Monday, January 18, 2016

స్వేచ్ఛ మరియు ఇస్లాం


స్వేచ్ఛ-స్వాతంత్య్రాన్ని ప్రతి ఒక్కరు కాక్షింస్తారు. బానిసత్వం, గులామ్‌గిరీని ఏ ఒక్కరూ ఇష్ట పడరు. మనిషికి కావాల్సిన ఆర్థిక, ఆధ్యాత్మిక, నైతిక, సాంస్కృతిక స్వాతంత్య్రం-స్వేచ్ఛ లేని చోట అతను మనజాలడు, మనుగడను సవ్యంగా కొనసాగించలేడు. తన స్వేచ్ఛా స్వాతంత్య్రాలను ఒకరు ప్రశించ డాన్ని మనిషి సుతరామూ ఇష్టపడడు. మనిషిలో ఈ సహజ భావాన్ని ఇస్లాం గౌరవిస్తుంది. ఇస్లాం మనిషి నైజాన్ని మార్చడానికి ఆవిర్భవించ లేదు, దాన్ని సంస్కరించడానికి అది వచ్చి.ంది. మంచీచెడులను విడమరచి చెప్పడంతో పాటే, అంగీకరించే, తిరస్కరించే పూర్తి స్వేచ్ఛాధికారాలను అతనికి ఇస్తుంది:
”నిశ్చయంగా మేము మానివుణ్ణి పరిక్షించడానికి ఒక మిశ్రమ వీర్య బిందువు తో ప్టుించాము. మరి మేము అతన్ని వినేవాడుగా, చూసేవాడుగా చేెశాము. నిశ్చయంగా మేమతనికి మార్గం కూడా చూపాము. ఇక అతను కృతజ్ఞుడుగా వ్యవహరించినా లేక కృతఘ్నతకు పాల్పడినా ఆ స్వేచ్ఛ అతనికుంటుంది. నిశ్చయంగా తిరస్కారుల (స్వేచ్చను దుర్వినియోగ పరచిన వారి) కోసం మేము సంకెళ్ళను, ఇనుప ప్టాలను, జ్వలించే అగ్నిని సిద్ధం చేసి ఉం చాము. దీనికి భిన్నంగా సజ్జనులు (స్వేచ్చను సద్వినియోగ పర్చుకున్న వారు) ‘కాఫూర్‌’ కలుపబడిన మధు పాత్రలను సేవిస్తారు”. (అద్‌ దహ్ర్‌:2,3)
మరియు ఇలా అను: ”అసాంతం సత్యం (తో కూడుకున్న ఈ ఖుర్‌ఆన్‌) మీ ప్రభువు తరఫు నుంచి వచ్చింది. కనుక కోరిన వారు దీనిని విశ్వసించవచ్చు. కోరినవారు నిరాకరించవచ్చు”. (అల్‌ కహఫ్‌: 29)
దేవుడు మనిషిని వినేవాడుగా, చూసేవాడు, బుద్ధికుశలతలు గలవాడిగా చేయడమే కాక అతని మార్గదర్శనార్థం 1లక్ష 24వేల మంది ప్రవక్తల్ని ప్రభ వింపజేసి, అనేక గ్రంథాలను అవతరింపజేసి, అనేకానేక పుణ్యాత్ముల ద్వారా సత్యమేదో, అసత్యమేదో బోధ పరచి – దైవ విధేయతా మార్గాన్ని అవలంబిం చి ధన్యజీవిగా నెగ్గుకొస్తాడో లేక అపమార్గాన్ని అనుసరించి అప్రతిష్ట పాలవు తాడో అతని ఇష్టం అని చెప్పడంతోపాటు అతని చేష్టల వల్ల తర్వాత చోటు చేసుకునే పర్యవసానాల గురించి కూడా విశద పర్చాడు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ అంతిమ దైవప్రవక్త ముహమ్మద్‌ (స) ఇలా అన్నారు: ”ప్రతి వ్యక్తీ తన అంతరాత్మను క్రయావక్రయాలకై పెడతాడు. ఈ వర్తకంలో అతడు దాన్ని నాశనం అయినా చేస్తాడు లేదా దానికి స్వేచ్ఛనయినా ప్రసాదిస్తాడు”. (సహీహ్‌ ముస్లిం)
స్వేచ్ఛాసాంతత్య్రాల విలువ నిజంగా వాిని ఒకసారి పొంది కోల్పోయిన వ్యక్తికే బాగా తెలుస్తుంది. ఓ సందర్భంగా నాటి విశ్వాస భాందవుడొకడు ఈరాన్‌ రాజునుద్దేశించి చెప్పిన మాట గమనార్హం! ”ఇస్లాం వచ్చిందే మానవుల్ని సాటి మనుషుల దాస్య శృంఖలాల నుండి ముక్తిని ప్రసాదించి అనంత స్వేచ్ఛా వాయువుల్లో విహరింపజేయడానికి”. సత్యం శక్తి ఉన్నవారి పక్షాన ఉంటుంది అన్న భ్రాంతిని పాపంచలు చేసిన ధర్మం ఇస్లాం. సత్యమే స్వయంశక్తి. అది ఎవరి పక్షాన ఉంటే అతనే శక్తిమంతుడు. స్వాతం త్య్రం ప్రతి ఒక్కడి జన్మహక్కు అన్నది జగద్వితం, కఠోర సత్యం! ”మనిషి స్వేచ్ఛాపరునిగానయినా జీవించాలి లేదా స్వేచ్చ కోసం పోరాడుతూ అయినా మరణించాలి.ఇస్లాంలో రెండే మార్గాలు మూడో ప్రత్యామ్నయం లేదు” అన్నారు అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ (ర). (ఖౌల్‌ ఫైసల్‌: 63,64)
మనుషుల్ని సృష్టించిన దేవుడు మనిషికి చాలా వరకు స్వేచ్ఛాధికారాలను ప్రసాదించాడు. ఇష్టమయినది తినే, తొడిగే, ఇష్టమయిన చోటుకి వెళ్ళే, నచ్చిన పని చేసుకునే, నచ్చినది కొనుక్కునే, ఆర్థిక, వైజ్ఞానిక రంగాల్లో అభి వృద్ధిని సాధించుకునే, నచ్చిన నారీమణిని మనువాడుకునే స్వేచ్ఛను అల్లాహ్‌ అతనికి ప్రసాదించాడు. ఈ విధమయినటువిం స్వేచ్ఛలో స్త్రీపురుషులిరు వురూ సమానులే. ఈ కారణంగానే ఒక స్త్రీని మనువాడాలంటే ఆమె అను మతి తప్పనిసరి అంటుంది ఇస్లాం. ఇస్లాం మనిషికి స్చేచ్ఛనయితే ఇచ్చింది కానీ బాధ్యతారహిత స్వేచ్ఛను ఇవ్వలేదు. ”ఫ్రీడమ్‌ ఈజ్‌ రెస్పాన్సిబిలిటి” అంటుంది ఇస్లాం. ఇస్లాం వ్యక్తిపై కొన్ని ఆంక్షల్ని విధించడానికి కారణం అతను తనకివ్వబడిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసి తన స్వయానికి, కుటుం బానికి, సమాజానికి ఎలాిం హాని కలుగజెయ్యకుండా ఆనంద మకరం దాన్ని గ్రోల గలగాలన్నదే! ముఖ్యంగా ముస్లింలు ఈ విషయంలో మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలంటుంది.
బాధ్యతారహిత స్వేచ్ఛ పిచ్చోడి చేతిలో రాయి అంటుంది. ”ఇహం, మనిషికివ్వ బడిన పరిమిత స్వేచ్ఛను దుర్వినియోగ పర్చేవారి కోసం స్వర్గంగానూ, సద్వినియోగ పర్చుకునే వారి కోసం చెర శాలగా (ఆంక్షలు కూడినదిగా)ను ఉంటుంది” (తిర్మిజీ) అంటుంది. ఆ విధంగా ఒక ముస్లింపై అనేక విధమయినటువిం ఆంక్షలు ఉంాయి. వాక్‌ స్వాతంత్య్రం పేర నేడు కొనసాగుతున్న అనైతికానికి, అధర్మానికి అతను బాసటగా నిలువడు. నోరు ఉంది కదా అని నోటికొచ్చింది వాగడు. ఒక మాట చెప్పక ముందు ఒకికి పది సార్లు ఆలోచించి మరీ చెబుతాడు. ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది: ”ఏదేని విషయంలో అల్లాహ్‌ా మరియు ఆయన ప్రవక్త తీర్పు చేసేస్తే విశ్వాసి అయిన స్త్రీపురుషులెవ్వరికి సొంత జోక్యం చేసుకునే అనుమతి లేదు”. (అహ్జాబ్‌: 36)

ఒకనాటి బానిస వ్యవస్థ:

నేటి మానవుడు, 21వ శతాబ్దిలో కూచోని, బానిసత్వపు సమస్యను పరిశీలించినప్పుడు, ఆ చరిత్రలో మనుషుల్ని వ్యాపార వస్తువులుగా, క్రయా విక్రయాలకు గురి చేసిన ఉదంతాలు కుప్పలుతెప్పలుగా కనబడతాయి. అలాిం తరుణంలో – ‘స్వాతంత్య్రం అన్నది ఎవరో దయదలిస్తే లభించే భిక్షం వింది కాదు. దాన్ని తమ బాహుబలంతో కృషించి సాధించ వలసి ఉంటుంది’ అని మానవ చరిత్రలో మొదిసారిగా బానిసత్వానికి వ్యతిరే కంగా గళం విప్పిన ఘనత ఇస్లాం ధర్మానిది. పూర్ణ స్థాయిలో ఇస్లాం ఆవిర్భావం తర్వాత బానిసల స్థితిలో వచ్చిన మార్పుకు పర్యవసానంగా వారు వ్యాపార వస్తువులుగా కాక మొది సారి పూర్తిగా మానవతా హక్కుల్ని, గౌరవాదరణలను పొందారు. ఇస్లాం కేవలం బానిసల విడుదల లేక విముక్తికి మాత్రమే కృషి చెయ్యలేదు. సకల మానవ స్వేచ్ఛా స్వాతం త్య్రాలకు సంబంధించిన సరయిన భావనను కూడా ప్రతిపాదించింది. ఆ భావనకనుగుణంగా ఆచరించి మరీ చూపింది. వారి విముక్తికై ఓ విలక్షణ మయిన ఉద్యమాన్ని మానవ నైజానికి అతి సమీపమయిన పంథాలో లేవ నెత్తింది.
ఈ లక్ష్యసిద్ధికి అది రెండు మార్గాలను అవలంబించింది. 1) అల్‌ ఇత్ఖ్‌ – యజమానుల తరఫున బానిసల స్వచ్ఛంద స్వేచ్ఛ. 2) ముకాతబత్‌ – యజ మానులూ బానిసల మధ్య స్వేచ్ఛకు సంబంధించన వ్రాతమూలకమయిన ఒప్పందం. ఖుర్‌ఆన్‌లో కొన్ని పాపకార్యాలకు ప్రాయశ్చితంగా బానిసల్ని విముక్తి కలిగించమని బోధించడం జరిగింది. పొరపాటున ఒక ముస్లింను చంపితే పరిహారంగా ఒక బానిసను విడుదల చెయ్యాలి. హతుని వారసుల కు రక్తపరిహారం చెల్లించాలి. (దివ్యఖుర్‌ఆన్‌-4: 92)
దైవప్రవక్త (స) కొన్ని అపరాధాలకు ప్రాయశ్చితంగా బానిసల్ని విముక్తి కలిగించమని బోధించారు. ”కొడుకు తండ్రి రుణాన్ని తీర్చలేడు, తండ్రిని బానిసత్వం నుండి విడుదల చేస్తే తప్ప” అని బానిస సమస్య తీవ్రతను విశద పర్చారు.
ఇస్లాం బానిసలకు స్వేచ్ఛను ప్రసాదించడమే కాదు సైన్యాధిపత్యాన్ని, జాతి నేతృత్వాన్ని, ఉన్నత పదవుల్ని ప్రసాదించింది. దైవప్రవక్త (స) అన్సార్ల, ముహాజిరీన్లలోని గొప్ప గొప్ప నాయకులతో కూడిన ఓ సైనిక బృందాన్ని తయారు చేసినప్పుడు దానికి బానిస జైద్‌ను అధినాయకునిగా నియమిం చారు. తండ్రి జైద్‌ మరణానంతరం ఆయన కొడుకు ఉసామా(ర)ను అబూ బకర్‌ (ర), ఉమర్‌ (ర) విం ఉద్దండులున్న సైన్యానికి సేనాధిపతిగా నియ మించారు. ఇస్లాం ఇచ్చిన శిక్షణ ఫలితమే – హజ్రత్‌ ఉమర్‌ తన తర్వాత ఖలీపాగా నియమించ వలసిన అవసరం ఏర్పడినప్పుడ ”అబూ హుజైఫా బానిస సాలిమ్‌ బ్రతికి ఉన్నట్లయితే నేను నా తర్వాత అతన్నే ఖలీఫాగా నియమించేవాణ్ణి” అన్నారు. ఇస్లాం ఒకవైపు స్వచ్ఛందంగా తమ బానిసల్ని విమోచనివ్వాలని ముస్లింలను ప్రేరేపించి, రెండోవైపు బానిసల మానసిక, నైతిక స్థాయిని పెంచేందుకు శ్రద్ధ వహించింది. ఎందుకంటే, బానిసల్ని మానిసికంగా స్వేచ్ఛా స్వాతంత్య్రాల కొరకు సమాయత్త పరచకుండానే కేవలం కొన్ని సద్భావాలపై ఒక చ్టాన్ని చేయడం ద్వారానో, ఒక ఆదేశాన్ని ప్రకించడం మూలంగానో శతాబ్దాల తరబడి వస్తున్న బానిసలు వారం తటవారే స్వయంగా విమోచన పొందలేరు. కాబ్టి వారిలో విమోచనా కాంక్షను జాగృతం చేసింది. స్వేచ్ఛ తెచ్చే బాధ్యతలను ఎదుర్కొనేలా వారిని సమాయత్త పరచింది. సొంతంగా శ్రమించి స్వేచ్ఛను పొందే అధికారాన్ని ముకాతబత్‌ రూపంలో వారికిచ్చింది. అంతే కాదు స్వేచ్ఛ కోరుకునే బానిస లకు ప్రభుత్వ ధనాగారం నుండి ధన సహాయం ఇస్తుంది. దీనికి బదులుగా ఎలాిం భౌతిక ప్రతిఫలాన్ని అది ఆశించదు. కేవలం విశ్వ ప్రభువు ఆదేశాలను పాలించి, ఆయన ప్రస్నతను పొందాలన్న ఒకే ఒక్క వాంఛ తప్ప. జకాతు ఫండును ఖర్చు చేసే పద్దుల్ని ప్రస్తావిస్తూ ఖుర్‌ఆన్‌ ఇలా అంటుంది: ”నిశ్చయంగా జకాత్‌ నిరుపేదల కోసం, అగత్యపరుల కోసం …..ఇంకా బానిసల్ని విడుదల చేయించడానికి ఖర్చు చేయండి”. (దివ్య ఖుర్‌ఆన్‌-9: 60)

అసలు దాస్యం ఎవరికి చెయ్యాలి?

తన దాసులు తన దాస్యాన్ని తప్ప అన్య సృష్టితాల దాస్య సృంఖలాలలో బంధీలవ్వడం అల్లాహ్‌ాకు సుతరామూ ఇష్టం లేదు. ఆయన మనందరి సృష్టికర్త గనక మనందరిని తన దాసులుగా, తన దాస్యంలోనే శ్వాసించేవారిగా చూడా లనుకుాండు. ఎందుకంటే ఆయన ఈ విశ్వ బ్రహ్మాండాన్ని ప్టుించడమే కాదు, దాన్ని సంరక్షిస్తున్నాడు, దాని మంచీచెడులను గమనిస్తున్నాడు కూడా. సమస్తాన్ని జిన్నాతుల, మానవుల సేవ కోసం ప్టుించి జిన్నాతులను, మాన వులను మాత్రం తన సేవ కోసం ప్టుించాడు. ఒక్క సారి దాసుడు దేవుని దాస్య పరిధిలోకి ప్రవేశించాడంటే ప్రపంచలోని దాస్యసృంఖలాలన్నిం నుండి అతనికి సంపూర్ణ స్వేచ్ఛాస్వాతంత్య్రాలు ప్రాప్తిస్తాయి. ఆయన సమక్షంలో మనస్ఫూర్తిగా చేసే ఒక్క సజ్జా దరి దరిన తల వంచే తలవంపు చర్యల నుండి అతన్ని కాపాడుతుంది. మనిషి విశ్వంలో మహోత్కృష్టజీవి. అందమైన ఆకృతి గలవాడు, గౌరవోన్నతలు గలవాడు. సృష్టిశ్రేష్టుడయిన మనిషి తనకన్నా హీనమయిన సృష్టిరాసుల ముందు మోకరిల్లడానికి మించిన మూర్ఖత్వం మరొకి ఉండదు. హజ్రత్‌ రుబ్‌యీ బిన్‌ ఆమిర్‌ (ర) ఈరాన్‌ రాజు రుస్తుం ముందు అల్లాహ్‌ా సందేశాన్ని అందజేస్తూ అన్న మాట సువర్ణాకరాలతో లిఖిం చదగినది -”అల్లాహ్‌ తాను తలచిన తన దాసుల్ని దాసుల దాస్యం నుండి వెలికి తీసి అల్లాహ్‌ దాస్యం వైపునకు, ప్రాపంచిక ఇరుకు మనస్తత్వం నుండి దాని విశాలత వైపునకు, మతాల దౌర్జన్యం నుండి ఇస్లాం న్యాయం వైపునకు తీసుకెళ్ళడానికి మమ్మల్ని పంపాడు”.
ద్వితీయ ఖలీఫా హజ్రత్‌ ఉమర్‌ (ర) గారి హయాంలో ఈజిప్టు గవర్నర్‌ అమ్ర్‌ బిన్‌ ఆస్‌ (ర) గారి కొడుకు అన్యాయంగా ఒక సామాన్య వ్యక్తి మీద చేయి చేసుకున్నాడు. అది తెలిసిన ఉమర్‌ (ర) ఇరువురినీ ఈజిప్టు నుండి మదీనా పట్టణానికి రప్పించి – ‘నువ్వు నా కళ్ళ ఎదుటే నిన్ను అతను ఎలా క్టొాడో అలానే కొట్టు’ అని చెప్పడమే కాక, చారిత్రక మాటనొకి ఉటంకించారు: ”తల్లులు వారి సంతానాన్ని సంపూర్ణ స్వేచ్ఛాస్వాతంత్య్రాలు గల వారుగా జన్మనిస్తే మీరెప్పి నుంచి వారిని బానిసలుగా మార్చుకోవడం ప్రారంభిం చారు?” అని. ఈ సందర్భంగా హజ్రత్‌ అలీ (ర) గారు చెప్పిన మాట గమనా ర్హం! ”అల్లాహ్‌ా నిన్ను సేచ్ఛాపరునిగా ప్టుించినప్పుడు ఎవ్వరికీ ఊడిగం చేసే అగత్యం నీకు రాకూడదు”.

ఆధునికంలో బానిసత్వ రూపాలు:

ఆటవికం నుండి మనిషి ఆధునికంలో అడుగు పెట్టే క్రమంలో కొన్ని పాత రాతారీతులకయ పాతరేసినా అవే కొంగ్రొత్త రూపంలో కోరలు చాచడం విడ్డూరం! అవన్నీ స్వేచ్ఛ పేరు మీద ప్రవేశ పెట్టబడ్డాయి అన్నది గమనార్హం!! కమ్యూనిజం అయినా, కాపటలిజమయినా వాస్తవంగా ప్రాచీన బానిసత్వపు సరికొత్త రూపాలే. ఒక చోటు నియంత ప్రభుత్వం, మరో చోట నిరంకుశ ప్రభువులు. మనుషులు గత్యంతరం లేక స్వేచ్ఛాస్వాతంత్య్రాలకు బదులుగా బానిసత్వాన్ని కోరుకునేలా ఆర్థిక, రాజకీయ, ఆధ్యాత్మిక చింతనాత్మక వాతా వరణాన్ని సృజించాయి. ఆధునికం పేరుతో బరి తెగించి తిరగాడే సొసౖీె గర్ల్స్‌ ఏ ‘స్వేచ్ఛ’ పేరుతోనయితే తమ శరీరాలను ఇతరులకు అప్పజెప్పుతారో అది స్వేచ్ఛ కాదు పచ్చి బానిసత్వం.
నేడు యువత నోట తరచూ వినబడే మాట – ‘ఎవరడ్డు చెప్పనంత వరకు తప్పు కాదురో, నువ్వు బాధ పెట్టనంత వరకు తప్పు కాదురో, అంతా చేసినాక సొరీ చెప్పి ముగిస్తే తప్పేం కాదోయ్‌’ అన్నది. ఈ మాట మహా మోసపూరిత మయినది. ఒక వ్యక్తి ఇంి లోపల కూర్చుని మాదకద్రవ్యాల్ని, మత్తు పదార్థాల్ని సేవిస్తే తప్పు కాదనా? అతను చేస్తున్నది కరెక్ట్‌ అనా దీనర్థం? అల్లాహ్‌ సాక్షిగా! ఇది మాయావి అయిన షైతాన్‌ అందమైన నినాదం. అందమైన పేర్లు, మనోహరమయిన పదాలు, మనోజ్ఞమయిన పదబంధాలు, వినసొంపయిన నినాదాలు మనందరి బహిరంగ శత్రువయిన షైతాన్‌ ఎత్తుగడలోని అంతర్భాగాలు. ఇలాిం పైపూత ప్రేరకాలకు, మోసపూరిత ఆకర్షణలకు ఆమడ దూరం ఉండాలి.

బానిస కూలీలు:
కొంత భూమిని ఒకరికిచ్చి జీవితాంతం వారితో ఊడిగం చేయిపించుకో వడం. ఈ విధమయినటువిం బానిసత్వం నేికీ పల్లే ప్రాంతాల్లో, ఆధునిక ముసుగులో పట్టణ ప్రాంతాల్లో దర్శనమిస్తుంది. ఒక వంశానికి, కులానికి చెందిన వారు ఇదే పని చెయ్యాలన్న నియతి ఇస్లాంలో లేదు. ఆ విషయాని కొస్తే ఇస్లాం పరమ ఆదర్శవంతులుగా పేర్కొనే ప్రవక్తలు కూలీ పని చేసిన వారే. జీతానికి గొర్రెలు మేపినవారే. ‘కూలీవాని చెమట ఆరక ముందే అతని వెతనం చెల్లించాల’న్నది ఇస్లాం ఆదేశం. (ఇబ్ను మాజహ్‌) ”ఒక వ్యక్తిని కూలీకి పిలిచి, అతనితో మొత్తం పని చేయిపించుకుని కూలీ ఇవ్వకుండా ఎగ్గొ ి్టనోడికి వ్యతిరేకంగా రేపు ప్రళయ దినాన నేను పోరాడుతాను” అన్నారు ప్రవక్త ముహమ్మద్‌ (స). అలాగే ఒక పని గురించి చెప్పి వేరే పని చేయించు కునేవారు, ఒక సమయం చెప్పి ఆ సమాయనికన్నా ఎక్కువ అతని శ్రమను జలగల్లా పీల్చేవారు, ఒక వెతనం గురించి మాిచ్చి మాట తప్పేవారు, విదే శాల్లో మంచి జీతం అంటూ అరచేతిలో స్వర్గాన్ని చూపించి మొండి చెయ్యి చూపించి కట్టు బానిసల్ని చేసేవారు, వందల్లో, వేలల్లో పిల్లల్ని, వృద్ధుల్ని ప్రోగు చేసి వారి చేత భిక్షం ఎత్తించి బీభత్సంగా వ్యవరించేవారు అందరూ నేడు మనిషి స్వేచ్ఛ, శ్రమను దోచుకునే దోపిడి దొంగలే, దగాకోరులే!

బానిసత్వం రెండు రకాలు. ఒకి: దేహపరమయిన బానిసత్వం – చాలా దేశాలు ఈ విధమయినటువిం బానిసత్వం నుండి ముక్తి పొంది స్వేచ్ఛా వాయువుల్లో జీవిస్తున్నాయి. రెండవది: మానసిక బానిసత్వం: ఈ విధమయి నటువిం బానిసత్వానికి దాదాపు దేశాల ప్రజలు గురయి ఉన్నారు. మత స్వేచ్ఛ పేరుతో ఆంబోతు ముందర మొకరిల్లడం, జర జర ప్రాకే పాముకు దండం పెట్టడం స్వేచ్ఛ కాదు, సత్యం అంతకన్నా కాదు. అది బహిరంగ బాని సత్వం. బాహ్య బానిసత్వం నుండి ముక్తి పొందే ప్రయత్నం మనిషి చేసినంత గా మానసికమయిన, ఆత్మపరమయిన ఈ బానిసత్వం నుండి బయట పడే ప్రయత్నం చేయడం లేదు. ఇదే యదార్థాన్ని తెలియజేస్తూ ఖుర్‌ఆన్‌ ఇలా అంటుంది: ”నిశ్చయంగా మేము మానువుణ్ణి అత్యుత్తమ ఆకారంలో పుట్టిం చాము. అటుపిమ్మట అతన్ని (అతని నిర్వాకాల కారణంగా) అధమాతి అధమ స్థానానికి మళ్ళించాము”. (అత్తీన్‌: 4,5) ఫలితంగా అతనికి కోతంటే భయమే, కొమ్మంటే భయమే, రాయంటే భయమే, రప్పంటే భయమే, తుమ్మంటే భయమే, రాశంటే భయమే, వాస్తంటే భయమే. నిజ ఆరాధ్యుడయిన ఒక్క అల్లాహ్‌కు భయపడని కారణంగా ఎన్ని భయాలు అతన్ని చుట్టమ్టుాయో, ఎందరికి అతను ఊడిగం చేయాల్సి వస్తుందో గమనించండి! ఇస్లాం మనిషికి బాహ్యపరమయిన స్వేచ్ఛను ప్రసాదించడమే కాక, ఆత్మపరమయిన, ఆధ్యాత్మిక పరమయిన బానిసత్వం నుండి సయితం ముక్తిని ప్రసాదిస్తుంది.
నేటి ప్రపంచం భౌతిక వాదం, ఆర్థిక సంఘర్షణల ద్విగుణ అభిశాపంతో కొట్టుమ్టిడుతోంది. భౌతిక వాదం మనిషి ఆత్మ,మనస్సు రిెం ప్రశాంతతను దోచుకుంటుంది. ఆర్థిక ఘర్షణ ప్రపంచాన్ని నిరంతర అలజడికి ఆటపట్టుగా మార్చేస్తుంది. ఇస్లాం ఈ రెంటికి మధ్య మధ్యేమార్గం. ప్రపంచం నేడు కాక పోయినా రేపయినా సరే ఇస్లాం విలువను గుర్తిస్తుంది.
లాస్ట్‌ బట్ నాట్ లిస్ట్‌ – ఏ జాతి ప్రజలయితే తమ మనోకాంక్షలను, భావోద్రే కాలను తన అధీనంలో ఉంచుకోరో, తమకు ఇవ్వబడిన స్వేచ్ఛను సద్విని యోగ పర్చుకోరో, మరెవరయితే అవసరం ఏర్పడినా తమకు ప్రియమయిన వాటిని వదులుకోవడాన్ని ఇష్ట పడరో అలాిం” జాతి నాయకత్వపు (స్వాతం త్య్ర) హోదాను పొందజాలదు. అలాగే అంతర్జాతీయ సంఘర్షనల్లో ఏ జాతి ప్రజలయితే కష్టాలను, ఆపదలను భరించే సామర్థ్యం కలిగి ఉంటారో, అవసరం కలిగినప్పుడు ఎవరయితే తమ మనోభిరామమయిన కోరికల్ని గంటలు, దినాలు కాదు; సంవత్సరాల తరబడి త్యజించే నిబ్బరం చూపగలరో అలాిం పురుషోత్తములకే విజయశ్రీ కాళ్ళు పడుతుంది.

