్రమకోర్చి పారాయణం చేసేవాడు రెట్టింపు పుణ్యాన్ని పొందుతాడు.”
రమజాన్ నెల రాగానే మన పూర్వీకులు ప్రాపంచిక వ్యవహారాలన్నిటిని ప్రక్కకు నెట్టి ఖుర్ఆన్ పారాయణంతోపాటు ఆధ్యాత్మిక ప్రయాణానికి సంసిద్ధులయ్యే వారు. రమజాన్ రాకతో ఇమామ్ మాలిక్ ఒక్క ఖుర్ఆన్ పారాయణం తప్ప ఇతర ఏ విషయానికి ప్రాముఖ్యత ఇచ్చేవారు కాదని చారిత్రక ఉల్లేఖనాల ద్వారా తెలుస్తోంది. విద్యార్ధులకు ఖుర్ఆన్ హదీసులు బోధించటం, ఇస్లామీయ చట్టపరమైన విషయాల్లో ప్రజలకు సలహాసహకారాలు అందించటం సాధారణ రోజుల్లో ఆయన నిత్యకృత్యాలు.
అయితే రమజాన్ నెల వస్తే చాలు ఆయన ఈ పనులన్నీ పక్కన పెట్టేసి ఒక్క ఖుర్ఆన్ పారాయణంలోనే నిమగ్నులయి ఉండేవారు. రమజాన్ అంటే ఖుర్ఆన్ మాసమని చెబుతుండేవారు. ఒక్క ఇమామ్ మాలిక్ అనే కాదు, రమజాన్ నెలలో మన పూర్వీకులందరి ఇండ్ల నుంచీ తేనెటీగలు పాడుతున్నట్టు కమ్మని ఖుర్ఆన్ పారాయణం వినిపిస్తూ ఉండేది. ఉపవాసపు నెలసాంతం వారి ఇండ్లు ఖుర్ఆన్ పారాయణపు నవకాంతుల్ని వెదజల్లుతూ ప్రజల గుండెల్లో నూతన ఆనందాల్ని నింపుతూ ఉండేవి. కమ్మటి స్వరాలతో వారు ఖుర్ఆనను మధురాతి మధురంగా పారాయణం చేసేవారు. అందులోని వింత విషయాల వద్ద ఆగి విస్మయం వెలిబుచ్చేవారు. శిక్షకు సంబంధిం చిన హెచ్చరికలు వినగానే వణకిపోయేవారు. నరకం గురించి తెలుసుకొని కన్నీరుమున్నీరుగా విలపించేవారు. స్వర్గ ప్రస్తావనలు వస్తే అమితానందాన్ని వ్యక్తపరిచేవారు. ఆదేశాత్మక వాక్యాలు పఠించినప్పుడు వాటిని పాటించాలని మనసులో గట్టిగా నిశ్చయించుకునేవారు. వారింపు విషయాలకు దూరంగా ఉంటామని ప్రతినబూనేవారు.
ఇది సత్యమని ధృవీకరించబడిన విషయం. ఒకసారి ఇబ్నె మసూద్ (రజ్ళి దైవప్రవక్త (స) ముందు నిసా అధ్యాయంలోని మొదటి భాగం పారాయణం చేస్తున్నారు. అలా పఠిస్తూ పఠిస్తూ ఆయన, “ఓ ముహమ్మద్ (స)! మేము ప్రతి సమాజం నుంచి ఒక సాక్షిని తెచ్చి, వారిపై నిన్ను సాక్షిగా పెట్టినప్పుడు వారి పరిస్థితి ఎలా ఉంటుంది?” అనే వాక్యం దగ్గరికి వచ్చేసరికి దైవప్రవక్త (స), “ఇక చాలు, ఆపండి” అన్నారు. ఇబ్నె మసూద్ (రజి) తల పైకెత్తి చూస్తే, దైవ ప్రవక్త (స) కన్నీళ్ల పర్యంతమై ఉన్నారు. ఆయన కండ్ల వెంబడి అశ్రుధారలు ప్రవహిస్తూ కనిపించాయి.
