Thursday, August 22, 2024

ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది - A new shoot appears where all the leaves have fallen




జాతులు నిర్మించబడేది మనుషులతోనైతేఆ మనుషుల్ని మానవతామూర్తులుగానైతి కతకు నాందిగా తీర్చిదిద్దేది నిజ దైవం సమ్మతించిన మతం. మనిషిని చైతన్యవంతం గావించి సంపూర్ణ దిశానిర్దేశంతో మనుషులజాతుల పూర్తి దశనే గొప్పగా అద్వితీయంగా మార్చివేసేది దైవ ప్రవక్తలచే మానవాళికి అందిన మతం. అసలు దాన్ని మతం అనడం కన్నా మానవతా ధర్మంప్రకృతి సిద్ధాంతం అనడం ఉత్తమం. మహాప్రవక్త ముహమ్మద్ (స) చెప్పింది కూడా అదే  'కుల్లు  మౌలూదిన్  యూలదు అలల్ ఫిత్రహ్ఫ అబవాహు యుమజ్జి సానిహియుహద్విదానిహియునస్రరానిహిపుట్టే ప్రతి శిశువు ప్రకృతి ధర్మంపైనే జన్మిస్తుంది. కాని దాని తల్లిదండ్రులు దాన్ని మజూసీగానో,' యూదునిగానోక్రైస్తవునిగానో మార్చివేస్తారు. అంటే మనుషుల అభిమతాలుఅభిప్రాయాలతో ఉనికిలో తేబడ్డవాటిని 'మతంఅంటే అది మత్తు కావచ్చు. మత్తు కన్నా భయంకర హాలహాలం అనొచ్చు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే మనిషి యొక్క ఈ మనోదాస్యం అతన్ని ఇహపరాల నష్టానికిపరాభవానికి లోను చేస్తుంది గనక. దీనికి భిన్నంగా నేడు పూర్తి మానవాళి ఎదుర్కొం టున్న సమస్యలన్నింటికీ పరిపూర్ణ పరిష్కారం చూపివారిని అన్ని విధాల ధర్మమార్గానప్రగతిపథాన నడిపించేది ఖచ్చితంగా దైవ శాసనమే అయివుండాలిఅలాంటి ఓ జీవన విధానం. సంపూర్ణ ధర్మం ఈ ధరణిపై ఉందాఅంటేఉందిఉండి తీరాలి. అదే ఇస్లాం.



నేడు అనేక వివాదాలువిమర్శలుఅపో హలుఅపార్థాల మధ్య చర్చనీయాంశం అవుతున్న 'ఇస్లాంరాబోయే కొన్ని సంవత్సరాల్లో ఎలా విజయ ఢంకాను మోగిస్తుందోదానిగ్గాను అవసరమైన ఒనరులు ఏమిటోనేటి ఈ ధర్మ అవలంబీకుల్లో గల లోపాలేమిటోవారు చేయవలసిందేమిటో తెలియపర్చ డమే ఈ వ్యాస ముఖ్య ఉద్దేశ్యం.

మనం ఎక్కడ పొరబడుతున్నట్లుమనం సరిదిద్దుకోవలసింది దేన్నిమనం సాధించా లను కుంటున్న అంశాలన్ని మన పూర్వీకులు సాధించి చూపినవే. ఈ బాట కొత్తది  ఎంత మాత్రం కాదు. ఈ మార్గాన ప్రవక్తలుమహనీయులుపుణ్యాత్ములుగొప్పవారెందరో నడిచి చూపించారు. దీన్ని సాధించడం ఎంతమాత్రం అసాధ్యమైంది కాదు. సుసా ధ్యమే. అవునుమనకు ఆవశ్యకమయిన వనరులెన్నో మనకు లభ్యమయి ఉన్నాయి. 'నేనూనా ప్రవక్త నిశ్చయంగా గెలుపొందుతాంఅన్న దైవవాగ్దానమూ మనకుంది. 'విశ్వమంతటి వీధుల్లోని గృహాలన్నింటిలోనూ 'ఇస్లాంప్రవేశించి తీరుతుందిఅన్న ప్రవక్త (స) వారి ప్రవచనమూ మనకుంది.

అయితే సమస్యల్లా మన మనోధర్మంతోనే. మనం దేన్ని పరిమిత స్థాయిలో తప్పసాధించలేమన్న చిత్తవృత్తి నుంచి మనని మనం విదుల్చుకోలేకపోతున్నాం. ఆ సంకెళ్ళను ఛేదించిన నాడే మన ప్రగతి మొదలవుతుంది. అప్పుడే ‘రక్షణ కల్పించండిఅనే దీన స్థితి నుండి 'రక్షణ కల్పించేగొప్ప స్థాయికి ఎదగ గలం.