మత సామరస్యం మరియు ఇస్లాం


కడువెడు పాలను ఒక ఉప్పు కల్లు పాడు చేసినట్లు, ప్రాణం పొసే మతాన్ని ‘కొందరి ఛాందసం’ ప్రమాదంగా మార్చి వేస్తున్న రోజులివి. నేడు మత దువ్వినియోగం, మత ఛాందసం, మత దురభిమానం, మతమౌఢ్యం, మతోన్మాదం సమాజాన్ని చిందరవందర చేస్తోంది. మత ధర్మాన్ని మనిషి సమాజ హితం కోరేదిగా భావించాల్సింది పోయి, దాన్ని సమాజం పాలిట ఓ గండంగా మార్చే ప్రయత్నంలో ఉన్నాడు. విశ్వాసాల పేరిట వినాశాలు సృష్టిస్తున్నాడు. అమృతం కావాల్సిన మతాన్ని హాలహలంగా మారుస్తున్నాడు. ‘రామ్‌కి ఔలాద్‌ లేదా హరామ్‌కి ఔలాద్‌’ అంటూ వెర్రి నినాదాలతో పెట్రేగి పోతున్నాడు. స్వమత విజ్ఞాన శూన్యతే అన్య మత ద్వేషానికి కారణం అన్న యాదా ర్థం గ్రహించ లేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. మతమనేది వ్యక్తి వికాసాన్ని, దృక్పథాన్ని ప్రభావితం చేయాలి. అది మనిషిలో సాత్విక చింతనను పెంపొందించగలగాలి. విశ్వకర్తను మాత్రమే ఆరాధిస్తూ విశ్వం మొత్తాన్ని ప్రేమించేలా చేయాలి. అలా చేసేదే నిజమయిన మతధర్మం. మనిషి దృక్పథంలో, నడకలో, నడవడికలో మార్పు రానంత వరకు ఎన్ని మతముల పట్టున చేరిన వృధాయే! దాన్ని మతి పరిధిలో నిలుపుకున్న నమ్మకాలకు పెట్టుకున్న పేరుగా చూడాలే గానీ, అది నిజమయి మతధర్మం కాజాలదు. నిజధర్మం కేవలం దైవం సమ్మ తించి ఆమోదించినదే. అదే కాలాతీతం, సర్వజనీనం. సర్వ జనులకు ఆచరణీయం. మిగతావన్నీ దాన్నుండి చీలి పడ్డ వక్ర మార్గాలే! ప్రక్క త్రోవలే!!
ఏ విధంగా చూసుకున్నా విశ్వం మొత్తంలో చెల్లుబాటయ్యే ధర్మం ఇస్లాం మాత్రమే. అదే ఇహలోక విజయానికి పరలోక మోక్షానికి రాచ బాట. ఈ విషయంలో ఎలాంటి సర్దుబాటుకి ఆస్కారం లేదు. అంటే, దీనర్థం ఇస్లాం తన సిద్ధాంతాల్ని బలవంతాన ప్రజల మీద రుద్దు తుంది అని అపార్థం చేసుకుంటే మాత్రం తప్పులో కాలేసినట్లే! ఇస్లాం అన్య మతస్థులతో సయితం ఉత్తమంగా వ్యహరించాలని హితవు పలు కుతుంది. ”ప్రజలతో మీరు మంచి మాటలే మాట్లాడండి”. (అల్‌ బఖరా:83) అలా చేయ నిరాకరించే వారిని అది గట్టిగానే మందలి స్తుంది కూడా: ”నీ ప్రభువు గనక తలచుకుంటే భూమండలంలోని జనులంతా విశ్వసించి ఉండేవారే- ఏమిటి, నువ్వు ప్రజలు విశ్వసించ నంత వరకూ వారిని బలవంతం చేస్తూనే ఉంటావా”? (యూనుస్‌: 99)
బలవంతంగా ప్రజలు మెడలు వంచే అధికారం అల్లాహ్‌ా ఏ వ్యక్తికి ఇవ్వ లేదు. చివరికి ప్రవక్తలకు కూడా ఆ అనుమతి లేదు. వారి కర్త వ్యం హితబోధ చేయడం వరకే. ఒకరికి సన్మార్గం చూపడం, చూపక పోవడం అనేది కేవలం అల్లాహ్‌ాకు సంబంధించిన విషయం. ఈ కార ణంగానే – ప్రవక్తల్ని, వారి సందేశాన్ని తిరస్కరించిన వారిలో వారి భార్యలను, వారి సంతానాన్ని, వారి బంధువులను మనం చూస్తాము.

ఇస్లాం అన్య మతస్థుల పట్ల సమసర భావం కలిగి ఉండమని చెప్పడంతోనే సరిపెట్టుకోదు, ఎదుటి వారి మత పీష్వాలను, వారి ఆరాధ్య దైవాలను తూలనాడకండి అని హెచ్చరిస్తుంది: ”వారు (నిజ ఆరాధ్యుడయిన) అల్లాహ్‌ాను నదలి ఆరాధిస్తున్న వారిని తూలనాడ కండి, దూషించకండి”. (అన్‌ఆమ్‌:108) ఇస్లాం ధర్మం తన సిద్ధాంతాన్నయితే ఎలాంటి అరమరికలు లేకుండా స్పష్టంగా, సూటిగా చెబుతుంది. దాంతోపాటు అంగీకరిచడం, అంగీకరించకపోవడం అనే స్వేచ్ఛను ఏదయితే అల్లాహ్‌ా తన దాసులకు ఇచ్చాడో దాన్ని కూడా అది గౌరవిస్తుంది. ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది: ”మరియి ఇలా అను- (అసాంతం)సత్యం(తో కూడుకున్న ఈ ఖుర్‌ఆన్‌) మీ అందరి ప్రభువు తరఫు నుంచి వచ్చింది. ఇక కోరిన వారు దీన్ని నమ్మొచ్చు. కోరిన వారు దీన్ని తిరస్కరించవచ్చు”. (కహఫ్‌: 29)
అంటే ఇస్లాం ఎంపిక అధికారం మాత్రం మనిషి హేతువు, బుద్ధికే వదలి పెడుతుంది. అనగా ఇస్లాం బై ఛాయిజ్‌ ధర్మమే కానీ, బై ఛాన్స్‌ ధర్మం కాదు. అవును ”ధర్మం విషయంలో ఎలాంటి బలాత్కారం, బల వంతం లేదు. సత్యం-సన్మార్గం, అసత్యం-అపమార్గం నుండి స్పష్టం గా వేరు పర్చబడింది.” (అల్‌ బఖరా:256)

మహనీయ ముహమ్మద్‌ (స) మదీనా వెళ్లి అక్కడ సత్సమాజాన్ని స్థాపించనప్పుడు మదీనా చుట్టుప్రక్కల నివసించే అన్య మతస్థులతో, తెగలతో శాంతి ఒప్పందం చేసుకోవడం జరిగింది. వారి ప్రాణాలకు, మానాలు, ధనాలకు రక్షణ కల్పిస్తామని, వారిని సమాన స్థాయి పౌరు లుగా గౌరవిస్తామని, వారి ఆర్థిక, ఆధ్యాత్మిక, రాజకీయ హక్కులకు వారికి పూర్తిగా ఇస్తామని, అందరూ కలిసికట్టుగా శత్రు సైన్యాల నుండి స్వప్రాంతం అయిన మదీనాను కాపాడుకోవాలని అందులో పేర్కొనడం జరిగింది. అప్పటి ఆ ఒడంబడికలో దాదాపు 52 సెక్షన్లు ఉండేవి. అది మదీనా ఒప్పందంగా ఖ్యాతి కెక్కింది. అంతే కాదు, ఇస్లాం ముస్లిమేత రుల మనోభావాలను సయితం గౌరవ పరిగణలోకి తీసుకుంది. వారికి దక్కాల్సిన సర్వ హక్కులను ఇస్లాం వారికి ఎటువంటి డిమాండ్‌ లేకుండానే ప్రసాదించింది. దీనికి మించి-మక్కా విజయం సందర్భంగా బద్ధ శత్రువులకు ప్రాణభిక్ష పెట్టి మానవ చరిత్రలోనే కని, విని, ఎరు గని రీతిలో గొప్ప ఆదర్శాన్ని నెలకొల్పింది. అల్లాహ్‌ా అటువంటి ఉత్తమ ప్రవర్తన కలిగి ఉండమనే చెబుతున్నాడు: ”మంచీ-చెడులు (ఎట్టి పరిస్థి తిలోను) సమానం కాలేవు. (ఓ ప్రవక్తా!) చెడును మంచి ద్వారా తొల గించు. ఆ తర్వాత (నువ్వే చేద్దువుగాని), నీకు-తనకూ బద్ధ విరోధం ఉన్న వ్యక్తి సయితం నీకు ప్రాణస్నేహితుడై పోతాడు”. (హామీమ్‌ అస్సజ్దా: 34)

ఆ తర్వాత చెడును మంచి ద్వారా తొలగించే ఈ బృహత్కార్యం అందరి వల్ల అయ్యేది కాదని, దాని కోసం గుండె దిటవు అవసరమని, సహనస్థయిర్యాలు అవసరమని, కోపాన్ని దిగమింగే గుణం అవసర మని, అలాంటి సహనమూర్తులకే ఈ భాగ్యం దక్కుతుందని తెలియ జేశాడు: ”అయితే ఈ భాగ్యం సహనశీలురకు మాత్రమే ప్రాప్తిస్తుంది. దీన్ని గొప్ప అదృష్టవంతులు మాత్రమే పొందగలుగుతారు”. (హామీమ్‌ అస్సజ్దా: 35)
మత సామరస్యానికి మచ్చుతునకగా చెప్పుకోదగ్గ సంఘటన – మహనీయ ముహమ్మద్‌ (స) ఒక అవిశ్వాసి జనాజా వెళుతుంటే, ప్రవక్త (స) వారు లేచి నిలబడ్డారు. ఏమిటి? అతను అవిశ్వాసి కదా! అని అక్కడున్న వారు అభ్యంతరం చెప్పగా – ‘తనూ మనిషేగా’ అని సమాధానమిచ్చారు ప్రవక్త (స). (బుఖారీ)
ఇస్లాం – వ్యవహార విషయంలో తన, పర అన్న వివక్షను పాటించదు. ప్రవక్త (స) మదీనాకు హిజ్రత్‌ చేసి వెళ్ళిన తర్వాత కొన్నాళ్ళకు మక్కా లో భీకర కరువు ఏర్పడింది. ప్రవక్త (స), ఇస్లాంకు బద్ధ శత్రువయిన అబూ సుఫ్యాన్‌, మరియు సఫ్యాన్‌ బిన్‌ ఉమయ్యా వద్దకు ఐదు వందల దిర్హిమ్‌లు పంపి వాటిని అవసరార్థులలో, నిరుపేదలలో పంచవలసిం దిగా కోరారు. స్వయంగా ప్రవక్త మహనీయ ముహమ్మద్‌ (స) ఎందరో ముస్లిమేతర సోదరుల్ని తన ఇంటికి విందుకి ఆహ్వానించేవారు. అలాగే ముస్లిమేతర సోదరులు ఇచ్చే విందు ఆహ్వానాన్ని స్వీకరించేవారు కూడా. అలా స్వీకరించిన ఓ విందులో ఆయనకు విషం కలిపిన ఆహా రం ఇవ్వబడినా ఆయన ముస్లిమేతరులు ఇచ్చే విందుకి వెళ్ళడం మాను కోలేదు. అంతే కాదు మహనీయ ముహమ్మద్‌ (స) ముస్లిమేతరులతో ఎంతో స్నేహపూరితంగా, వ్యవహరించేవారు. ”నేను మీ ఇంటికి విందు కి రానా?” అనేవారు.అది విన్న ముస్లిమేతర సోదరులు ఆయన రాకను శుభప్రదంగా, మహా భాగ్యంగా తలంచి ఆయన్ను తమ ఇంటికి తీసు కెళ్ళేవారు. అలాగే ఇంట్లో ఏదయినా మంచి కూర వండితే దాన్ని కాస్త పలుచ చేసి ఇరుగుపొరుగున ఉన్న ముస్లిమేతర సోదరుల ఇళ్ళకు పంపమని సతీమణులను పురమాయించేవారు. అలాగే సమయం. సందర్భాన్ని బట్టి వారికి బహుమతులు కూడా పంపుతూ ఉండేవారు. ఇదే మత సామరస్యానికి ఆయన (స) తర్వాత అయన సహచరుల యిన నలుగురు ధర్మఖలీఫాలు సయితం కట్టుబడి నడుచుకున్నారు.

ముస్లింలు బైతుల్‌ మఖ్దుస్‌ను జయించిన సందర్భంగా ద్వితీయ ఖలీఫా హజ్రత్‌ ఉమర్‌ (ర) జెరూషలెమ్‌ చేరుకుని అక్కడి ప్రజలతో ఒప్పందం చేసుకున్నారు.”ఈ ఒడంబడిక పత్రాన్ని అల్లాహ్‌ా దాసు డయిన ఉమర్‌ బిన్‌ ఖత్తాబ్‌ (ర), ఏలియా ప్రజలకు ఇస్తున్నాడు. ఇది వారి ధన, మాన, ప్రాణ, చర్చీ, శిలువ, అరోగ్యవంతులు, రోగగస్త్రుల తోపాటు అన్ని మతాల ప్రజల రక్షణకు సంబంధించి ఇవ్వబడుతున్న హామీ పత్రం. వారి ప్రార్థనా మందిరాలను కూలదోయరాదు. – వారి చర్చీలను నివాస స్థలాలుగా మార్చ రాదు. వారి ధనాన్ని దోచుకో కూడదు. మతావలంబన విషయంలో వారిపై ఎలాంటి బలవంతం, బలాత్కారం ఉండదు. వారిలో ఏ ఒక్కరిని కూడా నష్ట పర్చడం, కష్ట పెట్టడం జరుగదు”. అని అందులో పేర్కొన్నారు. ఇవి ఇలాంటి లెక్క లేనన్ని సజీవ సాక్ష్యాల కారణంగానే అనేక మంది ముస్లిమేతర సోద రులు చరిత్రలో ముస్లిం నాయకులు కనబరచిన మత సామరస్యాన్ని ప్రశంసిమచకుండా ఉండలేక పోయారు. ప్రాన్స్‌కి చెందిన ప్రముఖ స్కాలర్‌ -ఫ్రాన్సిసీ గొస్తాఫ్‌ లీబోన్‌ – ”అరబ్బుల వంటి మత సామరస్యం గల ప్రజల్ని లోకం చూడలేదు. ఇస్లాం వంటి మత సమ రస భావాన్ని పాటించే ధర్మాన్ని లోకులు కనలేదు”. అన్నాడు.
ఇస్లాం కనబర్చే మతసామరస్యానికి మరో మచ్చుతునక కాగల సంఘట – వలీద్‌ బిన్‌ అబ్దుల్‌ మలిక్‌ రాజు హయాంలో డెమాస్కస్‌ లోని పెద్ద మస్జిద్‌ను విస్తీర్ణ పరుస్తూ చర్చీకి సంబంధించిన కొంత భాగాన్ని మస్జిద్‌లో కలుపుకున్నారు. అయితే ఉమర్‌ బిన్‌ అబ్దుల్‌ అజీజ్‌ (ర) గారు ఖలీఫాగా ఎన్నుకోబడిన వెంటనే ఆయన మస్జిద్‌ ఆ బాగాన్ని పడగొట్టి చర్చీ అధికారులకు అప్పగించాడు.

అలెగ్జాండ్రియాను ముస్లింల కైవసం చేసుకున్నప్పుడు ఓ ముస్లిం యోధుడు ప్రవక్త ఈసా (అ)కు సంబంధించిన ఒక కన్నును పగుల గొట్టాడు. ఈ సంఘటన వివరాలు మసర్‌ గవర్నర్‌ అయిన అమ్ర్‌ బిన్‌ ఆస్‌ (ర) వద్దకు చేరగా ఆయన క్రైస్తవ సోదరుల్ని ఉద్దేశించి – ”మీరే చెప్పండి ఈ నేరానికి ఏం శిక్ష విధించాలో? ఈ సమస్యకు పరిష్కారం ఏం కాగలదో?”. దానికి వారు ‘మీరు మీ ప్రవక్త ముహమ్మద్‌ (స) వారి ఓ చిత్రపటాన్ని తయారు చేసి ఇవ్వండి. మేమూ ఆయన కన్నును పగులగొడతాము’ అన్నారు. అది విన్న ముస్లిం గవర్నర్‌ – ”మా ప్రవక్త (స) వారి చిత్రపటాన్ని మేమే తయారు చేయము. అలాంటిది మీకెలా తయారు చేసి ఇవ్వగలము చెప్పండి. హాఁ! ఓ పరిష్కారం ఉంది. నా ఈ రెండు కళ్ళున్నాయి, కావాలంటే మీరు వీటిని పగులగొట్టచ్చు” అన్నారు.ఎంతో న్యాయబద్ధమయిన గవర్నర్‌ తీర్పుని విన్న వారు ప్రతీకార నిర్ణయాన్ని మానుకున్నారు.

చివరిగా ఒక మాట – మత సామరస్యం అంటే, మనిషి తన వ్యక్తి త్యాన్ని, తన మత ధర్మాన్ని, తన విశ్వాసాన్ని తిలోదకాలిచ్చి ఇష్ట మొచ్చి నట్టు వ్యవహరిస్తూ నేనో గొప్ప లౌకిక వాదిననో, మానవతావాదిననో భజనప్రియుల్ని ప్రోగు చేసుకోవడం కాదు. తను నమ్మే నిజాన్ని పాటిస్తూ, అన్యులు పాటించేది అసత్యమయినా వారికి సత్యావగాహన కలిగించే ప్రయత్నం చేస్తూనే వారి మాటల్ని, చేతల్ని సహించడం. ఒక వేళ వారు హింసా మార్గాన్ని ఎంచుకున్నా, తాను మాత్రం శాంతిని ఆశ్రయించి అందరి మేలును మనస్ఫూర్తిగా కోరడం. అయితే,
అత్యంత శోచనీయమయిన విషయం ఏమిటంటే, ముస్లింలుగా పిలవబడుతున్న అనేకుల ప్రవర్తన అల్లాహ్‌ా ఏకత్వాని (తౌహీద్‌)కే మచ్చ తెచ్చేదిగా ఉంది. గుంటూరు జిల్లాకు చెందిన షేక్‌ హుసైన్‌ మరియు హైదరాబాద్‌కు చెందిన సయ్యద్‌ మీర్జా అనబడే ముస్లింలు సమర్పించిన 108 బంగారు పుష్పాలతో బాలాజీ 108 నామాలు ఉచ్చరిస్తూ ”స్వర్ణపుష్పార్చన” లేదా ”అష్టదళ పాద పద్మా రాధన” చేస్తారట. శబరిమలై అయ్యప్పకు వావర్‌ అనే ముస్లిం మిత్రుడున్నాడట. అక్కడికెళ్ళేవారు వావర్‌ స్వామి కోసం కూడా ప్రత్యే కంగా మిరియాల పొట్లం ఇరుముడిలో పెట్టుకుని వెళతారట. అయ్యప్పే అలా ఆదేశించాడని స్థల పురాణం చెబుతొందట. మంళగిరి మిద్ది సెంటర్లో ముస్లింలు నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నారట. గుంటూరులో ముస్లిం యువకులు ఐదేళ్ళుగా వినాయకుని విగ్రహం ఏర్పాటు చేస్తున్నారట. ఔరంగాబాదులో దర్గామసీదులో 35 సంవత్స రాలుగా గణపతి ఉత్సవాలు ముస్లింలు చేస్తున్నారట. హైదరాబాదుకి చెందిన జఫరుల్లాహ్‌ా ఖాన్‌ వేలంలో లక్షా రెండు వేలకు గణపతి లడ్డూను సొంతం చేసుకుని మత సామరస్యాన్ని చాటాడట. బీహార్‌ లో ముస్లింలు మహావీర్‌ మందిర నిర్మాణానికి భూమి విరాళం మత సామరస్యాన్ని ఘనంగా చాటారట. ఇవి ఇలాంటి అనేక వార్తలతో (అవి వాస్తవాలు కూడా) ముస్లింలు తౌహీద్‌ను పాటిస్తూనే షిర్క్‌ (బహు దైవారాధన)కు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు అని ప్రచారం చేయడం జరుగుతోంది.

ఏది ఏమయినా, కొందరి ప్రవర్తన ధర్మానికి గీటురాయి కాదు, ధర్మమే అన్నింటికీ గీటురాయి. వాస్తవం ఏమిటంటే, తౌహీద్‌ మరియు షిర్క్‌ పర్సపరం పూర్తి విరుద్ధమయిన భావాలు. ఏక సమయంలో ఓ వ్యక్తి తౌహీద్‌ని కూడా నమ్ముతున్నాడు, షిర్క్‌ని కూడా పాటిస్తున్నాడు అంటే దానికి మించిన ఆత్మవంచన, ధర్మద్రోహం మరొకటి కాజాలదు. షిర్క్‌ చేసే వాడు ముస్లిం కాడు. ఉంటే ముస్లింగానయినా ఉండాలి, లేదా బహుదైవారధకుడిగానయినా ఉండాలి, లేదా నాకు మతంతో సంబంధమే లేదు అనే వర్గంలోనయినా చేరాలి. అన్యదా నష్టపోయేది వీరో వారో కాదు, అలా నడుచుకునే వ్యక్తి, వర్గం మాత్రమే. నేడు భారత ముస్లింలలో కనబడే ఇదే ధోరణి ఎండ గడుతూ అల్లాహ్‌ా చెప్పిన మాట:

”వారిలో చాలా మంది అల్లాహ్‌ను విశ్వసిస్తూ కూడా ఆయనతోపాటు ఇతరుల్ని సాటి కల్పింస్తున్నారు (షిర్క్‌కి ఒడిగడుతున్నారు). ఏమిటి? అల్లాహ్‌ శిక్షలలో ఏ శిక్ష కూడా తమపై వచ్చి పడదనీ, అకస్మాత్తుగా – తమకు తెలియకుండానే-ప్రళయం విరుచుకు పడదని వారి నిశ్చింతగా ఉన్నారా?”. (యూసుఫ్‌: 106, 107)

ఇస్లాం విహాంగ వీక్షణం


అజ్ఞానం, అంధకారంలో మునిగి ఉన్న ఆ సమాజం జ్ఞాన కాంతులతో ప్రకాశించింది.
నామోషిగా భావించి ఆడకూతుళ్ళను సజీవ సమాధి చేసిన తల్లి దండులే  ఆమె పుట్టుకను శుభవార్తగా, స్వర్గానికి సోపానంగా, నరకాగ్ని నుండి కాపాడే రక్షక కవచంగా భావించి తలెత్తుకు తిరిగారు.
కుమా రులతోపాటు కుమార్తెలకు సయితం ఆస్తి హక్కు ఇవ్వడం తమ విధిగా గుర్తించారు.
శతాబ్దాల పాటు మద్యం మత్తులో జోగిన ఆ జాతి – ఇక ప్రళ యం వరకు ఒక్క చుక్క మద్యం కూడా ముట్టేది లేదని  శపథం చేసింది.
తన స్థాయి, ఆత్మగౌరవాన్ని మరచిపోయి అగుపించిన ప్రతి వస్తువును దైవంగా తలంచి పూజించనవారు, నిజ సృష్టికర్త ఒక్కడేనని, సకల ఆరాధనలకు, సమస్త స్తోత్రాలకు, ఉపసనా రీతులకు ఆయన ఒక్కడే అర్హుడని అర్థం చేసుకున్నారు.
ఊడిగం, వెట్టి చాకిరి చెయ్యడానికే వీరు పుట్టారు అనుకునే తమ బాని సలను నాయకులుగా, అధినాయకులుగా నియమించుకోవడానికి సిద్ధ మయ్యారు ఆ జాతి పెద్దలు. వారిలో వచ్చిన ఈ మార్పుకి, వారి ఈ సత్ప్రవర్తనకు, పరివర్తనకు కార ణం ఒక్కటే – అదే ఇస్లాం! ఇస్లాం మనిషి ఇహపరాల సౌభాగ్యానికి, సిసలయిన సంతోషానికి, అసలయిన సంతృప్తికి పూచీ వహిస్తుంది. అదెలా అంటే?
 నిజ సృష్టికర్త అయిన అల్లాహ్‌ యెడల దాసుడు విశ్వాసం కలిగి ఉండటం ద్వారా దీన్ని సాధించుకోగలడు అంటుంది, ఇస్లాం. దాసునికి మరియు దేవునికి మధ్య గల ఈ అనుబంధం వల్లనే మనిషికి అసలయిన సంతోషం, సిసలయిన సంతృప్తి సాధ్యమవుతుంది.  ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది: ”విశ్వసించిన వారి సంరక్షకునిగా స్వయంగా అల్లాహ్‌ా ఉంటాడు. ఆయన వారిని చీకట్ల నుండి వెలుగు వైపునకు తీసుకుపోతాడు. కాగా అవిశ్వాసుల నేస్తాలు షైతానులే. వాళ్ళు వారిని వెలుగు నుండి చీకట్ల వైపు లాక్కు పోతారు. వారు నరక వాసులు, కలకాలం అందులోనే పడి ఉంటారు”. (బఖరహ్‌: 257)   ఈ మేరకు  మానవతా ధర్మమయిన ఇస్లాం మానవాళికి ఇచ్చే రక్షణ గురించి, శిక్షణ గురించి తెలుసుకుందాం!

ధర్మ పరిరక్షణ 

 మనిషి పుట్టుకతోనే స్వేచ్ఛాజీవి. తనకు సంబంధించిన ప్రతి విషయం లోనూ పూర్తి స్వేచ్ఛ కలిగి జీవించాలని కోరుకుంటాడు. అదే స్వేచ్ఛ తాను అవలంబించే మతధర్మం విషయంలో సయితం తనకు దక్కాలని అభిలషిస్తాడు. అతని ఈ సహజ భావనకనుగుణంగానే సర్వలోక సృష్టి కర్త అతన్ని పుట్టించి, వినే, అనే, కనే శక్తిని అనుగ్రహించి, సత్యా సత్యాల వ్యత్యాసాన్ని విడమరచి చెప్పడంతోపాటే, బాటను అనుసరిం మాటను అనుసరించే సేచ్ఛను మాత్రం అతనికి ప్రసాదించాడు. ఇలా అన్నాడు: ”అసాంతం సత్యం (కూడుకున్న ఈ ఖుర్‌ఆన్‌) మీ ప్రభువు తరఫు నుంచి వచ్చిందని ప్రకటించు. ఇక కోరిన వారు దీన్ని విశ్వసించ వచ్చు మరియు కోరిన వారు నిరాకరిమచవచ్చు”. (దివ్యఖుర్‌ఆన్‌-18:29)
ధర్మం – ఎంతటి మహత్తు గలదంటే, అల్లాహ్‌ా ప్రజలన్ని దాని కోసమే పుట్టించాడు. దాన్ని సమస్త మానవాళికి చేరవేయడానికి, దాన్ని సంరక్షించడానికి ప్రవక్తల్ని ప్రభవింపజేశాడు. గ్రంథాల్ని అవతరింపజేశాడు. ఇలా సెలవిచ్చాడు: ‘మేము ప్రతి సముదాయంలోనూ ప్రవక్తను ప్రభవింపజేశాము. అతని ద్వారా (ప్రజలారా!) ”అల్లాహ్‌ాను మాత్రమే ఆరాధించండి. ఆయన తప్ప ఇతరత్రా మిథ్యా దైవాలకు దూరంగా ఉండండి” అని బోధ పర్చాము’. (అన్నహ్ల: 36)
 మతధర్మాన్ని ఎంచుకునే పూర్తి స్వేచ్ఛ మనిషికి ఉన్నప్పటికీ అతను సత్యధర్మాన్నే అనుసరించినట్లయితే దానికి బదుసు స్వర్గసీమను ప్రసాది స్తానని శుభవార్తను అందజేయడంతోపాటు, ఒకవేళ ఆ సేచ్ఛను దుర్వి నియోగ పరచి మిథ్యావాదాలను, అసత్యాలను, అర్థ సత్యాలను నమ్మి బతికినట్లయితే నరక యాతనలు తప్పవు అని హెచ్చరించాడు కూడా. అయితే మత స్వేచ్ఛ మాత్రం అతని శ్వాస ఆగేంత వరకు అతనికుం టుంది. ఆ విషయంలో ఎలాంటి బలవంతం, బలాత్కారం లేదు అన్నాడు అల్లాహ్‌: ”ధర్మం విషయంలో బలవంతం ఏమీ లేదు. సన్మార్గం అపమార్గం నుండి ప్రస్పుటమయింది”. (బఖరహ్‌: 256)

మేధో రక్షణ

 మనిషి మస్తిష్కాన్ని పాడు చేసే ప్రతి విధమయినటువంటి విషయా న్నుండి ఇస్లాం వారిస్తుంది. ఎందుకంటే, మనిషికి ప్రాప్తమయి ఉన్న ఇతర భౌతికానుగ్రహాలు ఓ ఎత్తయితే విచక్షణా జ్ఞానం, తెలివీతేటలు ఓ ఎత్తు.అతనికి ప్రాప్తమయి ఉన్న ఈ  మేధోశక్తి ఆధారంగానే ఇతర సృష్టి తాలలో అతనికి ఓ ప్రత్యేక గుర్తింపు.అట్టి  మేధోశక్తికి నీరుగార్చే మత్తు పానీయాలను, మాదకద్రవ్యాలను, వెకిలి చేష్టలను ఇస్లాం సంపూర్ణంగా నిషేధిస్తుంది:”ఓ విశ్వసించిన ప్రజలారా!నిశ్చయంగా సారాయి,జూదం, దైవేతరాలయాలు, పాచికల జోస్యం-ఇవన్నీ పరమ జుగుప్సాకరమయి న విషయాలు, షైతాన్‌ చేష్టలు. కాబట్టి వాటికి దూరంగా ఉండండి. తద్వారా మీరు సాఫల్యం పొందవచ్చు”. (మాయిదహ్‌: 90)

ప్రాణ రక్షణ

 అల్లాహ్‌, ఏ ప్రాణినయినా లేదా స్వయాన్నయినా సరే హాని కలిగించ డాన్ని, హత్య చేయడాన్ని నిషేధించాడు. ఇలా అన్నాడు: ”చేజేతులా మిమ్మల్ని మీరు వినాశనం పాలు చేసుకోకండి”. (అల్‌ బఖరహ్‌ా: 195)
 వ్యక్తులు ఎవరయినా, ఏ మత ధర్మానికి చెందిన వారయినా సరే అన్యాయంగా ఒకరిపై దౌర్జన్యానికి ఒడిగట్టే వారి ఆట కట్టించే నిమిత్తం సరి హద్దులను, శిక్షలను కేటాయించాడు. ఇలా అన్నాడు: ”ఓ విశ్వసిం చిన ప్రజలారా! హతుల విషయంలో ప్రతీకార న్యాయం (ఖిసాస్‌) మీ కొరకు విధిగా నిర్ణయించబడింది”.  (అల్‌ బఖరహ్‌: 178)
”ఓ బుద్ధి జీవుల్లారా! ఈ ప్రతీకార న్యాయంలోనే మీ జీవనం ఉంది – ఇలా ఉంటేనే మీరు (అమానుషాల నుండి) ఆగి ఉంటారు”. (అల్‌ బఖరహ్‌: 179)
ఒక్క మాటలో చెప్పాలంటే ఇస్లాం మనిషి ప్రాణానికి ఇచ్చినంత విలువ మరే మతధర్మం ఇవ్వలేదు: ”ఎవరయితే అన్యాయంగా ఒక మనిషిని చంపాడో అతను సకల మానవులను చంపినట్లే. మరెవరయితే ఒక ప్రాణాన్ని కాపాడాడో అతను సకల మానవుల ప్రాణాలను కాపాడి నట్లే”. (మాయిదహ్‌:32)

సంతాన సంరక్షణ

 సంతాన రక్షణ కోసం ఇస్లాం గట్టి చర్యలే చేపట్టింది. ఏ కుటుంబ పట్టునయితే పిల్లలు పెరిగి పెద్దవుతారో ఆ కుటుంబ పునాదిని ఇస్లాం పవిత్ర బంధం పునాదిగా నిర్మించగోరుతుంది. వారి హక్కుల్ని పెద్దలకు బోధించడమే కాకుండా వారి మధ్య న్యాయంగా వ్యవహరించమని హితవు పలుకుతుంది. ఇస్లాం ధర్మసమ్మతమయిన రీతిలో వివాహం చేసుకోవాలని అభిలషిస్తుంది. అందులో వెకిలి చేష్టలకు, దుబారా ఖర్చుకు, అతికి పాల్పడకూడదంటుంది. ఇస్లాం అక్రమ సంబంధాలపై, అధర్మ వావివరసలపై, అశ్లీలం, అనైతికాలపై తన శిక్షా  కొరడాను ఝుళిపిస్తుంది.

మాన రక్షణ:  

ఇస్లాం మనిషి మానం మర్యాదలకు పెద్ద పీట వేస్తుంది. ప్రజల పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లకుండా, వారి వంశాన్ని తూల నాడే చర్యలకు పాల్పడకుండా ఉండాలని నొక్కి వక్కాణిస్తుంది. అలా చేయడాన్కి ఘోరపాపంగా పరిగణిస్తుంది. ఇస్లాం మనిషి (స్త్రీపరుషుల) గౌరవ మర్యాదల్ని కాపాడమంటుంది.  ”ఏ వ్యక్తయితే తన పరువును, పరివారాన్ని కాపాడుతూ హత్య చెయ్యబడతాడో అతను షహీద్‌” అంటుంది.

ధన సంరక్షణ

 ఇస్లాం ధర్మసమ్మతమయిన జోవనోపాధి కొరకు పరిశ్రమించాలని ఉపదేస్తుంది. ధర్మ రీతిలో వ్యాపారాన్ని అనుమతిస్తుంది. వడ్డీ, దోపిడి, దొంగతనాన్ని నిషేధిస్తుంది. ఎందుకంటే, వడ్డీ వ్యాపారం, జూదం,  మట్కా వంటి వాటి వల్ల ఒకరి సొమ్ము అన్యాయంగా దోచుకోవడం జరుగుతుంది గనక. ఇవి ఒక ఆరోగ్య సమాజానికి గొడ్డలి పెట్టుగా ఉంటాయి గనక. వీటి ద్వారా ప్రజల మధ్య ఉండాల్సిన ప్రేమాను రాగాలు పోయి రాగధ్వేషాలు చోటు చేసుకుంటాయి గనక. ఒక్క మాట లో చెప్పాలంటే, ”ఏ వ్యక్తయితే తన ధనాన్ని కాపాడుతూ హత్య చెయ్యబడతాడో అతను షహీద్‌. ఏ వ్యక్తయితే తన పరువును, పరివా రాన్ని కాపాడుతూ హత్య చెయ్యబడతాడో అతను షహీద్‌. ఏ వ్యక్తయితే తన ధర్మాన్ని కాపాడుతూ హత్య చెయ్య బడతాడో అతను షహీద్‌. ఏ వ్యక్తయితే తన ప్రాణాన్ని, కాపాడుతూ హత్య చెయ్యబడతాడో అతను షహీద్‌” అంటుంది ఇస్లాం. (తిర్మిజీ).  ఇక ఇస్లాం మనిషికిచ్చే శిక్షణ గురించి తెలుసుకుందాం!

శుచీశుభ్రతలు  

పరిశుద్ధత, పరిశుభ్రత, పవిత్రత అనేది మానవ నైజం వాంఛించే, మానవ సమాజం కాంక్షించే సుగుణం, సహజ గుణం. దీనికి భిన్నంగా అపరిశుద్ధతను, అపవిత్రతను మానవ నైజం, మానవ సమా జం సహించదు, ఇష్ట పడదు. ఈ కారణంగా ప్రతి విధమయినటు వంటి అశుధ్దాల నుండి దూరంగా ఉండాలని, శుధ్ధి పొందాలంటుంది ఇస్లాం. మనిషి మలమూత్రాలు, నిషిద్ధ జంతువుల మల మూత్రాలు, కుక్క, పంది వంటి నిషిద్ధ జంతువులకు దూరంగా ఉండాలని కోరుకుం టుంది. మలమూత్ర విసర్జనాననంతరం శుద్ధి పొందాలని, వుజూ చేయాలని, స్నానమాచరించాలని, నీరు లేని పక్షంలో తయమ్ముమ్‌ చేయాలని ఉపదేశిస్తుంది.

