Friday, August 23, 2024

చరిత్ర పుటల్లో రమజాన్ / Ramadan in the pages of history

 

రమజాన్‌-ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భిన్న ఆలోచనా ధోరణులను, వ్యక్తిత్వాలను ఏకోన్ముఖం చేసి లక్ష్య సాధనా మార్గంలో నడిపిస్తుంది. వారందరిని ఏకతాటిపై తెచ్చి తౌహీద్‌ (ఏకేశ్వరో పాసన) ప్రాతి పదికన వారందరిని బలమయిన వ్యక్తులుగా,సత్య సమర యోధులుగా, శాంతి దూతలుగా తీర్చిదిద్దుతుంది. మనిషి మతి పరిధిలో ఏర్పరచుకున్న రాతారీతులు, కులం, వర్గం, వర్ణం అన్న జాఢ్యాలకు లోను కాకుండా, వాటి విష కోరల్లో చిక్కుకొని ఇరుకైన మనసు గోడలు నిర్మించుకుని భావదారిద్య్రంతో, పదార్థ దాస్యంతో మరుగుజ్జులుగా మారకుండా, అందరిని ప్రేమించే, అందరిని గౌరవించే సాత్విక జీవులుగా, శాంతి కాముకులుగా అది మలుస్తుంది. మనల్ని మనం గౌరవించుకోకుండా, మనకంటూ ఒక బలమయిన వ్యక్తిత్వాన్ని నిర్మించుకోకుండా అందరూ మనల్ని గౌరవించాలని, మన వ్యక్తిత్వాన్ని గుర్తించాలనుకోవడం కన్నా మించిన మూర్ఖత్వం మరొకటి ఉండదని, మనిషికి కూడు, గూడు, గుడ్డ, గాలీ, నీరు, వేడిమి ఎంత అవసరమమో స్వీయ గౌరవం, స్వీయ వ్యక్తిత్వం అంతే అవసరం అని, శ్వాసించాలన్నంత బలమయిన కాంక్ష వలే మనం శ్రమించినప్పుడే అవి మనకు ప్రాప్తిస్తాయని హితవు పలుకుతోంది.





శుభాల సరోవరం, సత్కారాల సమాహారం, వరాల వసంతం, కరుణా సాగరం  అయిన రమజాను మాస రాకకు సాక్ష్యంగా ప్రకృతిలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. స్వర్గ ద్వారాలు తెరవబడతాయి. ఏ ఒక్క ద్వారం మూసి వేయబడదు. నరక ద్వారాలు మూసి వేయ బడతాయి, ఏ ఒక్క ద్వారం తెరువబడదు. దుష్టులయిన షైతానులను బంధించడం జరుగుతుమది. ప్రతి రోజు ఇద్దరు దైవ దూతల పిలుపు తో ముస్లిం భక్త జనంలో భక్తీప్రపతులు పొంగి పొర్లుతాయి. దైవ దూతల ఆ పిలుపు ఏమిటో తెలుసా? ‘యా బాగియల్‌ ఖైరి అఖ్బిల్‌’ – ఓ మేలు కోరేవాడా! ముందుకు సాగు, విజృభించు!! ఇంత కాలం చూపిన అలక్ష్యం చాలు. నిద్రావస్థ నుండి మేలుకో. నింగినున్నవాడు నీకు అనుగ్రహిం చిన రమజాను నెలవంక దర్శనం పూర్తయింది. పుణ్యకాలం ప్రారంభమయింది. మేలుకో! సత్కార్యాల సామగ్రిని కూడబెట్టుకో! దైవభీతి మూటను తోడు తీసుకో! నువ్వో బాటసారివి. ఇహలోకం కేవలం విశ్రాంతి స్థలం. నీవు ఇంకా ముందుకు సాగాల్సి ఉంది. ఇక్కడే అడిపోతే గమ్యం చేరుకో లేవు. గమ్యం మధ్యలో వచ్చే మజిలీలను గమ్యం అని భ్రమిస్తే నష్ట పోయేది నువ్వే. కష్ట పడేదీ నువ్వే. ”ఏమిటి? అల్లాహ్‌ స్మరణతో విశ్వాసుల హృదయాలు కంపించే సమయం ఇంకా ఆసన్నం కాలేదా?” అని ఖుర్‌ఆన్‌ మనల్ని జాగుఉక పరుస్తోంది చూడు! ఇది పోటీల మాసం. ఉపవా సాల్లో పోటీ, తరావీహ్‌లలో పోటీ, ఖుర్‌ఆన్‌ పారాయణంలో పోటీ, దానాధర్మాలలో పోటీ. లైలతుల్‌ ఖద్ర్‌ అన్వేషణలో పోటీ. ఈ పోటీ సంవత్స రపు 12 నెలలు నిరంతరాయంగా, నిర్విఘ్నంగా, నిరాటంకంగా కొనసాగుతూనే ఉండాలి. అల్లాహ్‌ ప్రసన్నత మనకు ప్రాప్తమయ్యేంత వరకూ. స్వర్గ ప్రవేశం మనకు దక్కేంత వరకూ.

మరో దూత ఏమని పిలుస్తున్నాడో తెలుసా? ‘యా బాగియష్‌ షర్రి అఖ్సిర్‌’ – ఓ చెడును కోరుకునేవాడా! అగిపో!  నువ్విన్నాళ్ళు అల్లాహ్‌ా నామ విస్మరణకు లోనయి గడిపేసిన అన్య మాసాల్లాంటి మాసం కాదు ఇది. ఇది రమజాను మాసం. ఈ మాసంలో అల్లాహ్‌ా కారుణ్య కడలి నీ వద్దకు కదిలొచ్చింది. ఇప్పటి వరకు నీవు చేసిన నిర్వాకాలు చాలు. ఆగిపో! అల్లాహ్‌ కారుణ్యం వైపు, భూమ్యాకాశాలంతటి విశాలమైన స్వర్గ వనాల వైపు సాగిపో! చేసిన తప్పులకు పశ్చాత్తాపం చెందు. క్షమాభిక్షను వేడుకో!  ప్రతి రాత్రి చివరి ఝామున – ”ఉదయం తప్పు చేసిన ఉన్నారా? పశ్చాత్తా పం చెందండి. నేను మీ పాపాలను మన్నిస్తాను. రాత్రి తప్పు చేసిన వారు ఉన్నారా? తౌబా చేసుకోండి నేను వారి పాపాలను మన్నించడమే కాక వాటిని పుణ్యాలుగా మార్చి వేస్తాను” అని యేడాది మొత్తం నిన్ను ఎంతో ప్రేమతో పిలుపునిచ్చిన నీ ప్రభువు ఈ మాసంలో మరింత అధిక కరుణ తో, అధిక క్షమాభిక్షతో నిన్ను తౌబా చేసుకోమని పిలుపునిస్తున్డాడు. ”తమ ఆత్మలపై అన్యాయం చేసుకున్న ఓ నా దాసులారా! అల్లాహ్‌ కారుణ్య యెడల నిరాశ చెందకండి. నిశ్చయంగా అల్లాహ్‌ సకల పాపాలను మన్నిస్తాడు. నిశ్చయంగా ఆయన అమిత క్షమాశీలి, అపార దయాకరుడు”. (జుమర్:53)

ప్రస్తుతం పూర్తి ముస్లిం సముదాయం నిరాశ నిస్పుృహలకు లోనై ఉంది. ఏం చేయాలో తోచని అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంది రెక్కలు తెగి నేలకొరిగిన వక్షిలా వారి స్థితి మారిపోయింది తరుణోపాయం కోసం వారందరూ కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఎవరో వస్తారు. ఏదో చేస్తారు అని ఆశలు పెంచుకొని బ్రతుకుతున్నారు.

ఇట్టి క్లిష్ట స్థితిలో మరొక్కసారి రమజాను మాసం ముస్లిం సముదాయంపై కారుణ్య మేధమై వాలింది. రమజాను మానం భయంకర ఎడారిలో జలనిధి శుభవార్తను, బంజరు భూమిలో బంగారు వంట కబురును మోసుకొచ్చే సుగంధ భరిత వవనం. ఈ మానంలో నత్కార్యాలు, పుణ్యఫలాలు ఏరులై పారుతాయి. దానికితోడు ఈ మాసం దళిత జనాల పాలిట, పీడిత ప్రజల పాలిట విప్లవ నాదం, మార్పుకి చిహ్నం కూడా.
కారుణ్య గ్రంథం ఈ మాసంలోనే అసతరంచింది. ఈ ఉద్గ్రంథం అన్యాయాన్ని ఆక్రమాల్చి, దౌర్జన్యాన్ని, దుర్మార్గాన్ని అంతమొం దించింది. ఈ గ్రంథరాజం మూలంగానే పీడిత ప్రజలు, దళిత జనాలు, పాలిత ప్రజలు పాలకులయ్యారు. గొర్రెల్ని మేపే కృషి నలులు, ఒంటెల్ని తోలుకునే క్రమఃవులు సభ్యతా సంస్కారాల్ని వెదజల్లే చిరుదివ్వెలయ్యారు. అబ్దుల్లా ముద్దుల కొడుకు ముహమ్మద్ ఈ దళిత జనాల నుంచి ఉద్భవించిన  నాయకుడే. అవిశ్వాస అంధకారాల్లో కొట్టుమిట్టాడే మానవాళికి దివ్యతేజమై, ఉదయ భానుడై వెలిగాడు. ఆయనపై తొలి దైవవాణి అవతరించి, ఆయనకు దైవదౌత్యం ఒసగబడింది ఈ మాసంలోనే.ఫిరౌను  కబంధహసాల నుండి విముక్తి కలిగించే తౌరాత్  గ్రంథం కూడా ఈ మాసంలోనే లభించింది. యూద జనాల్ని, ఇస్రాయీలు ప్రజల్ని ప్రభువు మార్గాన నడిపేందుకు నచ్చిన ఇంజీల్  ( దేవుని సువార్త) గ్రంథం సైతం ఈ మాసంలోనే అవతరించింది. నియంత నమ్రూదును  ఎదిరించేందుకు, బూటకపు దైవాల్ని మట్టికరిపించేందుకు, దాసుల మెడలలో పడివున్న శృంఖా లను త్రెంచెన్దుకు 'సుహుఫ్ ఇబ్రాహీమ్' ఈ మాసంలోనే ఇవ్వబడ్డాయి. ఉదయం సాయంత్రాలు దైవమహిమను కొనియాడేందుకు జబూర్ గ్రంథం ఈ మాసంలోనే వచ్చింది.

ఈ మాసంలోనే బద్ర్ సంగ్రామం జరిగింది. ఈ దినాన్నే ఖుర్ఆన్ 'యౌముల్ ఫుర్ఖాన్'గా పేర్కొంది. ఈ సమరం సత్యానికి అనత్యానికి, దర్మానికి అధర్మానికి మధ్య జరిగింది. ఈ సత్య సమరం  సత్యాసత్యాలకు మధ్య గీటురాయిగా నిలిచింది. ఈ సత్యపోరులో అల్లాహ్ అవిశ్వానపు వ్రేళ్ళను కూకటి వ్రేళ్ళతో సహా పెకళించాడు. మక్కా విజయం కూడా ఈ మాసంలోనే ప్రాప్తమయింది. ఇది కేవలం మక్కా పరిసరాలకు పరిమితమయిన విజయం కాదు. పూర్తి ప్రపంచపు రాజకీయ వ్యవస్థ మార్పుకి  సంకేతం. ఈ మాసంలోనే అజాన్ కూడా షరియత్ విభాగంలోకి వచ్చింది. ఇది తౌహీద్ నినాదం. ఘంటారావంగా 'దేవుడు ఒక్కడే' అన్న పిలువును విశ్వమానవాళికి చేరవేసే ఆజాన్ నినాదం  నాటి నుంచి నేటివరకు, నేది నుండి ప్రశయం వరకు ఎవరికి ఇష్టమున్నా లేకపోయినా నిర్విఘ్నంగా సృష్టి మొత్తంలో వినబడే ఏకేశ్వరోపాసనా పిలుపు, అమ్ర్  బిన్ ఆస్ (ర) సారధ్యంలో ఈజిప్టుపై విజయ ఢంకా ఈ  నెలలోనే మ్రోగించబడింది, తారిఖ్ బిన్ జియాద్  ఉందులుస్  - నేటి  ఫ్రాస్ ను  ఈ మాసంలోనే జయించారు. 15 ఏళ్ళ సూనుగు మీసాల కుర్రోడు ముహమ్మద్ బిస్ ఖాసిమ్ రాజు దాహిర్ ను ఓడించి సింధూ  ప్రాంతాన్ని ఇస్లామీయ రాజ్యంలో విలీనపర్సింది  ఈ మాసంలోనే.

ఈ నెలలోనే ఇమాదుద్దీన్ జంకీ  శిలువ క్రూసేడులపై విజయ పతాకను  ఎగుర వేసింది. ఉస్మానీయ పలపాలకులు ఈ పూసలలోనే 'హంగదే'ని తన కైవసం చేసుకున్నారు. ఈ సంఘటనలన్ని ఇచ్చే సందేశం - రనుజాన్ మాసం  శుభప్రదాయిని, కారుణ్య వర్షిణీ మాత్రమే కాదు. అది ముస్లింల -పాలిట విజయ పరంపరల సువార్తలను అందజేసే మాసం కూడా. పరీక్షలు, ఇక్కట్లు, ఇబ్బందులు ఈ సముదాయపు అంతర్భాగాలు. దాని చరిత్రలో సమస్యల సునామీలు, పరీక్షల తుఫానులు లేని కాలకుంటూ ఏదీ లేదు. అయినప్పటికీ చరిత్ర ఇచ్చే సాక్ష్యం- ఈ సముదాయం పడుతూ పడుతూ కూడా ఉవ్వేత్తున లేచింది. మరణ ఘడియలు దీనికి ఆవహించాయి అని అందరూ అన్న నాజూకు సమయంలో  కూడా జీవం పోసుకుని నిండు యవ్వనాన్ని సంపాదించుకుంది. కారణం- 'పదివేల పౌరుల రక్తంలోనే, త్యాగంతోనే విజయం సాధ్యం' అన్న మాటను అక్షరాల నమ్మినవారు వీరు.. ప్రతి ఎడారి తర్వాత ఒక ఉద్యానవనం ఉంటుందని, ప్రతి చీకటి తర్వాత వెలుగు ఉండి తీరుతుందన్నది వీరి ప్రగాఢ నమ్మకం. వీరు ఎవరూ ఎరగనంతట ఆశాజీవులు. విజయపరంపరలు వీరి లక్షణాలు. పరాజయం మీద పరాజయాలు వీరు ఎరుగరు. కాబట్టి శుభప్రదమైన ఈ మాసంలో, విప్లవాత్మకమైన ఈ నెలలో నింగికీ నేలకి నిచ్చెన వేయాలన్న స్ఫూర్తితో ప్రతి వ్యక్తి సంసిద్ధమవ్వాలి. సలహా సంప్రదింపులతో కొంగ్రొత్త ప్రణాళికలు తయారు చేసుకోవాలి. ఇది మన లక్ష్యం అంటూ ముందుకు దూసుకుపోవాలి, రమబాను నెలవంక మన జీవితాల్లో విప్లవ  జ్యోతియై వెలగాలి. విప్లవం అనేది మనలోని  ప్రతి వ్యక్తి తన్నుతాను మార్చుకోవాలి,  గొప్పగా మలచుకోవాలి అన్న ఆత్మపరిశీలనతోనే వస్తుంది. నిజం ఏమి టంటే -
"
నిశ్చయంగా అల్లాహ్ కూడా ఆ బాతి దుస్ధితిని మార్చడు. ఏ జాతి అయితే స్వయంగా తన మనోస్థితిని మార్చుకోదో, అల్లాహ్ ఏ జాతి సయినా శిక్షించదలచుకుంటే ఇక ఆ శిక్ష తొలగిపోయే ప్రసక్తే ఉండదు. ఆయన తప్ప నారిని రక్షించేవాడు కూడా ఎవరూ ఉండరు. (దివ్యఖంఆన్- అర్రాద్: 11))

వ్యవస్థ- అది ఎంత బలమైనదైనా, సిద్ధాంతం అది ఎంత ఉత్తమమైనదైనా, కేవలం అనుసరించినందు వల్ల సమైక్యత, సాఫల్యం సిద్ధించదు. విస్తృతమైన, ప్రగాఢమైన ఎరుక, చైతన్యం, విప్లవభావం ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. ఈ ఎరుక చైతన్యపు లోతుల్లోకి కూడా పోవాలి. ఊరికే పైపై ఉత్తుత్తి ఫలితాలతో తృప్తిపడితే చాలదు.  పారాడుతూ, పోరాడుతూనే ఉండండి. చివరి శ్వాస ఆగే
వరకు, పోతూ పోతూ ప్రేమను పంచండి. లోక శాంతి, విశ్వకళ్యాణం సిద్ధించే వరకు.

 

 

No comments:

Post a Comment