Saturday, August 31, 2024
దేశకాలాలు దైవాధీనం - మొదటి భాగం - The choice of time and place is for God alone
నీ ప్రభువు తలచుకున్నదాన్ని సృజిస్తాడు. తాను కోరిన వ్యక్తిని (ప్రవక్తగా) ఎంచుకుంటాడు. ఈ ఎంపిక వీరు చేయవలసిన పని కాదు. వారికా అధికారం లేదు. వారు చేస్తున్న బహుదైవారాధనకు అల్లాహ్ ఎంతోఅతీతుడు, ఉన్నతుడు, పరమపవిత్రుడు. (అల్-ఖసస్: 68)
సర్వలోక సృష్టికర్త, సృజనశీలుడు, భమ్యా శాశాలకు ఉనికినిచ్చాడు సూర్యచంద్రాది లోకాలను పుట్టించాను. రోజులు, వారాలు, నెలల పరంపర కాలాన్ని పరిచయం చేసింది. భూన్యూకాశాలు ప్రదేశంగా పేర్కొనబడ్డాయి. సూర్యచంద్రులు కాలంగా పరిగణించ బడ్డాయి. సూర్యచంద్రుల ద్వారా సమయాన్ని కేటాయించడం జరిగింది. "ఆయనే సూర్యుడ్ని తేజోవంతంగా, చంద్రుడ్ని కాంతిమంతంగా చేసినవాడు. మీరు తేదీలు, సంవత్సరాల లెక్క తెలుసుకోవడానికి చంద్రకళల్ని నిర్దేశించినవాడు కూడా ఆయనే. ఇదంతా దేవుడు ఒక మహోన్నత లక్ష్యంకోసం సృష్టించాడు. ఆయన గ్రహించే వారికోసం తన నిదర్శనాలు విడమరచి తెలియజేస్త్తున్నాడు. దేవునికి భయపడే వారి కోసం రేయింబవళ్ళ చక్రభ్రమణంలో అనేక నిదర్శనాలున్నాయి. అసలు భూమ్యాకాశాల్లో ఆయన సృష్టించిన ప్రతి వస్తువులోనూ (ఆయన ఉనికిని, ఏకత్వాన్ని చాటే అనేక) నిదర్శనాలున్నాయి. (యూనుస్: 5-7)
మేము రాత్రిని, పగటిని రెండు సూచనలుగా చేశాం. రాత్రి సూచనను (మీ విశ్రాంతి కోసం) చీకటిమయంగా చేశాం. అలాగే మీరు మీప్రభువు అనుగ్రహం(ఉపాధి) అన్వేషించడానికి; నెలలు, సంవత్సరాల లెక్క తెలుసుకోడానికి మేము పగటిని ప్రకాశ వంతంగా చేశాం. ఇలా మేము ప్రతి విషయాన్నీ స్పష్టంగా విశదీకరించాం. (అనీణస్రాయీల్: 12)
కాలం అంటే ఏమిటి? పరలు, విలిప్తలు, లిప్తలు, విఘడియలు, ఘడియలు, నిమిషాలు, ముహూర్తాలు, గంటలు, ఝాములు, రోజులు, వారాలు, పక్షాలు, ఋతువులు, నెలలు, అయనాలు, సంవత్సరాలు, దశాబ్దాలు, పుష్కరాలు, శతాబ్దాలు, సహస్రాబ్దాలు. కాలం అంటే ఏమిటి? క్షణం కూడా కాలమే. యుగం కూడా కాలమే. జీవితం కూడా కాలమే, ప్రపంచమూ కాలమే. మనిషికి కావలిసింది కాలం మనిషి వెలకట్టలేని సంపద కాలం. మనిషి సంపాదించలేని ధసం కాలం. అలాంటి కాలాన్ని మనిషికి ప్రసాదించాడు ప్రభువు.. అలాగే భూమ్యాకాశాలు, మార్యచంద్రులు, పర్వతాలు, నముద్రాలు, సృష్టి సర్వమూ ఒక ఎత్తయితే ఒక మానవుడే మరో ఎత్తు.
