వ్యభిచారం దరిదాపులకు కూడా వెళ్ళకండి. అది అతిదుష్ట కార్యం. బహు చెడ్డ మార్గం. (బనీఇస్రాఈల్ 17: 32).
అపరిమిత కోరికలతోనే అష్టకష్టాలు
కోరికలు, ఆశలు ఉండడం తప్పుకాదు. అవి లేనివారంటూ ఎవరూ ఉండరు. ఆకాంక్ష, ఆశారహితులైన వారి జీవితం తావి లేని పూవు లాంటిది. అవే జీవితనావకు చుక్కాని వంటివి. అయితే ఆ ఆశలు అత్యాశగా లేదా దురాశగా మారకూడదని, కోరికలు కళ్లాలు లేని గుర్రాలు కాకూడదని అంటారు. కోరికలే గుర్రాలైతే విపరీత, విపత్కర పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది.
అసలు కోరికలే కోరకూడదనడం వితండమే అవుతుంది. యుక్తాయుక్త విచక్షణను పాటించి కోరదగిన వాటినే కోరుకోవాలని వాటిని బట్టి స్పష్టమవుతుంది. అసంబద్ధ కోరికలకు అత్యాశ, అసంతృప్తి తోబుట్టువుల లాంటివి. అత్యాశ కోరికలను ప్రేరేపిస్తే, అవి ఎంతగా సిద్ధించినా అసంతృప్తి వెంటాడుతూనే ఉంటుంది.
అసలైన శత్రువులు అరిష్వడ్గాలు అంతఃకరణలోనే ఉన్నారని, వాటిలో మొదటి కామం (కోరిక) అని చెబుతారు. విషయా సక్తులకు కోరికలు కలుగుతాయి. అవి తప్పుకాకపోయిన హద్దులు దాటక మన అధీనంలోనే ఉండాలి. అందుకు భిన్నంగా జరిగితే మనిషి వాటి వెంట పరుగులు తీస్తూ, ఫలితంగా ధర్మమార్గం తప్పవలసి వస్తుంది. అవి కొన్నిసార్లు జీవితగమనాన్నే ఛిన్నాభిన్నం చేసే ఆస్కారం ఉంది.
అనేక కోరికలు తీర్చుకునే క్రమంలో పొందే ఆనందం, సుఖం తాత్కాలికమే. ఒకదాని తరువాత మరొకటి పుట్టుకొస్తూనే ఉంటుంది. నీటి కోసం ఎండమావుల వెంట పరిగెత్తినట్లు కోరికలను పట్టుకొని పాకులాడడం అవివేకం అంటారు పెద్దలు. మనిషి సుఖపడేందుకు ఎన్ని దారులు ఉన్నాయో, దుఃఖ పడేందుకు అంతకుమించిన కారణాలు ఉన్నాయని విజ్ఞులు చెబుతారు. అలవిమాలిన కోరికలూ వాటిలో భాగమే. అసంబద్ధ కోరికలు మనిషిని చింతల్లోకి నెట్టవచ్చు. అసలు ఏమీ లేనప్పుడు కొంత ఆసరా కోరుకునేవారు అది దక్కిన తరువాత మరిన్ని కావాలనుకోవడం, తమతమ స్థాయిని, యోగ్యతను మరచి ఉన్నతమైన వాటిని ఆశించడం దీని కిందికే వస్తుంది. అలా అని సాధించిన దానితో సంతృప్తి చెందాలని ఎవరూ చెప్పరు. అంకిత•భావం, పట్టుదల, కృషితో సమాజహితం కోసం నిర్దేశిత లక్ష్యసాధన వేరు. ఇంకొకరికి ఇబ్బంది కలిగిస్తూ తనకు మాత్రమే ఉపయోగపడేలాంటి కోరికలు పుట్టుకు రావడం వేరు.
మనిషి తన శక్తియుక్తులతో పట్టుదలతో కోరికలను సాకారం చేసుకుంటున్నాడు. అయినా కోర్కెల చిట్టా పుట్టుకొస్తూనే ఉంటుంది. అవి నిర్మాణాత్మకం, సమాజహితం అయితే ఆమోదయోగ్యమే కానీ వ్యక్తిగత ప్రయోజనాల కోసమో, ఇతరులకు ఇబ్బంది కలిగించేవో అయితే గర్హనీయమే. ‘అందరూ సుఖంగా, ఆరోగ్యంగా బాగుండాలి’ లాంటి వాటికి బదులు ‘నేను బాగుండాలి లేదా ఫ•లానా వ్యక్తి బాగుండాలి’ అనే కోరిక అలాంటిదే. దీనిని స్వార్థం, అత్యాశ అని కూడా అంటారు. అలా కాకుండా సర్వప్రాణి శ్రేయస్సును కాంక్షించడమే జీవితానికి సార్థకత అని పెద్దలు చెబుతారు.
ఇస్లారం ధర్మ చిహ్నం లజ్జ - వ్రీడ - సిగ్గు. అశ్లీలత, వ్యభిచారం ఈ సలక్షణాలకు పూర్తి విరుద్ధమైన దుర్లక్షణం. కనుకనే వ్యభిచారం వరకు చేర్చే మార్గాలను, సాధనాలను కూడా మూసి వేసింది ఇస్లాం. అందుకే పర్దా పాటించాలని, చూపులు క్రిందికి ఉంచాలని ఆదేశించింది. పరస్త్రీలతో ఒంటరిగా, ఏకాంతంలో ఉండటాన్ని నిషేధించింది.