మరో ఉల్లేఖనం ప్రకారం, ఒకసారి అబూమూసా (రజి) దివ్య ఖుర్ఆన్ పారాయణం చేస్తున్నారు. అయితే తన పారాయణం దైవప్రవక్త (స) ఆలకిస్తున్న సంగతి ఆయన గమనించలేదు. కాసేపటి తర్వాత దైవప్రవక్త (స) ఆయనతో, “నేను నైపుణ్యభరితమైన నీ పారాయణం ఆలకించాను. బహుశా నువ్వు గమనించలేదేమో! ఏమైనా దావూద్ ప్రవక్తకు ప్రసాదించబడిన స్వరమాధుర్యంలోని ఒకింత నీకు కూడా లభించినట్లుంది” అన్నారు. అబూ మూసా దైవప్రవక్త (స)కు బదులిస్తూ, “దైవప్రవక్తా! మీరు నా పారాయణం ఆలకిస్తున్న సంగతి నేను గమనించి ఉన్నట్లయితే మరింత మనోహరంగా, శ్రావ్యంగా పారాయణం చేసి ఉండేవాడిని కదా!” అన్నారు.
ఈ సందర్భంగా మరో సంఘటన కూడా గుర్తుకు తెచ్చుకుంటే బాగుంటుంది.
ఖత్తాబ్ కుమారులు ఉమర్ (రజి) తన సహచరులతోపాటు కూర్చొని ఉన్నప్పుడు, “అబూ మూసా! మాకు మా ప్రభువును గుర్తు చేయవూ?” అని వేడుకునేవారు. అంతే, అబూమూసా ముందుకు వచ్చి మధురమైన తన కంఠంతో ఖుర్ఆన్ పారాయణం చేసేవారు. ఆయన పారాయణం విన్నవారందరూ కన్నీరుమున్నీరుగా విలపించేవారు.
ఆ తర్వాతి తరాల ప్రజల్లో పురుడు పోసుకున్న అనుచిత కోరికలు వారిని అల్లాహ్ గ్రంథాన్ని వినకుండా చేశాయి. మనుషుల అభిరుచులు మారిపోయాయి. విద్యా సంగ్రహణానికి గ్రహణం పట్టింది. ప్రజల అవగాహనా శక్తికి సుస్తీ చేసింది.
దివ్య ఖుర్ఆన్ గ్రంథాన్ని వదలి పెట్టి మత గురువుల పుస్తకాలకు పెద్దపీట వేసిన రోజు నుంచే ముస్లిం సమాజంలో పతనం మొదలయింది. శుద్ధ సమాజం లోనూ ప్రతి చోటా చాపక్రింద నీరులా కలీ వ్యాపించింది. ఫలితంగా ముస్లిం సమాజంపై ఘోరమైన విపత్తులూ విరుచుకుపడ్డాయి. ఖుర్ఆన్ పదాలకు చెప్పబడిన అనుచిత తాత్పర్యాలు, వెలికి తీయబడిన విపరీతార్థాలు ముస్లిం సమాజాన్ని ముక్క చెక్కలు చేసి పడేశాయి. ప్రజల్లో ధైర్య సాహసాలు క్షీణించాయి. సమాజాన్ని సన్మార్గంలో నడిపింపజేయటం ఖుర్ఆన్ ఉద్దేశం. హృదయ రోగాలకు స్వస్థతను చేకూర్చే సంజీవని ఖుర్ఆన్. ఆసాంతం అది ఒక
జ్ఞానం, ఒక సంస్కృతి. మనిషి జీవితానికి, ప్రాణానికి, మోక్షానికి తిరుగులేని ఆధారం. సంతోషమైనా, ఆనందమైనా ఖుర్ఆన్ ద్వారానే ప్రాప్తిస్తుంది. ఇహలోక బహుమానమైనా, పరలోక పారితోషికమైనా ఖుర్ఆన్ చలువే. అది విశ్వప్రభువు ప్రబోధనం. మానవ జీవన సంవిధానం. సమసిపోని విజ్ఞానం.
అలాంటప్పుడు రమజాన్ నెలలో....... ఒక్క రమజాన్ నెలలోనే ఏమిటి, మిగతా నెలల్లోనూ మనం ఖుర్ఆన్ తో పాటు జీవించకపోవటం ధర్మమేనా? ఖుర్ఆన్ మహత్యాన్ని గుర్తెరిగి దాని వెలుగుజిలుగులతో, దాని పారాయణం వల్ల సంప్రాప్తి మయ్యే సుఖసంతోషాలతో మన హృదయాలను నింపుకోకపోవటం న్యాయమా? మనలో మార్పు అనేది రాదా?
Tuesday, March 23, 2021
అసలు బాధ ఏది?