సృష్టి సామ్రాజ్యంలోని ప్రచండశక్తులన్నీ పృథ్వి మీద ఉన్న 'అల్ప' జీవి 'సేవ కొరకు మాత్రమే సృజించబడ్డాయి. ఇంకా అందమైన ముఖం, పొందికయిన అంగ సౌష్టవం, ఆరోగ్యవంతమైన శరీరం-మానవునికి దేవుడు ప్రసాదించిన వరాలు..ఇవి మనిషి తాను కోరి, ఎంచుకున్న వరాలు కావు, కోరుకున్నా, పొందాలని ప్రయత్నించినా. లభించేవి అంతకన్నా కావు. వద్దనుకుంటే పోయేవీ కావు. ఇవి సృష్టికర్త ఇచ్చిన వరప్రసాదాలు. ఆ ప్రభువు మనకు ఈ శరీరాన్నేకాదు, ఈ ప్రపంచాన్ని అనుగ్రహించాడు. తనకు ఇష్టమైనరీతిలో ఈ శరీరాన్ని, దాని ప్రతి అంగాన్నీ, ప్రతి అవయవాన్నీ వాడుకునే అధికారమిచ్చాడు. అంతేకాదు తన ఆధీనంలో ఉంచిన ఈ ప్రపంచాన్ని సయితం మన ఇచ్చ ప్రకారం వినియోగించుకునే స్వేచ్చనూ ప్రసాదించాడు. కేవలం ఈ స్వేచ్చా స్వాతంత్రాలే వాటికి తగ్గ శక్తి సామర్ధ్యాలను వనరుల్ని, సాధన సందత్తినీ ఇచ్చాడు. వీటన్నింటిని వినియోగించుకునే బుద్ధి బలాన్ని కూడా ప్రసాదించాడు. ఆ తరువాత ఐలా అన్నాడు. నీ ప్రభువు తలచుకున్నదాన్ని సృజిస్తాడు. తాను కోరిన వ్యక్తిని (ప్రవక్తగా) ఎంచు కుంటాడు. ఈ ఎంపిక వీరు చేయవలసిన పనికాదు. వారికా అధికారం లేదు. వారు చేస్తున్న బహుదైవారాధనకు దేవుడు ఎంతోఅతీతుడు, ఉన్నతుడు, పరమపవిత్రుడు. (అల్-ఖసస్: 68)
ఇలా తన ప్రమేయం లేకుండా, తనకు తెలియకుండానే లభించిన తన ఈ ఆకృతిని, అంగాంగాలను, అనుగ్రహాలను, బుద్ధి వివేకాలను చూసుకుని ఆనందస్తూ అడగకుంగానే తనకు వీటికిచ్చిన కర్తను, స్వామిని, తన నిజప్రభుపుడు మరిచి పోతున్నాడు. మనిషి ఆయన గీసిన హద్దుల్ని విప్సిగ్గుగా జవదాటడానికి ప్రయత్నిస్తున్నాడు. మనిషి ఈ వ్యతిరేకత జీవిత ఇతర రంగాలలోనే కాక దేశకాలాల విషయంలోను కనబడుతుంది. సృష్టి విషయంలోగాని.. కాలం విషయంలోగాని, ప్రత్యేక స్థలాన్ని ఎంచుకునే విషయంలోగాని మానవులకు ఏ విరమైనటువంటి అధికారంలేదు. అది వారి పనికూడా కాదు అని ఆ సర్వోన్నతుడు సెలవిస్తుంటే... మనిషి మాత్రం తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ "పరము జగడాలమారి'' అన్పించుకుంటున్నాడు.
మట్టితో మనిషిని, అగ్నిలో జిన్నులను, వెలుగుతో దైవదూతలను వృష్టించిన సృజనకారుడు - ఈ పుడమిపై తన ప్రాతినిథ్య నిమిత్తం మనిషిని ఎన్నున్నాడు. బుద్దీ వివేకాల్ని అనుగ్రహించడంతో పాటు మానవ సమాజానికే చెందిన కొందర్ని తన ప్రవక్తలుగా, సందేశహరులుగా ఎన్నుకొని- పర్వమానవాళి సంక్షేమం నిమిత్తం, లోకశాంతి కోసం దైవగ్రంథాల్ని అవతరింపజేశాడు. అలా సర్వమానవాళికి మార్గదర్శకులుగా వచ్చిన ప్రవక్తల సంఖ్య ఇంచు మించు 1లక్షా 24 వేలు. అంటే ప్రవక్తలు అనే ఈ వర్గం ఇతర ప్రజలకన్నా శ్రేష్టులు, పాపరహితలు, వారి ఈ ఎంపిక సైతం ఆ కృపాసాగరుడు చేసినదే. రసూల్ల (సందేశహరుల) సంఖ్య 315 మంది, 315 మంది ప్రవక్తలలో అగ్రజులు అయిదుగురు. వీరినే 'ఒల్లు అజ్మ్ మినర్రుసుల్ అంటారు. వారికి ఈ ఉత్తమ స్థారావు ఇచ్చినవాడూ ఆ శుభకరుడే. వారి పేర్లు ఇలా హజ్రత్ నూహ్ (స), హజ్రత్ ఇబ్రాహీమ్ (స), హజ్రత్ మూసా (స) హజ్రత్ ఈసా (స), అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అదైహనపల్లం), ఐదు మంది వజ్ర సంకల్పం గల ప్రవక్తల్లో ఉత్తమోత్తము స్థానం అంతిను ప్రవక్త ముహమ్మద్ (స) గారిది. ఆయనకు ఈ ఘనకీర్తని అనుగ్రహించిన ఆ దయాసాగరుడే ఇలా అన్నాడు: (ప్రజలారా!) ముహమ్మద్(ఇ) మీ పురుషు ల్లోని ఎవరికీ తండ్రికాదు. ఆయన అల్లాహ్ సందేశహరుడు. దైవదౌత్య పరంపరను అంతమొందించిన అంతను దైవప్రవక్త. అల్లాహ్ సమస్త విషయాలు ఎరిగినవాడు." (అహ్జాద్ : 40)
దైవప్రవక్త(స) ఇలా అన్నారు: "ఆదం సంతతి మొత్తానికి నేను నాయకుడిని, అయితే ఇది గర్వంగా చెబుతున్న మాట ఎంతమాత్రం కాదు." అంటే ఈ హోదా దైవప్రసాదితమేగాని నాకు నేను చెప్పుకుంటున్న గొప్పలు కావు.
కొందరు దైవప్రవక్తల విషయంలో హద్దు మీరిన అభిమానానికి పోయి, అందరికంటే తమ ప్రవక్త గొప్ప అని చెప్పుకుంటారు. అంతిమ దైవప్రవక్త ముహమ్మద్(స) ఈ విషయాన్ని కూడా ఖండించారు. "మీరు దైవప్రవక్తలలో ఒకరిపై ఒకరికి (దేవుడు ఇవ్వని) ప్రాధాన్యం ఇవ్వకండి" అన్నారు. (బుఖారీ- ముస్లిం)
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment