Saturday, August 31, 2024

ہمارے پیارے اسلاف کی تین پیاری باتیں / Three lovely sayings of our belo...

దేశకాలాలు దైవాధీనం - మొదటి భాగం - The choice of time and place is for God alone

నీ ప్రభువు తలచుకున్నదాన్ని సృజిస్తాడు. తాను కోరిన వ్యక్తిని (ప్రవక్తగా) ఎంచుకుంటాడు. ఈ ఎంపిక వీరు చేయవలసిన పని కాదు. వారికా అధికారం లేదు. వారు చేస్తున్న బహుదైవారాధనకు అల్లాహ్ ఎంతోఅతీతుడు, ఉన్నతుడు, పరమపవిత్రుడు. (అల్-ఖసస్: 68) సర్వలోక సృష్టికర్త, సృజనశీలుడు, భమ్యా శాశాలకు ఉనికినిచ్చాడు సూర్యచంద్రాది లోకాలను పుట్టించాను. రోజులు, వారాలు, నెలల పరంపర కాలాన్ని పరిచయం చేసింది. భూన్యూకాశాలు ప్రదేశంగా పేర్కొనబడ్డాయి. సూర్యచంద్రులు కాలంగా పరిగణించ బడ్డాయి. సూర్యచంద్రుల ద్వారా సమయాన్ని కేటాయించడం జరిగింది. "ఆయనే సూర్యుడ్ని తేజోవంతంగా, చంద్రుడ్ని కాంతిమంతంగా చేసినవాడు. మీరు తేదీలు, సంవత్సరాల లెక్క తెలుసుకోవడానికి చంద్రకళల్ని నిర్దేశించినవాడు కూడా ఆయనే. ఇదంతా దేవుడు ఒక మహోన్నత లక్ష్యంకోసం సృష్టించాడు. ఆయన గ్రహించే వారికోసం తన నిదర్శనాలు విడమరచి తెలియజేస్త్తున్నాడు. దేవునికి భయపడే వారి కోసం రేయింబవళ్ళ చక్రభ్రమణంలో అనేక నిదర్శనాలున్నాయి. అసలు భూమ్యాకాశాల్లో ఆయన సృష్టించిన ప్రతి వస్తువులోనూ (ఆయన ఉనికిని, ఏకత్వాన్ని చాటే అనేక) నిదర్శనాలున్నాయి. (యూనుస్: 5-7)
మేము రాత్రిని, పగటిని రెండు సూచనలుగా చేశాం. రాత్రి సూచనను (మీ విశ్రాంతి కోసం) చీకటిమయంగా చేశాం. అలాగే మీరు మీప్రభువు అనుగ్రహం(ఉపాధి) అన్వేషించడానికి; నెలలు, సంవత్సరాల లెక్క తెలుసుకోడానికి మేము పగటిని ప్రకాశ వంతంగా చేశాం. ఇలా మేము ప్రతి విషయాన్నీ స్పష్టంగా విశదీకరించాం. (అనీణస్రాయీల్: 12) కాలం అంటే ఏమిటి? పరలు, విలిప్తలు, లిప్తలు, విఘడియలు, ఘడియలు, నిమిషాలు, ముహూర్తాలు, గంటలు, ఝాములు, రోజులు, వారాలు, పక్షాలు, ఋతువులు, నెలలు, అయనాలు, సంవత్సరాలు, దశాబ్దాలు, పుష్కరాలు, శతాబ్దాలు, సహస్రాబ్దాలు. కాలం అంటే ఏమిటి? క్షణం కూడా కాలమే. యుగం కూడా కాలమే. జీవితం కూడా కాలమే, ప్రపంచమూ కాలమే. మనిషికి కావలిసింది కాలం మనిషి వెలకట్టలేని సంపద కాలం. మనిషి సంపాదించలేని ధసం కాలం. అలాంటి కాలాన్ని మనిషికి ప్రసాదించాడు ప్రభువు.. అలాగే భూమ్యాకాశాలు, మార్యచంద్రులు, పర్వతాలు, నముద్రాలు, సృష్టి సర్వమూ ఒక ఎత్తయితే ఒక మానవుడే మరో ఎత్తు. సృష్టి సామ్రాజ్యంలోని ప్రచండశక్తులన్నీ పృథ్వి మీద ఉన్న 'అల్ప' జీవి 'సేవ కొరకు మాత్రమే సృజించబడ్డాయి. ఇంకా అందమైన ముఖం, పొందికయిన అంగ సౌష్టవం, ఆరోగ్యవంతమైన శరీరం-మానవునికి దేవుడు ప్రసాదించిన వరాలు..ఇవి మనిషి తాను కోరి, ఎంచుకున్న వరాలు కావు, కోరుకున్నా, పొందాలని ప్రయత్నించినా. లభించేవి అంతకన్నా కావు. వద్దనుకుంటే పోయేవీ కావు. ఇవి సృష్టికర్త ఇచ్చిన వరప్రసాదాలు. ఆ ప్రభువు మనకు ఈ శరీరాన్నేకాదు, ఈ ప్రపంచాన్ని అనుగ్రహించాడు. తనకు ఇష్టమైనరీతిలో ఈ శరీరాన్ని, దాని ప్రతి అంగాన్నీ, ప్రతి అవయవాన్నీ వాడుకునే అధికారమిచ్చాడు. అంతేకాదు తన ఆధీనంలో ఉంచిన ఈ ప్రపంచాన్ని సయితం మన ఇచ్చ ప్రకారం వినియోగించుకునే స్వేచ్చనూ ప్రసాదించాడు. కేవలం ఈ స్వేచ్చా స్వాతంత్రాలే వాటికి తగ్గ శక్తి సామర్ధ్యాలను వనరుల్ని, సాధన సందత్తినీ ఇచ్చాడు. వీటన్నింటిని వినియోగించుకునే బుద్ధి బలాన్ని కూడా ప్రసాదించాడు. ఆ తరువాత ఐలా అన్నాడు. నీ ప్రభువు తలచుకున్నదాన్ని సృజిస్తాడు. తాను కోరిన వ్యక్తిని (ప్రవక్తగా) ఎంచు కుంటాడు. ఈ ఎంపిక వీరు చేయవలసిన పనికాదు. వారికా అధికారం లేదు. వారు చేస్తున్న బహుదైవారాధనకు దేవుడు ఎంతోఅతీతుడు, ఉన్నతుడు, పరమపవిత్రుడు. (అల్-ఖసస్: 68) ఇలా తన ప్రమేయం లేకుండా, తనకు తెలియకుండానే లభించిన తన ఈ ఆకృతిని, అంగాంగాలను, అనుగ్రహాలను, బుద్ధి వివేకాలను చూసుకుని ఆనందస్తూ అడగకుంగానే తనకు వీటికిచ్చిన కర్తను, స్వామిని, తన నిజప్రభుపుడు మరిచి పోతున్నాడు. మనిషి ఆయన గీసిన హద్దుల్ని విప్సిగ్గుగా జవదాటడానికి ప్రయత్నిస్తున్నాడు. మనిషి ఈ వ్యతిరేకత జీవిత ఇతర రంగాలలోనే కాక దేశకాలాల విషయంలోను కనబడుతుంది. సృష్టి విషయంలోగాని.. కాలం విషయంలోగాని, ప్రత్యేక స్థలాన్ని ఎంచుకునే విషయంలోగాని మానవులకు ఏ విరమైనటువంటి అధికారంలేదు. అది వారి పనికూడా కాదు అని ఆ సర్వోన్నతుడు సెలవిస్తుంటే... మనిషి మాత్రం తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ "పరము జగడాలమారి'' అన్పించుకుంటున్నాడు. మట్టితో మనిషిని, అగ్నిలో జిన్నులను, వెలుగుతో దైవదూతలను వృష్టించిన సృజనకారుడు - ఈ పుడమిపై తన ప్రాతినిథ్య నిమిత్తం మనిషిని ఎన్నున్నాడు. బుద్దీ వివేకాల్ని అనుగ్రహించడంతో పాటు మానవ సమాజానికే చెందిన కొందర్ని తన ప్రవక్తలుగా, సందేశహరులుగా ఎన్నుకొని- పర్వమానవాళి సంక్షేమం నిమిత్తం, లోకశాంతి కోసం దైవగ్రంథాల్ని అవతరింపజేశాడు. అలా సర్వమానవాళికి మార్గదర్శకులుగా వచ్చిన ప్రవక్తల సంఖ్య ఇంచు మించు 1లక్షా 24 వేలు. అంటే ప్రవక్తలు అనే ఈ వర్గం ఇతర ప్రజలకన్నా శ్రేష్టులు, పాపరహితలు, వారి ఈ ఎంపిక సైతం ఆ కృపాసాగరుడు చేసినదే. రసూల్ల (సందేశహరుల) సంఖ్య 315 మంది, 315 మంది ప్రవక్తలలో అగ్రజులు అయిదుగురు. వీరినే 'ఒల్లు అజ్మ్ మినర్రుసుల్ అంటారు. వారికి ఈ ఉత్తమ స్థారావు ఇచ్చినవాడూ ఆ శుభకరుడే. వారి పేర్లు ఇలా హజ్రత్ నూహ్ (స), హజ్రత్ ఇబ్రాహీమ్ (స), హజ్రత్ మూసా (స) హజ్రత్ ఈసా (స), అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అదైహనపల్లం), ఐదు మంది వజ్ర సంకల్పం గల ప్రవక్తల్లో ఉత్తమోత్తము స్థానం అంతిను ప్రవక్త ముహమ్మద్ (స) గారిది. ఆయనకు ఈ ఘనకీర్తని అనుగ్రహించిన ఆ దయాసాగరుడే ఇలా అన్నాడు: (ప్రజలారా!) ముహమ్మద్(ఇ) మీ పురుషు ల్లోని ఎవరికీ తండ్రికాదు. ఆయన అల్లాహ్ సందేశహరుడు. దైవదౌత్య పరంపరను అంతమొందించిన అంతను దైవప్రవక్త. అల్లాహ్ సమస్త విషయాలు ఎరిగినవాడు." (అహ్జాద్ : 40) దైవప్రవక్త(స) ఇలా అన్నారు: "ఆదం సంతతి మొత్తానికి నేను నాయకుడిని, అయితే ఇది గర్వంగా చెబుతున్న మాట ఎంతమాత్రం కాదు." అంటే ఈ హోదా దైవప్రసాదితమేగాని నాకు నేను చెప్పుకుంటున్న గొప్పలు కావు. కొందరు దైవప్రవక్తల విషయంలో హద్దు మీరిన అభిమానానికి పోయి, అందరికంటే తమ ప్రవక్త గొప్ప అని చెప్పుకుంటారు. అంతిమ దైవప్రవక్త ముహమ్మద్(స) ఈ విషయాన్ని కూడా ఖండించారు. "మీరు దైవప్రవక్తలలో ఒకరిపై ఒకరికి (దేవుడు ఇవ్వని) ప్రాధాన్యం ఇవ్వకండి" అన్నారు. (బుఖారీ- ముస్లిం)

Saturday, August 24, 2024

గృహం నిండు అనుగృగంగా మారాలంటే - For the house to become full of grace

”అల్లాహ్‌ మీ కొరకు మీ ఇండ్లను విశ్రాంతి స్థలాలుగా చేశాడు. ఇంకా ఆయనే మీ కోసం పశువుల చర్మాలతో ఇళ్ళను చేశాడు. ప్రయాణ దినాన, విడది చేసిన దినాన కూడా అవి మీకు తేలిగ్గా – అనువయినవిగా ఉంటాయి. ఇంకా వాటి ఉన్నీతోనూ, రోమాలతోనూ, వెంట్రుకలతోనూ ఆయన ఎన్నో సామానులను, కొంత కాలం ఉపయోగ పడే వస్తువులనూ తయారు చేశాడు”. (అన్నహ్ల్ల్‌: 80) ”అల్లాహ్‌ మీ కొరకు మీ ఇండ్లను విశ్రాంతి స్థలాలుగా చేశాడు. ఇంకా ఆయనే మీ కోసం పశువుల చర్మాలతో ఇళ్ళను చేశాడు. ప్రయాణ దినాన, విడది చేసిన దినాన కూడా అవి మీకు తేలిగ్గా – అనువయినవిగా ఉంటాయి. ఇంకా వాటి ఉన్నీతోనూ, రోమాలతోనూ, వెంట్రుకలతోనూ ఆయన ఎన్నో సామానులను, కొంత కాలం ఉపయోగ పడే వస్తువులనూ తయారు చేశాడు”. (అన్నహ్ల్ల్‌: 80) ముస్లిం గృహంలో షిర్క్‌ మరియు హరామ్‌కు సంబంధించిన వస్తువులు ఉండకూడదు అబూ తల్హా కథనం – నేను ప్రవక్త (స) ఇలా ఉపదేశిస్తుండగా విన్నాను: ”ఏ గృహంలోనయితే కుక్క మరియు చిత్రపటాలు, ప్రతిమలు ఉంటాయో అందులో దైవదూతలు ప్రవేశించరు”. (బుఖారీ, 3225) హజ్రత్‌ ఆయిషా (ర) గారి కథనం: ”నిశ్చయంగా ప్రవక్త (స) ఇంట్లో ఎలాంటి చిత్రపటాలను ఉంచేవారు కాదు, వెంటనే తొలగించే వారు”. (బుఖారీ-5953)
ఇంట్లో ప్రవేశించేటప్పుడు సలామ్‌ మరియు అల్లాహ్‌ స్మరణ అల్లాహ్‌ ఇలా సెలవిస్తున్నాడు: ”సో, మీరు ఇండ్లలో ప్రవేశించేటప్పుడు మాత్రం మీ స్వయానికి సలామ్‌ చేసుకోండి. అది అల్లాహ్‌ా తరఫు నుంచి అవతరించిన, మేలు కొరకు చేయబడిన అభివాదం, ఎంతో శుభకరమయినది, పవిత్రమయి నదీను”. (అన్నూర్‌: 61) ఈ ఆయతు వ్యాఖ్యానంలో సఅదీ (రహ్మ) అన్నారు: ‘సో, మీరు ఇండ్లలో ప్రవే శించేటప్పుడు’ అంటే వ్యక్తి గృహంతోపాటు ఇతరులు నివసించే గృహాలు కూడా. వాటిలో మనుషులు నివాసం ఉన్నా, లేకపోయినా. దైవప్రవక్త (స) వారిని ఇలా చెబుతూ ఉండగా నేను విన్నానని హజ్రత్‌ జాబిర్‌ బిన్‌ అబ్దుల్లాహ్‌ (ర) గారు పేర్కొన్నారు: ”మనిషి తన ఇంట్లో ప్రవేశించేటప్పుడు మరియు భోంచేసేటప్పుడు అల్లాహ్‌ాను స్మరిస్తే, షైతాన్‌ (తన అనుయాయుల్ని ఉద్దేశించి) అంటాడు – ‘ఈ రోజు రాత్రి గడిపే సౌకర్యమూ లేదు, రాత్రి భోజన సౌలభ్యమూ లేదు’అని. ఒకవేళ మనిషి ఇంట్లో ప్రవేశించేటప్పుడు అల్లాహ్‌ా స్మరణను మరచిపోతే – షైతాన్‌ అంటాడు – ‘మీకు రాత్రి గడిపే సౌకర్యం లభించింది’. అదే మనిషి భోంచేటప్పుడు కూడా అల్లాహ్‌ా స్మరణ మరచిపోతే, ‘మీకు రాత్రి గడిపే సౌకర్యమూ, రాత్రి భోజన ఏర్పాటు జరిగిపోయింది’ అంటాడు షైతాన్‌. (ముస్లిం – 5381) ఇంటి నుండి బయలుదేరేటప్పుడు అల్లాహ్‌ స్మరణ హజ్రత్‌ అనస్‌ (ర) కథనం-దైవప్రవక్త (స) ఇలా ఉపదేశించారు: ఎవరయితే ఇంటి నుండి బయలుదేరేటప్పుడు – ‘బిస్మల్లాహి తవక్కల్‌తు అలల్లాహి వలా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహిల్‌ అజీమ్‌” అని పలుకుతాడో, అతనితో ఇలా అనబడుతుంది: ‘ఇది నీకు సరి పోతుంది, నీకు రక్షణ ఇస్తుంది’ అని. మరియు అతన్నుండి షైతాన్‌ ప్రక్కకు జరిగి పోతాడు. (తిర్మిజీ- 3426) ఇతరుల ఇండ్లలో ప్రవేశించేటప్పుడు బనూ ఆమిర్‌ తెగకు చెందిన ఓ వ్యక్తి, ప్రవక్త (స) ఇంట్లో ఉండంగా ఆయనతో అనుమతి కోరుతూ ‘నేను దూరనా?’ అన్నాడు. అందుకు ప్రవక్త (స) తన సేవకుణ్ణి ఉద్దేశించి-”చూడు! నువ్వా వ్యక్తి వద్దకు వెళ్ళి అనుమతి ఎలా కోరాలో నేర్పించు. ముందు అస్సలాము అలైకుమ్‌ అనాలని, తర్వాత నేను ప్రవేశించవచ్చా? అని అడగాలని చెప్పు” అన్నారు. ఇది విన్న ఆ వ్యక్తి అస్సలాము అలైకుమ్‌, నేను ప్రవేశించ వచ్చా? అని అనుమతి కోరగా, ప్రవక్త (స)అనుమతి ఇచ్చారు. ఆ వ్యక్తి లోనికి ప్రవేశించాడు. (అబూ దావూద్‌ – 5179) వేరొక ఉల్లేఖనంలో – ”అనుమతి మూడు సార్లు మాత్రమే. అనుమతి లభిస్తే సరి, లేదంటే తిరిగి వెళ్ళిపో” అన్నారు ప్రవక్త (స). (ముస్లిం- 5753) (మరిన్ని ఆదాబులు నూర్‌ సూరా 28-29లో చూడగలరు). ఇంట్లో ఖుర్‌ఆన్‌ పారాయణం హజ్రత్‌ అబూ హురైరా (ర) కథనం-దైవప్రవక్త (స) ఇలా ఉపదేశించారు: ”మీరు మీ ఇండ్లను ఖననవాటికలుగా చేయకండి. నిశ్చయంగా ఏ ఇంట్లోన యితే సూరతుల్‌ బఖరహ్‌ా చదవబడుతుందో దాన్నుండి షైతాన్‌ పారి పోతాడు”. (సహీహ్‌ ముస్లిం-1860) తన తల్లి తనతో ఇలా అన్నారని మన్సూర్‌ బిన్‌ సఫియ్యా పేర్కొన్నారు-హజ్రత్‌ ఆయిషా (ర.అ) ఇలా విశద పర్చారు: ”నేను బహిస్టుతో ఉన్నప్పుడు ప్రవక్త (స) నా ఒడిలో పడుకొని ఖుర్‌ఆన్‌ పారాయణం చేసే వారు”. (సహీహ్‌ా బుఖారీ-297) ఇంట్లో నఫిల్‌ ఆరాధనలు హజ్రత్‌ అబ్దుల్లాహ్‌ బిన్‌ ఉమర్‌ (ర) కథనం-దైవప్రవక్త (స) ఇలా ఉపదేశించారు: ”మీరు మీ నమాజుల్లో నుండి కొంత మీ ఇండ్లలో సయితం చదవండి. వాటిని ఖనన వాటికలుగా చేయకండి”. అన్నారు ప్రవక్త ముహమ్మద్‌ (స). (సహీహ్‌ బుఖారీ-432) హజ్రత్‌ జైద్‌ బిన్‌ సాబిత్‌ (ర) గారి కథనం-దైవప్రవక్త (స) ఇలా ఉపదేశించారు: ”ప్రజలారా! మీ ఇండ్లల్లో నమాజు చదవండి. మనిషి చేసే నమాజుల్లో ఫర్జ్‌ నమాజు మినహా, మహత్తరమయినది అతను తన ఇంట్లో చదివే నమాజు” అన్నారు ప్రవక్త (స). (బుఖారీ-731) విస్వాసుల మాత హజ్రత్‌ ఆయిషా (ర) ప్రవక్త (స) వారి రాత్రి ఆరాధన గురించి ఇలా అన్నారు: ”నేను ప్రవక్త (స) వారి ఎదుట కూర్చుని ఉండేదాన్ని.. నా రెండు కాళ్ళు ఆయన వైపు ఉండేవి. ఆయన సజ్దా చేెసేటప్పుడు వాటిని మడిచి పెట్టుకునేదానిని, ఆయన సజ్దా నుండి లేచాక మళ్ళీ పరచుకునేదానిని. ఆ నాడు ఇండ్లల్లో దీపాలుండేవి కావి”. (సహీహ్‌ా బుఖారీ – 382) ఇంట్లో అల్లాహ్‌ స్మరణ ”అల్లాహ్‌ స్మరణ చేయబడే గృహం మరియు అల్లాహ్‌ా స్మరణ చేయ బడని గృహం ఉపమానం జీవం, మరియు మరణం వంటిది” అన్నారు ప్రవక్త (స). (ముస్లిం-1859) పిల్లలు మరియు అనుమతి అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు: ”విశ్వసించిన ఓ ప్రజలారా! మీ అధీనంలో ఉన్న మీ బానిసలుగానీ, ఇంకా ప్రాజ్ఞ వయస్సుకు చేరని మీ పిల్లలుగానీ మూడు వేళల్లో మాత్రం మీ అనుమతి పొందిన మీదటే మీ వద్దకు రావాలి. ప్రజ్‌ నమాజుకు పూర్వం. మధ్యాహ్నం (జుహ్ర్‌ా) వేెళ మీరు బట్టలు విడిచినప్పుడు, ఇషా నమాజు తర్వాత! ఈ మూడు వేళలు మీరు ఏకాంతంలో ఉండే వేళలు. ఈ మూడు వేళలన్ని మినహాయిస్తే (రాకపోకలు సాగించడంలో) మీపై గానీ, వారిపైగానీ ఎలాంటి దోషం లేదు. (ఎందుకంటే) మీరు తరచూ ఒండొకరి దగ్గరకు వస్తూ పోతూ ఉండవలసిన వారే. ఈ విధం గా అల్లాహ్‌ా తన ఆజ్ఞలను మీకు స్పష్టంగా విడమరచి చెబుతున్నాడు. అల్లాహ్‌ా సంపూర్ణ జ్ఞాని మరియు పరిపూర్ణ వివేకవంతుడు. మరి మీ పిలల్లలు (కూడా) ప్రాజ్ఞ వయస్సుకు చేరుకున్న తరువాత వారి పెద్దలు అనుమతి పొందినట్లే వారు కూడా అనుమతి పొంది మరీ రావాలి. అల్లాహ్‌ా ఈ విధంగా తన ఆదేశాలను మీకు విశద పరుస్తున్నాడు. అల్లాహ్‌ాయే సర్వజ్ఞాని, వివేక సంపన్నుడు. పెళ్ళి కోరిక లేని వృద్ధ మహిళలు – తమ అందాలంకరణలు ప్రదర్శించే ఉద్దేశ్యం లేకుండా – తమపై దుప్పట్లను తీసేసినా తప్పు లేదు. అయినా కూడా వారు జాగ్రత్త వహిస్తే అది వారికే శ్రేయస్కరం. అల్లాహ్‌ అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు”. (అన్నూర్‌: 58-60) వారి పడకలను వేరు పర్చండి అమ్ర్‌ బిన్‌ షుఐబ్‌ తన తండ్రితో, ఆయన తన తండ్రితో అందించిన కథనం – దైవప్రవక్త (స) ఇలా ఉపదేశించారు: ”మీరు మీ పిల్లల్ని ఏడేండ్లు నిండగానే నమాజుకై ఆదేశించండి. పదేండ్లకు చేరుకొని కూడా వారు నమాజు చేయకపోతే వారిని మందలించండి. అలాగే వారి పడకలను వేరు పర్చండి”. (అబూ దావూద్‌-495) ముస్లిం గృహంలో మిడియా పరికరాలు: అనుగ్రహము మరియు అనర్థమూను ఈనాడు మీడియా పరికరాలు (టీవీ, అంతర్జాలం, రేడియో, పత్రికలు, వ్యాసాలు) లేని ముస్లిం ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు. ఇవి ఒక ఇంటిని, ఇంటివారిని బాగు చేయడంలో, పాడు చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి ప్రపతి ముస్లిం వీలయినంతగా తన ధర్మాన్ని, పరివారాన్ని వీటి కీడు నుండి కాపాడుకునే ప్రయత్నం చేయాలి. అల్లాహ్‌ా ఇలా ఉపదేశి స్తున్నాడు: ”ఓ విశ్వసించిన ప్రజలారా! మీరు మిమ్మల్ని మరియు మీ కుటుంబీకుల్ని నరకాగ్ని నుండి కాపాడుకోండి. మనుషులు మరియు రాళ్ళు దాని ఇంధనంగా ఉంటారన్న (విషయాన్ని స్మరించకండి)”. (తహ్రీమ్‌: 6) ఈ పరికరాల మాధ్యమంగా చేెరవేయబడే సమాచారం క్రింద ఇవ్వబడిన విధంగా ఉంటుంది: 1) ప్రయోజనకరమయిన కార్యక్రమాలు, సమాచారం – దీని ద్వారా దాసుడికి పుణ్యం లభిస్తుంది. 2) అనుమతించబడిన కాలక్షేపం. దీని వల్ల పణ్యమూ లభించదు, పాపము అంటదు. 3) రేపు ప్రళయ దినాన శాపాలుగా పరిణమించే కార్యక్రమాలు, సమాచారం. కాబట్టి యుక్తిపరుడయిన ముస్లిం ప్రధానమయిన, ప్రయోజనకరమయిన వాటి కోసం పాటు పడాలి. అనుమతించబడిన వాటికి అవసరం ఉంటే తప్ప అలవాటు పడకూడదు. నిషేధించ బడిన వాటి దరిదాపులకు సయితం పోకుండా జాగ్రత్త వహించాలి. ఇంట్లో నిద్రకు ముందు పాటించాల్సిన హదీసుల్లో పేర్కొనబడిన అంశాలు సాలిమ్‌ (ర) తన తండ్రితో, ఆయన ప్రవక్త (స)తో చేసిన కథనం – ప్రవక్త (స) అన్నారు: ”మీరు పడుకునేటప్పుడు మీ ఇళ్ళల్లో నిప్పును కాలుతూ వదలకండి”. (మత్తఫఖున్‌ అలైహి) హజ్రత్‌ జాబిర్‌ బిన్‌ అబ్దుల్లాహ్‌ (ర) గారి కథనం – దైవప్రవక్త (స) ఇలా ప్రవచించారు: ”పాత్రలకు మూత పెట్టండి. తలుపులు మూసి వేయండి. దీపాలు ఆర్పి వేయండి. కొన్ని సంద ర్భాల్లో చిట్టెలుక చేష్టల వల్ల ఇల్లు, ఇంటి వారు తగులబడిపోయే ప్రమాదం ఉంది”. (సహీహ్‌ బుఖారీ – 6295) హజ్రత్‌ జాబిర్‌ (ర) గారి కథనం – దైవప్రవక్త (స) ఇలా ఉపదేశించారు: ”రాత్రి మీరు పడుకునేటప్పుడు దీపాలు ఆర్పి వెయండి. తలుపులు మూసి వేయండి. కూజాలకు మూత పెట్టండి. ఆహారపానీయాలను కప్పి ఉంచండి”. (సహీహ్‌ బుఖారీ-5624) ముస్లిం హథీసు గ్రంథంలో ఇలా ఉంది: ”ఒకవేళ మీలో ఎవరికయినా పాత్రపై మూత పెట్ట డానికి ఏమి దొరకనప్పుపడు ఒక్క కర్రను అయినా సరే అల్లాహ్‌ా నామాన్ని స్మరించి పెట్టగలి గితే పెట్టండి. నిశ్చయంగా చిట్టెలుక ఇంటివారి సమేతంగా ఇల్లును తగుల బెడుతుంది”. నిద్రకు ఉపక్రమించేటప్పుడు చేసే కొన్ని దుఆలు హజ్రత్‌ అబూ హురైరా (ర) కథనం:”నిశ్చయంగా దైవప్రవక్త (స) ఇషాకు ముందు పడుకోవడాన్ని, ఇషా తర్వాత మాట్లాడటాన్ని ఇష్ట పడేవారు కాదు”. (సహీహ్‌ బుఖారీ) హజ్రత్‌ అబుద్దర్దా (ర) కథనం: ”నిద్రకు ఉపక్రమించడానికి వస్తూ రాత్రి లేచి ప్రార్‌తన చేస్తానన్న సంకల్పం చేసుకొని తర్వాత ఫజ్ర్‌ వెళ వరకు నిద్ర లేవలేక పోతే అతని సంకల్పానికనుగుణంగా అతనికి పుణ్యం లభిస్తుంది. అతని నిద్ర అతని ప్రభువు తరఫు నుండి అతనికి సత్కార్యంగా పరిణమిస్తుంది” అన్నారు ప్రవక్త (స). (సహీహ్‌ అత్తర్‌గీబ్‌ వత్తర్హీబ్‌) హజ్రత్‌ అబూ హురైరా (ర) కథనం: దైవప్రవక్త (స) ఇలా ప్రవచించారు: ”మీలో ఎవరయిన తన పడక మదకు చేెరాలనుకుంటే దాన్ని, దుప్పటిని బాగా విదిలించాలి. వాటి లోపల ఏముందో బహుశాఅతనికి తెలియకపోవచ్చు”. (సహీహ్‌ బుఖారీ-6320) హజ్రత్‌ హుజైఫా (ర) కథనం: దైవప్రవక్త (స) పడకపై మేను వాల్చిన మీదట ”బిస్మక అమూతు వ అహ్యా” అనేవారు. నిద్ర నుండి మేల్కొన్న తర్వాత ”అల్‌హమ్దు లిల్లాహిల్లజీ అహ్యానా బఅద మా అమాతనా వ ఇలైహిన్నుషూర్‌” అనేవారు. హజ్రత్‌ బర్రా బిన్‌ ఆజిబ్‌ గారి (ర) కథనం: దైవప్రవక్త (స) ఇలా ఉపదేశించారు: ”నీవు నీ పడక మిదకు చేరకోవాలనుకున్నప్పుడు నమాజు కోసం వుజూ చేసేలా వుజూ చేసుకో. తర్వాత నీ కుడి ప్రక్కకు తిరిగి పడుకో. పిదమ ”అల్లాహుమ్మ అస్లమ్తు వజ్హీ ఇలైక, వ ఫవ్వజ్‌తు అమ్రీ ఇలైక. వ అల్‌జఅతు జహ్రీ ఇలైక. రగ్‌బతవ్‌ వ రహ్బతన్‌ ఇలైక. లా మల్జఅ వలా మన్‌జఅ ఇల్లా ఇలైక. అల్లాహుమ్న ఆమన్తు బికితాబికల్లజీ అన్‌జల్‌త, వ నబియ్యికల్లజీ అర్‌సల్‌త”. ఇది చదివి ఆ రాత్రే నీకు మరణం వస్తే నీవు ప్రకృతి ధర్మంపై మరణించినట్లు. కాబట్టి నీ చివరి పలుకులు ఇవి అయి ఉండేటట్లు చూసుకో!”. ఉల్లేఖకులు అంటున్నారు – నేను ఈ దుఆ చదువుతూ ”అల్లాహుమ్న ఆమన్తు బికితాబికల్లజీ అన్‌జల్‌త”కు చేెరుకున్నప్పుడు ‘వ బి రసూలిక’ అన్నాఉ. అందుకాయన (స) లేదు, వ బి నబియ్యికల్లజీ అర్‌సల్‌త’ అనే చెప్పు” అన్నారు. (ముత్తఫఖున్‌ అలైహి) – నిద్ర నుండి మేల్కొనే ఆదాబులు హజ్రత్‌ అబూ హురైరా (ర) కథనం-దైవప్రవక్త (స) ఇలా ఉపదేశించారు: ”మీలో ఒకరు నిద్రించే సమయంలో షైతాన్‌ అతని తల వెనుక భాగం మిద ముడు ముడులు వేస్తాడు. ప్రతి ముడి మీద ”నీ దగ్గర సుదీర్ఘ రేయి ఉంది, గాఢంగా నిద్రపో’ అని మంత్రిస్తాడు. దాసుడు నిద్ర మేల్కొని అల్లాహ్‌ాను స్మరిస్తే ఒ ముడి విప్పుకుంటుంది. తర్వాత వుజూ చేస్తే మరో ముడి విప్పుకుంటుంది. ఆనత అతను నమాజు చదివితే ఉన్న ఆ ఒక్క ముడి కూడా పటాపంచలవుతుంది. అప్పుడు దాసుడు స్వచ్ఛమయిన మనస్సతో రెట్టింపు ఉత్సాహంతో ఉదయం చేస్తాడు. అలా జరగని పక్షంలో అశుద్ధ మనస్కుడయి, పరమ సోంబేరిలా ఉదయం చెస్తాడు”.(ముత్తఫఖున్‌ ఆలైహి) హజ్రత్‌ అబ్దుల్లాహ్‌ బిన్‌ అబ్బాస్‌ (ర) కథనం: నిశ్చయంగా దైవప్రవక్త (స) తన సతీమణి (ఆయన పిన తల్లి) హజ్రత్‌ మైమూనా దగ్గర రాత్రి బస చేశారు. ఆయన అంటున్నారు: ”సగం రాత్రి గడిచాక, దానికన్నా కొంచెం ముందు లేదా కాస్త తర్వాత – దైవప్రవక్త (స) మేల్కొన్నారు. తన ముఖం నుండి నిద్ర మత్తును దూరం చేసిన మీదట సూరతుల్‌ ఆల్‌ ఇమ్రాన్‌లోని చివరి పది ఆయతులు చదివారు”. (సహీహ్‌ా బుఖారీ-183) హజ్రత్‌ హుజైఫా (ర) కథనం: ”రాత్రి దైవప్రవక్త (స) నిద్ర మేల్కొంటే ముఖాన్ని తుడుచుకొని, మిస్వాక్‌తో పల్లు తోమేవారు”. (మ్తుఫఖున్‌ అలైహి) సాధారణ మర్యాదలు హజ్రత్‌ అబూ హురైరా (ర) కథనం-ఆయన ఇలా అన్నారు: ‘ఓ వ్యక్తి ప్రవక్త (స) వారి గదికి గల రంధ్రం గుండా తొంగి చూస్తున్నాడని తెలుసుకున్న ఆయన చేతిలో తల గీకేందుకు ఉపయోగించే కర్ర ఉంది. అతన్నుద్దేశించి ఇలా అన్నారు: ”నువ్విలా తొంగి చూస్తున్నావని నాకు తెలిసి ఉంటే ఈ కర్రతో నీ కంటిలో పొడిచేవాడను. నిశ్చయంగా అనుమతి కోరడం అనేది ఈ చూపు కోసమే పెట్టబడింది” అని మందలించారు. (సహీహ్‌ బుఖారీ-6241) హజ్రత్‌ అబూ మస్‌వూద్‌ (ర) కథనం- మమ్మల్ని ఉద్దేశించి ప్రవక్త (స) ఇలా అన్నారు:”మీలో ఎవరు ఇంకొరి ఇంటికెళ్ళినప్పుడు అనుతి లభిస్తే, ఉంటే తప్ప ఇమామత్‌ చేయించడంగానీ, అధికారిగా వ్యవహరించడంగానీ, ఆ ఇంటి యజమాని ప్రత్యేక పరుపు (చాప, కుర్సీ) మీద కొలువుదీర డంగానీ చెయ్యకూడదు సుమా!”. (సహీహ్‌ా ముస్లిం-1566) హజ్రత్‌ ఉక్బా బిన్‌ ఆమిర్‌ (ర) కథనం – ప్రవక్త (స) ఇలా అన్నారు:”జాగ్రత్త! స్త్రీలున్న చోట మీరు వెళ్ళకండి”. అది విన్న అన్సారులలోని ఓ వ్యక్తి – ‘ఓ దైవప్రవక్తా! మరది గురించి మీ అభిప్రాయం ఏమిటి?’ (అంటే మరిది వెళ్ళొచ్చా? అని.) అందుకు ప్రవక్త (స) వారన్నారు: ”మరది (వదిన పాలిట) మరణం”. (సహీహ్‌ా బుఖారీ-5232) గమనిక: ఇంట్లో పాటించాల్సిన ఇతరత్రా మర్యాదలతోపాటు, ఇంటిని నరకాగ్నికి ఆహుతి చేసే విషయాల నుండి దూరంగా ఉంచుకున్నప్పుడు మన గృహం ఓ అనుగ్రహంగా పరిఢవిల్లుతుంది ఇన్‌ షా అల్లాహ్‌!

మన తొలి మరియు తుది కర్తవ్యం ఏమిటి? What is our first and last duty?

ప్రియ మిత్రుల్లారా! ధీర విస్వాసి, గొప్ప సహాబీ ఖుబైబ్‌ బిన్‌ ఆదీ గరించి విన్నారా? ఇస్లాం స్వీకరించినందుకుగాను అవిశ్వాసులు ఆయన్ను చిత్రహింసలు పెట్టి మరీ చంపారు. దారుణంగా హింసిస్తూ ప్రాణం పోవడానికి కొన్ని ఘడియల ముందు ‘నీ చివరి కోరిక ఏమిట?’ గుండెల్లో గునపం దింపి అడిగారు. అందుకు ఆయన తట పటాయించకుండా ‘రెండు రకాతుల నమాజు చేసుకోవాలన్నది నా చివరి ఆకాంక్ష’ అని సమాధానమిచ్చారు. వారి నుండి లభించిన అను మతితో రెండు రకాతులు పూర్తి చేసి ఇలా అన్నారు: ”ఇది నా జీవితపు అంతిమ ఆరాధన గనక సుదీర్ఘంగా చేయాలన్న అభిలాష ఎంతో ఉన్నా, ‘చావు భయంతో నమాజుని సుదీర్ఘం చేసి చదువుతున్నాడు’ అన్న అపవాదు అవిశ్వాసల తరఫున రాకూడదని నేను నా ప్రార్థనను సంక్షిప్తంగా చేసి ముగించాను”. ప్రియ మిత్రుల్లారా! యాతనలతో కూడిన, చిత్రహింసలతో కూడిన చావు అందరికి రాకపోవచ్చు. కానీ, అందరూ చావడం మాత్రం ఖాయం. ఒకవేళ మనకే మరణ ఘడియలు దాపురించి ‘నీ చివరి కోరిక ఏమిట?’ అని ఎవరయినా మనల్ని అడిగినా, అడగకపోయినా మన చివరి కోరికి ఏమై ఉంటుందో? ఏమై ఉండాలో? మనలోని ప్రతి ఒక్కరు ఆత్మ సమీక్ష చేసుకోవాలి. అమ్మానాన్నలను చూడాలనుకుం టామా? భార్యాపిల్లలతో గడపాలనుకుంటామా? మన అభిమాన వ్యక్తి తో భేటి అవ్వాలనుకుంటామా? ఏదైనా ఆట ఆడాలనుకుంటామా? ఆస్తిపాస్తులను మరొక్కమారు లెక్కబెట్టుకోవాలనుకుంటామా? మిగిలి ఉన్న ఆ కొద్ది ఘడియల్ని సయితం సినిమాలు, సిత్రాలు అంటూ వృధా చేస్తామా? లేదా ‘నన్నొదలండి, రెండు రకాతుల నమాజు చేసుకోవా లన్నది నా చివరి ఆకాంక్ష’ అని అల్లాహ్‌ా పట్ల మనకున్న అచంచల విశ్వాసాన్ని ప్రకటిస్తామా?
అయినా అంత పునీతమయిన మాట మన నోట వెలువడాలంటే, నమాజు మధురానుభూతి తాలూకు పూర్వానుభవం మనకుంటేనే కదా? జీవితంలో ఒకట్రెండు మార్లు తోచినప్పుడు, తోచిన విధంగా వారానికో, మాసానికో, సంవత్సరానికో ఒక సారి నమాజు చేసే వారికి నమాజు మహిమ ఎలా తెలుస్తుంది? చెప్పండి. ‘ఒక నమాజు మరో నమాజుకి మధ్య జరిగే పాపాలను ప్రక్షాళిస్తుంది’ అన్నారు ప్రవక్త (స). అసలు నమాజే చదవని వ్యక్తి తన పాపాల్ని ఏం చేెస్తాడు? అతని పాప ప్రక్షాళనామార్గం ఏమిటి? అతను పాప ఊబి నుండి విముక్తి పొందే దారేది? ప్రియ మిత్రుల్లారా! రోజుకి పది సార్లు ‘హయ్యా అలస్స్వలాహ్‌ – నమాజు వైపునకు రండి!’ అని, 10 సార్లు ‘హయ్యా అలల్‌ ఫలాహ్‌ సాఫల్యం వైపునకు రండి!’ అని అయిదు పూటల నమాజు కోసం ఇచ్చే అజాన్‌ రూపంలో స్వయంగా అల్లాహ్‌ మనల్ని పిలుపునిస్తున్నాడు. అయినా మనం ఆయన ఆప్త పిలుపుకి స్పందించడం లేదు. ‘నేను హాజరయ్యాను స్వామీ’ అని జవాబు పలకడం లేదు. ‘కర్మకు తగ్గ ఫలం’ అన్నట్టు అల్లాహ్‌ా ఆప్త పిలుపు పట్ల ఇలా అమర్యాదగా వ్యవహ రించిన వ్యక్తిని అల్లాహ్‌ా అభిమానించి సత్కరిస్తాడని, సన్మానిస్తాడని ఎలా భావించగలం? చెప్పండి. నిజమయిన కీర్తి ఎవరికి వారుగా ఇచ్చుకునేది, ఒకరిస్తే పుచ్చుకునేది కాదు. అల్లాహ్‌ అనుగ్రహించినది మాత్రే నిజమైన కీర్తి, వాస్తవ గౌరవం. ‘దాసుడు అత్యంత సమీపంగా దైవానికి సజ్దా స్థితిలో ఉంటాడు’ అని ప్రవక్త (స) వారు అన్నారు. మరే వ్యక్తయితే జీవితంలో ఒక్కసారి కూడా అల్లాహ్‌ా సన్నిధిలో పూర్ణ హృద యంతో, పూర్ణ బలంతో, పూర్ణ విశ్వాసంతో ఒక్క సజ్దా కూడా చేసి ఎరుగడో అతని వదనం దేదీప్యమానం ఎలా అవుతుంది. అతని జీవి తం నిండు కళను ఎలా సంతరించుకుంటుంది?అతనికి కీర్తి ఎలా ఒనగూడుతుంది?అతనికి రేపు తీర్పు దినాన పుల్‌సిఇరాత్‌ వారధి దాటేం దుకు కావాల్సిన జ్యోతి ఎలా ప్రాప్తిస్తుంది? శరీరానికే తలమానికం అయిన శిరస్సును ఆ సర్వలోక పాలనాధీశుని సన్నిధానంలో వంచి నప్పుడే దానికి సిసలైన గౌరవం అసలయిన కీర్తి అని ఎరుగని వ్యక్తి ఎలా సంస్కారంతుడు అనిపించుకుంటాడు? చేసిన అర్థ రూపాయి సహాయానికి కృతజ్ఞత కోరుకునే మనిషి అల్లాహ్‌ ప్రసాదించి అనన్య అనుగ్రహాల్ని అనుభవిస్తూ, అగణ్య వరాలను పొంది కూడా అల్లాహ్‌ పట్ల పూర్తి అణుకువ కూడిన ఒక సజ్దా చేయకపోవడం ఎంత దుర దృష్టకరం! దాసుడు దైవ సన్నిధికిలో నిలబడి అల్లాహ్‌ను స్మరించ డమే ఆలస్యం ‘నేనున్నాను’ అంటూ బదులిస్తాడు. అట్టి దయాసాగరు ని సన్నిధికి వెళ్ళనివాడు ఎంత దరిద్రుడో ఆలోచించండి. ప్రియ మిత్రుల్లారా! నమాజు ఏదో ఆషామాషి వ్యవహారం కాదు. అల్లాహ్‌ ఆదేశం.అల్లాహ్‌ పంపగ వచ్చిన ప్రవక్తలందరూ ఎంతో ఇష్టం గా పాటించిన సంప్రదాయం. మానవుల్లోనే శ్రేష్టులయిన ప్రవక్తలు భక్త్తిప్రపత్తులతో నమాజు చేయడం, సామాన్య వ్యక్తులయిన మనం చేయకపోవడం దేన్ని సూచిస్తుందో యోచించండి! ఇది మనలో దుర హంకార వైఖరికి నిదర్శనం కాదా? లేదా ‘దురంహాకర దురంధురుల వైపు అల్లాహ్‌ కన్నెత్తి కూడా చూడడు’ అని ప్రవక్త (స) చేసిన హెచ్చ రిక మన చెవిన పడలేదా? కొందరు సంపద లేమితో సతమతమవుతూ ఉండొచ్చు. కొందరు సంతాన లేమితో బాధ పడుతూ ఉండొచ్చు. కొందరు సంతాప సము ద్రంలో మునిగి ఉండొచ్చు. అన్ని రోగాలకు, అన్ని బాధలకు, అన్ని సమస్యలకు పరిష్కారం నమాజు. నమాజు చదివి ప్రవక్త జకరియ్యా (అ) పొందిన శుభవార్తను మనమూ పొందాలి. ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది: ”కుటీరంలో నిలబడి (జకరియ్యా -అ)నమాజు చేస్తుండగా దైవదూతలు తనను పిలిచి, ‘అల్లాహ్‌ నీకు యహ్యా గురించిన శుభవార్త ఇస్తున్నాడు. అతను అల్లాహ్‌ వాక్కును ధృవ పరుస్తాడు. నాయకుడవుతాడు. ఇంద్రియ నిగ్రహం కలవాడు, దైవప్రవక్త, దైవ వర్తనులకోవకు చెందినవాడై ఉంటాడు” అని చెప్పారు. (ఆలి ఇమ్రాన్‌: 39) ప్రజలు నమాజు చేసుకుంటున్నారు.నమాజు చెయ్యకుండా ఓ మూల నిలబడి ఉన్న వ్యక్తినుద్దేశించి ”ఏమిటి? నువ్వు ముస్లింవి కాదా?”అని ఆరా తీశారు ప్రవక్త (స). రేపు ప్రళయదినాన నమాజు పట్ల మన నిర్లక్ష్యాన్ని చూసి ‘ఏమిటి మీరు ముస్లింలు కారా?’ అని ప్రవక్త (స) మనల్ని నిలదీయడం మనకు ఇష్టమేనా? నమాజు సలిపే ప్రతి వ్యక్తి ముఖారవిందంలో ప్రార్థనా తాలూకు తేజస్సు తొణికిసలాడుతూ ఉంటుంది. ప్రజల నుదుళ్ళపై కనబడే నల్లని మచ్చ కాదు.. అల్లాహ్‌ ఖుర్‌ఆన్‌లో పేర్కొన్న ఛాయ. నల్ల ఛాయో, తెల్ల ఛాయో, పశుపు పచ్చని ఛాయో, ఏర్ర ఛాయో కాదు; అది అక్షరాల నమాజు ఛాయ. ”అల్లాహ్‌ కృపను, ఆయన ప్రసన్న తను చూరగొనే ప్రయత్నంలో వారు వినమ్రులయి రుకూ చేయ డాన్ని, సజ్దా చేయడాన్ని నీవు చూస్తావు. వారి సజ్దా ప్రత్యేక ప్రభా వం వారి ముఖార ందాలపై తొణికిసలాడుతూ ఉంటుంది.” (అల్‌ పతహ్‌: 29) అల్లాహ్‌ాకు మిక్కిలి ప్రియమయిన నమాజు ఛాయను నోచుకో కుండా పోయిన వ్యక్తి ఎంత మేలిమిచ్ఛాయ కలిగి ఉన్నా అంతిమం గా నరకాగ్నిలో కాలి నల్లబడాల్సిందే! నరకవాసుల గురించి తెలియ జేస్తూ అల్లాహ్‌ా ఇలా అంటున్నాడు: ”వాడు సత్యాన్ని ధృవీకరించనూ లేదు. నమాజు చదవనూ లేదు. పైగా వాడు ధిక్కరించాడు. వెను తిరిగి పోయాడు. మిడిసి పడుతూ తన ఇంటి వారల వైపు వెళ్ళి పోయాడు. శోచనీయనం! నీ వైఖరి కడు శోచనీయం!! మరీ విచార కరం! నీ ధోరణి మిక్కిలి విచారకరం!!” (ఖియామా:31-35) ”ఆ రోజు (స్వర్గవాసులు నరకవాసుల్ని ఉద్దేశించి) ఇంతకీ ఏ విష యం మిమ్మల్ని నరకానికి తీసుకొచ్చింది? అని అడుగుతారు. వారి లా సమాధానం ఇస్తారు. ‘మేము నమాజు చేసేవారము కాము. నిరుపేదలకు అన్నం పెట్టే వారమూ కాము. పైగా మేము పిడి వాదన చేసేవారితో చేరి వాదోపవాదాలలో మునిగి ఉండేవారము. ప్రతిఫల దినాన్ని ధిక్కరించేవాళ్ళము. తుదకు మాకు మరణం వచ్చేసింది”. (దహ్ర్‌ా: 43-47) మరి మనం నరకవాసుల్లోనే ఉండిపోదామా? స్వర్గవాసుల స్థాయి ని అందుకునే అవిరళ కృషికి పూనుకుందామా? మరి స్వర్గవాసులు ఎవరంటారా? అదీ ఆ కృపాసాగరుని మాటల్లోని వినండి – ”వారు అగోచరాలను విశ్వసిస్తారు. నమాజును స్థాపిస్తారు”. (బఖరా:2) అల్లాహ్‌ కృప వల్ల మనం విశ్వాసులం; మంచిదే. కానీ, నమాజు చదవడం లేదు ఎందుకు? తమ తమ ఇళ్ళకు వెళ్ళాలనుకున్న యువకుల్ని ఉద్దేశించి ప్రవక్త (స) వారు చేసిన ప్రధమ హితవు ఏమిటో తెలుసా? ”నమాజు స్థాపించండి” అన్నది. నమాజు చదివే వ్యక్తి అల్లాహ్‌ాకు అత్యంత సమీపంగా ఉంటే, చదవని వ్యక్తి అందరికన్నా దూరంగా ఉంటాడు. అమ్మనాన్న, అక్కాచెల్లెల్లు, అన్నాదమ్ముళ్లు, ఆప్తులు స్నేహితులు – ఇలా ఎవరితోనయినా దూరంగా ఉండి బ్రతకొచ్చు కానీ, అల్లాహ్‌ా కు, ఆయన కృపాకటాక్షాలకు దూరంగా ఉండి ఎవరు బ్రతికి బట్ట కట్టగలరు చెప్పండి! ఏమిటి, ”ఆ తర్వాత కొందరు అయోగ్యులు వచ్చి నమాజులను వృధా చేశారు. మనోవాంఛలకు బానిసలయి బ్రతికారు” (మర్యమ్‌; 59) అని స్వయంగా అల్లాహ్‌ాయో ‘అయో గ్యులు’ అన్న వారి జాబితాలో చేరడం మనకిష్టమేనా.? ‘బే నమాజీ’ అని అందరూ ఎద్దేవ చెయడం మన నచ్చుతుందా? మనం ఎంత అంగ బలం, అర్థ బలం, అధికార బలమయినా కలిగి ఉండొచ్చు. అందం రీత్యా మనం విశ్వ సుందరులే కావచ్చు. కానీ, మనం నమాజును వేళకు చేయకపోతే అల్లాహ్‌ దగ్గర మాత్రం కటిక దరిద్రులం, అందవిహీనులం, అజ్ఞానులం, దుష్టులం, దుర్మార్గు లమే. ఇది మనకు సమ్మతమేనా? ప్రియ మిత్రుల్లారా! అల్‌హమ్దులిల్లాహ్‌ా మనం రోజుకి అయిదు సార్లు అజాన్‌ వింటున్నాము. ఖుర్‌ఆన్ను దైవగ్రంథంగా విశ్వసిస్తున్నాము. ఖుర్‌ఆన్‌లో నమాజును స్థాపించండి అన్న ఆదేశం అనేెక సార్లు వచ్చిం దన్నదీ మనకు ఎరుకే. ఖుర్‌ఆన్‌ అల్లాహ్‌ా ప్రోక్తం అని బలంగా విశ్వ సించే మనలో రోజుకు ఆయిదు సార్లు నమాజు పిలుపు విని కూడా స్పందన కనబడటం లేదంటే ఏమిటి అర్థం? గుండె అని గుడిలో దైవ భీతి ఉన్నాట్టా? లేదా ఐహిక లాలస, కాంక్షల దాస్యం గూడు కట్టుకు న్నట్టా? ”ఏమిటి. విశ్వాసుల హృదయాలు అల్లాహ్‌ా సంస్మరణ పట్ల, ఆయన అవతరింపజేసిన సత్యం పట్ల మొత్తబడే సమయం ఇంకా ఆసన్నం కాలేదా?” (హదీద్‌: 16) చూడండి! మనం ఒక కార్యాలయంలోనో, ఒక పాఠశాలలోనో పని చేస్తున్నామనుకోండి.ఆ కార్యాలయం, ఆ పాఠశాల కేటాయించిన సమ యానికి బద్దులయి మసలుకోమా?ఉద్యోగ విషయంలో, వ్యాపార విష యంలో, వివాహ విషయంలో, జీవిత ఇతర విషయాల్లో ఖచ్చితంగా సమయపాలనను పాటించే మనం-”నిశ్వయంగా నమాజును నిర్థారిత వేళల్లో చేయడం విశ్వాసులకు విధిగా చేయబడిది”. (నిసా:103) అని స్వయంగా ఆ సర్వేశ్వరుడే సెలవిస్తుంటే ఆ మాత్రం నీతిని నమాజు విషయంలో పాటించలేకపోతున్నాము. పనీ చేయక, కష్టా పడక అదృ ష్టం వరించాలనుకోవడం, యజమాని నుండి వెతనాన్ని, ఫలితాన్ని కోరుకోవడం దురాశే కదా! మరి దురాశేమో దుఃఖానికి చేటాయో! ప్రియ మిత్రుల్లారా! సాధారణ దినాల్లోనే కాదు, సంబర ఘడియల్లో సయితం ‘మేము మా ఈ పండుగ రోజుని నమాజుతో ప్రారంభి స్తాము’ అని ప్రవక్త (స) వారు చెబుతుంటే, మనం మన దైనందిన జీవితాన్ని నమాజుతో ప్రారంభించకపోవడం శుభమా? అశుభమా? ఆలోచించండి! మనం శ్వాస పీల్చుకుంటున్న దినం పండుగ దినమే కావచ్చు. షడ్రుచులు మేళవించిన వంటకాలే మనం ఆరగించి ఉం డొచ్చు. నూతన వస్త్రాలు ధరించి మనం నవాబుల్లానే నడుస్తుండొచ్చు, అమ్మనాన్నలు, బంధుమిత్రులు, ఇరుగపొరుగు వారితో యమ జోరు గా వెళ్ళి పలుకరించే ఉండొచ్చు; కానీవీటన్నింటిని మనకు అనుగ్ర హించిన ఆ నిజ స్వామి సన్నిధానానికి మనం హాజరు కాలేదంటే మనం అనుకుంటున్న ఈ పండగ కూడా పనికిమాలిందే. ఒక్క మాటలో చెప్పాలంటే, అల్లాహ్‌ా విధేయతలో గడిపిన ప్రతి దినం పండగే. అది లేని ప్రతి క్షణం దండగే. ప్రవక్త (స) వారి సహచరుల్లో ఎవరి వల్లయినా ఒక నమాజు తప్పి పోతే ‘తన మొత్తం కుటుంబాన్ని పోగుట్టుకున్నట్లు’ వారు ఫీలయ్యే వారు. అవును, ప్రార్థనా ప్రాశస్త్యం వారికి తెలిసినంతగా ఎవరికి తెలి యదు. ఒక్క పూట నమాజు తప్పితేనే వారు అంతగా విలవిల్లాడి పోతున్నారే, మరి మనమేమో రోజులు, వారాలు, నెలలు, ఏండ్ల తర బడి నమాజులను వదులుతూ కూడా చలించడం లేదంటే, మన నుదు ళ్ళపై మడతలు పడటం లేదంటే, మనకు బాధ కలగటం లేదంటే మనలో విశ్వాసం ఉన్నాట్టా, లేనట్టా? ‘నా కంటి చలువ నమాజులో ఉంచ బడింది’ అని స్వయంగా ప్రవక్త (స) వారు సెలువిస్తున్నారు. అంతిమ దినాల్లో నడవలేని స్థితిలో ఇద్దరి సహాయమ కాళిఓలడ్చుకు ంటూ వచ్చి సామూహిక నమాజులో పాల్గొంటున్నారు. మరి మన మేమో ‘సినిమాలు, సిత్రాలు, వ్యర్థ కార్యక్రమాల్ని చూసి మన కళ్లను చల్లార్చుకోవాలనుకుంటున్నామే దీన్నేమనాలి? ”నమాజు స్థాపించే వారిని ప్రశంసాత్మక స్థానం మీద ప్రతిష్టింప జేస్తాను” అని అల్లాహ్‌ా మాటిస్తుంటే, మనమేమో అపకీర్తి అడుసులోనే అట్టడుగున పడి ఉండ టాన్నే ఇష్టపడుతున్నామే, దీన్నేమంటారు? ”అల్లాహ్‌ వారి ఇళ్ళను నిప్పుతో నింపుగాక! వారు మమ్మల్ని అస్ర్‌ నమాజు చేయకుండా చేశారు” అని కందక యుద్ద సమయంలో ప్రవక్త (స) వారు అవిశ్వాసుల్ని అభిశపించారు అంటే ఆలోచించండి, నమాజు ఎంత ఘనతరమయిన ప్రార్థనో! ఆ రోజు యుద్ధ కారణంగా అనేక దైనందిన కార్యాలు వాయిదా పడ్డాయి. ప్రవక్త (స) వాటిని ఖాతరు చేయలేదు. నమాజునే ప్రత్యేకంగా పేర్కొన్నారంటే, సదా దీవె నల్ని కురిపించే ఆయన అధరాలు అభిశపించాయి అంటే, నమాజును వదలడంగానీ, నమాజును చేయకుండా ఆపడంగానీ ఎంత భయంకర నేరమో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ఇస్లాంలోని ప్రతి ఆదేశం గురించి సమయం సందర్భాన్ని బట్టి మినహాయింపు ఉంది. కానీ, శ్వాస, స్పృహ ఉన్నంత వరకు ఎటువంటి మినహాయింపు లేని ఆదే శం ఒక్క నమాజు విషయంలోనే ఇవ్వబడింది. చివరికి భీకర పోరు జరుగుతున్నా నమాజును వాయిదా వేయడానికి లేదు అంటూ ఆ స్థితిలో చేసే నమాజు విధానాన్ని ప్రత్యేకంగా అల్లాహ్‌ా ఖుర్‌ఆన్‌లో పేర్కొన్నాడంటే, అల్‌హమ్దులిల్లాహ్‌ ప్రశాంత వాతావరణంలో నివ సిస్తున్న మనపై నమాజు తాలూకు బాధ్యత ఏపాటిదై ఉంటుందో యోచించాలి. కొత్తగా ఇస్లాం స్వీకరించిన తాయిఫ్‌ ప్రజలు కొన్ని విషయాలలో మినహాయించపు కోరితే మినహాయింపును ప్రకటించిన ప్రవక్త (స), నమాజు విషయంలో కూడా మినహాయింపునివ్వండి అని విన్నవించుకున్నప్పుడు ‘నమాజు లేని మతధర్మంలో శుభమే మిగు లుండదు’ అని చెప్పారంటే నమాజుకు నోచుకోని మన జీవితం ఎలాంటిదో యోచించండి! అల్లామా జహబీ (ర) మరణిస్తూ అన్న మాట:”ఏ ఒక్క విధి నమాజు వదలని శుభ దినంలో నాకు మరణాన్ని ప్రసాదించినందుకు నేను అల్లాహ్‌ాకు వేనవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను’ అన్నా రంటే, అంతిమ దైవప్రవక్త (స) అంతిమ ఘడియల్లో అనేక సార్లు స్పృహ తప్పినా స్పృహ వచ్చిన ప్రతి సారి నమాజు చేయడానికి ప్రయ త్నించేవారంటే, తన గది తెరను తొలగించి నమాజు చేస్తున్న సహచరుల్ని చూసి చల్లని చిరినవ్త్వుకటి ఆయన ఆధరాలపై కదలాడిం దంటే, అంతిమ శ్వాస అగుతున్న సమయంలో సయితం ‘నమాజ, నమాజు…మీ అధీనంలో ఉన్న వారి యెడల ఉత్తమంగా వ్యవహరిం చండి’ అని తాకీదు చేెశారంటే నమాజు ఎంత మహిమాన్వితమయిన ఆరాధనో ఆలోచించండి! ప్రవక్తల, పుణ్యాతుల, సత్పురుషుల, షహీ దుల, ఔలియాల, హదీసువేత్తల దృష్టిలో అంతటి ఘనపాటి అయిన నమాజు మన దృష్టిలో ఎటువంటి విలువ లేనిదిగా ఉందంటే లోపం ఎవరిదో, ఎవరిలో ఉందో ఎవరి వారే ఆత్మ సమీక్ష చేసుకోవాలి.

ఆశావాదికి ఆకాశమే హద్దు ..The sky is the not limit for an optimist.

నిరాశ, నిరుత్సాహం, నిస్పృహలు ఒకదానితో ఒకటి సంబంధమున్న ప్రక్రియలు. మనం నిరాశ చెందితే, నిరుత్సాహ పడతాం. నిరుత్సాహా పడితే, నిస్పృహ చెందుతాం. కటిక పేదరికం, నిరుద్యోగం, ఆర్థిక సంక్షోభం, అధర్మ భూషణం, అసత్య భాషణం, అనుమానం, ప్రేమ వైఫల్యం, ఆప్తుల విరహం, నిజ దైవం పట్ల విశ్వాస లేమి – ఇలా ఏదోక కారణం నిరాశకు. కానీ, ఆశకు మార్గాలు అనేకం. మనలోని ప్రతి ఒక్కరిలోనూ సమస్యను ఎదుర్కునే శక్తిసామర్థ్యాలు పుష్కలంగా ఉంాయి. మనం మోయలేని భారాన్ని దేవుడు మన మీద మోపడు. మనం చేయాల్సిందల్లా ఒక్కటే సానుకూలంగా స్పందిస్తూ సమస్యను పరిష్కరించుకోవడమే. పంట పోతే పంట వస్తుంది, బతుకు పోతే బతుకు రాదు. కాబట్టి మనం బతకాలి, నలుగురికి బతుకినివ్వాలి. ఆ నిమిత్తం పనికొచ్చే వ్యాసమే ఇది. మనం ఎందుకు నిరాశ పడుతున్నాం? దీనిలో అర్థం ఏమైనా ఉందా? నిరాశ నుండి బయటపడేదేలా? ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ వ్యాసాన్ని తప్పక చదవండి!
నిరాశ అంటే: నేను అనుకున్న, తల పెట్టిన కార్యం జరుగుతుందన్న నమ్మకాన్ని కోల్పోవడమే నిరాశ. ఇందులో కొంత పాత్ర భయానిది కూడా. మానవ నైజం గురించి ఖుర్‌ఆన్‌; ”మేము మనిషికి మా కారుణ్యం రుచిని చూపి ఆ తర్వాత దాన్ని గనక అతన్నుంచి తిరిగి తీసేసుకుంటే అతను నిరాశ చెందుతాడు; కృతఘ్నుడిగా మారి పోతాడు”. (హూద్‌: 9) ”అదే అతనికి కలిగిన కష్టాల, నష్టాల తర్వాత మేము గనక కొన్ని అనుగ్ర హాల రుచిని చూపితే,’నా దురవస్థలన్నీ దూరమయిపోయాయి’ అని అంటాడు. నిశ్చయంగా అతను మిడిసి పడతాడు, గొప్ప చెప్పుకుాండు”. (హూద్‌; 10) అంటే, లేమి కలిగితే నిరాశకు లోనయి నిజదైవం చేసిన మేళ్లన్నింనీ మరచి ఆయన్ను కొలవడం మానేస్తాడు. కలిమి కలిగితే ఇక దేవుని అవసరం తనకేం టన్న అహంభావంతో బీరాలు పోతాడు. తానే కష్టాల్ని అధిగమించినట్లు, కష్టం తనను చూసి తోక ముడిచినట్లు గొప్పలు పోతాడు. ”మరియు మేము ప్రజలకు కారుణ్యం రుచిని చూపించినప్పుడు వారు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతారు. ఒక వేళ వారి చేతులు చేసుకున్న చేతల వల్ల వారికి ఏదయినా కీడు కలిగితే మాత్రం పూర్తి నిరాశ చెందుతారు”. (అర్రూమ్‌: 36) ఇంకా చెప్పాలంటే, ”మేలును అర్థించడంలో మానవుడు అలసిపోడు. అదే అతనికేదయినా కీడు వాటిల్లితే మాత్రం ఆశలన్నీ వదులుకొని పూర్తి నిరాశ జీవిగా మారి పోతాడు”. (ఫుస్సిలత్‌; 49) నిరాశ ధర్మనిష్ఠుల దృష్టిలో: ‘నిజ భావంలో పండితుడు ఎవడంటే, అల్లాహ్‌ కారుణ్యం యెడల ప్రజల్ని నిరాశకు గురి చెయ్యనివాడు, అల్లాహ్‌ అవిధేయతకు బరి తెగించేలా వెసులు బాటును ఇవ్వనివాడు, అల్లాహ్‌ా శిక్ష యెడల పూర్తి నిశ్చింతను కల్గించనివాడు’ అన్నారు హజ్రత్‌ అలీ (ర). ”వినాశనం రెండింలో ఉంది – నిరాశ, ఆత్మ స్తుతి” ”ఘోర పాపాలు మూడు-అల్లాహ్‌ విశాలత పట్ల నైరాశ్యత, అల్లాహ్‌ా కారుణ్యం యెడల నిరాశ, అల్లాహ్‌ా శిక్ష యెడల నిర్భయత” – హజ్రత్‌ అబ్దుల్లాహ్‌ా బిన్‌ మస్‌వూద్‌ (ర). ”అల్లాహ్‌ కారుణ్యం యెడల నిరాశ చెందడం అంటే మనిషి తనును తాను వినాశనానికి గురి చేసుకోవడమే” ”నిరాశ చెందకు, లేదా కార్యశూన్యుడవయి కూర్చుండి పోతావు” – ఇబ్ను సీరీఁ (రహ్మ). ”అల్లాహ్‌ కారుణ్యం యెడల నిరాశకు గురి చేసేవారు, నిరాశకు గరయ్యే వారు తప్పు చేస్తున్నారు” – సుఫ్యాన్‌ బిన్‌ ఉయైనా (రహ్మ). ”పూర్తి నిశ్చింతా మంచి కాదు, పూర్తి నిరాశా మంచిది కాదు. ఖిబ్లా వాసు లకు సత్య మార్గం ఈ రిెంకీ మధ్యన ఉంది” – తహావీ (ర). నిరాశ అవిశ్వాసుల లక్షణం: ”మార్గభ్రష్టులు మాత్రమే తమ ప్రభువు కారుణ్యం యెడల నిరాశ చెందు తారు”. (అల్‌ హిజ్ర్‌: 56) ”అవిశ్వాస వర్గానికి చెందిన వారు మాత్రమే అల్లాహ్‌ కారుణ్యం పట్ల నిరాశ చెందుతారు”. (యూసుఫ్‌: 87) నిరాశ కొన్ని సందర్భాల్లో మంచిదే: ఆశకు అంతు లేదు. ”మానవ మాత్రునికి ఒక లోయ నిండా బంగారం దొరికితే ఇంకో లోయ ఉంటే ఎంత బావుండు అంాడు. రెండు లోయల నిండా బంగారం దొరికినా మూడో లోయ కూడా ఉంటే ఎంత బావుండు అంాడు. మనిషి కడుపును కాి మ్టి మాత్రమే నింప గలదు” అన్నారు ప్రవక్త (స). (ముస్నద్‌ అహ్మద్‌) కాబ్టి కొన్ని సందార్భలలో అత్యాశకు పోకుండా ఉండటమే కాదు అన్యుల ఆస్తుల వైపు ఆశగా చూడటం కూడా మానుకోవాలి. హజ్రత్‌ ఉమర్‌ (ర) వేదిక మీద ప్రసంగిస్తూ ఇలా అన్నారు: ”నిశ్చయంగా లాలూచీ దారిద్య్రానికి దారి. అనాసక్తత నిరపేక్షతకు మార్గం. మనిషి ఒక వస్తువు యెడల ఆశను వదులుకుంటే అతను ఆ వస్తువు నుండి నిరపేక్షాపరుడయి పోతాడు”. ఇబ్నుల్‌ ఖయ్యిమ్‌ (ర) ఇలా అన్నారు: ”చిత్తశుద్ధి, మరియు స్వీయ ప్రశంసా కాంక్ష, ప్రజల వద్ద ఉన్న వాిని యెడల లాలూచీ ఒకే హృద యంలో ఇమడజాలవు. ఒకవేళ ఉన్నా అవి, నీరు-నిప్పులా ఉంాయి. నీ ఆత్మ నిన్ను చిత్తశుద్ధి గురించి ప్రేరేపిస్తే, ముందు నువ్వు నిరాశ అనే కత్తిని చేబూని లాలూచీని అంతమొందించు. ఐహిక అనాసక్తత ఆయుధంతో స్వీయ ప్రశంసా కాంక్షను నియంత్రించు. ఈ రెండూ నువ్వు చెయ్యగలిగితే నీకు చిత్తశుద్ధి అనే సంపద దక్కుతుంది”. నిరాశ రకాలు: 1) అల్లాహ్‌ కారుణ్యం యెడల ఆశను వదులుకోవడం. 2) కష్టాలు, నష్టాలు వైెదొలగవు అన్న నిర్ణయానికి వచ్చేయడం. 3) ప్రస్తుత స్థితికన్నా ఇంకా మెరుగయిన స్థితి కలుగదు అని భావించడం. 4) ధర్మోన్నతి, ధర్మపరాయణుల ఉన్నతి సాధ్యం కాదు అన్న ఆలోచన. 5) దుర్మార్గులు, దుర్నడత ప్రియులు, వ్యసన పరులు, పాపులు ఇక మారరు, వీరిలో మార్పు రాదు అని భావించడం. ”ఇంకా వారిలో ఒక వర్గం (ధర్మబోధకుల్ని ఉద్దేశించి) ‘అల్లాహ్‌ా నాశనం చేయబోయే లేక కఠినంగా శిక్షించబోయే వారికి నీతిబోధ చేసి ప్రయోజనం ఏమి?’ అని చెప్పగా, ”మీ ప్రభువు సమక్షంలో సంజాయిషీ ఇవ్వగలిగే స్థితి లో ఉండానికి (ఈ పని చేస్తున్నాము). బహుశా వారు ఈ నీతిబోధ ద్వారా దైవభీతిపరులుగా మారవచ్చు” అని వారు సమాధానమిచ్చారు. (అల్‌ ఆరాఫ్‌: 164) నిరాశకు కారణాలు: 1) నిజ దైవమయిన అల్లాహ్‌ గురించి సత్యబద్ధమయిన అవగాహన లేక పోవడం: మనిషి తనకు తెలియని దానికి శత్రువు అన్నది తెలిసిందే. ఇబ్ను ఆదిల్‌ (రహ్మ) ఇలా అన్నారు: అల్లాహ్‌ కారుణ్యం యెడల నిరాశ అనేది కొన్ని విషయాల పట్ల అవగాహన లోపించడం వల్లనే చోటు చేసుకుంటుంది. అ) అల్లాహ్‌ాకు, తన సమస్యను తీర్చే శక్తి ఉందని తెలియకపోవడం. ఆ) తనుకు ఏం కావాలో దేవుడికి తెలీదు అని భావించడం. ఇ) అల్లాహ్‌ అవసరానికి, సహాయానికి, పిసినారితనానికి అతీతుడు అని గ్రహించకపోవడం. ఈ మూడు రకాల అవగాహన రాహిత్యం అతన్ని మార్గభ్రష్టత్వానికి గురి చేసి నిరాశ నిశీధిలోకి న్టెి నరక వాసుల జాబితాలో చేర్చేస్తుంది. 2) అల్లాహ్‌కు భయ పడటంలో అతిశయిల్లడం: ఇబ్నుల్‌ ఖయ్యిమ్‌ (ర) ఇలా అన్నారు: ”మనిషిని ఆశను పూర్తిగా వదులుకునేంతి భయం ఉండకూడదు. అల్లాహ్‌ కారుణ్యం యెడల ఆశను వదులుకునేంతి భయం మంచిది కాదు”. ఇమామ్‌ తైమియా (ర) గారి మాటను ఉటంకిస్తూ ఇలా అన్నారు: ”దైవభీతి పరిధి అల్లాహ్‌ అవిధేయతకు పాల్పడకుండా చేసేంతిదయినదై ఉండాలి. దానికన్నా మించింది నిష్ప్రయోజనకర భయంగా ఉంటుంది. అదే మనిషిని నిరాశకు లోను చేస్తుంది. అది అల్లాహ్‌ా ఆగ్రహాన్ని అధికమించిన కారుణ్యం యెడల అమర్యాద అవుతుంది”. 3) నిరాశ వాదుల సావాసం: ”మనిషి తన మిత్రుని మతధర్మం మీదే ఉం ాడు” అన్నారు ప్రవక్త (స). (అహ్మద్‌) కనుక నిరాశ వాదుల సావాసం నిరాశకు దారి తీస్తుందే తప్ప ఆశల పల్లకి ఎక్కించదు. 4) భౌతిక కారణాలతో ముడి పెట్టేది: ఓ నిరాశవాది ఓ వివేకితో జరిపిన సంభాషణ – నిరాశవాది: నాకు శత్రువులున్నారు. వివేకి: ”మరెవరయితే అల్లాహ్‌ాను నమ్ముకుాంరో వారికి అల్లాహ్‌ా ఒక్కడే చాలు” (అత్తలాఖ్‌: 3) నిరాశవాది: వారందరూ నాకు వ్యతిరేకంగా కుయుక్తులు, కుట్రలు పన్నుతున్నారు. వివేకి: ”మరియు దుష్ట పన్నాగాల కీడు ఆ పన్నాగాలు పన్నేవారి మీదే పడుతుంది”. (ఫాతిర్‌: 43) నిరాశవాది: వారు చాలా మంది ఉన్నారు. వివేకి: ”ఒక చిన్న వర్గం ఒక పెద్ద సమూహాన్ని అల్లాహ్‌ ఆజ్ఞతో జయించడం ఎన్నో సార్లు జరిగింది”. (అల్‌ బఖరహ్‌: 249) 5) ధర్మ విషయంలో మౌఢ్యాన్ని ప్రదర్శిస్తూ, ధర్మం కల్పించిన వెసులుబాటును వినియోగించుకోక పోవడం వల్ల చోటు చేసుకునే నైరాశ్యం. 6) ఫలితాల విషయంలో సహనం, సంయమనాన్ని పాటించక పోవడం వల్ల కలిగే నిరాశ. ”నేను దుఆ చేశాను, నేను ప్రార్థించాను. అయినా నా ప్రార్థన ఆలకించ బడలేదు అంటూ వాపోతూ దుఆ చెయ్యడమే మానేస్తాడు మనిషి” అన్నారు ప్రవక్త (స). (ముత్తఫఖున్‌ అలైహి) 7) ప్రాపంచిక వ్యామోహం. 8) ఖచ్చితమయిన నిర్ణయాత్మక శక్తి లేకపోవడం. 9) మార్పుకి సిద్ధం కాకపోవడం. 10) అన్యుల రాతా రీతుల యెడల ప్రతికూల స్పందన. కుళ్ళుబోతు తనం. నిరాశ నుండి కాపాడే సాధనాలు: 1) అల్లాహ్‌ యెడల సత్య బద్ధమయిన అవగాహన కలిగి ఉండటం: ఆయన సర్వోన్నత నామాల,గుణగణాల అవగాహన కలిగి ఉండటం. అల్లాహ్‌ా కష్టా లన్నింని తీర్చగల సమర్థుడు, పాపాలన్నింని మన్నించగల ప్రభువు అని తెలిసిన తర్వాత నిరాశకు తావు ఉండదు. 2) అల్లాహ్‌ా యెడల సద్భావన కలిగి ఉండటం: ”నేను నా దాసుని భావనకు దగ్గరగా ఉంాను. అతను నా పట్ల కలిగి ఉన్న భావనకు అనుగుణంగా నేను అతనితో వ్యవహారం చేస్తాను”. (బుఖారీ) 3) అల్లాహ్‌ యెడల గట్టి నమ్మకం కలిగి ఉండటం. ఆయనపై మనసును లగ్నం చెయ్యడం. 4) ఆశాభయాల మధ్యస్థ స్థితిలో ఉండటం: ఇమామ్‌ అహ్మద్‌ (ర) ఇలా అన్నారు: విశ్వాసి జీవితం ఆశాభయాల నడుమ ఉండాలి. అందులో దేని పాళ్ళు అధికమయినా సదరు వ్యక్తి వినాశనం ఖాయం. 5) విధిరాత పట్ల విశ్వాసం కలిగి ఉండటం: ”ఏ ఆపదయినా సరే – అది భూమి లో వచ్చేదయినా, స్వయంగా మీ ప్రాణాలపైకి వచ్చేదయినా – మేము దానిని ప్టుించక మునుపే అదొక ప్రత్యేక గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఇలా చేయడం అల్లాహ్‌ాకు చాలా తేలిక”. (హదీద్‌; 22) ఇబ్నుల్‌ ఖయ్యిమ్‌ (ర) ఇలా అన్నారు: ”దాసుని జీవితంలో నచ్చని ఏదేని విషయం జరిగినప్పుడు అతన్ని ఆశవాదిగా మలిచే, అతని థను, దిశను మార్చే మేలిమి ఘ్టాలు ఆరు ఉంాయి. 1) తౌహీద్‌ ఘట్టం-తనకు అలా జరగాలని నిర్ణయించిన వాడు కేవలం అల్లాహ్‌ా మాత్రమే. ఆయన తలచింది అయి తీరుతుంది. ఆయన తలచనిది ఎన్నికీ అవ్వదు. 2) న్యాయ ఘట్టం – తన జీవితంలో ఏం జరగాలో ముందే ఖరారయింది. తన విషయంలో చేసిన అల్లాహ్‌ తీర్పు పూర్తి న్యాయబద్ధమయినది. 3) కరుణ ఘట్టం- తనకు జరిగిన దాని విషయంలో అల్లాహ్‌ా కోపంకన్నా కరుణ పాళ్ళె అధికం. ప్రతీకా రంకన్నా ప్రేమ పాత్రే మిన్న. 4) యుక్తి ఘట్టం – తనకు ఏది జరిగినా, అది అల్లాటప్పగా జరిగినది ఎంత మాత్రం కాదు. ప్రణాళిక బద్ధంగా ఆయన యుక్తి లోబడే జరుగుతుంది. ఆయన యుక్తి ఎన్నికీ వృధా అయ్యేది కాదు.5) ప్రశంసా ఘట్టం – అల్లాహ్‌ పూర్ణ ప్రశంసకు అర్హుడు, సంపూర్ణ స్తుతికి పాత్రుడు. ఆయన ఏది చేసినా అన్ని కోణాల దృష్ట్యా ప్రశంసాభరి తమే. లోపానికి, వంక పెట్టడానికి ఆస్కారమే లేదు. 6) దాస్య ఘట్టం – తను కేవలం అల్లాహ్‌ా దాసుడు మాత్రమే. దాసుని పని యజమాని ఆదేశ పాలన. ఆయన తీర్పుకి శిరసా వహించడం, ఆయన ఆజ్ఞలకు లోబడి జీవిం చడం. (అల్‌ ఫవాయిద్‌) పై ఘ్టాలను దృష్టిలో పెట్టుకుంటే జీవితానికి సంబంధించిన ఏ ఘట్టమూ మనల్ని నిరాశకు గురి చేయజాలదు. మరే ఘటనా వెలుగుతూ ఉండాలను కునే మన జీవన జ్యోతిని ఆర్పజాలదు. 6) విపత్తు విరుచుకు పడినప్పుడు సహనం పాటించడం: ”బాధ కలిగిన ప్రథమ స్థితిలోనే సహనం” అన్నారు ప్రవక్త (స). (బుఖారీ, ముస్లిం) అలాగే ”తనకు ఎదురయిన కష్టం, నష్టం కారణంగా మీలో ఎవరూ మరణాన్ని కోరుకోకూడదు. ఒక వేళ ఆపద చాలా తీవ్రమయినదయితే, తప్పనిసరి అనుకుంటే ఇలా ప్రార్థించాలి: ”ఓ అల్లాహ్‌! జీవితం నా కోసం సంక్షేమంగా ఉన్నంత కాలం నన్ను బ్రతికి ఉంచు. ఒకవేళ మరణమే నా పాలిట శ్రేయస్కరం అయితే నాకు మరణాన్ని ప్రసాదించు”. (అబూ దావూద్‌) వై మీ అనడం తప్పే, ట్రై మీ అనడం తప్పే: నాకే ఎందుకీ కష్టాలు అనడమూ తప్పే, కష్టాలను రమ్నను చూద్దాం అనడమూ తప్పే. వచ్చిన కష్టానికి కలత చెందకూడదు, రాని కష్టాన్ని కవ్వించి రమ్మనకూడదు. ఎందుకంటే ”నిశ్చయంగా కష్టంపాటే సౌలభ్యం ఉంటుంది” (అష్షరహ్‌: 5) అంటున్నాడు అల్లాహ్‌. 7) స్వీకరించబడుతుంది అన్న నమ్మకంతో దుఆ: దుఆ చేసిన వ్యక్తి మూడింలో ఏదోకి తప్పకుండా లభిస్తుంది అన్నారు ప్రవక్త (స). 1) అతను కోరుకున్న అతనికి దక్కుతుంది. 2) అతని మీద రాబోయే ఆపద తొలగించ బడుతుంది. 3) అల్లాహ్‌ యుక్తి లోబడి పై రెండూ జరగని పక్షంలో ప్రళయ దినాన స్వర్గంలో అతని అంతస్థులను పెంచే అమల సాధ నం అవుతుంది. 8) కారకాలను ఆశ్రయించడం: ”నా కుమారుల్లారా! మీరు వెళ్ళి యూసుఫ్‌ను గురించీ, అతని సోదరుని గురించి బాగా వాకబు చేయండి. అల్లాహ్‌ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి”. (యూసుఫ్‌: 87) 9) ఐహిక అనాసక్తత: అల్లాహ్‌ ప్రాపంచిక లాభాలను ఇష్టమున్న వారిని, ఇష్టం లేని వారికీ ప్రసాదిస్తాడు. అయితే పరలోక ప్రయోజనాలు మాత్రం ఆయనకు ఇష్టమయిన వారికే లభిస్తాయి. అలా చూస్తే ప్రాపంచిక ప్రయోజనాలు, సౌఖ్యాలు, కనీస సౌకర్యాలు సయితం లభించని మహానుభావులు ఎందరో అగుపిస్తారు. 10) అవిరళ కృషి: ‘కృషితో నాస్తి దుర్భిక్షం’ అన్నట్టు మనిషి పట్టుదలతో ప్రయత్నిస్తే సమస్య దానంతట అదే సమసి పోతుంది. ఇబ్నుల్‌ ఉథైమీన్‌ (రహ్మ) తన గురువు అబ్దుర్రహ్మాన్‌ సఅదీ (రహ్మ) గారి మాటను ఉటంకిస్తూ -”నహూలో కూపా వాసులకు గురువయిన కసాయీ (రహ్మ) నహూ విద్యను అర్జించే ప్రయత్నంలో విఫలమయ్యారు. కాసింత నైరాశ్యానికి గురయ్యారు, ఒక రోజు – ఓ చీమ ఆహారాన్ని మోస్తూ గొడ ఎక్కే ప్రయత్నం చేస్తోంది. అలా పైకి ఎగబ్రాకడానికి ప్రయత్నించినప్పుడల్లా జారి క్రింద పడి పోతున్నది. అయినా ప్రయత్నించడంలో ఓడి పోకుండా చివరికి కఠినమయిన ఆ కనుమను దాింది. గోడపైకి ఎక్కేసింది. అది చూసిన ఇమామ్‌ కసాయీ లోలోన ఇలా అనుకున్నారు: ”నిలకడ కలిగిన ఈ చీమ తన అవిరళ కృషితో తాను అనుకున్నది సాధించ గలిగినప్పుడు, నేను సృష్టి శ్రేష్టుడనయి ఉండి సాధించ లేనా?” కఠోర సాధన చేశారు,నహూ విధ్యలో గురువులకు మించిన గురువుగా చరిత్రలో ఖ్యాతి గడించారు. కాబట్టి మనం నకారాత్మకంగా స్పందించక, సకారాత్మక స్ఫూర్తితోి సత్ఫలితాలను రాబ్టాలి, రాబట్ట గలం!

నీలో దీపం వెలిగించు, నీవే వెలుగై వ్యాపించు - Light a lamp in you, let yourself shine and spread

నీలో దీపం వెలిగించు, నీవే వెలుగై వ్యాపించు ఆత్మహత్యల మాటకొస్తే, అనాదిగా ఈ ఘోరాలు మనం వింటున్నవే. కాదనం. కానీ, అది భరించుకోగలిగినంత శాతంలోనే జరిగింది. కానీ ఈనాటి పరిస్థితి ఎలా మారిపోయిందంటే ఆత్మహత్య వార్త లేని రోజంటూ లేకుండా పోయింది.
క్షణికొద్రేకానికి లోనయి తప్పుడు పనులు చెయ్యడం, క్షణికమైన ఆవేశానికి లోనయి హత్యలు చెయ్యడం, క్షణికమైన ఒత్తిడికి లోనయి ఆత్మహత్యలు చేసుకోవడం వివేకవంతుల లక్షణం కాదు.. వారు సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఉన్నవారే కావొచ్చుగాక.. ఒక్క క్షణాన్ని తమ చెప్పుచేతల్లోకి తీసుకోలేనివారు అంతకు ముందు సమాజానికి ఏమి చెప్పినా ఏమి చేసినా నిరర్ధకమే. "మాటలు కాదు చేతలు, ఉదాహరణలు చెప్పకు నీవే ఒక ఉదాహరణగా మారు" అంటారు. లోకజ్ఞానం సముద్రమంత వున్నా బిందువంత ఆత్మ జ్ఞానం లోపిస్తే మనిషి జీవితానికి అర్ధం వుండదు.. అందుకే కేవలం మనో వికారాలకి లోనయ్యే ప్రపంచ జ్ఞానం కన్నా, మనలో ప్రకాశాన్ని వికాసాన్ని కలిగించే ఆధ్యాత్మిక పరిజ్ఞానం నేటి సమాజానికి ఎంతయినా అవసరం.. అందుకే సినారె గారు - "నీలో దీపం వెలిగించు, నీవే వెలుగై వ్యాపించు" అన్నారు. నేటి ఒంటికాయ శొంఠి కొమ్ము బతుకులు మనుషుల జీవితాల్లో నిరాశా నిస్పృహలనే మిగులుస్తున్నాయి. చదువులు పెరిగాయి, జీతాలు పెరిగాయి, జీవితావసరాలు వున్నవాటికన్నా రెట్టింపు పెరిగాయి. సౌకర్యాలు పెరిగాయి, సౌలభ్యాలు పెరిగాయి. దానితో పాటు మనిషికి మనిషికీ మధ్య సంబంధ బాంధవ్యాల దూరాలు కూడా చాలా చాలా పెరిగాయి. దానివలన మనుషుల్లో అభద్రతా భావం అధికంగా పెరిగిపోయింది. సమాజంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు గల గొప్ప గొప్ప సంస్థలకి అధిపతులు, రాజకీయనాయకులు, సినీ కళాకారులు, రచయితలూ యీ కోవకి చెందిన వారే ఆత్మహత్యలకి అధికంగా పాల్పడుతుండడానికి కారణం ఒక్కటే... అదే ఒత్తిడి, భరించలేని మానసిక ఒత్తిడి.. ఉన్నదాన్ని నిలుపుకోలేక, లేనిదాన్ని అందుకోలేక నడుమ నలిగే మానసిక సంఘర్షణకి చరమ గీతం ఆత్మహత్య అన్న భావానికి లోనవుతున్నారు. ఇటీవల మనస్తత్వశాస్త్ర విశ్లేషకుడు ఒకాయన నేటి ఆత్మహత్యల వెనుక నున్న కారణాలను విశ్లేషిస్తూ, "మెదడులో కొన్ని రసాయనిక పదార్థాలు లోపించడం వలన రక్త ప్రసరణ మెదడుకి అందక ఆ అస్తవ్యస్త పరిస్తితిలో ఆత్మహత్యకి పాల్పడతారు" అని చెప్పారు.. అంటే ఇంచుమించు బ్రెయిన్ డెడ్ లాటిదన్నమాట. బ్రెయిన్ డెడ్ అంటే మనిషి జీవచ్చవమే కదా! ఈ దయనీయ స్థితికి కారణం అధిక మానసిక ఒత్తిడి, భరించలేని, తట్టుకోలేని మానసిక ఒత్తిడి అంటాడాయన.. అటువంటి స్థితిలో ఎవరయినా దగ్గర వుంటే, వారి స్థితిని గ్రహించి, సాంత్వన పలుకుతూ, వెన్నుతట్టి, నీకు భయం లేదు, నేనున్నాను అని ప్రోత్సహిస్తే కొంత ఒత్తిడి తగ్గి మెదడులో చలనం కలగవచ్చు, లేదంటే తమకి అత్యంత ప్రియమైన వారి ఫోటోలను తదేకంగా చూస్తూ వారికోసం నేను బ్రతకాలి అనే భావంతో కొంత ఒత్తిడి తగ్గించుకోవచ్చట... అటువంటి సమయాల్లో ఒంటరితనం అభద్రతా భావాన్ని పెంచుతుంది. ఆధ్యాత్మిక పరిజ్ఞానం నేటి సమాజానికి ఎంతయినా అవసరం: ఒకప్పుడు ప్రజల్లో పెద్దలంటే భయ గౌరవం, దేవుడంటే నమ్మకం ఉండేవి. దైవ భక్తీ ఉన్నవారిలో పాప భీతి వుండేది. ఆత్మహత్య మహా పాతకం అని నాటి పెద్దల మాటమీద నమ్మకం వుండేది. అందుకే ఎన్ని ఒడిదుడుకులు ఎదురయినా స్థైర్యంతో ఎదుర్కోగల మనో నిబ్బరం, సహనం ఉండేవి. అలాగే ఉమ్మడి కుటుంబాల వ్యవస్థ కూడా వెన్నుదన్నుగా వుండడం వలన తొందరపాటు నిర్ణయాలు తీసుకొనే అవకాశాలు తక్కువగా ఉండేవి. నేడు ఉమ్మడి కుటుంబాల వ్యవస్థ అనేది పూర్తిగా హ్రస్వమై పోయింది. తాతయ్య, నానమ్మ, అమ్మమ్మ, పిన్ని, బాబాయిలు, మామయ్యలు అందరితో కళకళలాడే నాటి నిండు కుటుంబాలు సినిమాల్లో తప్ప నిజజీవితంలో మచ్చుకయినా కానరావడం లేదు. ఆత్మహత్య అంటే 'తనని తాను అంతమొందించుకోవడం..' అనే ఈ ఘోరమైన ఆలోచన ఎలా వస్తుంది? ఎలాటి కారణాలు ఆత్మహత్యకి ఉసిగొల్పుతాయి? • అధిక శాతం జీవితంలో ఎదురయ్యే ప్రతికూల సంఘటనలు, అనుభవాలు, వైఫల్యాలు ప్రధాన కారణాలు అని చెప్పాలి. దీని వల్ల కలిగే నిరాశ నిస్పృహల వల్ల బ్రతకాలనిపించదు. శరీరం నించి ప్రాణం వెళ్ళిపోతేనే తప్ప ఆత్మకి శాంతి దొరకనంత అశాంతి వల్ల, ఆత్మహత్య చేసుకోడానికి సిద్ధపడతారు. ఎలాటి పరిస్థితుల్లోనైనా ఊపిరి ఆగిపోవాలి అనే బండ నిర్ణయం వల్ల ఈ కఠినమైన శిక్ష విధించుకుంటారు. * ఎంతో ఆశతో విదేశాలకెళ్ళినప్పుడు అక్కడ నీరు గార్చే హీన పరిస్థితుల్లో బ్రతుకీడ్చడం ఇష్టం లేక, ఆత్మహత్యలకు పాల్బడుతున్న వారెందరో. తన తప్పిదం వల్ల ఒక మనిషి చనిపోయాడన్న పశ్చాత్తాపంతో, పాప భీతి వెంటాడటంతో ప్రాయచ్చిత్తంగా – ఇటీవలే ఒకతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక దుర్వసనాల ఊబిలో చిక్కిన వారిలో - మద్యానికి, డ్రగ్స్కీ బానిసలైన వారు, పర స్త్రీ వ్యామోహం, విశృంఖలత్వం, నయము కాని అంటు వ్యాధులు ప్రబలి, చివరికి ఆత్మహత్యతో జీవితాన్ని అంతమొందించు కోవాలనుకుంటారు. ఇక యువతలో ఐతే, చదివే చదువు ఏ మాత్రం బుర్రలోకి వెళ్లక, సిలబస్ అర్థం గాక డిప్రెస్ అవుతున్నారు. ఇలా ఆత్మవిశ్వాసం లోపించినప్పుడు, లేదా టీజింగ్, రాగింగ్, ఇంకా - రాంక్ రానందుకు, ప్రేమ వైఫల్యమైనప్పుడు, లేదా పెళ్ళికి పెద్దలు అంగీకరించనప్పుడు, ఉద్యమాల ఉద్రేకంలోనూ – ఆత్మహత్యలు జరుగుతుంటాయి. * ఇటీవల కాలంలో చిన్న చిన్న కారణాలకు కూడా ప్రాణాలు తీసుకుంటున్న మొండి వైఖరిని చూస్తున్నాం. సినిమాకి తీసుకెళ్లలేదనీ, గేమ్స్ ఆడనీకుండా, తల్లి తండ్రులు సెల్ లాగేసుకున్నారనీ, పుట్టింటికి పంపలేదనీ.. ఇలాటి చిన్న చిన్న కారణాలుగా కూడా ఆత్మహత్యలకి పాలబడుతున్నారు. * రేప్ - అతి భయంకరమైన సామాజిక కారణంగా చెప్పుకోవాలి - ఆత్మహత్యల వెనక నిలుస్తున్న ఇదొక పెద్ద కారణం. చాలా నేరాలు కప్పేయ బడుతున్నాయి. స్త్రీలపై జరుగుతున్న లైంగిక దాడులు హింసలు అనేకానేక రకాలు. వాట్ని భరించలేక స్త్రీలు ఆత్మహత్యకు తలపడుతుంటారు. * పరువు ప్రతిష్ఠలు దెబ్బ తిన్నప్పుడు, నలుగురిలో తలెత్తుకోలేక కొందరు ఉన్నత విద్యావంతులు, వైద్యులు సైతం ఆత్మహత్యలు చేసుకుంటారు. నమ్మిన వాని వలలో ట్రాప్ అవడం, ఆ పైని బ్లాక్ మెయిలింగ్, మెంటల్ టార్చర్, గృహ హింసలు తట్టుకోలేక గృహిణిలు సూసైడ్ చేసుకుంటున్నారు. • పెళ్ళి కాకుండా మిగిలిపోవడం, ఒంటరితనం, పెళ్లైన వారికి సంతానం కలగకపోవడం. పోషించే భాగస్వామి మరణించడం, అంగవైకల్యం గల సంతానాన్ని కలిగి వుంటం, కుటుంబ తగాదాలు, కక్షలు, ప్రతీకారాలు, ఇవన్నీ వ్యక్తిగత కారణాలుగా నిలుస్తాయి. • అనైతిక సంబంధాలు, శారీరక రుగ్మతలు, ఎలాటి వైద్యానికీ నయం కాని దీర్ఘ కాల జబ్బులు, భరించుకోలేని బాధలు, - గ్రహించలేని మానసిక వ్యాధులు, భయ భ్రాంతులు, అపోహలు, అనుమానాలు, మూఢ నమ్మకాలు, అజ్ఞానం ఇవన్నీ కూడా కారణం. ఇవి ఎక్కువ గా పల్లెల్లో నివసించే వారిని బాధిస్తున్న సమస్యలు. * పిల్లలు కిడ్నాప్ అయినప్పుడు, కళ్ళ ముందే తమ వారిపై దారుణాలు జరిగినప్పుడు, ఆక్సిడెంట్స్ రక్త సంబంధీకులను పొగుట్టుకున్నప్పుడు, వృద్ధాప్యంలో పిల్లలకి భారమయినప్పుడు, ఆర్థికంగా దిగబడిపోతున్నప్పుడు - ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతోంది. * ఆర్ధిక పరమైన కారణాలు: అప్పులు చుట్టు ముట్టి, తీర్చలేక పోవడం, ఆస్తిని పోగొట్టుకున్నప్పుడు, కోర్ట్ కేసు గెలవలేకపోయినందుకు, పెద్ద పెద్ద వ్యాపారాలలో భారీ నష్టం వచ్చినప్పుడు, కంపెనీ మూసేయాల్సి వచ్చినప్పుడు, ఇల్లు, ఆస్తి, మూలధనం, భూమి, కోల్పోయినప్పుడు తనువు చాలించడమొకటే మార్గంగా నిర్ణయానికొస్తున్నారు. ప్రకృతి బీభత్సాలు, వైపరీత్యాలు, సమాజానికి కూడా, మనిషికి మల్లేనే శరీరం వుంటుంది. అవయవాలూ వుంటాయి. బాడీ టెంపరేచర్ వుంటుంది. సమ ఉష్ణోగ్రతలో వుంటేనే ఆరోగ్యంగా వున్నట్టు. మించిన అధిక ఉష్ణోగ్రతలున్నప్పుడు దానికీ మనలానే జ్వరం వచ్చినట్టు. వెంటనే పట్టించుకోకపోతే, మూలపడుతుంది. మూల్గుతూ వుంటుంది. ఆ! ఏడ్వనీ అని వొదిలేస్తే చివరికి కోమాలో కెళ్తుంది. ఆ పైన ప్రాణాలే కోల్పోతుంది. సమాజం అనారోగ్యం పాలైతే.. మనిషీ ఆరోగ్యం గా బ్రతకలేడు. అది చచ్చిపోయాక, మనిషి బ్రతికీ జీవచ్చవమే అవుతాడు. ఇది సత్యం.అదీ - మనకీ, సమాజంలో జరిగే మంచి చెడుల సంఘటనలకీ మధ్య గల సంబంధం బాంధవ్యం. రేయీపగలులా, చెట్టూ విత్తనంలా, జననం మరణంలా మనమూ, సమాజమూ! సమాజం బావుంటే మనమూ బావుంటాం.

ఏతెకాఫ్ ప్రాశస్త్యం- etikaf is recommended

మీరు మసీదుల్లో ఎతెకాఫ్‌ (తపోనిష్ఠ) పాటిస్తున్నప్పుడు మాత్రం మీ భార్యలను కలుసుకోకూడదు. ఇవి దేవుడు నిర్ణయించిన హద్దులు. వాటి దరిదాపు లకు వెళ్ళకండి. (బఖరః - 187) రమజాను మాసం ఉందన్న భరోసాతో చెబుతున్నాను: పశ్చాత్తాపం చెందిన మనస్సుతో, అశ్రువులు నిండిన కళ్ళతో మీ ప్రభువు సన్నిధిన మోకరిల్లండి. పూర్తి ఏకాగ్రతతో ఆయన వైపునకు మరలండి. రమాజను మాసంలోని ప్రతీ రాత్రి అనేకానేక మందిని నరకాగ్ని నుండి ముక్తిని ప్రసాదించే ఆ మోక్ష ప్రదాత, ప్రతి రోజు యేడాది సాంతం ‘రాత్రి తప్పు చేసిన వారున్నారా! రండి నేను మీ తప్పులను మన్నిస్తాను, ఉదయం తప్పు చేసిన వారున్నారా? రండి నేను మీ తప్పులను మన్నిస్తాను’ అని క్షమాశీలి మీకిస్తున్న పిలుపు ఇది: ”తమ ఆత్మలపై అన్యాయం చేసుకున్న ఓ నా దాసులారా! నా కారుణ్యం యెడల నిరాశ చెందకండి. నిశ్చయంగా అల్లాహ్‌ సకల పాపాలను మన్నిస్తాడు. నిస్సందేహంగా ఆయన పరమ క్షమాశీలి, అపార దయా నిధి”. (జుమర్‌; 53)
ఈ ప్రభువు వరాల వసంతం మీ ప్రాంగణంలో లైలతుల్‌ ఖద్ర్‌ శుభాలతో పాదం మోపుతుంది. లైలతుల్‌ ఖద్ర్‌ రాత్రి ఒక్క ఘడియ 30 వేల ఘడియల కంటే విలువయినదిగా మారి పోతుంది. ఈ మాసంలోని క్షణక్షణం క్షమా వర్షం కురుస్తూనే ఉంటుంది. ఈ మాసంలో కురిసే క్షమను మీరు కోరుకున్నట్లే, మీ నుండి మీ తల్లిదండ్రులు, భార్య పిల్లలు, బంధు మిత్రులు, ఆప్తులు, సహుద్యోగులు, స్నేహితులు, మీ వద్ద పని చేసే వారు సయితం కోరుకుంటారు. వారిని క్షమించడం అలవాటు చేసుకోండి. కోపాన్ని ద్రిగమింగండి, అందరి యెడల ఉదార వైఖరి కలిగి వ్యవహరించండి. విశ్వాసం తర్వాత స్వర్గానికి అర్హుల్ని చేసేది మీ ఉత్తమ నడక, నడవడికే అని గుర్తించండి. ”బంధుత్వాన్ని బల పర్చేవారిని నేను బల పరుస్తాను, దాన్ని విచ్ఛిన్న పరచిన వారిని నేను విచ్ఛిన్న పరుస్తాను” అని స్వయం అల్లాహ్‌ మాటిచ్చాడు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. రమజాను మాసం మన ముంగిట వాలిన దైవ అతిథి. ఈ మాసాన్ని మీరు సత్కరించా లంటే, సహరీ, ఇఫ్తార్‌ వేళల్లో షడ్రుచులు మేళవించిన ఆహార పదా ర్థాలు పేర్చడం వల్ల కుదరదు. నిజంగా మీరు నన్ను సత్కరించాలంటే, ఖుర్‌ఆన్‌ పారాయణాల ద్వారా,తరావీహ్‌ నమజుల ద్వారా, దాన ధర్మాల ద్వారా, ఏతికాఫ్‌, లైలతుల్‌ ఖద్ర్‌ అన్వేషణ ద్వారా, నిరతం అల్లాహ్‌ నామ స్మరణ చెయ్యడం ద్వారా మాత్రమే కుదురుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మాసాన్ని సత్కరించడం అంటే మీ సత్కారానికి, ప్రభువు మీకు చేసే సన్మానానికి మార్గం సుగమం చేసుకోవడమే. ఈ మాసాన్ని మీరు ఎంతగా సత్కరిస్తారో అల్లాహ్‌ మీ యెడల అంతకు మించి ప్రసన్నుడవుతాడు. ఈ ప్రపంచానిదేముంది,ఇదో మాయా వస్తువు, మోసం, ఆట విడుపు అంతే. అసలు జీవితం పరలోక జీవితం. అసలు సంతోషం పరలోక సంతోషం, అసలు విజయం పరలోక విజయం. అవును, ‘ఎవరు నరకాగ్ని నుండి కాపాడ బడి స్వర్గంలో ప్రవేశం కల్పించ బడ్డారో వారే మహోన్నత విజయాన్ని సొంతం చేసుకున్న వారు”. (ఆల్‌ ఇమ్రాన్‌;185) రమజాను మాసం దుఆల మాసం కూడా. లేవండి! అల్లాహ్‌తో మీ బాధల్ని చెప్పు కోండి. మీరు పడ్డ కష్టాల్ని, నష్టాల్ని ఆయనతో షేర్‌ చేసుకోండి. మీ మొరలను ఆలకించేవాడు ఆయన, మీ అక్కరలను తీర్చేవాడు ఆయన. ప్రపంచంలో జరుగుతున్న దాష్టికాన్ని, ఫలస్తీనాలో సాగుతున్న పైశాచికాన్ని, సిరియాలో రగులుతున్న మారణ హోమాన్ని, ఇరాక్‌లో సాగుతున్న కీచక క్రీడను, యమన్‌లో రాజేయబడిన నిప్పు కుంపటిని, జాతీయ స్థాయిలో జరుగుతున్న దౌర్జన్యాన్ని, అంతర్జాతీయ స్థాయిలో జోరు మీదున్న దుష్ప్రచారాన్ని – అంతా అల్లాహ్‌తో చెప్పుకొని ఏడ్వండి. అంతా వినేవాడు, ఎవరికి ఎప్పుడు ఏది ఇవ్వాలో ఇచ్చేవాడు ఆయనే. ఆయన అందరికన్నా అధిక ప్రేమ గలవాడు, అందరికన్నా అధిక కరుణ గలవాడు, అందరి కన్నా అధిక క్షమ గలవాడు, అందరికన్నా ఎక్కువగా మనల్ని రక్ష్షించే వాడు, అందరికన్నా ఎక్కువగా మనల్ని అనుగ్రహించే వాడు. అందరి కన్నా గొప్ప ఉపాధి ప్రదాత, విధి విధాత, మహోన్నత ఆర్ష్‌కి యజమాని. ఇవన్నీ మనం నిష్టగా చేసుకోవాలంటే - ఏతికాఫ్ కు మించింది ఏది లేదు. హజ్రత్ ఇబ్నె ఉమర్ (రజి) కథనం: దైవప్రవక్త (సల్లం) రమజాన్ మాసంలోని చివరిదశకంలో ఏతెకాఫ్ పాటించేవారు. (బుఖారీ-ముస్లిం) హజ్రత్ ఆయిషా (రజి. అన్హ) కథనం: దైవప్రవక్త (సల్లం) జీవితాంతం రమజాన్ మాసంలోని చివరి దశకంలో ఏతెకాఫ్ పాటించారు. ఆయన తర్వాత ఆయన సతీమణులు (కూడా) ఏతెకాఫ్ పాటించారు. (బుఖారీ-ముస్లిం) రమజాన్ మాసంలోని చివరి దశకంలో ఏతెకాఫ్ పాటించటం దైవప్రవక్త సంప్రదాయం. స్త్రీలు కూడా ఏతెకాప్ లో కూర్చోవచ్చు. అయితే ఏతెకాఫ్ ఇంట్లో కాదు, మస్జిద్లోనే పాటించాలి. అందుకని ఒకవేళ మస్జిద్లో స్త్రీల కొరకు పురుషుల నుండి వేరుగా ప్రత్యేకంగా, పూర్తి కట్టుబాట్లతో ఏతెకాఫ్ పాటించటానికి అవకాశముంటే అలాంటి చోట్ల స్త్రీలు ఏతెకాఫ్ పాటించవచ్చు. లేకపోతే వారు ఏతెకాఫ్ పాటించకపోవటమే మంచిది. హజ్రత్ ఆయిషా (ర.అ) కథనం : “(రమజాన్ నెల) చివరి దశకం మొదలైందంటే చాలు, దైవప్రవక్త (సఅసం) రాత్రి జాగారం కోసం ఉపక్ర మించేవారు. తన సతీమణులను కూడా మేల్కొనమనేవారు.” (బుఖారీ, ముస్లిం) హజ్రత్ ఆయిషా (ర.అ) కథనం : “దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ‘ఏతెకాఫ్' కొరకు సంకల్పిం చుకుంటే ఫజ్ నమాజ్ చేయగానే 'ఏతెకాఫ్' స్థానంలోకి వెళ్ళిపోయేవారు." (బుఖారీ, ముస్లిం) మరో హదీసు : దైవప్రవక్త (సఅసం) జీవితాంతం - రమజాన్ చివరి దశకంలో ఏతెకాఫ్ పూనేవారు. ఆయన (స) మరణించిన తరువాత ఆయన (స) సతీ మణులు ఏతెకాఫ్ పాటించసాగారు. (బుఖారీ, ముస్లిం) ఏతెకాఫ్ సున్నత్ అన్న దానికి ఈ హదీసు తార్కాణం. దైవప్రవక్త (స) తన జీవితకాలంలో దీనిని ఏటేటా పాటించగా, ఆయన (స) తదనంతరం ఆయన (స) సతీమణులు దీనిని అనుసరించారు. హజ్రత్ ఆయిషా కథనం : దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మస్జిద్ (ఏతెకాఫ్ స్థితిలో) నుండగా తన తలను నా వైపునకు జరిపే వారు. నేను ఆయన (స) తల దువ్వే దానిని. ఆయన (స) ఏతెకాప్ లో ఉన్నప్పుడు - కాలకృత్యాలు తీర్చుకోవటానికి తప్ప ఇంటికి వచ్చేవారు కాదు. (బుఖారీ, ముస్లిం-) హజ్రత్ ఆయిషా (ర.అన్హా) ఇలా వివరించారు : “ఏతెకాఫ్ వ్రతానికి పూనుకున్నవారు వ్యాధిగ్రస్తులను పరామర్శించరాదు, అంత్యక్రియల (జనాజా) నమాజులో పాల్గొనరాదు, భార్యను ముట్టుకోవటం గానీ, సంభోగించటం గానీ చేయరాదు. కాలకృత్యాలు తీర్చుకోవటానికి తప్ప మస్జిద్ బయటికి వెళ్లరాదు. జామె మస్జిద్ తప్ప ఏతెకాఫ్ పాటించరాదు. ఇది సున్నత్ (ప్రవక్త సంప్రదాయం).” (అబూ దావూద్,) ఏతెకాఫ్ మొత్తానికి మస్జిద్ లోనే పాటించాలి. జామె మస్జిద్ అంటే ఇక్కడ భావం ఏమిటీ? ఏ మస్జిద్లో సామూహిక నమాజ్ జరుగుతుందో ఆ మస్జిద్ నిస్సంకోచంగా 'ఏతెకాఫ్' పాటించ వచ్చునని ఇమామ్ అహ్మద్, ఇమామ్ అబూ హనీఫా (రహ్మ) అభిప్రాయపడ్డారు. హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు - “ఏతెకాఫ్ లో ఉన్న వారికై ఉపవాసం అనివార్యం కాదు. ఒకవేళ వారు దాన్ని తమపై విధించుకుంటే విధించు కోవచ్చు.” (దీనిని దారెఖుత్నీ, హాకిమ్ ఉల్లేఖించారు ) రమజానేతర మాసాల్లో 'ఏతెకాఫ్' పాటించేవారు ఉపవాసాన్ని విధిగా పాటించాలా? పాటించకపోయినా ఫరవాలేదా? ఈ విషయమై విద్వాంసుల మధ్య భేదాభిప్రాయముంది. ఉపవాసం పాటించాల్సిందేనని అత్యధిక మంది భావించారు. అయితే దీనికి సంబంధించి స్పష్టమయిన మూలాధారం ఏదీ లేదు. దైవప్రవక్త (స) ఉపవాసం పాటించకుండా 'ఏతెకాఫ్'లో కూర్చున్నట్టు కూడా ఎలాంటి ఆధారం లేదు. ఉపవాసం పాటించగలిగిన పక్షంలోనే 'ఏతెకాఫ్'కు పూనుకోవాలన్న నిబంధన కూడా ఏదీ లేదు. లైలతుల్ ఖద్ర్ ను పొందే పునీత ప్రాతం ఎతికాఫ్ సజ్జనులయిన మన పూర్వీకులు మూడు పదులను గొప్పవిగా భావించేవారు. రమజాను చివరి దశకం, జుల్‌హిజ్జహ్‌ తొలి దశకం, ముహర్రమ్‌ మొధటి పది రోజులు. ఈ మూడు పదుల్లో రమజాను చివరి దశకానికి అగ్ర పీఠం కట్టబెట్టేవారు. కారణం ఈ పది రాత్రుల్లో లైలతుల్‌ ఖద్ర్‌ ఉండటమే. ఈ రాత్రి దైవ దూతల నాయకుడ యిన జిబ్రీల్‌ (అ) ఇతర దైవ దూతల తోడు దివి నుండి భువికి దిగి వచ్చి ఫజ్ర్‌ వేళ అయ్యేంత వరకూ ఉంటారు అంటుంది ఖుర్‌ఆన్‌. లైలతుల్‌ ఖద్ర్‌ చివరి దశకంలో బేసి సంఖ్య గల రాత్రుల్లో ఉంటుంది అని స్వయంగా ప్రవక్త (స) వారు తెలియజేశారు. ఇతరత్రా ఉల్లేఖనాల ద్వారా రమజాను 27వ తేదీ ఉండే అవకాశాలు ఎక్కువ గా ఉన్నా అన్య రాత్రులలో సయితం అన్వేషణ కొన సాగాలి. ఆ రాత్రికే పరిమితం అయి పోవడం సబబు కాదు. చివరి దశకంలోని ప్రతి రాత్రి-”అల్లాహుమ్మ ఇన్నక అఫువ్వున్‌ తుహిబ్బుల్‌ అఫ్వ ఫఅఫు అన్నీ” అని దుఆ చేస్తూ ఉండాలి. రమజాను చివరి రాత్రి అల్లాహ్‌ ముస్లిం సముదాయానికి క్షమాభిక్ష పెడతాడు. వారికి చెందాల్సిన వెతనాన్ని ఆ రాత్రినే పంచి పెడతాడు. అల్లాహ్‌ మనందరి తప్పిదాలను మన్నించి, ఇహపరాల మనల్ని

అన్యోన్య దాంపత్యానికి అమల సాధనాలు

అన్యోన్య దాంపత్యానికి అమల సాధనాలు ఆయన మీకోసం మీజాతి నుండే జీవిత భాగస్వాము(స్త్రీ)లను సృజించాడు, వారి దగ్గర మీరు సౌఖ్యం పొందడానికి. ఇంకా ఆయన మీ మధ్య ప్రేమానురాగాలు, దయా దాక్షిణ్యాలను కూడా జనింపజేశాడు. ఇది కూడా ఆయన సూచనల్లోనిదే. యోచించే వారికి ఇందులో అనేక నిదర్శనాలున్నాయి. (21) వేర్వేరు కుటుంబాల నుంచి వచ్చిన ఇద్దరు వివాహ బంధంలోకి అడుగుపెడతారు. సంస్కృతి, సంప్రదాయాలు, అలవాట్లు భిన్నంగా ఉండే ఆ ఇరువురూ ఒకటై సుఖసంతోషాలతో జీవించాలంటే కొన్ని సూత్రాలు పాటించాలి. పనులను పంచుకుంటూ ప్రేమను పెంచుకోవాలి ఇంటి బాధ్యతలను పంచుకున్నట్లే ఇంటి పనులు కూడా నువ్వూ నేను సగం సగం అనుకుంటూ పూర్తి చేయాలి. మగవాడిని నేనెందుకు చేయాలి లేదా నాకు చేయడం రాదు అని తప్పించుకో కూడదు. చిన్నప్పుడు నేనీ పనులు నేర్చుకోలేదు అంటూ అమ్మాయిలు బద్దకించడానికి ప్రయత్నించకూడదు. ఇలా చేస్తే తమకు ఎదుటివారి చేయూత లేదు, మొత్తం పనంతా నాపైనే అనే భావన ఇవతలి వారికి కలిగే ప్రమాదం ఉంది. అలాకాకుండా ఇంట్లో సమానత్వానికి పెద్ద పీట వేయాలి. చిన్న పనిని కూడా పంచుకుంటూ చేస్తే చాలు. ఒకరిపై మరొకరికి మర్యాద, గౌరవం, ప్రేమ పెరిగి, ఇరువురి అనుబంధాన్ని మరింత పెంచుతాయి. ఓ కవి అన్నట్టు - ఆడుతు పాడుతు పనిచేస్తుంటే అలుపు సొలుపేమున్నది ఇద్దరుమొకటై చేయికలిపితే ఎదురేమున్నది మనకు కొదవేమున్నది.
ఓ సారి హజ్రత్ ఆయిషా (ర.అ)ను ప్రవక్త (స) వారిని గురించి ప్రశ్నించగా, ఆమె ఇలా వివరించారు: “ఆయన ఇంటి పనుల్లో 3 నిమగ్నులై ఉండేవారు. తన స్వహస్తాలతో చినిగిన దుస్తులకు అతుకులు వేసేవారు. ఇల్లు ఊడ్చేవారు. పాలు పితికేవారు. బజారు నుంచి సరకులు కొనుక్కువచ్చేవారు. చెప్పులు తెగితే స్వయంగా కుట్టుకునేవారు, నీరు తోడే బొక్కెనకు మరమ్మత్తు చేసేవారు. ఒంటెను తానే కట్టేసేవారు, దానికి మేత వేసేవారు. సేవకునితో కలసి పిండి కలిపేవారు". (సహీహ్ బుఖారీ) ఇంటి పెద్దలను గౌరవించాలి. తల్లిదండ్రులను.. ఇరువైపులా పెద్దలను భార్యాభర్తలిద్దరూ అభిమానించాలి. తమ వారిని బాగా చూసుకుంటూ ఎదుటివారి తల్లిదండ్రులను పట్టించుకోకుండా ఉండకూడదు. ఇలా చేస్తే అవతలివారు నొచ్చుకుంటారు. ఒక్కోసారి వారు వెంటనే దాన్ని పైకి చెప్పలేకపోవచ్చు. కానీ ప్రేమ క్రమేపీ తగ్గిపోయే అవకాశం ఉంది. దాని ఫలితంగా పరస్పరం ఆసక్తి క్రమేపీ తగ్గుతుంది. నిజమైన ప్రేమ లేని చోట బంధం బలహీనపడుతుంది. ఇది మరిన్ని దుష్పరిణామాలకు దారి తీస్తుంది. అలా కాకుండా ఇరువురూ జీవిత భాగస్వామి అమ్మా నాన్నలను కూడా సొంత వారిలానే ప్రేమించగలిగితే సమస్యలకు తావుండదు. ఎక్కడైనా, ఎప్పుడైనా పెద్దవాళ్లను గౌరవిస్తూ, వారి సలహాలు, సూచనలు తీసుకుంటూ ఉంటే వారి అనుభవాలే మనకు చక్కటి మార్గదర్శకత్వాన్ని అందిస్తాయి. ఈ రోజు భార్యాభర్తలు - వారి వారి అత్తామామల్ని, వారి వారి ఆప్తుల్ని, సంబంధీకుల్ని గౌరవిస్తే, రేపు వారికి వారిని గౌరవించే అల్లుళ్లు, కోడళ్ళు వస్తారు. మన ఇళ్లల్లో పని చేసేవారు కూడా కొన్ని సమయాల్లో పెద్దవారి ఉంటారు - వారిని సైతం గౌరవించాలి. మీరు అల్లాహ్‌నే ఆరాధించండి. ఆయనకు (దైవత్వంలో) ఎవరినీ సాటి కల్పించకండి. తల్లిదండ్రుల పట్ల సద్వర్తనంతో వ్యవహరించండి. బంధువులు, అనాథలు, నిరుపేదలతో మంచిగా మసలుకోండి. ఇరుగుపొరుగు బంధువులకు, పరిచయంలేని పొరుగువారికి, (మీ దైనందిన కార్యకలాపాలలో) తారసపడే మిత్రులకు, బాటసారులకు, మీ అధీనంలో వున్న బానిసలకు మేలు చేయండి. అల్లాహ్ అహంకారుల్ని, ప్రగల్భాలు పలికేవారిని ఎన్నటికీ ప్రేమించడు. (అన్-నిసా: 36) పరస్పరం దర్పణాలు దంపతులు ''ఒక విశ్వాసి మరో విశ్వాసి కోసం దర్పణం - అద్దం వంటి వాడు" అన్నారు ప్రవక్త (స). (అబూ దావూద్) అన్యోన్యత లేని చోట అనురాగం ఉండదు. అనురాగం లేని చోట ఆనందం అసలే ఉండదు. ‘దర్పణం’ అంటే.. అద్దం! అద్దంలో మన ప్రతిబింబం ఏ రీతిలో కనబడుతుందో, మనని మనం స్పష్టంగా ఎలా చూడగలమో, ఎలా చూస్తామో అలాగే దాంపత్య దర్పణంలో ఇతరులు కూడా స్పష్టంగానూ భార్యాభర్తల జీవితాలను, నడవడికను, వారి అన్యోన్యతను లేదా వారి కయ్యాలను, ప్రవర్తనలనుఅంటే స్పష్టంగా చూడగలుగుతారు. అడ్డం అబద్ధమాడదు, అన్యోన్య దాపత్యంలోనూ అబద్దాలు తావివ్వకూడదు. అద్దం మన రూపాన్నే, మనలోని అందాన్ని, వికారాన్ని మాత్రమే చూపుతుంది. కాబట్టి పరోక్ష నిందాఁకి పాల్పడకూడదు. అద్దం ముందున్నది మాత్రమే చొప్పిస్తోంది. కాబట్టి ఒకరి కూపీలు లాగటం, రంధ్రాన్వేషణ చేయడం మానుకోవాలి. అద్దం అనుమానించాడు, అవమానించదు. కాబట్టి పెనుభూతంగా మారే అనుమానానికి చోటివ్వకూడదు. అద్దం ముందు ఎవరు నిలబడినా, ధనికుడైనా -పేదవారైనా, అత్తయినా - కోడలయినా, మామయినా, అల్లుడయినా, ప్రజలైనా, ప్రముఖులైనా, మనిషైనా - మృగమైనా ఎవరైనా సరే, ఎవరికీ భయపడకుండా, నిర్భయంగా నిజాన్ని వ్యక్త పరురుస్తుంది కాబట్టి ఒక విశ్వాసి అద్దంలాగా మరొక విశ్వాసి పట్ల ధైర్యంగా ఉండాలి. ఏ వ్యక్తిత్వంచేనయినా ప్రభావితం కాకూడదు. భార్యాభర్తలు - ప్రతి ఒక్కరు వారికంటూ ఓ ప్రత్యేకమైన వెన్నుముక వ్యక్తిత్వం ఉండేలా చూసుకోవాలి. అద్దం మనం దాన్ని ఏదైనా అడిగినప్పుడే సమాధానం ఇస్తుంది. అనవసరంగా ఎవరి విషయంలోనూ తల దూర్చదు. భార్యాభర్తలు సయితం ఒండొకరి విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకొని, అతి ఉత్సాహానికి పోయి అనర్థాల్ని కొని తెచ్చుకోకూడదు. భార్యాభర్తల అన్యోన్యతలూ తగవులూ ఎదుటివారికీ, చుట్టూ వున్నవారికి తప్పనిసరిగా టీవీ సీరియల్‌లా, సినిమా రీలుగా కనిపిస్తూనే వుంటాయి. దర్పణంలో మనని మనమే కాక ఇతరులను ఎలా చూస్తామో, ఎలా చూడగలుగుతామో, అలాగే బాహ్య దర్పణం నుండి ఇతరులూ మనల్ని గమనిస్తూనే ఉంటారు. అందుకని దాంపత్యం అనేది మనకు మాత్రమే కాదు, చూపరులకీ ఆనందంగా, ఆదర్శంగా, ఆహ్లాదంగా అగుపించాలి. వింతగా, వెక్కిరించేలా, వెగటు కలిగించేలా అగుపించకూడదు. సర్దుకుపోతేనే సుఖం దాంపత్య జీవితంలో చిటపటలు, చిర్రుబురులు, చిలిపి తగాదాలు, సరససల్లాపాలు, సంసారంలో సరిగమలు లాంటివి ఎన్నో ఆసక్తికరమైన సంగతులుంటాయి. వివాహంతో రెండు శరీరాలు మాత్రమే కాదు, రెండు మనసులు కూడా ఒక్కటవుతాయి. ఎలాంటి కష్టనష్టాలు వచ్చినా, సుఖం దుఃఖం కలిగినా పరస్పర సలహా సంప్రదింపులతో చక్కదిద్దుకోవాలి. ఒకరి అభిప్రాయాలు ఒకరు పంచుకొంటే బంధం బలపడుతుంది. ప్రతిఒక్క విషయం ప్రేమగా చర్చించుకోవాలి. కావాల్సిన సలహాలు, సూచనలు చెబుతూ ఉండాలి. అలాగే స్వీకరించాలి కూడా. అపుడే ఇద్దరిమధ్య ప్రేమ శాశ్వతం అవుతుంది. ఎలాంటి సమస్యలున్నా వాటిని ఎదుర్కొనే శక్తి వస్తుంది. ఇంటి గుట్టును రట్టు చేయకూడదు బయటవారితో... కుటుంబ సమస్య ఏదైనా వచ్చినప్పుడు దాన్ని దంపతులిద్దరే తీర్చుకోవడానికి ప్రయత్నించాలి. బయటి వారితో చర్చించడం లేదా భాగస్వామి గురించి వారివద్ద చెడుగా మాట్లాడటం చేయకూడదు. మూడో వ్యక్తికి అవకాశం ఇస్తే, సమస్య అవతలివారి చేతిలోకి వెళ్లినట్లే. దాని గురించి మనకు అర్థమైనంతగా వారికి అర్థం కాకపోవచ్చు. ఒకసారి మనం అలా చర్చిస్తే, తిరిగి మళ్లీ ఎదురుచూడొచ్చు. ఇది మరో సమస్యను కొనితెచ్చుకున్నట్లే. ఇరువురూ కలిసి చర్చించుకుని సామరస్య పూర్వకంగా పరిష్కరించుకుంటే ఆ సమస్య మళ్లీ తలెత్తక పోవచ్చు. వచ్చినా.. దాన్నెలా తీర్చిదిద్దుకోవాలో అనుభవం నేర్పుతుంది. చివరి మాట సమాజంలో భార్యాభర్తల బంధం అత్యంత పవిత్రమైనది. నిజానికి ఇదే అసలు సృష్టికి మూలం. ఈ బంధం ద్వారానే దైవం మానవజాతిని ఉనికిలోకి తీసుకువచ్చాడు. అందుకే దీనికి ఇంత పవిత్రత, ప్రత్యేకత. ఈ బంధం పటిష్టంగా, గౌరవప్రదంగా ఉంటేనే మానవజాతి విజయపథంలో సాగుతుంది. సమాజ నిర్మాణంలో భార్యాభర్తలిద్దరి పాత్రా కీలకమైనదే. భార్యాభర్తల మధ్య అవగాహన, ప్రేమానుబంధాల ద్వారానే మంచి కుటుంబాలు ఉనికిలోకి వస్తాయి. వారిద్దరి సాంసారిక జీవితం, దాని నియమాలు, బాధ్యతలు సరిగా అవగాహన చేసుకుంటేనే ఉత్తమఫలితాల్ని సాధించడానికి వీలవుతుంది. ఆలుమగల మధ్య ఈ విధమైన అవగాహన, పరస్పర ప్రేమానురాగాలు లోపించడం వల్లనే ఈనాడు కుటుంబాల్లో శాంతి కరవైపోతోంది. కుటుంబ జీవితంలో శాంతి కొరవడితే, అది సత్సమాజ నిర్మాణానికి అవరోధంగా పరిణమిస్తుంది. అందుకని భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకోవాలి. ఎవరి పరిధుల్లో వారు తమతమ బాధ్యతల్ని నెరవేర్చాలి. స్వేచ్ఛ పేరుతో స్త్రీలు తమ పరిధుల్ని అతిక్రమించకూడదు. అలాగే పురుషులు భార్యలపై పెత్తనం చలాయించకూడదు. సహధర్మచారిణితో సత్ప్రవర్తనతో కూడిన జీవితం గడపాలి. ఆమె హక్కులను విశాల హృదయంలో గౌరవించాలి. ఎందుకంటే, ‘‘వారితో సత్ప్రవర్తనతో సంసారం చేయండి’’ (నిసా) అని దైవం ప్రబోధించాడు. భార్య పట్ల సౌమనస్యంతో, ప్రేమాభిమానాలతో ప్రవర్తించాలి. ముహమ్మద్ ప్రవక్త ఇలా ప్రవచించారు: ‘‘తమ నడవడికతో అందరికంటే ఉత్తములైనవారే విశ్వాసంలో పరిపూర్ణులు. తమ భార్యల పట్ల అత్యంత మంచిగా మెలిగేవారే అందరిలో మంచి నడవడిక కలవారు’’(తిర్మిజీ). ఒక మనిషి నైతిక ప్రవర్తనను, అతని మంచితనాన్ని గ్రహించడానికి అసలైన గీటురాయి అతడి గృహజీవితమే. స్వేచ్ఛగా ఉండే గృహజీవితంలోనే… మానసిక, నైతిక, ఆర్థిక సంబంధమైన ప్రతి అంశం ముందుకు వస్తుంది. కుటుంబం పట్ల ఔదార్యం, ప్రేమ, దయ కలిగి, కుటుంబానికి మానసిక తృప్తిని, ప్రశాంతతను కలిగిస్తూ ప్రేమాభిమానాలతో ప్రవర్తించినప్పుడే ఒక మనిషి విశ్వాసంలో పరిపూర్ణుడవుతాడు. ప్రతిమనిషిలో ఏదో ఒక బలహీనత ఉంటుంది. స్త్రీలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. అందుకని చిన్నచిన్న విషయాలను రాద్ధాంతం చేయకూడదు. భార్యలో ఏదైనా చిన్నాచితకా లోపం, బలహీనత కానవస్తే – దానికే మూతి ముడుచుకోకూడదు. ఓర్పు వహించాలి. ఆమెలోని మరో మంచి గుణాన్ని గుర్తించి ఔదార్యం ప్రదర్శించాలి. చిన్నచిన్న విషయాలకే మనసు పాడుచేసుకుంటే కుటుంబాల్లో దాంపత్య సుఖసంతోషాలు కనుమరుగైపోతాయి. అందుకే ముఖ్యంగా స్త్రీల వ్యక్తిత్వాన్ని గుర్తించాలి. అన్ని విషయాల్లోనూ పరస్పర అవగాహన అత్యంత అవసరం. ఈ విధంగా భార్యాభర్తలు ఒకరి హక్కుల్ని ఒకరు గుర్తించి, గౌరవించుకుంటే దైవం, దైవప్రవక్త హితవుల వెలుగులో జీవితం గడిపితే… ఇహంలో, పరంలో సాఫల్యవంత జీవితం పొందవచ్చు.

ఖురాన్ బంధువు లక్షణాలు-Characteristics of the relative of the Qur'an

ఖురాన్ బంధువు లక్షణాలు వారిలో సన్మార్గగాములు కూడా ఉన్నారు. వారు రాత్రి వేళల్లో అల్లాహ్ సూక్తులు పఠిస్తూ ఆయన ముందు సాష్టాంగ పడతారు. అల్లాహ్ ను , పరలోకాన్ని విశ్వసిస్తారు. ప్రజలకు మంచిని బోధిస్తారు. చెడుల నుండి వారిస్తారు. సత్కార్యాలు చేయడంలో పరస్పరం పోటీపడతారు. ఇలాంటివారే సజ్జనులు. వారు ఏ సత్కార్యం చేసినా దాన్ని విస్మరించడం జరగదు. దేవునికి భక్తిపరా యణులు ఎవరో బాగా తెలుసు. (ఆల్ ఇమ్రాన్: 113-115) అనస్ బిన్ మాలిక్ కథనం దైవ ప్రవక్త (స) ఇలా అన్నారు: నిశ్చయంగా ప్రజలలో అల్లాహ్ కు చెందిన వారు కొందరున్నారు. సహాబా అడిగారు - ఓ దైవ ప్రవక్తా ! వారెవరు ? ''వారు ఖుర్ ఆన్ వారు, వారే అల్లాహ్ కు చెందిన వారు మరియు ఆయనకు మిక్కిలి ఇష్టమైనవారు" అని దైవ ప్రవక్త (స) సమాధానమిచ్చారు . (ఇబ్ను మాజహ్) ఖురాన్ బంధువు అని ఎవరిని అంటారు? ఖురాన్ గ్రంథ పారాయణమే శ్వాసగా, దాని సాధనే జీవితంగా బతికే వ్యక్తి ఖురాన్ బంధువు అవుతాడు.ఆటను ఖురాన్ పారాయణాన్ని శ్వాసిస్తాడు,. జీవితంగా భావించి అది చూపిం అబాటనే పయనిస్తాడు. అతని ఆలోచన ఖుర్ఆన్ తో మొదలై ఖుర్ఆన్ తోనే ముగుస్తుంది. ఖుర్ఆన్ స్వర్ణకార ధుని ధ్వని - అతని స్వభావం, మాటలు, ప్రవర్తన, పరివర్తన, ఆలోచన, ఆచరణల ద్వారా వ్యక్తమవుతోంది. మహనీయ ముహమ్మద్ (స) వారి నడక, నడవడిక గురించి కొందరు హజ్రత్ ఆయిషా( ర.అ) గారిని ప్రశ్నించినప్పుడు - "కాన ఖులుఖుహు అల్ ఖుర్ఆన్" - "అయన నడవడి ఖుర్ఆన్ గ్రంథానికి ప్రతిబింబంగా ఉండేది" అని సమాధానమిచ్చారు. (ముస్నద్ అహ్మద్)
ఖుర్ఆన్ తో మన సంబంధం ఎలా ఉండాలి? దివ్య ఖుర్ఆన్ పారాయణం చేశాము. స్వయంగా పారాయణం చెయ్యడమే కాక, హాఫిజ్ లను నియమించి మరీ ఖర్ఆన్ పఠనాన్ని వీనుల విందుగా విన్నాము. తరావీహ్ నమాజ్ లో రోజూ దాదాపు గంట, గంటన్నర సేపు నిద్ర సుఖాన్ని నిష్కర్షగా త్రోసిపుచ్చి ఈ మహత్కార్యం కొరకే కేటాయించాము. రమజాన్ నెల సాంతం, సమయం దొరికినప్పుడల్లా పరమ పవిత్రమయిన ఆ ఉద్గ్రంథ పఠనం చేశాము. సకల లోకాలకు ప్రభువయిన అల్లాహ్ తన దాసులయిన మానవుల కోసం, తన ప్రేమకు ప్రతీకగా, తన ప్రీతిపథానికి ప్రమిదగా, మానవ హృదయ నిశీథికి ప్రత్యూషగా, మానవాంతర్య రుగ్మత నివారిణిగా, దివి నుండి దింపిన దివ్య ఔషది అది. ఆ పరమ దివ్య గ్రంధాన్ని మధుర మకరంద ధారలు జాలువారుతుండగా దివ్యంగా శ్రావ్యంగా గానం చేశాము. ఆ గ్రంధరాజాన్ని కాంతులు వెదజల్లే కళావై భవం తొణకిసలాడగా బంగరు సిరాతో వ్రాయించాము. ఆ మహాగ్రంథ పత్రాలను ప్రాణప్రదంగా, పవిత్రంగా, భక్తి ప్రపత్తులతో తల పైన మోశాము, కళ్ళ కద్దుకున్నాము, భద్రపరిచాము. దాని ఎడల గౌరవభావాన్ని, భయభక్తుల్ని, ప్రేమాదరణల్ని ఎన్ని విధాల వ్యక్తం చెయ్యాలో అన్ని విధాలా ప్రదర్శించాము. ఇంకేం చెయ్యాలి? అనొచ్చు చాలా మంది. నిజమే, ఇదంతా చెయ్యవలసిందే. కాని మీరు విద్యార్థులయితే మీ పాఠ్యపుస్తకాలను ఇలాగే అర్థం చేసుకోకుండా 'పారాయణం' చేస్తారా? మీరు కొనే దిన, వార, మాసపత్రికల్ని ఇలాగే 'అనుసంధానం' చేసి భద్ర పరుస్తారా? మీకు మీ కార్యాలయాల నుండి అందే ఆదేశ పత్రాలను సువర్ణాక్షరాలతో వ్రాయించి మీ కుడ్యాలంకరణ కొరకు వినియోగించుకుంటారా? న్యాయస్థానం మీకు దండన విధిస్తూ తీర్పు ఇస్తున్నప్పుడు 'ఆహా! న్యాయమూర్తి కంఠం ఎంత కర్ణ పేయంగా ఉంది! ఎన్ని సంగీత సౌరభాలు విరజిమ్ముతోంది!!' అని సంభ్రమాశ్చర్యాల్లో మునిగితేలుతారా? మీరే చెప్పండి, ఖుర్ఆన్ పట్ల మన వైఖరిని ఎలా అభివర్ణించాలో !? . దివ్య ఖుర్ఆన్ మన స్వామి పంపిన సందేశం; మార్గదర్శక గ్రంథం; జీవన నియమావళి; ఆంక్షలూ అనుమతులున్న ప్రవర్తనా నిబంధనావళి; ఆర్థిక సూత్రావళి; శిక్షాస్మృతి; శాసన గ్రంథం; రాజ్యాంగ పత్రం. గుడ్డిగా పారాయణం చెయ్యడానికి బట్టీయం వెయ్యడానికి కాదు, నేత్ర కవాటాలను తెరచి, మనోచేతనను జాగృతం చేసి మనం అర్థం చేసుకోవడానికి, ఆలోచించడానికి అరుదెంచిన ఫర్మానా అది. ఇహంలోనూ, పరంలోనూ మన మార్గం సుగమం చెయ్యడమే దాని పరమార్ధం. మనం ఆలోచించడానికి, అనుసరించడానికి సిద్ధంగా లేమా? "వీరు కుర్ఆనపట్ల చింతన చెయ్యలేదా, లేక వీరి హృదయాలపై తాళాలు పడి ఉన్నాయా?" (ముహమ్మద్: 24) అంతేగా మరి, ఇలాంటి మహత్తర జ్ఞాననిధి ద్వారా ప్రాప్తమైన సూచనలను గురించి లోతుగా ఆలోచన, అనుశీలన జరపకపోతే హృదయాలకు తాళాలు పడినట్లే కదా అర్థం! (వెన్నెల తెరలు పుస్తకం నుండి పై రెండు పేరాలు) ఖుర్ఆన్ మన నుండి ఏమి కోరుతుంది? అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : '' మేము ఎవరికి గ్రంథం వొసగామో వారు దానిని పారాయణం చేయవలసిన రీతిలో పారాయణం చేస్తారు . (అంతేకాదు ) వారు ఈ గ్రంథాన్ని విశ్వసిస్తారు. ఇక,దీని పట్ల తిరస్కార వైఖరిని అవలంబించినవారే నష్టపోయేది " . (అల్ బఖర 121) '' పఠించవలసిన విధంగా పఠిస్తారు " అన్న వాక్యానికి పలు అర్థాలున్నాయి. * ఈ మహద్గ్రంథాన్ని బాగా చదువుతారు. శ్రద్ధతో ,ఏకాగ్రతతో పారాయణం చేస్తారు. పఠన సందర్బంగా స్వర్గప్రస్తావన వస్తే స్వర్గంలో ప్రవేశం కల్పించమని అల్లాహ్ ను వేడుకుంటారు . నరక ప్రస్తావన వస్తే దాని బారి నుంచి రక్క్షించమని ప్రార్థిస్తారు. * ఈ గ్రంథరాజంలో ధర్మసమ్మతంగా ఖరారు చేయబడిన అంశాలను ధర్మసమ్మతంగా విశ్వసిస్తారు. అధర్మం అని స్పష్టం చేయబడిన వాటిని అధర్మాంగానే భావిస్తారు. అంతేగాని (యూదుల మాదిరిగా ) ప్రక్షిప్తాలకు పాల్పడటంగానీ , తప్పుడు అన్వయింపులు చేయటం గానీ చేయరు . * ఈ మాగ్నాకార్టాలో పొందుపరచబడివున్న విషయాలను గురించి అందరికీ వివరిస్తారు, వాటిని దాచి ఉంచరు. * ఈ అంతిమ గ్రంథంలో చేయమని ఆజ్ఞాపించబడిన వాటిని (ముహ్కామాత్ ను ) అమలు చేస్తారు, అస్పష్టంగా ఉన్న (ముతషాబిహాత్) విషయాలను విశ్వసిస్తారు, అర్థం కాని విషయాలను గురించి విద్వాంసులను అడిగి తెలుసుకుంటారు. * ఈ అద్వితీయ గ్రంథంలోని ఒక్కో విషయాన్ని తు.చ. తప్పకుండా పాటిస్తారు. అందలి ప్రతి విషయాన్నీ గుండెలకు హత్తుకొని, తన్మయం చెందుతూ, తాదాత్మయానికి లోనవుతారు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : "వారి ముందు కరుణామయుడైన అల్లాహ్ వచనాలు పారాయణం చేయబడినప్పుడు వారు కన్నీరు మున్నీరవుతూ సజ్దాలో పడిపోతారు" . (మర్యం: 58) అల్లాహ్ వచనాలను విన్నప్పుడు భక్తితో కళ్ళు చెమర్చటం , విలపిస్తూ సజ్దాలో పడిపోవటం ఖుర్ఆన్ బంధువు ముఖ్య లక్షణం. చూడండి, అల్లాహ్ ఏమంటున్నాడో: " ఇదొక శుభప్రదమైన గ్రంథం. ప్రజలు దీని వాక్యాల పై చింతన చేసేటందుకు , బుద్ధి జీవులు దీని ద్వారా గుణపాఠం నేర్చు కునేందుకు మేము దీనిని నీ వైపునకు పంపాము" . (సూరా సాద్ :29) " నిజమైన విశ్వాసులు ఎటువంటి వారంటే - అల్లాహ్ ప్రస్తావన రాగానే వారి హృదయాలు భయంతో వణుకుతాయి. అల్లాహ్ ఆయతులు వారి ముందు పఠించినప్పుడు , అవి వారి విశ్వాసాన్ని మరింత వృద్ధి చేస్తాయి. వారు తమ ప్రభువునే నమ్ముకుంటారు''. (అల్ అన్ ఫాల్ : 2) " మరియు ఇది మేము అవతరింపజేసిన ఒక శుభప్రదమైన గ్రంథం. కాబట్టి మీరు దీనిని అనుసరించండి. భయభక్తులతో మెలగండి. తద్వారా మీరు కరుణించబడే అవకాశం ఉంది". (అల్ అన్ ఆమ్ : 155)

దాంపత్య జీవితం - అనుమాన భూతం - Marital life - a ghost of doubt

దాంపత్య జీవితం - అనుమాన భూతం భూమి పైన చాలా అందమైన, స్వచ్ఛమైన బంధాలలో వివాహం ఒక్కటి. ఇది ఇద్దరి ఆత్మల యొక్క సంబంధం, వారు జీవితాంతం ఒకరికొకరు కట్టుబడి ఉంటానని వాగ్దానం చేస్తారు. దాంపత్య జీవితం -అది నమ్మకం అనే బీజంతో ఎదిగే మహా వృక్షం. దాంపత్య జీవితం - అది కేవలం అనుమానం అన్న విష వైరస్‌తో పుటుక్కుమని తెగిపోయే పచ్చి దారం. కాబట్టి ఆలుమగలు తాము, కట్టుకునే అనురాగ గోపురంలో విష వాయువులు ప్రవేశించకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే రాను రాను అవి పెనుభూతాలుగా మారి ఏకంగా ఇద్దరి జీవితాల్ని మింగేసే ప్రమాదముంది. ఓ బంధం నిలవాలంటే దానికి పునాది నమ్మకమే.. నమ్మకం లేని చోట బంధం ఎన్నాళ్ళో నిలవదు. భార్యాభర్తల మధ్య అన్యోన్నత, అనురాగం మూడు పూలు ఆరు కాయలుగా వర్ధిల్లాలంటే వారు షరీయతు సూచించిన హద్దులను గౌరవిస్తూ ఎవరి పరిమితుల్లో వారుండాలి. ఒకవైపు వేరుగా బ్రతకలేము అని చెబుతూనే భార్య మీద భర్త, భర్త మీద భార్య ఫిర్యాదు చేస్తూ తిరగటం నిరర్థకం, నిర్హేతుకం. ఒకరిలో ఉన్న లోపాలను ఇంకొకరు పెద్ద మనస్సుతో మన్నించాలి. ఏదేని విషయంలో మనిషి తీవ్ర సందిగ్ధానికి లోనైనప్పుడు ఖుర్‌ఆన్‌ వచనాల, ప్రవక్త (స) వారి ప్రవచనాల వెలుగులో పరిష్కారం చూపే పండితులను, వివేచనాపరులను, స్థితప్రజ్ఞులను సంప్రదించటం ఎంతో ఉత్తమం. ఆ మేరకు ఉపయోగపడే దైవ ప్రవక్త (స) వారి రెండు ప్రవచనాలను ఇక్కడ పొందుపరుస్తున్నాము.
ఓ పల్లెటూరి వ్యక్తి దైవ పవ్రక్త (స) వారి సన్నిధికి వచ్చి - ''యా రసూలల్లాహ్‌! నేను తెల్లన, నా భార్య తెల్లన. కాని మాకిద్దరికి పుట్టిన పిల్లాడు నల్లన'' అని భార్య మీద తనకున్న అనుమానాన్ని వ్యక్త పర్చాడు. అది విన్న ఆదర్శ పవ్రక్త (స) ''రెండు ఎరన్రి ఒంటెలకు బూడిద రంగు ఒంటె పుట్టడం నీవు గమనించి ఉంటావు కదా! అది ఎలా సాధ్యం అయ్యిందంటావు?'' అని ఎదురు పశ్న్ర వేశారు. అందుకా వ్యక్తి ''బహుశా వాటి తాతముత్తాతలలో ఎవరి పోలికయినా వచ్చి ఉంటుంద''ని సమాధానమిచ్చాడు. ''అదే విధంగా నీ కొడుక్కి కూడా నీ వంశస్థుల్లోని ఎవరి రంగయినా వచ్చి ఉంటుంది'' అని దైవ పవ్రక్త (స) సెలవిచ్చారు. (ముస్లిం) హజత్ర్‌ ఆయిషా (ర) కథనం - ఒక రోజు దైవ పవ్రక్త (స) సంతోషాతిశయంతో నా దగ్గరకు వచ్చారు. ఆయన ముఖారవిందం పక్రాశిస్తూ ఉంది. నన్నుద్దేశ్యించి ఆయన ఇలా అన్నారు: ''నీకు తెలుసా! ముజజ్జిజ్‌ ముద్‌లజీ ఇప్పుడే జైద్‌ బిన్‌ హారిసా మరియు ఉసామా (ర)ను చూసి ''ఈ కాళ్ళు పరస్పరం పోలికలు గలవి'' అని అన్నారు (బుఖారీ, ముస్లిం) అంటే - ఆ సమయంలో వారిరువురి ముఖాలపై దుప్పటి ఉంది. పాదాలు మాత్రం కన్పిస్తున్నాయి. కేవలం పాదాలు చూసి ముఖ సాముద్రిక విద్యలో నిష్ణాతుడైన ముద్లిజ్‌ తెగకు చెందిన ముజజ్జిజ్‌ నిదురిస్తున్న వారిద్దరూ ఒకే వంశ వృక్షానికి చెందినవారని చెప్పడం మహా ప్రవక్త (స) వారికి ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఎందుకంటే అప్పటికే ఉసామా బిన్‌ జైద్‌ (ర) నలుపు రంగుపై కొంత మంది చెవులు కోసుకుంటున్నారు. ఉసామా గారి తండ్రి జైద్‌ బిన్‌ హారిసా (ర) తెల్లగా ఉండటం వారి సంశయానికి అసలు కారణం. ప్రస్తుతం రక్త పరీక్ష వల్ల ఈ పని సులువైపోయినప్పటికీ ఆ సౌకర్యం లేని, దాని గురించి తెలియని ప్రదేశాల్లో నివసించే ప్రజలకు ఇందులో అనేక నిదర్శనాలున్నాయి. దంపతుల్లో అన్యోన్నత పెరగాలంటే 1) పెళ్లికి ముందు దాంపత్య జీవితం గురించి ఎన్నో కలలు కంటాం. ఇతరుల అనుభవాల ఆధారంగా ఏదేదో ఊహించుకుంటాం. దాంతో పెళ్లయ్యాక వాస్తవం ఊహకు ఏ కాస్త దగ్గరగా లేకపోయినా అసంతృప్తికి లోనవుతాం. 2) తక్కువ సమయంలో ఎక్కువ తెలుసుకోవాలనే తత్వం దాంపత్య జీవితంలో పనికి రాదు. ఒకరి ఇష్టాలు మరొకరు తెలుసుకుని మసలుకోవటానికి, ఒకరి అభిరుచులు మరొకరికి అర్థం అవ్వడానికి సమయం పడుతుంది. ఇదంతా నెమ్మదిగా జరిగే చర్య. 3) యాంత్రికంగా మసలుకోకుండా ఎదుటి వ్యక్తి సంతృప్తే ప్రధానంగా మసలుకోగలిగితే దంపతులిద్దరూ సమంగా దాంపత్య జీవితాన్ని ఆస్వాదించగలుగుతారు. ఒకరి ఆనందం మీద మరొకరు దృష్టి పెడితే మనసులోని అర్థం లేని భయాలు పటాపంచలవుతాయి. ఆత్మవిశ్వాసంతో మెలగగలుగుతారు. ఫలితంగా మీ ప్రతి చర్యా జీవిత భాగస్వామి ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. 4) ఇప్పుడు కొత్తగా పెళ్లిళ్లు అవుతున్న వారిలో పెద్ద చదువులు, ఉద్యోగాలు చేస్తున్నవారే ఎక్కువ ఉంటున్నారని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో ఇరువురికి ఆత్మభిమానం కాస్త ఎక్కువగా ఉండొచ్చు. అయినా భాగస్వామి పట్ల ఈగోలు పక్కనపెట్టాలి. దాంతో భాగస్వామి మనసులో స్థానం సంపాదించగలుగుతాం. 5) పనిచేస్తేనే ఇల్లు గడిచే పరిస్థితులు ఇప్పుడున్నాయి. అయినా ఉన్న తక్కువ సమయంలోనైనా భార్యాభర్తలు ఒకరికోసం మరొకరు సమయాన్ని తప్పకుండా కేటాయించాలి. అప్పుడు వారి బంధం మీద నమ్మకం ఏర్పడుతుంది. నా కోసమంటూ ఓ వ్యక్తి ఉన్నారన్న భావన ఇరువురిలోనూ కలుగుతుంది. 6) ఒకరిని మరొకరు అర్థం చేసుకోవడంలో పొరపాట్లు జరుగుతాయి. అంత మాత్రాన ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకూడదు. అవి గొడవలుకు దారి తీస్తాయి. భార్యాభర్తల్లో ఎవరో ఒకరు కోపంతో అరుస్తున్నా... మరొకరు సైలెంట్‌గా ఉండటం చాలా మంచిది. ఆ సమయంలో ఏం మాట్లాడినా కోపంగా ఉన్న వ్యక్తి మరింత రెచ్చగొట్టినట్లే అవుతుంది. కొంత సమయం తీసుకుని, ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆ విషయం గురించి మాట్లాడితే మంచిది. ఒక వేళ తప్పుగాని, పొరపాటుగాని జరిగి ఉంటే క్షమించమని అడగటంలో తప్పేమి లేదు. అలా కాదని తగ్గేదే లే అంటే మాత్రం తిప్పలు తప్పవు. 7) పెళ్లైన కొత్తలో దంపతుల మధ్య రహస్యాలు ఉండకూడదని గతంలో జరిగిన ప్రేమ వ్యవహరాలు చెప్పుకున్నా. వాటిని అక్కడితోనే మర్చిపోవాలి. వాటిని మనసులో ఉంచుకుని ప్రతి చిన్న విషయాన్ని అనుమానించకూడదు. అదే విధంగా అనుమానం వచ్చేలా ప్రవర్తించకూడదు. 8) ఎదుటి వ్యక్తి మీద ప్రేమని చూపించడంలో చిన్న చిన్న కానుకలు ఇస్తూ ఉండాలి. లేదా వారి మీద కవితలు లేదా లేఖలు రాయడం, పాటలు పాడటం చేయాలి. నచ్చిన కలర్‌తో దుస్తులు ధరించడం చేస్తూ ఉంటే భాగస్వామికి మరింత దగ్గరయ్యి భార్యభర్తల బంధం బలపడుతుంది. 9) దాంపత్యజీవితంపై ఎన్నో కలలు కంటుంటారు. తమ జీవితం అలా ఉండాలని ఇలా కావాలని ఆశ పడుతుంటారు. కానీ ఆ దిశగా అడుగులు మాత్రం వేయరు. అందరు చేసే తప్పులే చేస్తూ సంసారాన్ని కకావికలం చేసుకుంటారు. సముద్రాన్ని అయినా ఈదొచ్చు కానీ సంసారం మాత్రం ఈదడం అంత సులువు కాదని తెలుస్తోంది. దాంపత్యం సవ్యంగా సాగాలంటే ఇద్దరి మధ్య ఉండాల్సింది అనురాగం, ఆప్యాయత, అభిమానం. వీటిని ఎప్పుడు కూడా దూరం చేసుకోకూడదు. 10) పరస్పర గౌరవం: వివాహం జీవితంలో భార్యభర్తలు పరస్పర గౌరవంతో నడుచుకోవాలి. ఒకరి ఆలోచనలు, భావాలు, అభిప్రాయాలను మరొకరు గౌరవించాలి. పరస్పర ప్రశంసలు, అవగాహనను కలిగి ఉండాలి. ఇవే వైవాహిక జీవితాన్ని సంతోషకరంగా చేయగలవు.

విశ్వాసి వజ్రాయుధం దుఆ - Believer's diamond weapon dua

విశ్వాసి వజ్రాయుధం దుఆ అశాశ్వతమైన ఈ లోకంలో దేవుడు కష్టం, సుఖం, అదృష్టం, దురదృష్టం, మిత్రులు శత్రువులు, ఆరోగ్యం, అనారోగ్యం లాంటి సుఖదుఃఖాలెన్నింవిరినో సృష్టించాడు. మనిషి తను పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు తరచూ ఇలాంటి వాటికి గురవుతూనే ఉంటాడు. అయితే దేవుడు వాటితోపాటు వాటి నుండి రక్షణ పొందటానికి ఎన్నో పద్ధతులు, ముందు జాగ్రత్తలు కూడా సూచించాడు. వాటిని ఆచరించి మనిషి తన్ను తాను కష్టాల నుండి రక్షించుకోగలడు. మానవులు రోగాలను నయం చేసుకోవటానికి ప్రార్థనలను, మందులను కూడా దేవుడు పుట్టించాడు. అందుకే దైవప్రవక్త (స) ఒకానొక సందర్భంగా ''దేవుడు ప్రతి వ్యాధికీ చికిత్సను, ఔషధాలను పుట్టించాడు'' అని అన్నారు. (బుఖారీ) దుఆలను అల్ల్లాహ్‌ మాత్రమే ఆలకిస్తాడు వాస్తవానికి మానవుల్ని దుఃఖవిచారాలకు, కష్టాలు కడగండ్లకు గురి చేసేవాడూ, తిరిగి వాటి నుండి కాపాడి వారికి సౌఖ్యాన్నీ, ఆరోగ్యాన్ని ప్రసాదించేవాడు కూడా దేవుడే! సృష్టిలోని ప్రతి వస్తువుపై ఆయనకు తిరుగులేని ఆధిపత్యం ఉంది. అయితే ఈ కష్టాలు, కడగండ్లకు గురైనప్పుడు తనను మొరపెట్టుకునే వారిని ఆయన అమితంగా ప్రేమిస్తాడు. ఆ విధంగా మొరపెట్టుకోవటాన్నే 'దుఆ' అని అంటారు. ''బాధితుడు మొరపెట్టుకున్నప్పుడు అతని మొరను ఆలకించి, అతని బాధను దూరం చేసేవాడు ఎవడు?'' (ఖుర్‌ఆన్‌- 27: 62)
పుట్టుక రీత్యా మనిషి అవసరాలు, అక్కరలు కలవాడు. సహజంగానే అతనికి అవసరాలు ఏర్పడుతుంటాయి. అల్లాహ్‌ా మాత్రమే సర్వ సంపన్నుడు, నిరపేక్షాపరుడు. ఆయన ఇలా అంటున్నాడు: ''మానవులారా! మీరందరూ అల్లాహ్‌ అవసరం కలవారే. కాని అల్లాహ్‌ మాత్రం సర్వ సంపన్నుడు, స్వయంగానే స్తుతిపాత్రుడు''. (ఖుర్‌ఆన్‌ - 35: 15) అల్ల్లాహ్‌ను తప్ప ఇతరులను ప్రార్థించరాదు మనిషి సహజంగా అవసరాలు కలవాడు అవడం చేత దుఆ తప్ప అతనికి గత్యంతరం లేదు. దుఆ మనిషికి నిత్యావసరం. మానవులు సాటి మానవుల్ని మొరపెట్టుకోవటం ప్రకృతి విరుద్ధమైన పని. స్వయంగా నిస్సహాయుడైన మానవుడు సాటి మానవుల నిస్సహాయతను దూరం చేయలేడు. అల్లాహ్‌ను వదలి పెట్టి ఇతర సజీవినిగాని, నిర్జీవినిగాని మొరపెట్టుకోవటం ఎంత తెలివి తక్కువ పనంటే అలా చేసేవాడు నీళ్ళ ముందు నిలబడి ''వచ్చెయ్యి! నా నోట్లోకి వచ్చెయ్యి'' అని నీళ్ళను పిలిచే మూర్ఖుడితో సమానం. (ఖుర్‌ఆన్‌ - 13: 14). విశ్వ సామ్రాజ్యాధిపతి అయిన అల్లాహ్‌ను త్రోసిరాజని సజీవ లేక నిర్జీవ సృష్టిరాసుల్ని మొరపెట్టుకునేవారు ఎంత అవివేకులు?! కొందరయితే కదలలేని, మెదలలేని, కనులు విప్పి చూడలేని, పెదవి విప్పి పలకలేని రాళ్ళను తమ ఆరాధ్య దైవాలుగా చేసుకొని వాటిని తమ కష్టాల గురించి మొర పెట్టుకుంటుంటారు. ఈ వైఖరి మరీ దారుణం! సకల లోకాలకూ ప్రభువైన అల్లాహ్‌ ''నన్ను మొరపెట్టుకోండి. నేను మీ మొరలను ఆలకిస్తాను'' అని ప్రకటిస్తూ ఉంటే, మరోవైపు ఆయన దాసులు ఆయన్ని వదలిపెట్టి ఇతర మిథ్యా దైవాల ముందు చేయి చాపటం ఎంత దిగజారుడుతనం?! ఒక ముస్లిం అలాంటి ఘాతుకానికి ఒడిగడితే అది ఇంకా శోచనీయమైన విషయం! 'దుఆ' కూడా ఒక ఆరాధన లాంటిది. ఆరాధనలన్నీ అల్లాహ్‌కే చెల్లుతాయి. అల్లాహ్‌ను వదలి ఇతరుల్ని మొరపెట్టుకోవటం, వారిని సహాయం చేయమని అర్థించటం, వారిని ఆపద మ్రొక్కువారిగా తలపోయటం ''షిర్కె జలీ'' (బహిరంగ బహుదైవారాధన) అవుతుంది. దేవుడు దాన్ని ఎన్నటికీ క్షమించడు. విశ్వాసి చేతిలో 'దుఆ' ఆయుధం వంటిది. దాని ముందు పెద్ద పెద్ద ఆయుధాలు కూడా పనికిరాకుండా పోతాయి. హృదయావేదనకు ఉపశమనం, బాధితులకు ఆధారం, భయాందోళనలకు గురయిన వారికి అభయ హస్తం దుఆ! బాధితుని శాపం సప్తాకాశాలనూ చీల్చుకుని వెళుతుంది బాధితుని నోటి నుండి వెలువడే దుఆ అంతరిక్షాన్ని, సప్తాకాశాలనూ చీల్చుకుంటూ దైవ సన్నిధికి వెళ్ళి బాధితునికి సహాయం అందేలా చేస్తుంది. దుఆ ఎన్నడూ త్రోసిపుచ్చబడదు! దాసుడు చేసే దుఆ ఎట్టి పరిస్థితిలోనూ త్రోసిపుచ్చబడదు. దాసుని దుఆ ఒక్కోసారి వెంటనే దైవ సన్నిధిలో స్వీకృతికి నోచుకుంటుంది. లేదా దాని మూలంగా అతనికి రాబోయే ఆపదలు, గండాలు తప్పి పోతాయి. లేదా ఆ దుఆ అతని పరలోక జీవితం కొరకు నిక్షేపంగా ఉంచబడుతుంది. ఆత్మ ప్రక్షాళనకు తాళం చెవి ప్రార్థన – దుఆ. దైవప్రవక్త (స) ఇలా అన్నారు: ”అల్లాహ్‌కు దుఆ కన్నా మిక్కిలి ఇష్టమయిన వస్తువు మరేదీ లేదు”. (తిర్మిజీ) ఎందుకు దుఆకు మాత్రమే అగ్ర తాంబూలం అంటే, దుఆలో కృతజ్ఞత ఉంటుంది. దుఆలో ఉపకార భావం ఉంటుంది. దుఆలో వినయం ఉంటుంది, దుఆలో విధేయత ఉంటుంది. దుఆలో ఆర్థ్రత ఉంటుంది. దుఆలో అశక్తత ఉంటుంది. దుఆలో ఆశ ఉంటుంది. దుఆలో అంగీకారం ఉంటుంది. దుఆలో భయం ఉంటుంది. దుఆలో భక్తి ఉంటుంది. ప్రార్థన అంటేనే, దాస్య భావన పరాకాష్ట. అది దుఆలో పుష్కలంగా ఉంటుంది. అందుకే ”దుఆ పార్థనా సారాంశం” అన్నారు ప్రవక్త (స). (తిర్మిజీ ) ”మేళ్ళన్నింటికీ తాళం చెవి దుఆ” అన్నారు ఇమామ్‌ ఇబ్ను తైమియా (రహ్మ). హజ్రత్‌ ఉమర్‌ (ర) ఇలా అంటుండేవారు: ”దుఆ స్వీకరించ బడుతుందా? లేదా? అన్న చింత నాకు లేదు. దుఆ చెయ్యాలన్న ఆలోచన మాత్రమే నాది. నాకు దుఆ చేసే సత్బుద్ధి కలిగిందంటే స్వీకరించబడుతుందన్న సంకేతం దానితోపాటే ఉంటుందన్నది నా బలమయిన నమ్మకం”. (తిర్మిజీ) దైవ ప్రవక్త (స) సదా ఈ దుఆ చేస్తూ ఉండేవారు: ”అల్లాహుమ్మ ఆతి నఫ్సీ తఖ్వాహా వ జక్కిహా అంత ఖైరు మన్‌ జక్కాహా” – ఓ అల్లాహ్‌! నా మనసుకి దానికి తఖ్వాను అనుగ్రహించు. దానిని పవిత్రం గావించు. ఆత్మకు పవిత్రను ప్రసాదించడం కేవలం నీ వల్ల మాత్రమే అవుతుంది. నీవే దాని రక్షకుడవు మరియు యజమానివి”. (ముస్లిం)

నిరతం కురిసే కారుణ్య మేఘం ఖుర్ఆన్ గ్రంథం - The ever-falling cloud of mercy is the Qur'an