అప్పగింతల పట్ల అప్రమత్తత 

 ఇస్లాం బోధించే నైతిక ప్రమాణాలలో ఉన్నత నైతిక ప్రమాణం అమానతు. అంటే, నిజాయితీ-సచ్చీలత. వ్యాపారంలోగానీ, వ్యవహారం లోగానీ, మాటలోగానీ, బాటలోగానీ, నడకలోగానీ, నడవడికలోగానీ నిజాయితీగా మసలుకోవాలంటుంది. ”ఎవరి అమానతులను (అప్పగిం తలను) వారికి అప్పగించండి. ప్రజల మధ్య తీర్పు చేెసేటప్పుడు  న్యాయంగా తీర్పు చేయండి అని అల్లాహ్‌ా మిమ్మల్ని గట్టిగా తాకీదు చేస్తున్నాడు”. (అన్నిసా: 58)

సత్య సంధత 

 సత్యం-సత్యమే సదా సాపల్య ద్వారం. సత్యమే సమున్నతికి సోపానం – ఇహంలోనూ, పరంలోనూ అన్నది ఇస్లాం ఉపదేశం. కాబట్టి మనిషి సదా సత్యానికి కట్టుబడి ఉండాలంటుంది. అసత్యానికి, అధర్మానికి, అవినీతికి, అన్యాయానికి, అక్రమానికి మనిషి ఆమడ దూరం ఉండా లంటుంది. సత్యప్రవక్త అయిన ముహమ్మద్‌ (స) ఇలా ఉపదేశించారు: ”మీరు సత్యాన్ని అట్టి పెట్టుకు ఉండండి.  దానికే కట్టుబడి జీవించండి. ఎందుకంటే, సత్యం మంచికి మార్గం చూపుతుంది, మరి మంచి మనిషి ని స్వర్గానికి దారి చూపుతుంది.అసత్యం చెడుకై పురిగొల్పుతుంది. మరి చెడు మనిషిని నరకం పాలు చేసి గాని వదలదు”. (ముస్లిం)

స్థితప్రజ్ఞత 

 మనిషి చేపట్టే ఏ కార్యమయినా సరే అందులో తాను స్థితప్రజ్ఞత స్థాయిని సాధించాలని అభిలషిస్తుంది ఇస్లాం. మనిషి చేసే పని ఏద యినా పూర్తి ప్రావీణ్యం కలిగి పని చేయడం హర్షనీయం అంటుంది. ప్రవక్త ముహమ్మద్‌ (స) ఇలా సెలవిచ్చారు: ”మనిషి తలపెట్టే ఏ మంచి పనయినా పూర్తి నాణ్యతతో, ప్రావీణ్యం కలిగి పూర్తి చేయడాన్ని అల్లాహ్‌ా ఇష్ట పడతాడు”. (తబ్రానీ)

సంస్కారవంతమయిన వస్త్రధారణ

ఇస్లాంలో వస్త్రధారణం అందంగా, పరిశుభ్రంగా, సంస్కారవంతంగా ఉండాలి. పురుష పోలికలు గల దుస్తులు స్త్రీలు, స్త్రీల పోలికలు గల దుస్తులు పరురుషులు తొడగరాదంటుంది ఇస్లాం. అలాగే గర్వం, అహంకారం, అహంభావం ప్రదర్శితమయ్యే దుస్తుల్ని సయితం ఇస్లాం నిషేధిస్తుంది. వస్త్రధారణ విషయంలో దుబారా ఖర్చును అది సహిం చదు. దుస్తులు మరి పొడవాటివిగా-(పరుషులకు చీలమండలానికి క్రింది వరకు) ఉండటం, మరీ పొట్టి (కనీస కప్పి ఉంచాల్సిన ప్రదేశాల ను బహిర్గత పర్చే) దుస్తుల్ని స్త్రీపరుషులిరువురూ తొడగడాన్ని అది గర్హి  స్తుంది. అల్లాహ్‌ా ఖుర్‌ఆన్‌లో ఇలా సెలవిస్తున్నాడు: ”ఓ ఆదం సంతతి వారలారా! మేము మీ కోసం దుస్తుల్ని దించాము. అవి మీ మర్మాస్థానా లను కప్పి ఉంచడమే గాకుండా, మీ శరీరానికి శోభాయమానంగా కూడా ఉంటాయి”. (ఆరాఫ్‌: 26)

పెద్దల పట్ల గౌరవం, పిన్నల పట్ల వాత్సల్యం

 ఇస్లాం, ఉత్తమ రీతిలో తల్లిదండ్రుల సేవ చేయాల్సిందిగా,వారి తుది శ్వాస ఆగేంత వరకూ ధర్మసమ్మతమయిన వారి ప్రతి మాట వినాల్సిం దిగా తన అనుయాయుల్ని కోరుతుంది. ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది: ”నీ ప్రభువు స్పష్టంగా ఆజ్ఞాపించాడు-మీరు ఆయనను తప్ప మరొకరెవరినీ ఆరాధించకూడదు. తల్లిదండ్రుల యెడల ఉత్తమంగా వ్యవహరించాలి. నీ సమక్షంలో వారిలో ఒకరుగాని, ఇద్దరుగానీ వృద్ధాప్యానికి చేరుకొని ఉంటే వారి ముందు విసుగ్గా ‘ఉఫ్‌’ అని కూడా అనకు. వారిని కసురు కుంటూ మాట్లాడకు. పైగా వారితో మర్యాదగా మాట్లాడు”.  (బనీ ఇస్రాయీల్‌: 23)

బంధుత్వ సంబంధాల రక్షణ; 

ఇస్లాం బంధుత్వ సంబంధాలను పటిష్ఠ పరచమంటుంది. అమ్మానాన్నల తరఫు నుండి ఏర్పడే సంబంధాలను బల పర్చాలంటుంది. ఒకరు మనతో మంచిగుంటే మనం వారితో మంచిగుండటం కాదు, వారి మన పట్ల అనుచితంగా వ్యవహరించినా మనం వారి పట్ల ఉత్తంగా వ్యహరించడం, వారు మన నుండి తెగత్రెంపులు చేసుకున్నా మనం మాత్రం వారితో కలిసే ఉండటం సిసలయిన బంధుప్రీతి అంటుంది.

స్త్రీ రక్షణ; 

ఇస్లాం, ఆస్తిలో న్యాయబద్ధమయిన స్త్రీ వాటాను ప్రత్యేకంగా పేర్కొంటుంది. ఆమె హోదా, ఆమె బాధ్యతల దృష్ట్యా ఆమెకు దక్కాల్సిన హక్కును ఆమెకు ఇస్తుంది.
ఇస్లాం, స్త్రీపరుషుల మధ్య అన్ని విషయాలలో న్యాయబద్ధంగా వ్యహరిస్తుంది.
ఇస్లాం, స్త్రీకి తన జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే పూర్తి స్వేచ్ఛను ఇస్తుంది. పిల్లల అసలు పోషణ అమ్మ ఒడిలోనే సాధ్యం అంటుంది. అదే విధమయినటువంటి బాధ్యతల్ని ఆమెపై మోపుతుంది.
ప్రవక్త ముహమ్మద్‌ (స) ఇలా ఉపదేశించారు: ”మీలోనీ ప్రతి ఒక్కరూ కాపలాదారుడే…..స్త్రీ తన ఇంటికి కాపలాదారు. తన సంరక్షణలో ఉన్న వారి గురించి ఆమె జవాబుదారీ”. (బుఖారీ)
స్త్రీపురుషుల మధ్య గల సంబంధం పరస్పరం ఒండొకరిని బల పర్చేదిగా ఉండాలంటుంది ఇస్లాం, స్త్రీ రహిత పురుష సమాజ అభివృద్ధిగాని, పురుడు లేకుండా మహిళా సమాజ అభ్యుదయంగానీ పరిపూర్ణమవ్వదు అంటుంది. ఒక ఆరోగ్యకరమయిన సమాజానికి స్త్రీపురుషులిరువురి సహకారం, శ్రమ అవసరం అంటుంది.

భూత దయ: 

ఇస్లాం, సకల ప్రాణుల యెడల సాత్విక ప్రేమ, క్షమ, ఉపకార భావం ప్రతి వ్యక్తి మాటలోనూ, నడకలోనూ, నడవడికలోనూ కలిగి ఉండాలని ఉత్బోధిస్తుంది.ఇస్లాం, మూగ జమతువుల పట్ల మెతక వైఖరి, దయాభావం కలిగి ఉండాలంటుంది. ప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు: ”ప్రతి ప్రాణిలోనూ మీకు పుణ్యం ఉంది”. (బుఖారీ)

పర్యావరణ పరిరక్షణ: 

ఇస్లాం, మొక్కల్ని పెంచమంటుంది. భూమి పచ్చని పొలాలలో కళకళలాడాలంటుంది.బంజరు భూముల్ని పంట పొలాలుగా మార్చాలని హితవు పలుకుతుంది.”ప్రళయం ఇంకాసేపట్లో ముంచుకొస్తుందని నీకు తెలుస్తున్నా నీ చేతిలో మొక్క ఉంటే దాన్ని నాటెయ్యి”అంటుంది.  దీనికి భిన్నంగా భూమిని బంజరు నేలగా మార్చే ప్రక్రియల్ని, చర్యల్ని, లేదా భూమిని చెడు ఉత్పాదనల కోసం వినియో గించడాన్ని అది గర్హిస్తుంది. ఏ విషయంలోనయినా సరే దుబారా ఖర్చు కు దూరంగా ఉండమంటుంది. ప్రవక్త (స) ఇలా ఉపదేశించారు:  ”నువ్వు ప్రవహించే నది ఒడ్డున ఉన్నా సరే దుబారా ఖర్చు చేయకు”   (ముస్నద్‌ అహ్మద్‌)
 ఇస్లాం, దౌర్జన్యం, దుర్మార్గం, దురాక్రమణ, దమన నీతి, మరణించిన శత్రు శరాన్ని ముక్కలుగా నరకడం  నుండి వారిస్తుంది. అది ప్రతి విషయంలోనూ న్యాయానికి, ధర్మానికి, క్షమకి, విశాల భావానికి కట్టుబడి ఉండాటలంటుంది. సమాజంలోని పెద్దలు, వృద్ధులు, పిల్లలు, స్త్రీల పట్ల మర్యాద పూర్వకంగా మసలుకోవాలని అబిలషిస్తుంది.

ఇస్లాంలో దైవప్రవక్తలు 

ఇస్లాం, ప్రవక్తలందరి పట్ల విశ్వాసం కలిగి ఉండాలంటుంది. వారి మధ్య వివక్షకు తావు కల్పించకూడదంటుంది. వారిలో కొందరిని నమ్మి మరికొందరిని విశ్వసించకపోవడాన్ని అది అవిశ్వాస చర్యగా పరిగణిస్తుంది. ప్రతి జాతి వైపునకు అల్లాహ్‌ా ప్రవక్తను పంపాడని, అలా వేర్వేరు కాలాల్లో, వేర్వేరు జాతుల్లో వచ్చిన ఆ ప్రవక్తలందరూ సత్యప్రవక్తలని, దైవభీతిపరులని, నిజాయితీపరులని, మార్గదర్శకులని, వారి ఇవ్వబడి సందేశాలను సంపూర్ణంగా ఆయా జాతులకు అందజేశారు:
”మేము ప్రతి సముదాయంలోనూ ప్రవక్తను ప్రభవింపజేశాము. అతని ద్వారా (రపజలారా!) అల్లాహ్‌ాను మాత్రమే ఆరాధించండి. ఆయన తప్ప ఇతరత్రా మిథ్యా దైవాలకు దూరంగా ఉండండి”. (నహ్ల్‌: 36)
 ఏ ఒక్క ఆదేశాన్ని వారు దాచి పెట్టలేదని, మరే ఒక్క ఆదేశంలో హెచ్చు తగ్గులకు పాల్పడరాదని, తమ స్వయానికి లోబడి వారు ఏ మాట పలుక లేదని స్వయంగా అల్లాహ్‌ాయే కితాబు ఇచ్చాడు: ”కనుక ప్రవక్తల బాధ్యత మా సందేశాన్ని స్పష్టంగా అందజేయడం తప్ప మరొకటి లేదు”. (అన్నహ్ల్‌; 35)
|ఈ ప్రవక్తల పరంపరలో చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్‌ (స). కట్టకడపటి గ్రంథం ఖుర్‌ఆన్‌.ప్రయళం వరకూ వచ్చే ప్రజలందరికీ ఖుర్‌ఆన్‌ గ్రంథం మార్గదర్శకం, ప్రవక్త (స) వారి జీవితమే ఆదర్శం.

ప్రవక్త ఈసా-యేసు (అ) పట్ల ముస్లింల విశ్వాసం

నిశ్చయంగా ఆయన పుణ్య స్త్రీ అయిన మర్యమ్‌ కుమారుడు. ఆమె సద్గుణవతి, దైవబీతిపరురాలు, సత్యవతి, సౌశీలవతి, అల్లాహ్‌ా విధేయురాలయిన కన్య. ప్రవక్త ఈసా (అ) పురుష సంపర్కం లేకుండానే అల్లాహ్‌ా ఆజ్ఞ  మేరకు ఆమె కడుపున జన్మించారు అని ప్రతి ముస్లిం విశ్వసిస్తాడు.
ప్రవక్త ఈసా (అ) మరియు అంతిమ దైవప్రవక్త ముహమ్మద్‌ (స) మధ్య మరే ప్రవక్తా లేడు అని  ప్రతి ముస్లిం నమ్ముతాడు.
ముస్లిం అయిన ప్రతి వ్యక్తి, ప్రవక్త ఈసా (అ) వారి చేతుల మీదుగా జరిపించిన మహత్కార్యాల్ని, మహిమల్ని – పుట్టు గుడ్డిని బాగు చేయడం, కుష్టు రోగిని బాగు చేయడం, మృతులను బతికించడం, ప్రజలు వారి వారి ఇళ్ళల్లో ఏమి కూడ బెడతారో, ఏమి తింటారో తదితర విషయాల గురించి అల్లాహ్‌ ఆజ్ఞతో తెలయజేయడం వంటి వాటిని నమ్ముతాడు.
ప్రవక్త ఈసా (అ) వారు హత్య చెయబడలేదు, శిలువా ఎక్కించబడలేదు అని, వాస్తవంగా అల్లాహ్‌ా ఆయన్ను కాపాడి సజీవంగా, సశరీంగా తన వైపునకు ఎత్తుకున్నాడని నమ్మడంతోపటు, ఆయన్ను హతమార్చాలని కుట్ర పన్నిన యూదులు అపోహకు గురి చేయబడ్డారని, వేరెవరినో హత్య చేసి ప్రవక్త (స)ను హత్య చేసినట్లు భ్రమకు గురి చెయ్యబడ్డారని నమ్ముతాడు.

ఇస్లాం స్వీకరించాలంటే ఏం చేయాలి? 

వ్యక్తి ఎవరయినా, ఏ భాష, ఏ రంగు, ఏ ప్రాంతానికి చెందినవాడయినా మనసా, వాఛా, కర్మణా సాక్ష్య వచనాలు పలికి  ఇస్లాం ఛత్రఛాయల్లోకి రావచ్చు. ”అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్‌ా వ అష్హదు అన్న ముహమ్మదర్రసూలుల్లాహ్‌” – అల్లాహ్‌ తప్ప నిజ ఆరాధ్యుడెవడూ లేడని నేను సాక్ష్యమిస్తున్నాను. ముహమ్మద్‌ (స) అల్లాహ్‌ా ప్రవక్తని సాక్ష్యమిస్తున్నాను”.
ఈ వచనాల్ని మనస్ఫూర్తిగా పలికి మీదట సదరు వ్యక్తి గతం పట్ల పశ్చాత్తాపం చెంది, జీవితంలో మళ్ళి గతించిన నిర్వాకాల జోలికి వెళ్లబొనని ప్రతీన బూని స్నానమాచరించాలి. ఆనక ఇస్లాం మూలాధారాలయి అయిదు విషయాలను క్రియా రూపం ఇచ్చేందుకు కంకణం కట్టుకోవాలి.
1) ”అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్‌ా వ అష్హదు అన్న ముహమ్మదర్రసూలుల్లాహ్‌ా” అని సాక్ష్యమివ్వడం.
2) నమాజును స్థాపించడం
3) జకాతును చెల్లించడం,
4) రమజాను పూర్తి మాసపు ఉపవాసాలు ఉండటం,
5) స్థోమత కలిగిన వ్యక్తి హజ్జ్‌ చేయడం.
 ”ఇస్లాం ఉపమానం వాన వంటది. దాన్ని స్వీకరించి సత్కర్మలు చేసిన వ్యక్తి సారవంతమయిన నేలను పోలి ఉంటాడు.  దాన్ని తిరస్కరించిన వ్యక్తి వాన కురిసినా  ఎలాంటి పంటను అందించని రాతి నేలను పోలి ఉంటాడు” అన్నారు ప్రవక్త (స).

మధ్యస్థ సమాజం


‘మధ్యే మార్గం’-నేడు సంఘ సంస్కర్తల, ధర్మ పండితుల, రాజకీయ నాయ కుల, ఆస్తికుల, నాస్తికుల, జాతీయ-అంతర్జాతీయ సంస్థల నోళ్ళ మీద నాను తున్న ఏకైక పదం. ఎవరు ఏ అర్థంలో ఈ పదాన్ని వాడుతున్నారో ఆయా వ్యక్తుల మేధకే అప్పగించి అసలు మధ్యే మార్గం దేన్నాంరో, మధ్యస్థ సమాజం ఏదో తెలుసుకుమదాం!
మధ్యే మార్గం అంటే, రెండు వ్యతిరేక విషయాలలో ఏ ఒక్క వైపు మొగ్గకుండా, ఏ ఒక్కదానికీ ప్రభావితం కాకుండా, మరే ఒక్క విషయాన్ని విస్మరించకుండా సమతూకాన్ని పాిస్తూ సమస్యకు సరైన పరిష్కారం వెతకడం. ‘సమతులనం’లో న్యాయం అన్నది అత్యంత కీలమయిన పాత్ర పోషిస్తుంది, పోషించాలి. గత జాతుల, జన పదాల పరిణామం వల్ల మనకు అవగతమయ్యేదేమిటంటే, వారిలో సమతుల్యం, సమతూకం లోపించడం వల్లనే అవి చేదు ఫలాన్ని చవి చూడాల్సి వచ్చింది. అందుకనే అల్లాహ్‌ా మనుషుల్ని నీతిమంతులు, సుశిక్షితులుగా చేసి వారి జీవితాలను పునీతం చేయడానికి అంతిమ దైవ ప్రవక్త (స) ముహమ్మద్‌ (స) వారికి ఇస్లాం అనే మధ్యే మార్గాన్ని ప్రసాదించి ప్రభవింపజేశాడు. దాన్ని నమ్మి నడుచుకునే సముదాయాన్ని ‘మధ్యస్థ సముదాయం’గా, ‘న్యాయశీల సమాజం’గా అభివర్ణించడం జరిగింది. ”అదే విధంగా మేము మిమ్మల్ని మధ్యస్థ సమా జంగా చేశాము. మీరు ప్రజలపై సాక్షులుగా, ప్రవక్త మీపై సాక్షిగా ఉండటం కోసం”. (దివ్యఖుర్‌ఆన్‌-2: 143)
ముస్లింలు చేసే దుఆలలో అయిదు పూటల నమాజులో చేసే దుఆ ‘ఇహ్‌ాది నస్సిరాతల్‌ ముస్తఖీమ్‌ – (దేవా!) మాకు రుజు మార్గం చూపించు’ (ఫాతెహ;౬ ) అన్నది ప్రధానమయినది. ఇలా వేడుకోమని ఎందుకు అనడం జరిగిందంటే మనిషి నిత్యం రెండు అతివాదాల నడుమ కొట్టుమ్టిడుతుాండు. అతను సవ్యమయిన బాటన, మధ్యే మార్గాన నడవాలంటే స్వీయ అన్వేషణతోపాటు దేవుని కృపాకటాక్షాలు సయితం తోడవ్వాలి, అప్పుడే అతను సత్యాన్ని కను గొనడమే కాక సత్య బాటన చివరి శ్వాస వరకు స్థిరంగా నిలబడ గలడు. పూర్వం ఈ మధ్యే మార్గాన్ని అల్లాహ్‌ా యూదులు మరియు క్రైస్తవులకు అనుగ్రహించాడు. కానీ వారిలో ఒకరు – యూదులు తెలిసి మార్గభ్రష్టులయి దైవాగ్రహానికి గురయితే, మరొకరు- క్రైస్తవులు తెలియక మార్గం తప్పి దైవానుగ్రహానికి దూరం అయ్యారు. ఆది మానవుడు ప్రవక్త ఆదమ్‌ (అ) మొదలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్‌ (స) వరకూ ఒక లక్ష 24 వేల మంది ప్రవక్తలు అనుసరించి, మానవాళికి ప్రబోధించిన మార్గమే ఇస్లాం. కనుకనే సమస్త మానవాళిని ఉద్దేశించి అల్లాహ్‌ా ఇలా ఉపదేశిస్తున్నాడు: ”నిశ్చయంగా నా రుజు మార్గం ఇదే. కనుక మీరు దీనిపైనే నడవండి. వేరే మార్గాలను అనుసరించకండి. ఎందుకంటే అవి మిమ్మల్ని ఆయన మార్గం నుండి తొలగించి వేరు పరుస్తాయి. మీ ప్రభువు మీకు చేసిన హితోపదేశం ఇదే. మీరు వక్ర వైఖరిని దూరంగా మసలుకుాంరని ఆశించ బడుతోంది”. (దివ్యఖుర్‌ఆన్‌-6: 153) ఇక ఇస్లాం మనిషికి బోధించే మధ్యే మార్గానికి సంబంధించిన కొన్ని కోణాలను తెలుసకుందాం.

విశ్వాసంలో మధ్యే మార్గం:

ఇస్లాం బోధించే విశ్వాసాలు, ఆచరణలు సమస్తం సమతుల్యం గలవే. ఇస్లాం మానవాళిని ఒకే ఒక్క నిజ ఆరాధ్యుని వైపునకు ఆహ్వానిస్తుంది. అందులో నాస్తిక భావానికి చోటు లేదు. బహుదైవ భావనకు స్థానం లేదు. ఈ రెండు అతి వాదాల నడుమ ఆది నిర్ధేశించే మధ్యే మార్గం సృష్టికి కర్త ఉన్నాడు, ఆయన ఒక్కడే; ఆయనే అల్లాహ్‌ అన్నది.

ప్రవక్తలు, పుణ్య పురుషులు, దైవ దూతల విషయంలో మధ్యే మార్గం:

పుణ్య పురుషులు, దైవప్రవక్తలు, దైవ దూతల విషయంలో లేని పవిత్రతను వారికి అంట గట్టడంగానీ, ఉన్న గౌరవాన్ని ఊడబెరకడంగానీ ఇస్లాం చేయదు. దేవుడు ఏ స్థితిలోనయితే వారిని ఉంచాడో ఆ నిజ స్థితిలోనే వారిని గుర్తిస్తుంది. ఏ స్థానంలోనయితే అల్లాహ్‌ా వారిని కూర్చోబ్టెాడో ఆ స్థాయి గౌరవం మాత్రమే వారికిస్తుంది. ఇస్లాంలో కేవలం మనిషి పంచేంద్రియాల పరిధిలోకొచ్చే విశ్వాసాలు మాత్రమే లేవు. అలాగని అన్నీ హేతువుకందని విష యాలూ కావు.

ఆరాధనలో మధ్యే మార్గం:

ఇస్లాం సన్యాస సహిత ధర్మమూ కాదు, అలాగని ప్రపంచానికి మాత్రమే ప్రధాన్యతనిచ్చే జీవన విధానమూ కాదు. ఇహం-పరలోక పంట పొలం అం టుంది ఇస్లాం. అది ఇహపరాల మేలు కలయిక గల ఏకైక ధర్మం. ఇమామ్‌ అలీ (ర) ఇలా అన్నారు: ”విశ్వాసికి మూడు వేళలు ఉన్నాయి. ఒక వేళలో అతను తన ప్రభువు వేడుకుాండు. ఒక వేళలో అతను జీవనోపాధి కోసం పరిశ్రమిస్తాడు. ఒక వేళలో తన స్వయం సంస్కరణ కోసం, స్వీయ కుటుంబ సుశిక్షణ కోసం కేయిస్తాడు”. ఇహం మరియు పరానికి మధ్య సమతుల్యాన్ని పాటించే సూక్తులు ఖుర్‌ఆన్‌లో అనేకం ఉన్నాయి:
”అల్లాహ్‌ నీకు ప్రసాదించిన దానితో పరలోక స్థానాన్ని కూడా అన్వేషించు. మరియు నీ ప్రాపంచిక భాగాన్ని కూడా మరువకు”. (అల్‌ ఖసస్‌: 77)
”ప్రజల్లొ కొందరు- ప్రభూ! మాకు ప్రపంచంలోనూ మేలును ప్రసాదించు. పరలోకంలోనూ మేలును ప్రసాదించు. ఇంకా మమ్మల్ని నరకాగ్ని శిక్ష నుండి కాపాడు” అని ప్రార్తిస్తారు. (అల్‌ బఖరహ్‌: 201)
”తన ఇహాన్ని బాగు చేసుకునే నిమిత్తం తన పరాన్ని పాడు చేసుకున్న వాడు బుద్ధిమంతుడు కాదు” అని ఓ సందర్భంలో అంటే, ”తన పరం కోసం ఇహాన్ని పూర్తిగా త్యజించేవాడు, తన పరాన్ని బాగు చేసుకునే నిమిత్తం ఇహాన్ని పూర్తిగా విడనాడే వాడు మీలో ఉత్తముడు కానేరడు. రెండింకి సమతూకాన్ని పాటించేందుకు ప్రయత్నించాలి. పరానికి చేర్చే సాధనమే ఇహం. కాబ్టి ప్రజల మీద భారంగా తయారవ్వకండి” అన్నారు ప్రవక్త ముహమ్మద్‌ (స).
ఇదే నియమాన్ని అల్లాహ్‌ా సకల ఆరాధనలకు వర్తింపజేశాడు. నమాజు గురించి ఆదేశిస్తూ – ”ఓ విశ్వాసులరా! శుక్రవారం నాడు నమాజు కొరకు అజాన్‌ (పిలుపు) ఇవ్వబడినప్పుడు, మీరు అల్లాహ్‌ా ధ్యానం వైపునకు త్వర పడండి. క్రయావిక్రయాలను వదలి పెట్టండి. మీరు గనక తెలుసుకోగలితే ఇది మీ కొరకు ఎంతో మేలైనది”. (జుముఅహ్‌ా: 9) తర్వాత ఇలా అనబడింది: ”మరి నమాజు ముగిసిన తర్వాత భూమిలో విస్తరించి, అల్లాహ్‌ా అనుగ్రహాన్ని అన్వేషించండి. ఎక్కువగా అల్లాహ్‌ను స్మరిస్తూ ఉండండి. తద్వారా మీరు సాఫల్యం పొందవచ్చు”. (జుముఅహ్‌: 10)
మహారాధన అయిన హజ్జ్‌ గురించి ప్రస్తావిస్తూ – ”ఆ తర్వాత మీరు వాిని తినండి. దుర్భర స్థితిలో ఉన్న అగత్యపరులకు కూడా తినిపించండి”. (హజ్జ్‌: 28)

నడవడికలో మధ్యే మార్గం:

ఇస్లాం మానవ సమాజ అభ్యుదయానికి పనికొచ్చే ఉన్నత నైతిక ప్రమాణాలను బోధిస్తుంది. అది దౌర్జన్యాన్ని ఎండ గ్టినట్లే పిరికితనాన్ని సయితం నిరశిస్తుంది. ఈ రిెంకి మధ్య గల ధీర గుణాన్ని బోధిస్తుంది. అది దుబారా ఖర్చుకి నిరసించినట్లే, పిసనారితనాన్ని సయితం ఎండ గడుతుంది. ఈ రిెంకీ మధ్య ఉన్న మంచి గుణం దానశీలతను అది ప్రోత్స హిస్తుంది.

ధర్మశాస్త్రంలో మధ్యే మార్గం:

శిక్షా బహుమానాల విషయంలో సయితం ఇస్లాం మధ్యే మార్గాన్ని అనుసరి స్తుంది. యూదులు లేని పోని ఆంక్షల్ని తమపై విధించుకున్న కారణంగా వారిలో నిషేధితాలు అధికమయ్యాయి. క్రైస్తవులు అనవసరమయిన వెసులు బాటు వెంపల్రాటలో గత శాస్త్రాల్లోని అనేక నిషేధిత విషయాలను ధర్మసమ్మ తం చేసుకున్నారు. ఇస్లాం మనిషి మనుగడకు అవసరమయిన వాిని ధర్మ సమ్మతం చేసింది. మనిషి మనుగడకు గొడ్డలిపెట్టు కాగలిగే వాిని నిషేధిం చింది. హలాల్‌, హరామ్‌లను నిర్ణయించే ఆధికారాన్ని అది మనిషికి ఇవ్వ లేదు. అది కేవలం అల్లాహ్‌ా అధికారం అంటుంది. ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది: ”ఆ ప్రవక్త వారిని మంచిని చెయ్యమని ఆదేశిస్తాడు. చెడుల నుండి వారి స్తాడు. పరిశుద్ధ వస్తువులను ధర్మసమ్మతంగా ప్రకిస్తాడు. అశుద్ధమైన వాిని నిషిద్ధంగా ఖరారు చేస్తాడు”. (అరాఫ్‌: 157) ఒక్క మాటలో చెప్పాలంటే ఇస్లాం అదేశించని మంచి లేదు. ఇస్లాం వారించని చెడు లేదు. ఇస్లాం కేవలం నైతిక కోణాన్ని మాత్రమే తీసుకోదు. సామాజిక కోణాల్ని సయితం అది తీసుకుంటుంది. వివాహ విషయాన్ని తీసుకున్నట్లయితే, కొందరు లెక్కలేనంత మందిని వివాహమాడొచ్చు అని తీర్మానించుకుంటే, మరికొందరు అసలు వివాహ అవసరమే లేదు, ఉన్నా ఎవరికి ఎంత అవసరం ఏర్పడినా ఒక్క భార్యతోనే సరి పెట్టుకోవాలి అంటారు.  ఇస్లాం ఈ రెంటికి మధ్య మధ్యే మార్గాన్ని సూచిస్తుంది.

ఆర్థిక రంగంలో మధ్యే మార్గం:

ఇస్లాం వృధా ఖర్చుని నిషేధించినట్లే పిసినిగొట్టుతనాన్ని సయితం నిషేధి స్తుంది. ఖుర్‌ఆన్‌లోని పలు ఆయతులు ఈ విషయాన్ని విశద పర్చాయి. ”వారు ఖర్చు పెట్టే సమయంలో కూడా అటు మరీ దుబారా ఖర్చు చేయ కుండా, ఇటు మరీ పిసినారితనం కూడా చూపకుండా రెండికీ మధ్య సమతూకాన్ని పాిస్తారు”. (అల్‌ ఫుర్‌ఖాన్‌: 67) వేరోక చోట ఇలా ఆదే శించబడింది:”నీ చేతిని నీ మెడకు క్టి ఉంచకు. అలాగని దానిని విచ్చలవిడి గానూ వదలి పెట్టకు. అలా నువ్వు చేశావంంటే నిందల పాలవుతావు. దిక్కు మాలిన స్థితికి లోనయి కూర్చుాంవు”. (ఇస్రా; 29)
అలాగే వ్యాపార లావాదేవీల్లో కొలచి ఇచ్చినా, తూకం చేసి ఇచ్చినా పూర్తిగా ఇవ్వాలని, మోసానికి పాల్పడ రాదని ఉపదేశిస్తుంది. పుచ్చుకునేటప్పుడు పూర్తిగా పుచ్చుకుని, ఇచ్చేటప్పుడు మాత్రం తగ్గించి ఇచ్చే ఈ జాఢ్యం ఎంత భయంకరమయినదంటే దాని వాతన పడిన జాతులు ఆర్థిక దోపిడికి, శ్రమ దోపిడి పాల్పడి నైతికంగా దీవాలా తీయడమే కాక, ఒక్కో సందర్భంలో ఆయా భాధిత ప్రజల ఆగ్రహ జ్వాలల్లో మాడి మసవుతూ ఉంారు. అందుకే అల్లాహ్‌ా ఇలా తాకీదు చేశాడు: ”కాబ్టి మీరు కొలతలు, తూనికలలో ఖచ్చి తంగా వ్యవహరించండి. ప్రజలకు వారి వస్తులను తగ్గించి ఇవ్వకండి. సంస్క రణ జరిగిన తర్వాత భూమిలో అల్లకల్లోలాన్ని సృష్టించకండి. మీరే గనక విశ్వాసులే అయితే ఇందులోనే మీ మేలు ఉంది”. (అల్‌ ఆరాఫ్‌: 85) అంతే కాదు అలా చేసే వారికి వినాశనం తప్పదని హెచ్చరిస్తుంది కూడా: ”కొలతల్లో, తూనికల్లో తగ్గించి ఇచ్చేవారు నాశనమవుదురు గాక! వారు ప్రజల నుండి కొలచి తీసుకున్నప్పుడు మాత్రం పూర్తిగా-ఖచ్చితంగా తీసుకుాంరు. కానీ వారికి కొలచి గానీ, తూకం వేసిగానీ ఇచ్చేటప్పుడు మాత్రం తగ్గించి ఇస్తారు”. (అల్‌ ముతఫ్ఫిఫీన్‌: 1-3)

వ్యక్తిగత విషయంలో మధ్యే మార్గం:

ఈమాన్‌ మరియు ఆమల్‌ – విశ్వాసం మరియు ఆచరణ అవిభాజ్యాలు. ఒకదాన్ని వదిలి మరొకి లేదు. విశ్వాస రహిత ఆచరణ, ఆచరణ రహిత విశ్వాసం రెండూ ఫల శూన్యమే. విశ్వాస రహిత ఆచరణ, ఆచరణ రహిత విశ్వాసం మనిషిని కాంక్షా దాసునిగా మార్చి వేస్తాయి. అతను ఏది చేసినా తన మనో వాంఛల్ని అనసరించి చేస్తాడు. అందులో ధర్మానికి, దైవాభీష్టానికి తావుండదు. మనిషి సంఘంలోని భాగం గనక సంఘానికి సేవ చేసుకోవాలి. సంఘాన్ని తన చుట్టు తిప్పుకునే ధోరణిని వీలైనంత త్వరగా స్వస్థి పలకాలి. దైవ ప్రవక్త (స) ఇలా అన్నారు: ”జ్ఞానం మూడు రకాలు. అది తప్పితే మిగతాది వ్యర్థం. యుక్తితో కూడిన మాట. ప్రయోజనకరమయినా ఆచరణ. న్యాయ బద్ధమయిన విధి”.  ఇక ఎవరయితే మాటలకు-చేతలకు మధ్య వైరుధ్యం కలిగి ఉంటూ నీతులు చెబుతూ నీచంగా బతుకుతారో అలాిం వారిని ఇస్లాం గ్టిగానే మంలించింది: ”ఓ విశ్వాసులారా! మీరు చేయని దాని గురించి ఎందుకు చెబుతారు. మీరు చేయని దాన్ని గురించి చెప్పడం అల్లాహ్‌ా సమక్షంలో ఎంతో గర్హించదగినది”. (అస్‌ సఫ్ప్‌: 2,3) అలాగే స్వీయ సంస్కరణలో పడి సమాజాన్ని విస్మరించడం, సమాజ సంస్కరణలో పడి స్వయాన్ని ఖాతరు చేయక పోవడం – రెండింనీ ఇస్లాం ఖండిస్తుంది. ఏక సమయంలో మనిషి స్వీయ సంస్కరణ, పోషణపై కూడా పాటు పడాలి. అదే సమయంలో సంఘ సంస్కరణ, పోషణను సయితం విస్మరించ కూడదు.

యాజమాన్య హక్కు; 

పెట్టుబడి దారి వ్యవస్థ మనిషి జీవితాన్ని మాత్రమే కేంద్ర బిందువుగా చేసి అతన్ని పచ్చి స్వార్థపరునిగా మార్చి వేస్తే, కమ్యూనిజం సమాజాన్ని మాత్రమే కేంద్ర బిందువుగా పేర్కొంటుంది. ఈ సిద్ధాంతాలు పరిస్థితుల్ని బ్టి రూపొం దాయి అనడంలో సందేహం లేదు. వీటిలో ఒకటి  అతి వృష్టి అయితే మరొకటి  అనావృష్టి. ఇస్లాం ఈ రెండు అతి వాదాలకి నడుమ మధ్యే మార్గాన్ని సూచిస్తుంది. వ్యక్తిగత స్వేచ్ఛ మరియు సమాజ ప్రయోజనాల్ని నడమ సమ తూకాన్ని పాటించాల్సిందిగా ఆదేశిస్తుంది. అది మనిషి వ్యక్తిగత ఆస్తి పాస్తులు కలిగి ఉండే అధికారాన్ని అంగీకరించడంతోపాటే అవి అతనికి దైవం ప్రసాదించిన అమానతుగా పేర్కొంటుంది. వాటిని ప్రజా సంక్షేమ మార్గాల్లో ఖర్చు పెట్ట వలసిందిగా పురిగొల్పుతుంది. ఇస్లాం మనిషి రక్తం చిందించడాన్ని నిషేధించి అతనికి జీవించే హక్కునిచ్చింది. మనిషి మానాన్ని పవిత్రమయినదిగా ప్రకించి మనిషికి దక్కాల్సిన గౌరవాన్ని అతనికిచ్చింది. మనిషి ధనాన్ని అన్యుల కోసం నిషేధించి అతనికి యాజమాన్య హక్కు ప్రసా దించింది. మనిషి గృహ, కుటుంబ జీవనానికి పవిత్రతను ఇచ్చి అతని ఒక చోట స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే వెసులుబాటును అందించింది. ఇస్లాం లో ప్రతి వ్యక్తి కాపలాదారుడే. అతని పోషణ క్రింద ఉన్న వారి గురించి అతన్ని ప్రశ్నిచడం జరుగుతుంది.

పరస్పర సంబంధాలలో మధ్యే మార్గం:

ఇస్లాం పరస్పర సంబంధాలను స్పష్టమయిన పునాదుల మీద నిర్మించ గోరుతుంది. అందులో గుడ్డి అభిమానానికి తావు లేదు. వ్యర్థ వైరానికి చోటు లేదు. ప్రజలు కేవలం అల్లాహ్‌ ప్రసన్నతను కోరుతూ పరస్పరం అభిమా నించుకోవాలంటుంది. అలా అభిమానించుకోవడం విశ్వాసపు అత్యుత్తమ స్థాయిగా పేర్కొంటుంది. ”నీ సోదరుడు దుర్మారుగడయినా, దౌర్జన్యానికి గురయిన బాధితుడయినా అతనికే వత్తాసు పలుకు” అన్న అజ్ఞాన కాలపు నానుడికి అది ఇచ్చిన కొత్త భాష్యం – ”నీ సోదరుడు భాధితుడయితే నువ్వు అతని పక్షాన నిలబడి అతనికి బలాన్నివ్వు, ఒకవేళ నీ సోదరు దౌర్జన్యపరు డయి ఉంటే అతను ఆ దుర్మార్గానికి పాల్పడకుండా అతని చెయ్యి పట్టుకొని ఆపు” అన్నది. ఒక్క మాటలోచెప్పాలంటే, రంగం అది ఆర్థికమయినా, ఆధ్యాత్మికమయినా, జాతీయమయినా, అంతర్జాతీయం అయినా, వ్యక్తిగతం అయినా సామాజికం అయినా అన్ని రంగాల్లో, అన్ని అంగాల్లో అందరూ ఆచరించగిగే మధ్యే మార్గాన్ని ఇస్లాం బోధిస్తుంది. అది సర్వకాల, సర్వావస్థల యందు సమస్త మానవాళికి సరయిన దిశా నిర్దేశం చేసి సాఫల్య బాటన నడిపించి ఇహపరాల్లో తిరుగు లేని విజేతలుగా నిలబెడతుంది. అటువిం బృహత్తర ధర్మంలో, మహత్తర జీవన విధానంలో మళ్ళీ మధ్యే మార్గానికై దారులు వెతకడం ఎంత అవివేకమో బుద్ధిజీవులకు తెలియనిది కాదు.