మహనీయ ముమహాహండ్ (స) ఇలా హెచ్చ్రిరించారు:
“ప్రళయదినాన ముగ్గురితో అల్లాహ్ మాట్లాడడు, వారిని శుద్ధపరచడు మరియు వారి వైపు చూడడు. వారికి కఠిన శిక్షఉంటుంది. వృద్ధ వ్యభిచారి. అబద్ధం పలికే రాజు. అహంకారం చూపే పేదవాడు”. (ముస్లిం 107).
చెడ్డ సంపాదన
సంపాదనల్లో అతి చెడ్డది వ్యభిచార సంపాదన. ఏ వ్యభిచారిణి తన వ్యభి చారం ద్వారా డబ్బు సంపాదిస్తుందో అర్థ రాత్రి ఆకాశ ద్వారాలు తెరువ బడే సమయాన ఆమె దుఆ స్వకరించబడదు. (సహీహుల్ జామి 2971). పేదరికము మరియు ఆగత్యములు అల్లాహ్ హద్దులను మీరడానికి ఎంత మాత్రం ధార్మిక సబబులు కావు. వెనకటి సామెత ఎంత నిజం: “స్వతంత్రురాలైన స్త్రీ ఆకలిగొన్నప్పుడు తన రొమ్ముల వ్యాపారం చేసి (పాలు అమ్మి) తినదు అలాంటప్పుడు తన మానాన్ని అమ్మి ఎలా తింటుంది”.
అలాగే , ఎవరైనా సరే అక్రమంగా లేదా అన్యాయంగా సంపాదించిన సంపద పది ఆనతి కాలంలోనే సమూలంగా అంటే అంతకు ముందు ఉన్నదానితో సహా మొత్తం నాశనమై పోతుంది అని తెలుసుకుంటే మంచిది.
ఎవరైనా సరే.. డబ్బు ని సక్రమంగా సంపాదించి సక్రమంగా వినియోగిస్తే అది వాళ్ళకి ఒక మంచి సేవకుడవుతుంది. అన్యదా మనం దానికి బానిసలుగా మిగిలిపోతాం.
సహజీవనం తప్పు
ఆ మధ్య బయలుదేరి ఈ మధ్య కొత్తగా పరుగెడుతున్న ప్రక్రియ సహజీవనం. దీనికి సమాజంలో ఇంకా పూర్తిస్థాయి ఆమోదం లేదు. పెళ్లవ్వకుండా అమ్మాయి, అబ్బాయి కలిసుండడమనేది తప్పుగా భావించే సమాజమే ఇప్పుడు ఎక్కువగా ఉంది. కానీ ఈ వ్యవహారం సెలెబ్రిటీస్ లో బాగా ముదురుతోంది.
సినిమాల్లో ఎలా ఉన్నా నిజజీవితంలో కూడా నటీనటులు, ఆటగాళ్లు సహజీవనాల్లో మునిగి తేలి దానిని అఫీషియల్ చేసి సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు. ఒక నటుడైతే ఏకంగా కూతురిచేత సహజీవనకాపురం పెట్టించాడు. ఏమన్నా అంటే వాళ్లది మెచ్యూర్డ్ సొసైటీ అని, బంధానికి తాళి అవసరం లేదని, మనసులు కలిస్తే చాలని ఏవో సూక్తులు చెబుతారు.
వారిని చూసి ఎందరో సామాన్య యువతీయువకులు కూడా ప్రభావితం చెందుతున్నారు. కానీ అందులో పొంచి ఉన్న ప్రమాదాలను లెక్కవేసుకోవడం లేదు. ఎవరో ఒక యువకుడు కాస్త నచ్చే సరికి నమ్మి ట్రాపులో పడిపోయి సహజీవనానికి సై అనేస్తున్నారు అమ్మాయిలు. పైగా వేరే ఊళ్లల్లో ఉండి ఉద్యోగాలు చేసుకునే రోజులవడం చేత అమ్మానాన్నలకు తెలియకుండా కోరుకున్నప్రియుడుతో కాపురం పెట్టేసే అమ్మాయిలు ఎక్కువౌతున్నారు.
ఇక్కడ ఒక విషయం గుర్తుకొస్తుంది - కుర్చీ కొనాలనుకున్నప్పుడు అన్ని కుర్చీల్లోనూ కూర్చుని ఫైనల్: గా ఒకదాన్ని సెలెక్ట్ చేసుకున్నట్టే, అందరితోటి గడిపి నచ్చిన వారితో జీవితం పంచుకోమని చెప్పడం లాంటిదే ఈ సహజీవనం. అంతకంటే దరిద్రమైన జీవన విధానం మరొకటి ఉండదు. ప్రాణమున్న మనిషితో జీవితానికి, ప్రాణంలేని కుర్చీలాంటి వస్తువుతో పోలికపెట్టడమే తప్పు. ఇలాంటి దరిద్రపుగొట్టు ఆచారానికి సహజీవనం అనడం వేలం వెర్రికి పరాకాష్ట.
రకరకాల సైకలాజికల్ సమస్యలతో బతుకుతూ సెక్స్ ఒక్కటే పరమావధిగా జీవించే సైకోలు కొందరుంటారు. వాళ్లు మామూలు మనుషుల్లాగే ఉంటారు. కానీ మోజు తీరాక వాళ్లల్లో సైకో బయటికొస్తాడు. అప్పటివరకు ఉన్న బంధం వద్దనుకుంటారు. కాదంటే నిర్దాక్షణ్యంగా చంపేసి ముక్కలు కోసి ఫ్రిజ్ఞులో పెట్టేస్తున్నారు. మిస్సింగ్ కేసు కింద నమోదైన అమ్మాయి చావు గురించి తెలియడానికి తల్లిదండ్రులు నానా చావూ చావాల్సొస్తోంది. చివరకి సైకో దొరికినా ప్రయోజనమేంటి? అలా కాకుండా పెళ్లయ్యుంటే వెనుక చట్టమనేది ఒకటుంటుంది. అటు ఇటు పెద్దవాళ్లుంటారు తేడా వస్తే సంప్రదింపులకీ, కొండలో కొంత గృహహింస చట్టం బలంగా పనిచేస్తుంది.
ఒకమ్మాయికి ఒకబ్బాయి నచ్చితే గుడ్డిగా వలలో పడిపోవడం అస్సలు శ్రేయస్కరం కాదు. అందునా పొరుగూళ్లో ఉంటూ ఉద్యోగాలు చేసుకుంటున్న అమ్మాయిలు సైకోలకి పెద్ద టార్గెట్టవుతున్నారు. ఏ అబ్బాయి నుంచి ఏ ప్రపోజల్ వచ్చినా ఒకటికి వందసార్లు ఆలోచించాలి. తప్పు జరిగితే మోసపోవడమే కాకుండా, ప్రమాదంలో చిక్కుకోవడమే కాకుండా తల్లిదండ్రులకీ కూడా జీవితాంతం కన్నీళ్లు మిగిల్చినవాళ్లవుతారు.
సాంఘిక భయంకర నేరం వ్యభిచారం
ఆర్థిక భయంకర నేరం వడ్డీ అయితే సాంఘిక విచ్చలవిడి వ్యవహారం వ్యభిచారం. వడ్డీ వాళ్ళ ఆర్థిక రంగం, కుదేలయినట్టు - వ్యభిచారం మూలంగా సంసారం, సాంగేక జీవనం డొల్లబారి పోతుంది. అందుకే అల్లాహ్ ఈ అశ్లీల కార్యానికి కఠినమైన శిక్ష వేశాడు;
వ్యభిచారి, వ్యభిచారిణి- వీరిద్దరిలో ప్రతిఒక్కరినీ వందేసి కొరడాదెబ్బలు కొట్టండి. మీరు అల్లాహ్ ను , అంతిమదినాన్ని విశ్వసించినవారయితే అల్లాహ్ ధర్మం విషయంలో వారి (శిక్ష) పట్ల మీరు ఏమాత్రం సానుభూతి వెలిబుచ్చకూడదు. వారిని శిక్షించేటప్పుడు కొందరు విశ్వాసులు దగ్గర ఉండాలి. (అన్-నూర్: 2)
నేడు మన సమాజ పరిస్థితి ఎలా ఉన్నదంటే, వ్యభిచారాన్ని పెద్ద నేరంగా భావించడం లేదు; కారణం - ఈ పాప పంకిలంలో అన్ని వర్గాల ప్రజలు ఉండటం ఒకటైతే, ఈ చెడ్డ కార్యం ఇష్టమైన వారితోనే జరుపడాం అనేది రెండవదైతే, ఇది పరస్పర అంగీకారతోనే జరుగుతుంది అన్నది మూడవది. ఈ కారణంగానే, దొంగని చావబాదే ఈ సభ్య సమాజమే వ్యభిచారిణిని, వ్యభిచారిని శిక్షించడం అలా ఉంచి, కొన్ని సందర్భాల్లో అలాంటి వ్యక్తుల్ని గౌరవ స్థానాల్లో కూర్చోబెట్టి సన్మానాలు కూడా చేస్తారు. అందుకే - అల్లాహ్ - మీరు అల్లాహ్ ను , అంతిమదినాన్ని విశ్వసించినవారయితే అల్లాహ్ ధర్మం విషయంలో వారి (శిక్ష) పట్ల మీరు ఏమాత్రం సానుభూతి వెలిబుచ్చకూడదు. వారిని శిక్షించేటప్పుడు కొందరు విశ్వాసులు దగ్గర ఉండాలి. (అన్-నూర్: 2) అని నొక్కి వక్కాణించారు. అలాగే ఓ సరిహద్దు రేఖను కూడా గీశాడు. అది -
ఒక వ్యభిచారి వ్యభిచారిణిని లేదా బహుదైవారాధకురాలిని తప్ప మరెవరినీ వివాహమాడరాదు. అలాగే ఒక వ్యభిచారిణి వ్యభిచారిని లేదా బహుదైవారాధకుడ్ని తప్ప మరెవరినీ పెండ్లాడకూడదు. విశ్వాసులకు ఇలాంటి వివాహం నిషేధించబడింది. (అన్-నూర్: 3)
నేడు ఈ అశ్లీల ప్రవాహం పెచ్చు మీరుతొంది. షైతాన్ తన ఎత్తుగడలత, తనమూకల కుట్రలలతో ఈ మార్గాలను సులభం చేశాడు. ఇప్పుడు పర్దా లేకుండా తిరగడం, గుడ్లప్పగించి అశ్లీల దృశ్యాలను, చిత్రపటాలను చూడటం, , స్త్రీపురుషులు విచ్చలవిడిగా కలసుకోవడం సర్వసాధారణమయ్యాయి. కామవాంఛల్ని రెకేత్తించే మ్యాగ్జిన్లు, నీల చిత్రాలు సర్వ సామాన్యమయ్యాయి. వ్యభిచార కొంపలున్న దేశాలు, ప్రదేశాలకు ప్రయాణాలు అధికమయ్యాయి. రోజురోజుకి కొంగ్రొత్త వేశ్యాగృహాలు తెరువబడుతున్నాయి. మానభంగాలు పెచ్చరిల్లుతున్నాయి. అక్రమ సంతానానికి ఓ హద్దు ఓ పద్దు లేకుండా పొతొంది. అబార్షన్ల ద్వారా పిండాలను హతమార్చడం జరుగుతుంది.
అల్లాహ్! మేము నీ దయ, కరుణ ద్వారా మా దుష్కార్యాల నుండి దూరముండే భాగ్యం కోరుతున్నాము. ఇంకా మా హృదయాలను శుద్ధిపరచి, మా మానాలను కాపాడు. మాకూ, ఈ అశ్లీల కార్యాలకూ మధ్య పఠిష్టమైన రక్షక కవచాన్ని ఉంచు. ఈ అశ్లీలత ఊబి నుండి అందరినీ కాపాడు స్వామీ!!
బహుశా మనలో కొందరు పోకిరిచేష్టలు, దురాశలు, మద్యపానం, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, విగ్రహపూజలు, పాచిక జోస్యాలు, మొదలైనవి గతంలో చేసి ఉండవచ్చు. దయచేసి ఈ పాపములన్నీ మానివేసి అల్లాహ్ వైపు తిరుగమని బ్రతిమాలుతున్నాను. దయచేసి జారత్వము, వ్యభిచారం నుండి పారిపొండి, మోహపుచూపును వెలిచూపును వదిలెయండి! హస్తప్రయోగం లాంటి అలవాట్లు మానేయండి! ఆలాహ్ కు ఆగ్రహం తెప్పించే రంగురాళ్లు / రక్షరేకులు/ తావీదులు తీసిపారేయండి! మద్యపానం, ధూమపానం, మాదక ద్రవ్యాల సేవనాన్ని విసర్జించండి! అబద్ధాలు అబద్ద ప్రమాణాలు మానెయండి! వాస్తు చూడటం, హస్త రేఖల జోస్యం, తారా ఫలాల వీక్షణం లాంటి అన్య మతాచారాలను విసర్జించండి! ఎందుకంటే
విశ్వాసులారా! మద్యం, జూదం, దైవేతరాలయాలు, పాచికల జోస్యం- ఇవన్నీ అసహ్యకరమైన పైశాచిక విషయాలు. వాటికి దూరంగా ఉండండి, మీ జీవితం సార్థక మవుతుంది.
కారణం-
మద్యం, జూదాల ద్వారా షైతాన్ మీమధ్య విరోధం, విద్వేషబీజాలు నాటి మిమ్మల్నిఅల్లాహ్ ధ్యానం, ప్రార్థనల నుండి నిరోధించగోరుతున్నాడు. కనుక ఇకనైనా మీరు వాటిని మానుకోండి. అల్లాహ్ ఆజ్ఞలను, ఆయన ప్రవక్త హితవుల్ని పాటించండి. వాటిని పాటించకుండా ముఖం తిప్పుకుంటే మాత్రం (మీకే నష్టం), ఆదేశాన్ని యధాతథంగా అందజేయడమే మా ప్రవక్త బాధ్యత. (మాయిదహ్ : 90-92)
ఇకపొతే భార్యను కొట్టేవారు కొందరు. అనుమానించేవారు కొందరు. అవమానించేవారు కొందరు. మగ మారాజుల్లారా! మీకు శతకోటి సలాములు!! మీ భార్యలను ప్రేమించి పోషించమని ఖురాన్ మరియు అనేక హదీసుల్లో వ్రాయబడి ఉంటే భార్యని హింసిస్తారా? మనం మన భార్య ఎంత పవిత్రంగా, పతివ్రతగా ఉండాలని కోరుకొంటున్నామో, ఆమె కూడా మన విషయంలో అలాగే ఉండాలని కోరుకొంటుంది. మరి మనం అలా ఉంటున్నామా? ఆమెకో శాస్త్రం! మనుకో ధర్మమా? భార్యమీద భర్తకి, భర్తమీద భార్యకి నమ్మకం ఉండాలి, అప్పుడే కుటుంబం నిలబడతాది. దానిని వమ్ము చేస్తే అది కాపురం కాదు వ్యభిచారం అవుతుంది.
డబ్బు సంపాదించడానికి సులువైన మార్గమని భావించిన చాలామంది వ్యభిచార వృత్తిని ఎంచుకుంటున్నారు. దేశవ్యాప్తంగా రోజురోజుకీ వ్యభిచార వృత్తి విపరీతంగా పెరిగిపోతుంది. ఇక ఈ వృత్తి కొనసాగిస్తున్నవారు ఆడవాళ్లు మాత్రమే అంటే తప్పులో కాలేసినట్టే. వ్యభిచార వృత్తిని జీవనాధారంగా చేసుకుని పని చేస్తున్న మగ సెక్స్ వర్కర్ల సంఖ్య రోజు రోజుకి ఆందోళనకరంగా పెరుగుతుంది. ఇక భారతదేశంలోని ఒక రాష్ట్రంలో మాత్రం ఆందోళన కలిగించే విధంగా మగ సెక్స్ వర్కర్లు పెరిగారని తాజాగా చేసిన ఒక సర్వే వెల్లడించింది.కేరళకు చెందిన ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆ రాష్ట్రంలో సెక్స్ వర్కర్లపై ఓ సర్వే చేసింది. సర్వే నివేదిక ప్రకారం …ప్రస్తుతం కేరళలో 17,000 మంది మహిళా సెక్స్ వర్కర్లు ఉండగా 13,331 మంది మగవారు ఉన్నారు. రాష్ట్రానికి వేరే చోట నుండి వస్తున్న సెక్స్ వర్కర్ల సంఖ్య కూడా పెరుగుతున్నట్లు సర్వేలో స్పష్టం చేసింది.
స్వలింగసంపర్కం (Sodomy)
ఈ దుష్కార్యానికి పాల్పడింది లూత్ అలైహిస్సలాం జాతివారు. అల్లాహ్ ఆదేశం ఇలా ఉందిః
[లూత్ తన జాతి ప్రజలతో ఇలా అన్నాడుః నిశ్చయంగా మీరు చాలా అశ్లీల కార్యం చేస్తున్నారు. మీకు పూర్వం లోకంలో ఎవ్వడూ ఇటువంటి పని చేయలేదు. ఇదేమిటి? (కామంతో) మీరు పురుషుల వద్దకు పోతున్నారు, దారి దోపిడీలు చేస్తున్నారు. మీ సభలో అసభ్యకరమైన పనులు చేస్తున్నారు. (అన్కబూత్ 29: 28, 29).
ఈ పాపం చాలా చెడ్డది, దుష్టమైనది మరియు భయంకరమైనది. కనుక దానికి పాల్పడిన వారిపై అల్లాహ్ నాలుగు రకాల శిక్షలు పంపాడు. మరే జాతిపై ఆ నాలుగు శిక్షలు కలిపి పంపలేదు. 1. వారి కంటి చూపులను పొగొట్టాడు. 2. వారి పట్టనాన్ని తలక్రిందులుగా చేశాడు. 3. దాని మీద కాల్చిన మట్టితో చేయబడిన రాళ్ళు ఎడతెగకుండా కురిపించాడు. 4. భయంకర శబ్దం.
ఇలాంటి దుష్కార్యం తన ఇష్టంతో చేసిన వ్యక్తి, చేయించుకున్న వ్యక్తి ఇద్దరినీ ఖడ్గంతో హతమార్చాలన్న శిక్ష విధించింది మన ధర్మం. ఇబ్ను అబ్బాస్ రజియల్లాహు అన్హు ప్రవక్తతో ఉల్లేఖించిన హదీసులో ఇలా ఉందిః
“లూత్ అలైహిస్సలాం జాతివారు చేసినటువంటి పని ఎవరైనా చేస్తూ మీరు పట్టుకుంటే చేసుకున్నవాడు, చేయించుకున్నవాడు ఇద్దరినీ హత మార్చండి”. (అహ్మద్ 1/300. సహీహుల్ జామి 6565).
పోర్నోగ్రఫీ పాపం
పోర్నోగ్రఫీ... దేశంలో రోజురోజుకు పెనుభూతంలా వ్యాప్తి చెందుతుంది. రోజురోజుకు పెరుగుతున్న టెక్నాలజీతో సమాజం కొత్త పుంతలు తొక్కుతుండటం ఏమో కానీ ఈ పోర్నోగ్రఫీ మాత్రం విపరీతంగా వ్యాప్తి చెందుతుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకూ ఈ పోర్నోగ్రఫీ బానిసలుగా మారుతున్నారు. అప్పుడప్పుడే బయట ప్రపంచాన్ని అర్థం చేసుకుంటున్న చిన్నారులు చేతిలో సెల్ ఫోన్ పడడంతో ఇతర విషయాలను నేర్చుకోవడం కంటే పోర్నోగ్రఫీ మీదే ఎక్కువ దృష్టి పెడుతున్నారు విద్యార్థులు. దీంతో తెలిసీ తెలియని వయసులోనే పోర్నోగ్రఫీ బానిసలుగా మారిపోయి ఉన్మాదులగా తయారవుతున్నారు.పోర్న్ వీడియోలో చూపించినట్లు తాము చేయాలనీ కోరికలతో తెలియని వయసులోనే రగిలిపోతుండటం తో మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు.
పోర్నోగ్రఫీ బానిసలైన జనాలు కనీసం ఎలా ప్రవర్తిస్తున్నారో కూడా అర్థం చేసుకోలేనంత ప్రభావితులవుతున్నారు . ఎలాంటి సర్వేలు నిర్వహించిన రోజురోజుకు పోర్నోగ్రఫీ పెరిగిపోతుందనే వెల్లడవుతోంది. అంతేకాకుండా ఈ మధ్య ఎక్కువగా చదువుకునే విద్యార్థులు హాస్టల్ లో ఉండటమే కాకుండా తల్లిదండ్రులు తమ పిల్లలపై తగిన శ్రద్ధ చూపకపోవడంతో... తెలిసీ తెలియని వయసులోనే పోర్నోగ్రఫీ వైపు అడుగులు వేస్తున్నారు. పోర్నోగ్రఫీ కి బానిసలైపోయి నెలలు నిండని పసికందు నుంచి పండు ముసలి వరకు అందరిని కామంతోనే చూసే పరిస్థితి ఏర్పడుతుంది.
అర చేతిలో అంతర్జాలం సృష్టిస్తున్న అనర్థాలు ఇన్నీ అన్ని కాదు. స్మార్ట్ ఫోన్ అతి తక్కువ ధరకే డేటా ఆఫర్లు... ఇంకేంటి యువత అంతా సోషల్ మీడియాలో తమ చదువుకునే సబ్జెక్టుల గురించి వెతకడం మానేసి పోర్న్ వీడియోల కోసం వెతుకుతున్నారు. దేశవ్యాప్తంగా పోర్నోగ్రఫీ రోజురోజుకు పెరిగిపోతుండటం నిజంగా బాధాకరం.
నేను మీకు నేరుగా తెలియజేస్తున్నానుఅశ్లీలత మీ ఆత్మకు విషం కాబట్టి పూర్తిగా తిరస్కరించండి. ఇది మీ లక్ష్యం నుండి మిమ్మల్ని ఆకర్షించి, బలహీనులుగా మార్చాలనుకునే పాపం. దాని నుండి పారిపోండి. అశ్లీలతను చూసే వీక్షకులకు సంబంధించిన భాగములో భాగం కావద్దు. మీ ఫోన్ మరియు కంప్యూటర్లోని అన్ని అశ్లీలత మీడియాలను తొలగించండి మరియు అశ్లీలతకు సంబంధించిన అన్ని సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ చేయండి. టీవీ సీరియల్ అయితే పూర్తిగా తగ్గించండి. ఆ అశ్లీలత మ్యాగజైన్లన్నింటినీ చెత్త కుండీలో పడేయండి.
ఇప్పుడు ఏం చెయ్యాలి?
విశ్వాసులారా! మీరు మనస్ఫూర్తిగా అల్లాహ్ ను క్షమాపణ కోరుకోండి. మీప్రభువు మీ పాపాలు మన్నించి, మిమ్మల్ని సెలయేరులు పారే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాడు. ఆరోజు అల్లాహ్ తన ప్రవక్తకు, అతనితోపాటు విశ్వసించినవారికి ఎలాంటి అవమానాలకు గురిచేయడు. వారి జ్యోతి వారి ముందు కుడివైపు పరుగిడుతూ ఉంటుంది. అప్పుడు వారు “ప్రభూ! మా జ్యోతిని మాకోసం పరిపూర్ణం(గా కాంతినిచ్చేలా) చెయ్యి. మమ్మల్ని క్షమించు. నీవు ప్రతిదానిపై అదుపు కలిగివున్నావు” అని ప్రార్ధిస్తారు. (అత్-తహ్రీమ్: 8)
షైతాన్ విష వలయంలో పడకూడదు
షైతాన్ ఎల్లప్పుడూ మానవులను ఏదైనా ఉపద్రవంలో పడవేయడానికి మరియు నిషిద్ధ కార్యానికి గురిచేయడానికి పరితపిస్తూ ఉంటాడు. అందుకే అల్లాహ్ మనల్ని ఈ విధంగా జాగ్రత్తగా ఉండమని సూర నూర్ 24: 21 చెప్పాడు:
విశ్వాసులారా! షైతాను అడుగుజాడలలో నడవకండి, ఎవడు షైతాన్ అడుగుజాడలలో నడుస్తాడో నిశ్చయంగా షైతాన్ అతనిని అశ్లీలమైన మరియు అసభ్యకరమైన పనులు చేయటానికి ప్రోత్సహిస్తాడు.
పర స్త్రీతో ఏకాంతంలో ఉండకూడదు
మనిషి శరీరంలో రక్తం ఎలా ప్రవహిస్తుందో అలాగే షైతాన్ మానవ శరీరంలో తిరుగుతుంటాడు. మానవుణ్ణి అశ్లీల కార్యం (వ్యభిచారం)లో పడవేయడానికి షైతాన్ మార్గాల్లో ఒకటి పరస్త్రీతో ఒంటరిగా ఉండడం. అందుకే ఇస్లాం ధర్మం ఆ మార్గాన్ని మూసివేసింది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ఆదేశించారుః
“వినండి! ఏ పురుషుడైనా ఏ స్త్రీతో ఏకాంతంలో ఉంటాడో వారిద్దరితో మూడోవాడు షైతాన్ ఉంటాడు”. (తిర్మిజి 2165. మిష్కాతుల్ మసాబీహ్ 3118).
తరుల ఇళ్లలో ఎవ్వరూ లేని సమయంలో వెళ్ళకూడదు
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారని అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః
ఈ రోజు తరువాత ఎవ్వరూ కుడా భర్త లేకుండా ఒంటరిగా ఉన్న స్త్రీ ఇంటిలో ప్రవేశించకూడదు. (ఏదైనా అవసరం ఉండి పోదలుచుకుంటే) అతనితో ఒక వ్యక్తి లేదా ఇద్దరు వ్యక్తులు ఉండాలి”. (ముస్లిం 2173).
ఏ పురుషుడు కూడా ఇంటిలోగాని, గదిలోగాని, వాహనములోగాని ఎక్కడైనా పరస్త్రీతో ఏకాంతంలో ఉండకూడదు. ఆమె సోదరుని భార్య అయినా, సేవకురాలు, ఆడ పనిమనిషి అయినా, డాక్టర్ వద్ద ఆడరోగి అయినా ఎవరైనా సరే. అనేక మంది తమపై లేదా ఇతరులపై నమ్మకంతో ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తారు. అందువల్ల వ్యభిచారంలో లేదా దాని కారణంగల విషయాల్లో పడే భయం ఉంటుంది. తర్వాత వంశవృక్షంలో లోటు మరియు అక్రమ సంతానాలు అధికమవుతున్న విషాద వార్తలు వినవస్తాయి.
తనది కాని కలకంఠితో కరచాలనం కూడదు
పినతండ్రి మరియు పెత్తండ్రి కూతుళ్ళతో, మేనత్త కూతుళ్ళతో, చిన్నమ్మ మరియు పెద్దమ్మ కూతుళ్ళతో, సోదరుల భార్యలతో, పినతండ్రి మరియు పెత్తండ్రి భార్యలతో మరియు మేనమామ భార్యలతో కరచాలనం చేయడం మన సమాజంలో నీళ్ళు త్రాగడం లాంటి తేలికగా మారింది. కాని ఇందులో ధార్మికంగా ఉన్న నష్టాలను తెలివైన దృష్టితో చూస్తే ప్రజలు అలా చేయడం మానుకుంటారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఈ హదీసు శ్రద్ధగా చదవండిః
“మీలో ఒకరి తలపై పెద్దసూది లేదా మొలతో గుచ్చడం పరస్త్రీని ముట్టు కునేదానికంటే ఎంతో మేలు”. (తబ్రానీ 20/212, సహీహుల్ జామి 4921).
ఇది చేతుల ద్వారా వ్యభిచారం అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఈ ప్రవచనం చదవండిః
“రెండు కళ్ళు వ్యభిచారం చేస్తాయి. రెండు చేతులు వ్యభిచారం చేస్తాయి. రెండు కాళ్ళు వ్యభిచారం చేస్తాయి. మర్మాంగం వ్యభిచారం చేస్తుంది”. (అహ్మద్ 1/412, సహీహుల్ జామి 4126).
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కన్నా పవిత్రహృదయం గలవాడు ఎవడైనా ఉన్నాడా? (సమాధానం లేడు అనే వస్తుంది.) అయన ఏమన్నారో చదవండిః
“నేను స్త్రీలతో కరచాలనం చేయను”. (ముస్నద్ అహ్మద్ 6/357, సహీహుల్ జామి 2509). మరో సందర్భంలో ఇలా అన్నారు.
“నేను స్త్రీల చేతులకు తాకను”. (తబ్రానీ కబీర్ 24/342, సహీహుల్ జామి 7054.
ఆయిషా రజియల్లాహు అన్హా ఇలా చెప్పారుః
“ఎన్నడూ లేదు, అల్లాహ్ సాక్షిగా! ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హస్తం ఎన్నడూ ఏ పరస్త్రీ చేతిని కొంచమైనా తాకలేదు. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారితో మాట ద్వారా బైఅత్ (విధేయత ప్రమాణం) చేయిపించేవారు”. (ముస్లిం 1866, బుఖారి 5288).
జాగ్రత్తా! తమ సోదరులతో కరచాలనం చేయని భార్యలను విడాకుల బెదిరింపులు ఇచ్చే భర్తలు ఇకనైనా అల్లాహ్ తో భయపడాలి. అలాగే ఏదైనా వస్త్రము అడ్డుగా పెట్టి కరచాలనం చేయడం ఏ మాత్రం యోగ్యం కాదు. డైరక్ట్ కరచాలనం చేసినా, ఏదైనా అడ్డుగా పెట్టి చేసినా అన్ని స్థితుల్లో పరస్త్రీలతో కరచాలనం నిషిద్ధమే ఉంటుంది.
స్త్రీ సుగంధం పూసుకొని బైటికి వెళ్లడం తగదు
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఎంతో కఠినంగా హెచ్చరించినప్పటికీ స్త్రీలు సువాసనలు రుద్దుకొని ఇంటి బైటికి వెళ్ళుట, పురుషుల ముందు నుండి దాటుట ఈ కాలంలో ప్రబలిపోతుంది. ఆయన ఆదేశం ఇలా ఉంది.
“ఏ స్త్రీ అయితే సువాసన పూసుకొని ఆమె సువాసన పురుషులు ఆఘ్ర ణించాలని వారి ముందు నుండి దాటుతుందో ఆమె వ్యభిచారిణి”. (ముస్నద్ అహ్మద్ 4/418, సహీహుల్ జామి 105).
పరస్త్రీని ఉద్ధేశపూర్వకంగా డటం తప్పు
(ప్రవక్తా! విశ్వసించిన పురుషులకు తమ చూపులను క్రిందికి దించుకోండి (అదుపులో ఉంచుకోండి) తమ మర్మాంగాలను రక్షించుకోండి అనీ చెప్పు, ఇది వారికి ఎంతో పరిశుధ్ధమైన పద్దతి. వారు చేసే దాని గురించి అల్లాహ్ కు బాగా తెలుసు). (నూర్ 24: 30).
“(నిషిధ్ధమైన వాటి వైపు) చూచుట కళ్ళ వ్యభిచారం అవుతుంది”.
ధార్మిక అవసరంతో (పరస్త్రీని చూచుట తప్పుకాదు). ఉదా: పెళ్ళి చేసుకునే ఉద్దేశంతో మంగీతర్ (నిశ్చితార్థమైన స్త్రీ)ని చూచుట. లేక డాక్టర్ రోగినిని చూచుట.
స్త్రీలు పరపురుషుని వైపు దురుద్దేశంతో చూచుట కూడా నిషిధ్ధం. అల్లాహ్ ఇలా ఆదేశించాడు:
(ప్రవక్తా! విశ్వసించిన మహిళలకు ఇలా చెప్పు: తమ చూపులను క్రిందికి దించుకోండి (అదుపులో ఉంచుకోండి) తమ మర్మాంగాలను రక్షించుకోండి అనీ). (నూర్ 24: 31).
పుష్పవతి ప్రకటనలు కూడదు
అమ్మాయిలు పెద్ద మనిషి అవడం (యుక్త వయసు కి రావటం, మొదటి రజస్వల) ను ఇంకా ఒక పెద్ద వేడుకగా జరపడం కూడని పని. ఎంతో గోప్యంగా ఉంచవలసిన దానిని పెద్ద బానర్లూ అవి పెట్టి చేయడం నిజంగా చాలా దారుణం. ఈమధ్య అబ్బాయిలకు కూడా పంచె ఫంక్షన్లూ చేస్తున్నారు. ఏమో మనం ఎటు పోతున్నామో?
స్త్రీలు పలుచని, ఇరుకైన దుస్తులు ధరించకూడదు
ఈ కాలంలో మన శత్రువులు మనపై చేస్తున్న సాంస్కృతిక దాడుల్లో కొంగ్రొత్త ఫ్యాషన్ల డ్రెస్సులు, వివిధ రకాల దుస్తులు. ఇవి ముస్లిం సమాజంలో బాగా వ్యాపించిపోయాయి. అవి చిన్నగా, పలుచగా లేక ఇరుకుగా ఉన్నందు వలన తప్పనిసరిగా దాచి ఉంచవలసిన భాగాలను దాచలేక పోతున్నవి. అందులో కొన్ని రకాలైతే స్వయంగా స్త్రీల మరియు (కొడుకు, తండ్రి లాంటి) మహ్రంల ముందు ధరించుట యోగ్యం కాదు. ప్రళయానికి ముందు స్త్రీలు ఇలాంటి దుస్తులు ధరిస్తారని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) భవిష్యసూచన ఇచ్చారు. ఆ విష యమే అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనంతో ముస్లిం (2128) గ్రంథంలో ఉందిః
“నరకవాసుల్లో రెండు రకాలు. నేను వారిని చూడలేదు. వారిలో ఒక రకం వారి వద్ద ఆవు తోకల్లాంటి కొరడాలు ఉంటాయి. వారు వాటితో ప్రజల్ని కొడతారు. రెండవ రకంవారు స్త్రీలు. వీరు దుస్తులు ధరించి కూడా నగ్నంగానే ఉంటారు. ప్రజల్ని ఆకర్శిస్తారు. ప్రజలచేత ఆకర్శించబడతారు. వారి తలలు బుఖ్తీ (ఉబ్బి) ఒంటె మూపురాల మాదిరిగా ఉంటాయి. వీరు స్వర్గంలో చేరలేరు. అంతేకాదు, స్వర్గ పరిమళాన్ని కూడా ఆఘ్రాణించలేరు. వాస్తవానికి దాని పరిమళం అల్లంత దూరాన ఆఘ్రాణించవచ్చును”.
క్రింది నుంచి మధ్యలోకి తెరచి ఉన్నవి లేక వివిధ ప్రక్కల నుండి కత్తి రించి ఉన్న డ్రెస్సులు, కూర్చుంటే తమ మర్మాంగ ప్రదేశం బైటపడునటు వంటివి కూడా నివారించబడిన దుస్తులలో లెక్కించబడతాయి. అదీగాక దీనివలన అవిశ్వాసులను, వారి ఫ్యాషన్లను అనుసరించినట్లగును. ఇలాంటి అశ్లీల దుస్తుల నుండి అల్లాహ్ యే కాపాడుగాక!
అదే విధంగా అశ్లీల చిత్రాలు, మ్యూసిషియన్ల (సంగీతకారుల), గాయ కుల ఫోటోలు, మత్తు పదార్ధాల బాటిళ్ళపై ఉండే ఫోటోలు, జీవరాసుల ఫోటోలు, శిలువ గుర్తు, లేక వివిధ క్లబ్బులు, పార్టీల గుర్తులు గౌరవమానాలకు మచ్చ లాంటి అశ్లీల పదాలుగల షర్టులు, టీషర్టులు ధరించుట కూడా చాలా గంభీరమైన విషయం. వాటిని ధరించకుండా వాటికి దూరం గానే ఉండాలి.
భావోద్వేగాలు ఎక్కువైనప్పుడు మనిషి అన్ని విషయాల్లో అతిగా ప్రవర్తిస్తాడు. మితిమీరిన ఆనందం ఉత్సాహం, వాత్సల్యం, క్రోధం, కామం, లోభం, ప్రేమ- ఏదైనా అనేక అనర్థాలు తెచ్చిపెడుతుంది. అతిగా మాట్లాడటం వాచాలత్వం అనిపించుకుంటుంది. ఈ వాచాలత్వం వల్ల పరుషమైన మాటలు బయటకు వస్తాయి. స్పష్టత, స్వచ్ఛత ఉండవు. ఔచిత్యం, సందర్భ శుద్ధి లోపిస్తాయి. ఆలోచనను, విచక్షణను ఆక్రమించిన ఆవేశం కట్టలు తెంచుకుని మనిషిని మృగం చేస్తుంది. ' వదరుబోతుదనం వల్ల అసత్యం, చాడీలు, అశ్లీలత, అసభ్యత, ప్రాణహాని, మానహాని అనే అవగుణాలు బయటపడతాయి. అందుకే 'మౌనం పరం భూషణం' అన్నారుఈ మౌనం కూడా మితిమీరి ఉండకూడదు. మేధావి, లోకకల్యాణ ఆకాంక్షి తన ఎదుట అనర్థాలు జరుగుతుంటే మౌనం వహించి నిరసించక మిన్నకుంటే ఆ అకృత్యాలను ప్రోత్సహించినట్లవుతుంది. మించిన సంపద అర్హతను మించిన పదవి, చిత్తశుద్ది లేని కీర్తి- అనర్ధాలకు మూలాలు.
అభిమాన పాఠకుల్లారా!! ఒకరిని విమర్శించాలని గాని, కించపరచాలని గాని, ఒకరి పై కోపంతో గాని ఈ విషయాలు చెప్పడం లేదు. నేటి మన యువత స్థితిని, సంఘ దుస్థితిని చూసి హృదయభారంతో చెప్పడం జరిగింది. అర్థం చేసుకుంటారని, మార్పుకై ప్రయత్నిస్తారని ఆశిస్తూ...

No comments:
Post a Comment