నిరతం కురిసే కారుణ్య మేఘం ఖుర్ఆన్ గ్రంథం దివ్య ఖుర్ఆన్ ఎడారి లాంటి జీవితానికి శాంతిని, ప్రశాంతతను అందించే స్వచ్ఛమైన అద్వితీయ జలనిధి. స్వర్గ సౌధాల వైపునకు నిజ ఆరాధ్యుడు చూపే సవ్యమైన బాట. నిజ దైవానికి దాసుని మధ్య అవినాభావ, అవిభాజ్య బంధాన్ని బలపరిచే అల్లాహ్ త్రాడు దివ్య ఖుర్ఆన్. మరణానంతరం అమరత్వాన్ని, జీవించి ఉండగా అమృతత్వాన్ని ఆవిష్కరింపజేసే అక్షర సత్య జలధార దివ్య ఖుర్ఆన్. ఆత్మ సౌందర్యాన్ని, ఆత్మ గౌరవాన్ని, ఆత్మ విశ్వాసాన్ని పరిపుష్టం చేసే దిక్సూచి దివ్య ఖుర్ఆన్. బంధాలను, అనుబంధనాలను అద్భుతంగా మలిచే మహోధృత తరంగాల వాణి దివ్య ఖుర్ఆన్. మానవాళి మొత్తానికి జీవనాడి దివ్య ఖుర్ఆన్. జీవన పథాన్ని, విధానాన్ని నిర్దేశించే మహావ్రాత దివ్య ఖుర్ఆన్. ఆదరిస్తే అద్భుత శిఖరాల మీద కూర్చో బెట్టే గ్రంథరాజం దివ్య ఖుర్ఆన్. సమాధిలోనూ, పరలోకంలోనూ మనకు కొండంత అండగా నిలిచి, మన పక్షాన వాదించి అల్లాహ్ ను ఒప్పించి మరీ మనకు కీర్తి కిరీటాలను తొడిగించే మధ్యవర్తిత్వ దూత దివ్య ఖుర్ఆన్. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ గ్రంథానుగ్రాహానికి మించిన వరం మరొకటి లేదు, రాదు. ”కరుణామయుడు. ఆయనే ఖుర్‌ఆన్‌ నేర్పాడు”. (అర్రహ్మాన్‌:1,2)
సూరతుర్రహ్మాన్‌లో అల్లాహ్‌ తన అనుగ్రహాలెన్నినో పేర్కొన్నాడు. వాటన్నింటిలో అగ్ర స్థానం ఖుర్‌ఆన్‌కు ఇచ్చి, దానికి మించిన మహదాను గ్రహం మరోకటి లేదు అని స్పష్ట పర్చాడు. అంతే కాదు ఖుర్‌ఆన్‌ అవతరణను కారుణ్య ప్రభువయిన అల్లాహ్‌ తన కారుణ్యంగా, ప్రత్యేక బహుమానంగా పేర్కొన్నాడు: మానవులారా! మీ ప్రభువు నుండి మీ దగ్గరకు హితోపదేశం వచ్చింది. ఇది మీ హృదయరుగ్మతలకు నివారిణి. దీన్ని స్వీకరించేవారికి ఇది మార్గదర్శిని, కారుణ్యప్రదాయిని. ప్రవక్తా! వారికిలా తెలియజెయ్యి: “ఈ మహాభాగ్యాన్ని అల్లాహ్ మీకోసం పంపాడంటే ఇది ఆయన అనుగ్రహం, దాతృత్వాలే. దానిపై వారు ఆనందోత్సవాలు జరుపు కోవాలి. ఇది ప్రజలు కూడబెడ్తున్న దానికంటే ఎంతో శ్రేష్ఠమైనది. (యూనుస్: 57-58) అందుకే అన్నింటికన్నా ముందు మనిషి ఖుర్‌ఆన్‌ను నేర్చుకోవాలన్నది పండితుల మాట. ఎందుకంటే అది నిలువెత్తు కారుణ్య గ్రంథం గనక. స్వచ్ఛమయిన అల్లాహ్‌ వాక్కు గనక. ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది: ”మేము నీపై ఈ గ్రంథాన్ని అవతరింపజేశాము. అందులో ప్రతి విషయం విశదీకరించబడింది. విధేయత చూపేవారికి అది మార్గదర్శకం, కారుణ్యం, శుభవార్త”. (అన్నహ్ల్‌: 89) రహ్మత్‌ అర్థాలు: పూర్తి ఖుర్‌ఆన్‌లో – ‘రహ్మత్‌’ అన్న పదం 268 సార్లు ప్రస్తావించబడింది. ఖుర్‌ఆన్‌ ప్రారంభమే ‘బిస్మల్లాహిర్రహ్మానిహ్రీమ్‌’ – అనంత కరుణామయుడు అపార దయానిధి అయిన అల్లాహ్‌ పేరుతో అన్న వాక్యంతో మొదలువు తుంది. ఖుర్‌ఆన్‌లో రహ్మత్‌ అల్లాహ్‌ గుణంగా పేర్కొన బడింది. ఖుర్‌ఆన్‌లో రహ్మత్‌ స్వర్గం అన్న అర్థంలో వాడబడింది. ఖుర్‌ఆన్‌ లో రహ్మత్‌ దైవదౌత్య భావనలో పేర్కొన బడింది.రహ్మత్‌ వర్షం అన్న అర్థంలో వాడబడింది. రహ్మత్‌ దైవానుగ్రహం అన్న భావంలో వాడబడింది. రహ్మత్‌ ఉపాధి అన్న అర్థంలో వాడ బడింది. రహ్మత్‌ సహాయం, విజయం అన్న అర్థంలో వాడబడింది. రహ్మత్‌ శీలం అన్న భావంలో ఉపయోగించ బడింది. రహ్మత్‌ పుణ్యం అన్న అర్థంలో తీసుకో బడింది. రహ్మత్‌ దుఆ స్వీకరణ అన్న భావంలో చెప్ప బడింది. ఇంతటి కరుణామృతం నిండిన ఖుర్‌ఆన్‌ ఒక జాతికో, ప్రాంతానికో, భాషకో పరిమితం అయితే ఏంత అన్యాయం? కనుకనే అది సమసమ్త మానవుల పాలిట మార్గదర్శక గ్రంథం. అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు: ”ఓ ప్రజలారా! మీ ప్రభువు తరఫు నుంచి మీ దగ్గరకు హితోపదేశం వచ్చేసింది. అది హృదయాలలో ఉన్న వ్యాధుల నుంచి స్వస్థతనొసగేది. విశ్వసించే వారి కోసం మార్గదర్శకం, కారుణ్యం”. (యూనుస్‌: 57) ఖుర్‌ఆన్‌ సర్వలోకాల ప్రభువు తరఫు నుంచి కానుకగా అవతరింపజేయ బడిన కారుణ్యం గనకనే ప్రతి ముస్లిం ఖుర్‌ఆన్‌ శ్వాసించేంతగా ప్రేమిస్తాడు. శ్వాసించడమా, ఖుర్‌ఆన్ పారాయణం చేయడమా? అన్న మీమాంస ఎదురయితే ఖుర్‌ఆన్‌ చదువుతూ శ్వాస వీడాలని కోరుకుంటాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ముస్లిం తొలి శ్వాస ఖుర్‌ఆన్‌ తుది శ్వాస ఖుర్‌ఆన్‌. జీవితన కాలం అంటే ఎవరికయినా జనన మరణాల మధ్య కాలం. కానీ ఒక ముస్లింకు మాత్రం ఖుర్‌ఆన్‌ ఆదేశాల నీడలో జీవించిన కాలం. ఖుర్‌ఆన్‌ వల్ల ప్రాప్తించే కరుణ అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్త (స) మాటల్లో: ”అల్లహ్‌ గ్రంథాన్ని పారాయణం చేస్తూ, నమాజును నెలకొల్పేవారు, మేము ప్రసాదించిన దానిలోంచి గోప్యంగానూ, రహస్యంగానూ ఖర్చు చేసే వారు ఎన్నిటికీ నష్టం వాటిల్లని వర్తకాన్ని ఆశిస్తున్నారు”. (ఫాతిర్‌: 29) ”ఖుర్‌ఆన్‌ పారాయణం జరుగుతున్నప్పుడు దానిని శ్రద్ధగా వినండి. మౌనం పాటించండి. తద్వారా మీరు కరుణించ బడవచ్చు”. (అరాఫ్‌: 204) ”మీరు ఖుర్‌ఆన్‌ను పారాయణం చేస్తూనే ఉండండి. అది తన్ను పారాయణం చేసే వారి పాలిట రేపు ప్రళయ దినాన సిఫాసు చేస్తుంది”. (ముస్లిం) ”ఎవరయితే ఖుర్‌ఆన్‌లోని ఒక అక్షరాన్ని పఠిస్తాడో దానికి బదులు అతనికి ఒక పుణ్యం. దాన్ని పదింతలు పెంచి ఇవ్వడం జరుగుతుమది. ‘అలిఫ్‌ లామ్‌ మీవ్‌’ ఒకే అక్షరం అని నేను అనడం లేదు. అలిఫ్‌ ఒక అక్షరం, లామ్‌ ఒక అక్షరం, మీమ్‌ ఒక అక్షరం”. (తిర్మిజీ) ఓ సందర్భంలో ‘అల్లాహ్‌కు చెందినవారు ఎవరు?’ అని ప్రవక్త (స) వారిని అడగడం జరిగింది.అందుకాయన: ”ఖుర్‌ఆన్‌ పారాయణకర్తలే అల్లాహ్‌కు చెందినవారు మరియు ఆయన ఆప్త మిత్రులూను” అన్నారు. (ముస్నద్‌ అహ్మద్‌) ”రేపు ప్రళయ దినాన ఖుర్‌ఆన్‌ కంఠస్థం చేసుకున్న వ్యక్తితో ఇలా అనబడుతుంది: ‘పఠించు, నువ్వు ప్రంచంలో ఎలా పారాయణం చేసే వాడవో అలానే చెయ్యి. నీ స్వర్గ చివరి అంతస్తు నీవు ఆగే ఆయతు దగ్గర ఉంటుంది”. (తిర్మిజీ) ”ఏ సమూహమయినా సరే అల్లాహ్‌ గృహాల్లోని ఓ గృహం (మస్జిద్‌)లో సమావేశమయి ఖుర్‌ఆన్‌ పారాయణం చేస్తూ, నేర్చుకుంటూ , నేర్పిస్తూ ఉంటారో వారిపై ప్రశాంతత అవతరిస్తుంది. కారుణ్యం వారిని కప్పి వేస్తుంది. దైవదూతలు వారిని చుట్టు ముడతారు. అల్లాహ్‌ వారిని గురించిన ప్రస్తాన తన సమీప దూతల దగ్గర తీసుకు వస్తాడు”. (ముస్లిం) స్వయంగా హదీస్ ఖుద్సీలో అల్లాహ్ అన్న మాట - ”ఎవరినయితే ఖుర్‌ఆన్‌ పారాయణం మరియు నా స్మరణ వారి వ్యక్తిగత అవసరాల గురించి అడగటం నుండి నిమగ్నుల్ని చేస్తుందో నేను వారి అవసరాల ను అడిగే వారి అవసరాలకన్నా ఉత్తమ రీతిలో తీరుస్తాను”. (తిర్మిజీ) ”ఖుర్‌ఆన్‌ను కంఠస్థ చేసుకుని దాని ప్రకారం జీవించిన సజ్జన సంతానం మూలంగా వారి తల్లిదండ్రులను రేపు ప్రళయ దినాన అల్లాహ్‌ కీర్తి కిరీటం తొడిగించి సన్మానించడం జరిగురుంది. దాని కాంతి సూర్య కాంతికన్నా ప్రకాశమానమయి ఉంటుంది. (ముస్నద్‌ అహ్మద్‌) సజ్జన సంతాన అమ్మానాన్నలకు జరిగే సన్మానం ఈ స్థాయిలో ఉంటే, స్వయంగా దాని కంఠస్థం చేసుకుని అమలు పరచిన వ్యక్తి జరిగే సన్మానం ఇంకా ఎంత ఘనంగా ఉంటుందో ఊహిం చండి’. ఖుర్‌ఆన్‌ గురించి ప్రముఖుల అభిప్రాయం: ”ఖుర్‌ఆన్‌ అది అల్లాహ్‌ వాక్కు, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్‌ (స) పై అవతరించిన అంతిమ దైవ గ్రంథం. దాని పారాయణం పుణ్యప్రదం. అందులో ఒకే ఒక్క చిన్న పాటి సూరా లాంటిది ఎవరూ లిఖించి తీసుకు రాలేరు. అది భువనగగనాల్లో అల్లాహ్‌ను చేరుకునే వారధి. అది అల్లాహ్‌ మరియు ఆయన దాసుల మధ్య ఒప్పందం. అది శాశ్వత అల్లాహ్‌ శాసనం. అది సర్వకాల, సర్వావస్థలయందు పనికి వచ్చే ఆకాశ దస్తూరీ’ అన్నారు ఇబ్నుల్‌ ఖయ్యిమ్‌ (ర). హజ్రత్‌ అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌వూద్‌ (ర) ఇలా అభిప్రాయ పడ్డారు: ”అల్లాహ్‌ తనను ప్రేమించాలని ఎవరయితే కోరుకుంటున్నారో వారు ఆత్మావలోకనం చేసుకోవాలి. ఒకవేళ అతను ఖుర్‌ఆన్‌ను అభిమానిస్తుంటే అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్తను అభిమానించినట్లే. మరెవరయితే ఖుర్‌ఆన్‌ను అభిమానిస్తారో వారిని అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్త (స) ప్రేమిస్తారు”. (తబ్రానీ) కొన్ని సూరాల ప్రాశస్త్యం: ”ఓ సహాబీ ప్రవక్త (స) వారితో ఇలా అన్నాడు: ‘నేను ఈ సూరాను – ఖుల్‌ హువల్లాహు అహద్‌ – ఇష్ట పడుతున్నాను’. అది విన్న ప్రవక్త (స) ఇలా అన్నారు: ”నిశ్చయంగా దాని పట్ల నీ ప్రేమ నిన్ను స్వర్గంలో ప్రవేశింప జేస్తుంది”. (తిర్మిజీ) ”ఎవరయితే సూరతుల్‌ కహఫ్‌ ప్రారంభంలోని పది ఆయతులను కంఠంస్థం చెసుకుంటారో (వేరోక ఉల్లేఖనంలో చివరి పది ఆయతులను అని ఉంది) వారు దజ్జాల్‌ మహా ఉపద్రవం నుండి కాపాడ బడతారు”. (ముస్లిం) హజ్రత్‌ అబ్దుల్లాహ్‌ బిన్‌ అబ్బాస్‌ (ర) గారి కథనం – ‘జిబ్రీల్‌ (అ) ప్రవక్త (స) వారి సన్నిధిలో కూర్చుని ఉండగా తన పై భాగం నుండి ఓ శబ్దాన్ని విని తలను పైకెత్తి ఇలా అన్నారు: ”ఇది ఆకాశ తలుపుల్లోని ఓ తలుపు. ఈ రోజు అది తెరవబడింది, ఈ రోజు తప్ప మునుపెన్నడూ దాన్ని తెరవడం జరుగ లేదు. దాని గుండా ఓ దైవదూత దిగి వచ్చాడు. అది చూసి అయన మళ్ళీ ఇలా అన్నారు: ”ఈ దైవ దూత ఈ రోజు తప్ప మునుపెన్నడూ అవనిపై కాలు మోపలేదు”. అలా వచ్చిన ఆ దైవదూత సలామ్‌ చేసి ఇలా అన్నాడు: ‘ఓ దైవప్రవక్తా! నేను మిమ్మల్ని రెండు జ్యోతులకు సంబంధించిన శుభవార్తను అందజేస్తున్నాను. వాటిని మీకు పూర్వం గతించిన ఏ ప్రవక్తకూ ప్రసాదించడం జరుగలేదు. ఒకటి ఖుర్‌ఆన్‌ మున్నుడి – ఫాతిహా సూరహ్‌.మరొకటి సూరతుల్‌ బఖరహ్‌ చివరి ఆయతులు. వాటిలో ఏ ఒక్క అక్షరాన్ని మీ పఠించినా అది మీకు ప్రసాదించ బడుతుంది”. (ముస్లిం) గమనిక: నేడు ఇస్లాం సంబంధించిన ప్రతి దాన్ని వేదాలు, పురాణాలు, ఇతిహాసాలతో రుజు చేయాలనుకునే కొందరి స్వధర్మ అవగాహనా రాహిత్య వ్యాఖ్యానం ఖుర్‌ఆన్‌ను కూడా తాకుతూ ఉండటం మిక్కిలి విచారకరం! దాని వల్ల ఖుర్‌ఆన్‌కు ఎటువంటి హాని జరగక పోయినా, సామాన్య జనం మాత్రం మోసపోతున్నారు. అదే సూరతుల్‌ ఫాతిహాను వేదాలలో ఉన్నట్టుగా నమ్మ బలకడం. వారు అల్లాహ్‌కు భయ పడాలి. వారి ఈ వాదన నీతిని నిలబెడుతుందో, కూల దోస్తుందో ఆలోచించాలి. రేపు ప్రళయ దినాన ”ఏమిటి మీరు అల్లాహ్‌తో, ఆయన ఆయతులతో, ఆయన ప్రవక్తతో పరిహాసమాడుతున్నారా?” (తౌబహ్‌: 65) అని అల్లాహ్‌ నిలదీస్తే ఏమని సమాధానమిస్తారో? ఒక్కసారి యేచించాలి. ఇది ముమ్మాటికి బసీరత్‌తో కూడిన ధర్మబోధ కాదు. ఇస్లాం సత్యతను, ఖుర్‌ఆన్‌ స్వఛ్చతను నిరూపించడానికి ఖుర్‌ఆన్‌ ఒక్కటే చాలు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అలాగే ఔత్సాహికులైన కొందరు యువకులు సామాజిక మాధ్యమాలను ఆధారంగా చేసుకొని ఏరుకున్న జ్ఞానంతో మహనీయుల జీవితాలను ఎగతాళి చేసుతున్నారు. వారి బురద బుద్ధులకు బోధ పడని ప్రవక్త (స) వారి హదీసులను తూర్పార బడుతున్నారు. అసలు దేని గురించి పూర్వాపరాలు తెలుసుకోకుండానే వాగుడుకాయలు తాము గొప్ప వాక్చాతుర్యం గలవారమని హూంకరిస్తున్నారు, అహంకరిస్తున్నారు. స్వతాహా తాము త్రోవ తప్పడమే కాక అనేమంది యువ రచయితలను, రచయిత్రిలను త్రోవ తప్పిస్తున్నారు. ఖుర్ఆన్ చేస్తున్న హెచ్చరికను వారు గమనించాలి! మరికొందరు ఎలాంటి జ్ఞానం, మార్గదర్శకత్వం, (జ్ఞాన)కాంతి ప్రసాదించే గ్రంథం లేకుండానే ప్రజలను పెడదారి పట్టించడానికి అల్లాహ్ విషయంలో గుండెలు విరుచుకొని మరీ వాదిస్తుంటారు. అలాంటివాడికి ప్రపంచంలో అవమానం, అప్రతిష్ఠలే మిగులుతాయి. ప్రళయదినాన మేమతనికి నరకాగ్ని యాతనలు చవిచూపిస్తాం. “ఇదే నీకోసం, నీ చేజేతులా సంపాదించి పంపుకున్నదాని ఫలితం. అంతేగాని అల్లాహ్ తన దాసులకు ఎలాంటి అన్యాయం చేయడు” (అని అతనికి చెప్పబడుతుంది). (అల్-హజ్: 8-10) అల్లాహ్ పేరు మీద ఏం మాట్లాడినా సత్యం, న్యాయమే మాట్లాడాలని దైవగ్రంథం గురించి వారి చేత ప్రమాణం చేయించ లేదా? వారు గ్రంథంలోని విషయాలు చదివి ఉన్నారు. (అయినా వితండవాదం చేస్తూ దేవుడు తమను క్షమిస్తాడని భ్రమపడుతున్నారు. కాని)అల్లాహ్ కు భయపడుతూ దుష్కార్యాలకు దూరంగా ఉండేవారికే పరలోక (స్వర్గ) ధామం శోభిస్తుంది. ఆమాత్రం మీరు గ్రహించలేరా? (అల్-ఆరాఫ్: 169) విశ్వాసులారా! మీరు పరస్పరం బిగ్గరగా మాట్లాడుకున్నట్లు అల్లాహ్ ప్రవక్త ముందు బిగ్గరగా మాట్లాడకండి. (దీనివల్ల) మీరు చేసుకున్న సత్కర్మలు మీ ఆలోచనకు సైతం తట్టని విధంగా నిష్ఫలం కావచ్చు. అల్లాహ్ ప్రవక్త ఎదుట (వినయంతో) కంఠస్వరం తగ్గించి మాట్లాడేవారే నిజమైన దైవభీతిపరులు. భయభక్తుల కోసం అల్లహ్గ్ వారి హృదయాలు పరీక్షించి చూశాడు. వారికి మన్నింపు, గొప్ప ప్రతిఫలం లభిస్తాయి. (అల్-హుజూరాత్: 2-3) ఖుర్‌ఆన్‌ ఎవరి యెడల ఎలాంటి కరుణను కనబరుస్తుంది: ”ఓ ముహమ్మద్‌ (స)! మేము ఈ ఖుర్‌ఆన్‌ను నీపై అవతరిమపజేసింది నువ్వు కష్టాల్లో పడటానికి కాదు”. (తాహా: 2) లోతైన గొయ్యిలో పడి ఉన్న ఓ వ్యక్తి కొందరు కాపాడారు అంటే కారణం కరుణే. ఆ విషయానికొస్తే మనిషి పాలిట ఇహపరాల్లో ఖుర్‌ఆన్‌కు మించిన కారుణ్యం మరొకి లేదు. అది మనిషిని అంధ విశ్వాసాల భయంకర ఊబి నుండి కాపాడి సరైన మార్గం మీద నడిపించడమే కాకుండా, నడవడానికి కావాల్సినంత కాంతిని, దర్శకత్వాన్ని అందించి, ప్రభువు ప్రసన్నతను అనుగ్రహించి ఇహంలో విజేతగా, పరంలో సాఫల్యవంతునిగా చేసి నిలబెడుతుంది. ”అల్లాహ్‌ తరఫు నుంచి మీ వద్దకు జ్యోతి మరియు స్పష్టమయిన గ్రంథం వచ్చేసింది. దాని ద్వారా అల్లాహ్‌ తన ప్రసన్నతని అనుసరించేవారికి శాంతి మార్గాలను చూపుతాడు. తన అభీష్టం మేరకు వారిని చీకట్లలో నుంచి వెలికి తీసి, కాంతి వైపునకు తీసుకు వస్తాడు. రుజుమార్గం వైపునకు వారికి దర్శకత్వం వహిస్తాడు”. (మాయిదహ్‌: 15,16) హృదయ కారుణ్యం ఖుర్‌ఆన్‌: ”దాన్ని విన్నప్పుడు తమ ప్రభువుకు భయ పడే ప్రజల రోమాలు నిక్కబొడుచుకుంటాయి.ఇంకా వారి హృదయాలు అల్లాహ్‌ ధ్యానం పట్ల మెత్త బడి పోతాయి ”. (అజ్జుమర్‌: 23) కలకంఠి పాలిట కారుణ్యం ఖుర్‌ఆన్‌: తరాల తరబడి స్త్రీకి జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టి ఆమెకు న్యాయంం జరిగేలా చూడటం కరుణ అయితే స్త్రీ పాలిట ఖుర్‌ఆన్‌కు మించిన కారుణ్యం మరొకి లేదు. మానవ చరిత్రలో స్త్రీ పుట్టుకకు శుభవార్త పేర్కొని, దాన్నో శాసనంగా ఖరారు చేసిన ఏకైక గ్రంథం ఖుర్‌ ఆన్‌. ”వారిలో ఎవరికైనా కూతురు పుట్టిందన్న శుభవార్తను వినిపిస్తే…”. (నహ్ల్‌: 58) స్త్రీల హక్కులకు సంబంధించి 176 ఆయతులతో కూడి ఓ పూర్తి అధ్యాయయమే ‘నిసా’- మహిళలు ఖుర్‌ఆన్‌లో ఉంది. అంటే కాదు విశ్వాస జగత్తుకి ఆదర్శం స్త్రీలలో కూడా ఉంది అని ఘంటాపథంగా చెప్పిన ఉద్గ్రంథం ఖురాన్. విశ్వాసుల విషయంలో అల్లాహ్ ఫిరౌన్‌భార్య గాధను దృష్టాంతంగా పేర్కొంటు న్నాడు. ఆమె (అల్లాహ్ ను ప్రార్థిస్తూ) “ప్రభూ! నాకోసం నీ దగ్గర స్వర్గంలో ఒక గృహం నిర్మించు. నన్ను ఫిరౌన్‌ బారినుండి, అతని (దుష్ట)కర్మల (కీడు)నుండి కాపాడు. (ఈ) దుర్మార్గపు జాతి నుండి నాకు విముక్తి కలిగించు” అని అన్నది. అలాగే అల్లాహ్ ఇమ్రాన్‌ కుమార్తె మర్యంని కూడా ఉదాహరణగా పేర్కొంటు న్నాడు. ఆమె తన మానాన్ని కాపాడుకున్న పరమ శీలవతి. మేము మావైపు నుండి ఆమె (గర్భం)లోకి ఒక ఆత్మను ఊదాము. ఆమె తన ప్రభువు బోధనలను, ఆయన గ్రంథాలను విశ్వసించి, దైవవిధేయులలో చేరిపోయింది. (అత్-తహ్రీమ్: 11, 12) ఇలా చెప్పు కుంటూ పోతే ఖుర్‌ఆన్‌ కరుణ నోచుకోని జీవి ఈ జగాన లేదు. చివరి మాట: తొలకరి జల్లుతో మృత భూమి ఎలా సజీవమవుతుందో, అందులోని వృక్షాలు ఎలా చిగురిస్తాయో అలాగే ఖుర్‌ఆన్‌ కారుణ్య జల్లుతో మృత హృదయాలు జీవం పోసుకుంటాయి. అది జాతి జడత్వాన్ని జాడించి, చేవ కోల్పోయిన సమాజంలో చైతన్యాన్ని నింపుతుంది. అదెలా అంటే రహ్మహ్‌ – కారుణ్యంతో పాటు ఖుర్‌ఆన్‌కు గల మరో పేరు రూహ్‌ – ఆత్మ. నేడు ప్రపంచమంతా సమస్యల సుడిగుండంగా తయారయింది, మనిషి అలా తయారు చేసుకున్నాడు. ఈ వలయాన్ని ఛేదించి మానవ జాతులకు స్వేచ్ఛను, ముక్తిని ప్రసాదించే శక్తి గ్రంథ పరంగా ఒక్క ఖుర్‌ఆన్‌కు మాత్రమే ఉంది. నేడు ఖుర్‌ఆన్‌ను ఎంతగానో అభిమానించే ముస్లింలు, వ్యక్తులయినా, ప్రభుత్వాలయినా ఈ అనంత ‘కరుణా నిధి’ ద్వారా మానవాళికి కారుణ్యాన్ని పంచడంలో దాదాపు విఫలమయ్యారు అని చెప్పొచ్చు. నాటి ముస్లింలు ఖుర్‌ఆన్‌నే శ్వాసించి, ఖుర్‌ఆన్‌ నీడలోనే జీవించి ధన్యులయ్యారు. నేటి ముస్లింలు ఖుర్‌ఆన్‌ను విస్మరించి, మనోవాంఛలను అనుసరించి దీనులయ్యారు. ఫలితం వారి గతేమో సుగతి, వీరి గతి దుర్గతి. ఒక్క మాటలో చెప్పాలంటే , ప్రపంచ వ్యాప్తంగా వినబడే నినాదాలుగానీ, కనబడే ఇజాలుగానీ మనిషి సమస్యను మరింత జఠిలం చేసినవే. మానవులకు ఎదురయిన ఉన్న సకల సమస్యలకు పరిష్కారంగా సర్వలోక ప్రభువయిన అల్లాహ్‌ ఖుర్‌ఆన్‌ గ్రంథాన్ని అవతరింప జేశాడు. ”అల్లాహ్‌ ప్రవక్తలను శుభవార్తనిచ్చేవారుగా, భయ పెట్టేవారుగా చేసి పంపాడు. ప్రజల మధ్య తలెత్తిన అభిప్రాయ భేదాలపై తీర్పు చేయడానికిగాను వారి వెంట (ప్రవక్తల వెంట) సత్యబద్ధమయిన గ్రంథాలను పంపాడు”. (అల్‌ బఖరహ్‌: 213) అలా అల్లాహ్‌ అవతరిమపజేసిన గ్రంథాలలో అంతిమ దైవగ్రంథం ఖుర్‌ఆన్‌. కాబట్టి ఖుర్‌ఆన్‌ను మానవాళి సమస్యలకు పరిష్కారం పరిచయం చేయాల్సిన ఆవశ్యకత ఎంతయినా ఉంది. చేస్తారని ఆశిస్తూ ....

మన పాలు ఎవరి పాలవుతుందో?

నేటి యువతరంల్లో నానాటికీ అభద్రతా భావం అధికమైపోతూంది.అలాగే వయసు మీద పడిందని మదనపడే పెద్దలకీ కొరవ లేదు. ఇట్టి పరిస్థితుల్లో ఒకరి సమక్షంలో వారు ఆనందంగా గడపడానికీ, వారి మనోభావాలను వ్యక్తపరచడానికి, వారి ఫీలింగ్స్‌ని చెప్పుకోవడానికీ, ‘నీకు నేను న్నాను’ అన్న ఫీలింగ్‌ కలగటానికీ నిజ మైన హితుడి ప్రాణ మిత్రుడి అవసరం ఉంటుంది. ఇలా పిల్లల నుంచి పెద్దల వరకు, యువకుల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ స్నేహాన్నే కాంక్షిస్తారు. ఆ స్నేహ కాంక్షని మనం పాలతో పోల్చ వచ్చు. అవతలి వ్యక్తి ఇచ్చేది పంచాదార అయితే మనలో కరిగిపోతుంది. ఉప్ప యితే విరగ్గొడుతుంది. పెరుగయితే మన అస్థిత్వాన్ని మారుస్తుంది. నీరయితే పలు చన చేస్తుంది. కనుక మన పాలు ఎవరి పాలవ్వాలో మనమే నిర్ణయించుకోవాలి. ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారు - విభిన్నమయిన వ్యక్తులు కలిసి కొంతకాలం ఉంటే, ఒకరి గుణాలు (మంచైనా,చెడైనా) మరొకరికి అలవడతాయి అని చెప్పటమే ఈ సామెత సారాంశము. ఎదుటి వ్యక్తి ఉప్పా? నిప్పా? తీపా? చేదా? అమృతమా? విషమా? అన్న దాన్ని బట్టి మనం స్నేహం ఫలించనైనా ఫలిస్తుంది. నిష్ఫలమైనా అవుతుంది. ‘నేను చాలా ఒంటరిని నాకంటూ ఎవరూ లేరు. ఎవరూ నన్ను అర్థం చేసుకోరు. అందరితో నేను కలవలేక పోతున్నాను.’ అన్న దుర్భర స్థితి నుంచి ముందు బయట పడాలి.
ఇక వృద్ధుల విషమంటారా..! నిజంగా పరిశీలించి చూస్తే అసలైన జీవితం నలభై సంవత్సరాల తర్వాతే ప్రారంభమవు తుంది. ఇందుకు గొప్ప ఉదాహరణ ప్రవక్తలకు, ప్రవక్త పదవి 40 ఏండ్ల తర్వాత ప్రసాదించడమే. సగం జీవితం – ఇచ్చిన అనుభవ పరంపర నుంచి సరికొత్త జీవితం ప్రారంభించాలి. ఆ వయసు దాటాక జీవితం కాటికి కాలుజాచి ఉం టుందనుకోవటం మూర్ఖత్వం. నిజంగా ఆ వయసు నుంచే కొత్త జీవితం ప్రారంభ మవుతుంది అని అనుకుంటే ఆ సరికొత్త జీవితం మరింత ఆనందప్రదంగా ఉం టుంది. వృద్ధాప్యం వయసుకే గానీ, మన సుకీ కాదని తెలుసుకోవాలి. మనిషి ఒంటరితనానికి, అశాంతికి, అసంతృప్తికి బద్ధ శత్రువకటుంది. అది ‘వ్యాపకం’. ఒక మంచి వ్యాపకం మనిషి జీవితంలో కొత్త ఉత్సాహాన్నిస్తుంది. అర్థం చేసుకోగలిగితే, ఒక పుస్తకం, లేద ఒక గొప్ప వ్యక్తి చరిత్ర మనకి ప్రేరణ ఇస్తుంది. ‘ఇలా చెయ్యి’ అని శాసించకుండా ఎలా చేస్తే బావుంటుందో సలాహా ఇస్తుంది. నేను, నా జీవితం, నా చదువు, నా ఉద్యోగం, నా కుటుంబం, నా బ్యాంక్‌ బ్యాలెన్సు అనుకుంటే నూతిలోని కప్పకీ ఒడ్డునున్న మనిషికీ తేడా ఏం ఉంటుంది చెప్పండి. కనుక జీవితం నిరాసక్తంగా అని పించినప్పుడు ఒంటరితనంతో సతమతమై పోయే బదులు రోజుకో గంట, వారానికో రోజు, నెలకో నాలుగు రోజులు, ఏడాదికో యాభై రోజులు మనకంటు ఓ గుర్తింపు నిచ్చిన సమాజం కోసం కేటాయించినప్పుడే జీవితానికి సార్థకత. సమాజ సేవ చేసినంత సేపూ ఇష్టంగా చేయండి. అందులో మమేకమైపోండి. ఆ శ్రమలో కష్టం ఉండదు. అసలట అసలే అన్పిం చదు. ప్రతిఫలాన్ని కోరుకోం కాబట్టి ఆశా నిరాశలుండవు. ఎవరో నెత్తిన కూర్చొని ఆజమాయిషీ చేస్తున్న భావనే కలుగదు. ఆ అదృష్టం సేవకులకే దక్కుతుంది. పరిమిత మైన అనుభావాలతో, పరిమితమైన వ్యక్తుల మధ్య బతికే బతుకు, జైలు జీవితం కంటే ఎక్కువేం కాదు. మన ఇల్లు, మన కుటుంబం, మన స్నేహితులు…అంతా ఇరుకిరుగా ఉంటుంది. బయటికెళ్తే బోలెడంత ప్రపంచం. ఓ కవి అన్నట్టు ఓ ఫూల్‌ సర్‌ చడా జో చమన్‌సే నిక్‌లా’ ‘ఉస్‌ షక్స్‌కు ఇజ్జత్‌ మిలీ జో వతన్‌సే నిక్లా. మనిషికైనా, మరే మహాత్ముడికైనా గడప దాటాకే బుద్ధి వికసించింది. ఒంటరితనంతో బాధ పడుతున్న వారికీ, డిప్రెషన్‌ లాంటి సమస్యలు వేధిస్తున్న వారికి సృష్టిరాసుల సేవకు మించిన చికిత్స లేదు అంటున్నారు మానసిక నిపుణులు. అంత మంది కోసం పని చేస్తున్న ప్పుడు ఒంటరి భావనకు చోటెక్కడిది చెప్పండి. మనిషి ఎదుర్కొనే మానసిక సమస్యలకు బంధాల్ని మించిన, స్నేహపరా మర్శలకు మించిన మందేముంటుంది చెప్పండి. పైగా సమయాన్ని సృష్టి సేవ కోసం కేటాయించేవారు, మిగతావారికన్నా ఆరోగ్యంగా ఉంటారనీ, వారి ఆయుష్షు పెరుగుతుందిని, వారి సంపాదనలో శుభం కలుగుతుందిని ప్రవక్త (స) వారి పలు ప్రవచనాల ద్వారా రూడీ అవు తుంది. నిజమే మనకు బాగా ఇష్టమైన పని చేస్తున్నప్పుడు ఒత్తిడి ఉండదు. మనసు సేద తీరుతుంది. గుండే సాఫీగా పని చేస్తుంది. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అలాగే భరించలేని దిగులు ఆవరించిన ప్పుడు ప్రవక్త (స) గారి ”యా బిలాల్‌ అరిహ్‌ నా బిస్సలాత్‌” (ఓ బిలాల్‌! మాకు నమాజు ద్వారా విశ్రాంతినివ్వు) అన్న మాటను అనుసరిస్తూ, తాగుడికి ఇతర వ్యర్థ వ్యసనాలకి బానిసకాకుండా, మస్జి దుకు వెళ్ళటం, దైవ సన్నిధిలో సజ్దా చేయటాన్ని అలవాటు చేసుకోండి. మరీ బోరుగా ఉన్నప్పుడు సిగరెట్‌ తాగాలనిపిం చటం, చుట్ట పీల్చాలనిపించడం ఒక హానికర వ్యసనమైతే, మంచి స్వరం గల ఖుర్‌ఆన్‌ పారాయణాన్ని, పరలోక భీతిని పెంచే హితబోధనం వినడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే ..? చెడ్డ వ్యసనం మనల్ని అధిగమించి ఎంతగా తన చెప్పు చేతలలో ఉంచుకొం టుందో, మంచి అలవాటు ఒక స్నేహి తునిగా, మన పక్కన చేరి, మనతో పాటు ఉండి స్పూర్తినిస్తుంది. అందుకే ఒక ప్రముఖ మేధావి ఇలా అన్నాడు: (1) ఒక మంచి ఆలోచనకి అంకురంగా వెయ్య ండి. ఒక స్పూర్తి మొలక పైకొస్తుంది. (2) ఒక స్పూర్తి మొలకని అంటు కట్టండి. ఒక చర్య పుష్పిస్తుంది. (3) చర్య అనే పుష్పాన్ని ఫలించనివ్వండి. అలవాటు అనే ఫలం పక్వానిని కాస్తుంది. (4) ఆ ఆరాధన (అలవాటు) అనే ఫలాన్ని ఆస్వాదించండి. అది మీకు లక్ష్యం చేరుకొనే శక్తినిస్తుంది.