రచన: సయ్యిద్ అబ్దుస్సలామ్ ఉమ్రీ
మన మాటల్ని చేతల్ని వట్టి బూటకం అని కొట్టి పారేసినప్పుడు బాధ. మన హక్కుని మనకు దక్కకుండా చేసినప్పుడు బాధ. మనం కూడబెట్టిందంతా ఒక్కసారిగా కుప్ప కూలినప్పుడు బాధ. వయసు పైబడినా కన్న కలలన్నీ కల్లలుగానే మిగిలిపోయినప్పుడు బాధ. మనవారు, మనలో సగం అనుకున్నవారే ద్రోహం చేసినప్పుడు బాధ. ఆప్తులు అసువులు బాసినప్పుడు బాధ. వెన్నుపోటు పొడిచింది వెన్నుదన్నుగా నిలవాల్సినవారే అని తెలిసినప్పుడు బాధ. మనం ప్రాణంకన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నవారు మన మనో
భావాలతో ఆడుకుంటున్నారని తెలిసినప్పుడు బాధ. ఆశలు చిగురించక ముందే ఆశాభంగం కలిగినప్పుడు బాధ. సదుద్దేశ్యంతో సేవ చేయాలనుకున్నప్పుడు నిందలు పడాల్సి వస్తే బాధ. మనం గౌరవించే వ్యక్తి దగ్గర మనకు మర్యాద దక్కనప్పుడు బాధ. కటుంబ గౌరవం బజారు పాలైనప్పుడు బాధ. చేయని నేరాని కి శిక్ష అనుభవించినప్పుడు బాధ. కష్ట కాలంలో ఆప్తులు కూడా ఆదుకోనప్పుడు బాధ.
ఇవి, ఇలాంటి అనేక బాధల్ని మనిషి తన రోజువారి జీవితంలో ఎదుర్కొంటూ ఉంటాడు. 'అనుభవిస్తేనేగానీ ఆ బాధ ఏమిటో తెలియదు' అన్న మాట మనం తరచూ వింటుంటాము. అనుభవిస్తాము గనక అది బాధగా తోస్తుంది. ఐహిక పరమైన ఈ బాధలన్నీ పరీక్ష నిమిత్తం మాత్రమేనని ఆపద్బాంధవుడు అయిన అల్లాహ్ సెలవిస్తున్నాడు: “యావత్తు విశ్వ సార్వ భౌమత్వం కలిగి ఉన్న దేవుడు ఎంతో శుభదాయకుడు. ఆయన ప్రతి వస్తువుపై, ప్రతి విషయంపై సర్వాధికారం కలిగి ఉన్నాడు. మీలో ఎవరు మంచి పనులు చేస్తారో పరీక్షిండానికి ఆయన జీవన్మరణాలు సృష్టించాడు. ఆయన మహా శక్తిమంతుడు. గొప్ప క్షమాశీలి”.(అల్ ముల్క్: 1,2)
“భయం, ఆకలి, ధనప్రాణ, పంట నష్టాలు కలిగించి మిమ్మల్ని మేము తప్పనిసరిగా పరీక్షిస్తాము”. (బఖర: 155)
దైవ ప్రవక్త (స) ఇలా ఉపదేశించారు: “అల్లాహ్ కొందరిని ఇచ్చి పరీక్షిస్తాడు. మరికొందరిని కష్టాలకు గురి చేసి పరీక్షిస్తాడు”. ఈ బాధలు, కష్టాలన్నీ తాత్కాలిక తటాకమైన ఐహిక జీవితానికి సంబంధించినవే. కాని మన అనుభవంలోకి రాని బాధలు, సిసలైన పీడనలు ముందున్నాయి. అవి, మనిషి మరణానంతరం మొదలవుతాయి. అవేమంటారా?
అది- 'దైవదూతలు వచ్చి, వారి ముఖాలపై పిరుదలపై కొడుతూ 'ఇక దహనయాతన చవి చూడండి. ఇది మీరు చేజేతులా కొనితెచ్చుకున్న దాని పర్యవసానమే'. (అల్: 50) అని అన్నప్పుడు కలిగే బాధ. తను చలనం లేకుండా పడి ఉంటే - ఆప్తులు పెట్టే నాదాలు వింటూ కూడా కనీసం వారిని ఓదార్చలేని దుర్భర స్థితి ఏర్పడినప్పుడు కలిగే బాధ. సమాధిలో చల్లనైన ఎసీలకు, మెత్తనైన పరుపులకు, వెచ్చనైన హీటర్లకు, పసందైన పరిసరాలకి బదులు ఇరుకిరుకు స్థలంలో ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ ఉన్నప్పుడు, చేసుకున్న పాప పుణ్యాలు తప్ప మరే సామగ్రి లేనప్పుడు, అరచి నోరు బాదుకు న్నా వినే, పట్టించుకునే నాధుడే లేనప్పుడు కలిగే బాధ.
మున్కర్ నకీర్లు వచ్చి మన్ రబ్బుక? - నీ ఆరాధ్య దేవుడు ఎవడు?, మన్ నబియ్యుక? - నీ ప్రవక్త ఎవరు?, మా దీనుక? -నీధర్మం ఏది? అని నిలదీసినప్పుడు, భూమి అత్యంత విశాలంగా ఉండి కూడా అతి ఇరుకైన ప్రదేశంలో ఉండాల్సి వచ్చినప్పుడు, ధరిత్రి చేసే ఒత్తిడికి కుడి ప్రక్కటి ఎముకలు ఎడమ ప్రక్కటి ఎముకల్లో చొచ్చుకుపోయినప్పుడు, 70 గజాల లోతుకి పాతుకుపోయేలా చేసే కొరడా దెబ్బ పడినప్పుడు కలిగే విపరీతమైన బాధ.
“అలాంటి వారిని (దైవాన్ని మరచిన వారిని) మేము ప్రళయ దినాన బోర్ల పడేసి ఈడ్చుకొస్తాము. వారిని, అంధులుగా, బధిరులుగా, మూగలుగా చేసి వేస్తాము”. (బనీ ఇస్రాయీల్: 97) అని దేవుడు హెచ్చరించినప్పుడు కలుగుతుంది భరించరాని బాధ. కాకపోతే ఐహిక బాధలు పరీక్ష నిమిత్తం అయితే, మరణానంతరం బాధలు మనిషి చేసిన కర్మల ఫలం అయి ఉంటాయి. ఇది మరువ కూడదు. మరచి బ్రతకకూడదు. బ్రతికతే శిక్ష అనుభవించక తప్పదు.
“ఒక భయంకర దినాన తాము లేపి (దైవ సమక్షంలో) ప్రవేశించబడతామని వారికి తెలియదా? ఆ రోజు యావత్తు మానవులు విశ్వ ప్రభువు ముందు (తల వంచి) నిలబడతారు”.(దివ్య ఖుర్ఆన్ - 83; 4-6)
(వారు తమ దుష్కార్యాలకు జవాబు చెప్పుకోవాల్సిన పని లేదని భావిస్తున్నారా?) “ఎంత మాత్రం కాదు. దురాత్మల కర్మల వివరాలు కారాగారం (సిజ్జీన్) చిట్టాలో ఉంటాయి”. (ముతఫ్ఫిఫీన్: 7)
దీనికన్నా ఇంకా తీవ్రమైన బాధ మరొకటుంది. హషర్ మైదానంలో తలమీదికి సూర్యుడు తీసుకురాబడినప్పుడు, భూమి మరో భూమిగా మార్చివేయబడినప్పుడు, చేసుకు న్న వారికి చేసుకున్నంత అన్నట్టు - మోకాళ్ళ దాక కొందరు, నడుము దాక కొందరు, పూర్తిగా కొందరు చెమటలో మునిగి ఉన్నప్పుడు కలిగే బాధ.
నీడ ఎక్కడ కానరాని మాడ్చివేసే ఎండలో ఏ అండ మనకూ ఉండని తుది తీర్పు దినాన అల్లాహ్ అర్ష్ నీడకు సయితం నోచుకోని నికృష్ట స్థితి దాపురించినప్పుడు, హౌజె కౌసర్ (కౌసర్ సరోవరం) పై నుండి ధిక్కరించ బడినప్పుడు, మనం చేసిన పాపాలకు అల్లాహ్ ఆగ్రహించి “మీ కర్మలకు పర్యవసానం చవి చూసుకోండి” అన్నప్పుడు, “ఈ దినం రాకను మీరు బుద్ధి పూర్వ కంగానే విస్మరించారు. ఇప్పుడు మేము కూడా మిమ్మల్ని విస్మరిస్తున్నాము” (జా:13) అని అన్నప్పుడు కలిగే బాధ మహా దారుణమైనది.
ఆలూబిడ్డలు, అన్నాదమ్ముళ్లు కూడా మా లెక్క పూర్తి కాలేదు సారీ అన్నప్పుడు, మన కర్మల చిట్టా ఎడమ చేతిలో ఇచ్చి - 'ఇదిగో చదువుకో నీ కర్మల చిట్టా. ఈరోజు నీ కర్మల లెక్క చూడటానికి నీవే చాలు” (దివ్యఖుర్ఆన్-17:14) అని అన్నప్పుడు, విశ్వ కారుణ్యమూర్తి ముహమ్మద్ (స) వారి సిఫారసు కూడా మన విషయంలో స్వీకరించ బడనప్పుడు, 70 తల్లుల కన్నా అధిక ప్రేమ గల అల్లాహ్ కూడా మన వైపు కన్నెత్తి చూడనప్పుడు, మనతో ఒక్క మాటైనా ప్రేమతో మాట్లాడనప్పుడు కలిగే తీవ్రమైన బాధ వర్ణ నాతీతం.
మన నుదుటి మీద నరకవాసి అని వ్రాయబడినప్పుడు, అవిశ్వాసుల్ని గుంపులు గుంపులుగా నరకం వైపు తోలుకెళ్ళినప్పుడు, నరక ద్వారాలు తెరవబడినప్పుడు, 'నరకంలో పోయి పడండి. ఇక మీరిక్కడే ఎల్లకాలం పడి ఉంటారు'. (జుమర్: 72) అని అన్నప్పుడు, అయ్యయ్యో! నా కర్మల పత్రం నాకసలు లభించకుండా, నా లెక్కేమిటో నాకు తెలియకుండా ఉంటే ఎంత బాగుండేది!! ఈ రోజు నా సిరి సంపదలు నాకేమాత్రం పనికి రాలేదే!? అయ్యో! నా అధికారం, అధిపత్యాలన్నీ మట్టిలో కలిసి పోయాయి” (హ్మాహ్: 26-29) అంటూ తీవ్ర పశ్చాత్తాపంతో నెత్తి నోరు బాదుకున్నప్పుడు, 'పట్టుకోండి వాణ్ణి. వాడి మెడకు గుదిబండ కట్టి నరకంలో త్రోసేయండి. ఆ తర్వాత 70 మూరల గొలుసుతో వాడ్ని బిగించి కట్టండి.....చీము, నెత్తురు తప్ప వాడికి తినడానికి మరేమీ లభించదు' (దివ్యఖుర్ఆన్-69: 30-38) అని ఆజ్ఞ జారి చేయబడినప్పుడు, 'పట్టుకోండి వాడ్ని, బరబర ఈడుస్తూ తీసుకెళ్ళి నరకం మధ్యలో విసరి పడేయండి. సలసల కాగే నీటిని వాడి నెత్తి మీద కుమ్మరించండి...ఇక చూడు దీని రుచి, నువ్వు మహా గౌరవనీయుడవయిన పెద్ద మనిషివి కదూ....” (దుఖాన్: 48, 49) అని అవహేళనగా అన్నప్పుడు కలిగే పీడన. జఖూమ్ అనే చెట్టు తప్పకుండా తిన వలసి వచ్చినప్పుడు, చమురు తెట్టు లాంటి ఆ పదార్థం కడుపు లోకి పోయి మరగ కాచిన నీటిలా కుతకుత ఉడికిపోతున్నప్పుడు కలిగే బాధ మహా భయంకరమైనది.
చచ్చిపోదామన్నా చావు రానప్పుడు, చావుకే చావు ఇవ్వబడిన ప్పుడు, చర్మాలు కాలిపోతే మళ్ళి మళ్ళి కొత్త చర్మాల్ని సృజించ బడినప్పుడు, నరకంలో గల చివరి విశ్వాసి కూడా స్వర్గానికి చేరుకున్నప్పుడు, మీరు శాశ్వతంగా ఇక్కడే ఉండండి అని అల్లాహ్ తీర్పు ఇచ్చేసినప్పుడి కలిగే పరమ పీడన వర్ణనాతీతం.
పై పేర్కొన్న ఈ బాధలు నేడు మన అనుభవంలో లేనివి, రానివి. అయితే హెచ్చరిస్తున్నది ఎవరో కాదు; తన దాసుల
శ్రేయం కోరే కరుణ సాగరుడైన అల్లాహ్. ఆయన తెలియ పరచిన వాస్తవాలు నిజాలుగా మన ముందు ప్రత్యక్షమవ్వక ముందే 'పారా హుషార్' అంటున్నాడు. “మానవులారా! మీ ప్రభువు ఆగ్రహం నుండి తప్పించుకోండి. (మీ ప్రభువుకు భయపడండి.) తండ్రి తన కొడుకుకు, కొడుకు తన తండ్రికి ఎలాంటి సహాయం చేయలేని దినం గురించి భయపడండి. అల్లాహ్ వాగ్దానం తప్పకుండా నెరవేరుతుంది. కనుక ప్రాపంచిక జీవితం మిమ్మల్ని మోసగించ కూడదు సుమా!”. (లుఖ్మాన్: 33)
ఇక ఐహిక సంపద, సుఖసౌఖ్యాలంటారా-,
"మానవులంతా ఒకే ఒరవడిలో కొట్టుకుపోతారన్న భయమే గనక లేకపోతే మేము కరుణామయుడైన అల్లాహ్ను తిరస్కరించే వారి ఇండ్ల కప్పులను, వారు మేడపైకి ఎక్కే మెట్లను, వారి తలుపులను, వారు దిండ్లకానుకొని కూర్చునే పీఠాలను, అన్నింటినీ వెండి బంగారాలతో చేసి వేసే వారము. అయినా అది (మూన్నా ళ్ళ ముచ్చటైన) ప్రాపంచిక జీవిత సంపద మాత్రమే. (పరలోక సంపద ఇంతకంటే ఎంతో శ్రేష్ఠమైనది. శాశ్వతమైనది). నీ ప్రభువు దగ్గర భయభక్తులు కలవారికే పరలోక సంపద ప్రాప్త మవుతుంది”. (జుఖుఫ్: 35) -
కనుక విశ్వసించిన ప్రజలారా! మీరు మిమ్మల్ని, మీ భార్యా పిల్లల్ని నరకాగ్ని నుండి కాపాడుకోండి. ఆ నరకాగ్నికి మాన వులు, రాళ్ళు సమిధలవుతారు”. (తహ్రీమ్: 6)
రేపటి భయంకర పీడనలు, పరాభవం నుంచి మనల్ని, మన వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా మన మీద ఉంది. అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: “ప్రతీ ప్రాణి మృత్యు రుచి చూడ వలసిందే. ప్రళయ దినాన మీరందరూ మీ కర్మల పూర్తి ఫలితాన్ని పొందుతారు. అప్పుడు ఎవడు నరకాగ్ని నుండి కాపాడ బడి స్వర్గంలో ప్రవేశం కల్పించబడతాడో అతడు నిశ్చయంగా సఫలీకృతుడయ్యాడు. ప్రాపంచిక జీవితమైతే ఒక మాయా వస్తువు తప్ప మరేమీ కాదు”. (అలి ఇమ్రాన్: 185)
ప్రాపంచిక బాధలు, కష్టాలు, నష్టాలు - ఒక్క మరణంతో అంతమైపోతాయి. కానీ, పరలోక బాధలు మరణానంతరం మొదలవుతాయి. కాబట్టి మంకు ప్రాప్తమైన ప్రాపంచిక జీవితాన్ని పరలోకపు పంట పొలంగా భావించి మేలిమి విత్తనాల్ని నాటుకుంటే మంచిది. అలా కాకుండా నాసి రకపు విత్తనాల్ని, ముళ్ల విత్తనాల్ని జల్లుకుంటే తర్వాత చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.
ఆరోజు సంతానం, సిరిసంపదలు ఏమాత్రం ఉపయోగపడవు. నిష్కల్మషమైన హృదయంతో అల్లాహ్ సన్నిధికి వచ్చినవారికే ఆరోజు ప్రయోజనం ఉంటుంది.” దైవభీతి పరులకు స్వర్గం అతిచేరువగా తీసుకురాబడుతుంది. (ఆరోజు) దారితప్పినవారి ముందు నరకం ఉంచబడుతుంది. (అష్-షుఅరా: 88-91)
Sunday, March 7, 2021
తమస్సు తొలిగింది
(ఇది మనసు మనుషుల సంభాషణ. మనస్సనేది రెండు రకాలు: 1)తమస్సు-నఫ్సే అమ్మారా 2) ఉషస్సు-నఫ్సే లవ్వామా. మనసు ఒకటే అయినా రూపాలు రెండు. ఒకటి చీకట్లను నింపితే మరొకటి వెలుగుల్ని వ్యాపింపజేస్తుంది. తమస్సు అధీనంలో ఉన్నప్పుడు మనిషి ఎలా ఉంటాడో, ఉషస్సు వెలుగులో ఎలా జీవిస్తాడో తెలియజేసేందుకు వ్రాసినదే ఈ వ్యాసం.
మనిషి: ఎక్కడిదీ వికటాట్టహాసం? కన్ను పొడుచుకున్నా కనిపించని ఈ కారు చీకటిలో ఎవరిదీ అట్టహాసం?
ఎవరో ఇటే వస్తున్నారు. ఏయ్! ఎవరు నువ్వు?
తమస్సు: నేనా? నేనెవరో నీకు తెలియదా?
నరుడా! పామరుడా! (వెకిలి నవ్వు....)
మనిషి: ఏమిటా నవ్వు? నీ వెకిలి నవ్వులలో హడలిపోయి వచ్చిన దారి తిరిగి పోయే పిరికిని కాను. నా సత్యాన్వేషణ సాగక తప్పదు. నా లక్ష్యాన్ని నేను సాధించక తప్పదు. నాకడ్డం నిలవకు. నన్ను వెళ్ళనీ. ఉషస్సు కాంతుల్లో ఊయలలూగని. ఊఁ..
తమస్సు: బలే...బలే... నేనెవరో నీకు తెలీదా..? నేను నీ మనస్సుని
మనిషి: నువ్వు తమస్సులా అన్పిస్తున్నావు.
తమస్సు: వెర్రివాడా! నిన్ను నువ్వు వివేకి ననుకుంటున్నావు. నల్లదాననయిన నన్ను చూసి బెదిరి పోతున్నావు. భయపడుతున్నావు. నా నుంచి నువ్వు తప్పించుకోలేవు. అంతలో(ఈ తతంగమంతా చూస్తున్న ఉషస్సు రంగ ప్రవేశం చేస్తుంది)
మనిషి: కవిత్వం అబద్దమా?
ఉషస్సు: ఔను చాలా వరకు. పోయట్రి ఇజ్ హాఫ్ లై' అన్నారు. అలాగే 'అషుఅరావు యత్తబివుహుముల్ గావూన్' కవులు, దారి తప్పినవారే వారి వెనుక నడుస్తారు. అంటుంది ఖుర్ఆన్. 'నవ్వులా అవి; కావు నవపారిజాతాలు' అంటే నిజమని సామాన్యుడు నమ్ముతాడా?
మనిషి: సత్యం-ఆలోచనామృత కలశం కవిత్వం. అది చరిత్ర చెబుతుంది. అందంగా. నీ సుందర సుమనోహర కాంతి వదనాన్ని చూసి, ఒక్క క్షణం అలా విభ్రాంతుణ్ణయ్యాను. తమస్సుతోనే జీవితం గడిపిన నాకు నీ వెలుగు వదన దర్శనం మహాభాగ్యం.
ఉషస్సు: సరే...సరే...వెలుతురంటున్నావే వెలుగు నీ మనసులో లేదూ?
మనిషి: నా హృదయం ఏనాడో బొగ్గయిపోయింది. దాన్ని మాణిక్యంగా మార్చే సత్యశక్తి కోసం గాలిస్తున్నాను. ఈ నాటికి నీవు కనిపించావు. నాకు సహాయ పడవా ప్లీజ్!
ఉషస్సు: ఇదిగో వెలుతురు....చూడు...చూడు. తారల కన్నుల్లో,
మెరుపుల మెయి విరుపుల్లో వెలుతురు. కొండల్లో పూవనాల్లో వెలుతురు సెలయేటి గలగల్లో వెల్తురు. సిరిమల్లెల నవ్వుల్లో వెలుతురు.
మనిషి: నేను కోరింది. ఈ కాంతి కాదు. హృదయ కాంతి. కొద్ది
సేపటికి కనుమనుగయ్యే తారల్లో, తళుక్కుమని మెరిసి మాయమయ్యే మెరుపుల్లో, మరుక్షణంలో వాడిపోయే పూలల్లోనా వెలుతురు. మట్టి దీపమైనా, మణి దీపమైనా మనస్సులోని తమస్సులు తొలగవు.
ఉషస్సు: అవును తృప్తి కోసం, అలంకార నిమిత్తం మాత్రమే తప్ప ఈ దీపాలు హృదయాంధకారాన్ని తుడిచివేయలేవు. పైగా మనిషి వెలిగించే దీపాల కాంతి మనిషి చుట్టే ఉంటుంది. అది కూడా అసలయిన కాంతి కాదు. అసలు కాంతి మనసులో ఉండాలి.
నేను చెప్పేది కాస్త శ్రద్ధగా విను. (ఉషస్సు కంఠం మంద్ర గంభీ రంగా వినిపిస్తున్నది). మానవులూ, పశుపక్షాదులూ పుట్టక ముందు, చెట్టూ చేమలూ మొలవక ముందు, అల్లాహ్ ఈ సృష్టిలో ని ప్రతి వస్తువునూ నీటితో పుట్టించాడు.
మనిషి: జంతువు దశలో నుంచే మనిషి వచ్చాడంటారు కదా?
ఉషస్సు: వట్టి ఊహాజనిత ఆలోచన మాత్రమే తప్ప ఇందులో ఇసుమంతటి నిజం లేదు. ఈ సృష్టిలో సమస్తం అల్లాహ్ 6 రోజుల్లో సృష్టించాడు.
మనిషి: సృష్టికి సంబంధించిన సమాచారం చాలానే ఉన్నట్టనిపి స్తోంది.
ఉషస్సు: ఈ వెలుతురు అసలయిన వెలుతురు కాదన్నావు, నిజమే. ఆ అఖండజ్యోతిని కనుక్కోవాలంటే సృష్టి నిర్మాణం గురించి యోచించడం ఒక్కటే మార్గం. ఈ ప్రపంచం ఒక మిథ్య అనంటారు చాలా మంది. దీనికి భిన్నంగా విద్యావంతులు, వివేచనా పరులు 'ఈ లోకం పరలోక పంట పొలం' అంటారు. ఈ లోకం, లోకంలోని సమస్తం ఏదో ఒకనాడు నశించక తప్పదు. దీనికతీతంగా శాశ్వతమయిన మరో లోకం ఉంది. అదే పరలోకం అదే స్వర్గం. అదే పరమాత్మ దర్శనంతో పునీతమయ్యే జగం. అదే అసలయిన వెలుతురు. మనకు కనపడే ఈ బయటి వెలుతురు కొంత కాలానికి ఆరిపోతుంది. కానీ ఆ అఖండ జ్యోతి అక్షరంగా, అద్వితీయంగా నిలుస్తుంది. అసలైన వెలుతురంటే మనిషి ఆ అఖండ జ్యోతీశ్వరుణ్ణి చేరుకోవడమే.
మనిషి: తెలిసింది. వెలుతురెక్కడుందో నాకర్థమయ్యింది. ఇన్నాళ్ళు నిద్రపోతున్న వివేకం కనులు విప్పింది. నా చిరకాల అన్వేషణకు లక్ష్యం దొరికింది. ఓహో! ఎంత తీయని అనుభూతి! నా హృదయ వాటికలో వెలుతురు మొగ్గలు కిలకిలా నవ్వుతున్నాయి. నా జ్ఞానేంద్రియాలు, పంచేంద్రియాలు-సర్వేంద్రియాలు పరిమళిస్తు న్నాయి, పరవశిస్తున్నాయి. ఆత్మకు మాత్రమే దృశ్యమ్మగు అక్షర వాహిని అది. (తన్మయత్వంలో) ఓహోహో! ఎంత దివ్యంగా ఉందీ సన్నివేశం!! నిత్యం ఇలాంటి మనో స్థితే ఉంటే ఎంత బాగుండు!! ఇన్నాళ్ళూ నేను మాయ జగత్తులోనే జీవించాను. ఇప్పుడు నా మనసుకు చుట్టుకున్న మాయావలయం పటాపంచలయింది. ఈ సత్యా కాంతుల తళతళలు, నాలో ఏదేదో దురాలోచనలను రేకెత్తించిన తమస్సులను కడిగి వేస్తున్నాయి. ఇందుకేనేమో 'మనిషి సత్కర్మల్ని బట్టి వారికి జ్యోతులివ్వబడతాయి' అని మహాప్రవక్త (స) వారు అన్నది అంటూ సర్వలోక సృష్టికర్తను మొరపెట్టుకోనారంభిస్తాడు మనిషి:
దేవా! నా హృదయం జ్యోతిర్మయం అవ్వాలి. నా నయనం కాంతులీనాలి. నా శ్రవణం వెలుగులు నిండాలి. నా చుట్టూ ప్రక్కల వెలుగు దివ్వెలు వెలగాలి. నా వదనం ప్రకాశమానం అవ్వాలి. నా నరాల్లో నవ నాడుల్లో, నా కండరాల్లో, రక్తంలో, రోమంలో, చర్మంలో ఆంతర్యంలో - అంతటా కాంతి కమలాలు విరియాలి. నా జీవితం వెలుగు వెన్నెల్లో తడి స్నానాలు చేయాలి. నా నలువైపుల కాంతి కిరణాలు విరజిమ్మాలి. నా మేధ కాంతితోనూ,
నా మది శాంతితోనూ ఉప్పొంగాలి. నేను నిన్ను చేరాలి. నీ దివ్వ దర్శనంతో నా జన్మ ధన్యమవ్వాలి. ఆమీన్!