ప్రతి ఒక్క దారిలోనూ ఏదో ఒక అవరోధం చేరి విప్లవ ప్రవాహాన్ని అడ్డగిస్తోంది. పంజరంలో చిక్కుబడ్డ శక్తి సామర్థ్యాలులోపల్లోపల కుక్కుకున్న చొరవ బయటపడాలి. మనం ప్రతి ఒక్కసారీ మన ఆదర్శ నమూనాల్ని ఎవరో ఒకరి దగ్గర నుంచి అరువు తెచ్చుకోనవసరం ఇకపైన మనకుండకూడదు. ఆ అక్కరా మనకు లేదు. అమెరికనేయజపనీయచైనీయసింగపూరీయ విధానాలు మనకు పనికొస్తాయని అనుకోవడం ఉత్త వంచన. మరొకళ్ళ తలుపు తట్టడం వృధా. సిద్ధాంతాల్ని దిగుమతి చేసుకోవడంమరొక చోట పుట్టిన భావాల్ని ఇక్కడ నాట్లు నాటుకోవడం పరిపూర్ణత లోపించిన సంస్థల సమా జాల లక్షణం. మన మార్గం పరిపూర్ణ మార్గం. 'మన ధర్మం సంపూర్ణ ధర్మం. ఈ మార్గ అభ్యున్నతికి బయట ఒనరులసిద్ధాంతాల అవసరం అంతకన్నా లేదు. మన సమస్యలన్నింటికీ పరిష్కారాల్ని మనమే ఖుర్ఆన్హదీసుల ఆధారంగా అన్వేషించడం ఎంతో ఉత్తమం. మనకు ఎదురవుతున్న ప్రశ్నల సమాధానాల కోసం బయట వెతుక్కోవడం. కన్నా దేవుని వచనాలలోప్రవక్త (స) వారి ప్రవచనాలలోధర్మపండితుల సలహాల పరిధిలోనే అన్వేషించడం మంచిది. ఆ పరమ ప్రభువు సైతం మన నుండి కోరుతున్నది ఇదే.

మనం మన ఆలోచన దారులు మార్చాలి. మన విధాన నిర్ణయాలు మరింత స్పందన శీలంగా ఉండాలి. సమర్ధవంతంగా ఉండాలి. తొక్కిపెట్టబడ్డ ఉత్సాహాలు అప్పుడే పైకి లేవగలుగుతాయి. వివిధ మస్లక్ల  మధ్యదృక్పథాల మధ్య సమన్వయమే అందుకు మార్గం. ఏ మస్లక్ కి ఆ మస్లక్,  ఎ దృక్పథానికి ఆ దృక్పథం తన వ్యక్తిగత ప్రాధాన్యాల్నిఅనుసరించే పద్ధతికితమ పూర్వీ కుల అంధానుసరణకి స్వస్థి చెప్పాలి. సమీక్షలు సమావేశాలు ఇప్పుడు అవసరమయిన దానికంటే ఎక్కువే జరుగుతున్నాయి. అవి కాదు ముఖ్యం- అందరి మధ్య సహిష్ణుతా భావంసమైక్యతసామరస్యం ఇవి ముఖ్యం.

వనరుల కొరత మన సమస్యలకు కారణం కానే కాదు. మనం మన ఒనరుల్ని పల్చగా పరిచేసుకుంటున్నాం. మనం వ్యయపరుస్తున్న మన వనరులతో మనం ఒక నిర్దిష్ట పద్ధతిలోగాని ముందుకు పోయినట్టయితే ఇంతకు పది  రెట్లు ఎక్కువ ఫలితాన్ని సాధించగలం. దానికి ఇప్పుడు పడుతున్న కాలంలో సగం వ్యవధిచాలు.

ఇప్పటికి 100 ఏండ్ల తరువాత బహుశా మనలోని ఏ ఒక్కరూ ఉండకపోవచ్చు. కానీ మన తరం తరువాతి నవతరానికి చెందిన చాలా మంది ఆ రోజుని తప్పక చూస్తారు. ఈనాడు 'ఇస్లాంపట్ల ఇంతటి విశ్వాసాన్ని ప్రకటించడం సరయిందేనని అప్పుడు ఆరోజు వారు  ఒప్పుకుంటారు. శాంతి లేక ప్రగతి లేదు. ఆ కాంతికి మూలం ఇస్లాం గనక ప్రగతికి ప్రతిరూపమూ ఇస్తామే అవుతుంది. అయితే 'ముందు నడవండి. అల్లాహ్ వైపున పరుగెత్తండి', 'స్వర్ణ వనాలకై పోటీ పడండి' 'దైవకారుణ్యానికై పరితపించండి' 'మానవ హృదయాల పై విజయకేతనాన్ని ఎగుర వేయండిఅని చెప్పే నిజమయిననిజాయితీగల నాయకత్వం మనల్ని సత్యధర్మం వైపు నడిపించాలి. నిర్మాణాత్మక దృష్టి కలిగిన యువ ముస్లింలు దీర్ఘ నిరీక్షణలోనూఆమోదం కోసం వేచి ఉండటంలోనూ వాడిపోరాదు. అనవసర పరిమితుల నీమా బద్ధత నుంచి వారు బయటపడాలి. 'లోకం ఏం చెబుతుందికాదు 'ప్రభువు ప్రవక్త ఏమంటున్నారుఅన్న అత్యుత్తమ ఆలోచన వారిలో నాటుకుపోవాలి. అందుగ్గాను  జాతీయప్రాంతీయమస్లక్ల మౌఢ్యము   నుంచిమూక మనస్తత్వం నుండి బయటపడాలి. వారికి పవిత్ర ఆలో చనలే పెట్టుబడిఉత్సాహమే మార్గంకఠోర సాధనే పరిష్కారం కావాలి.

ముందు ప్రణాళికగా ఇక్కడోసంభాషణను పొందు పరుస్తున్నాను. ఇందులోని ఓ వ్యక్తి ప్రాపంచిక విద్య లపై గొప్పపట్టుగా ప్రతిభావంతుడయితేమరో వ్యక్తి ధార్మికంగా గొప్పగొప్ప హోదాలలో రాణించిన వ్యక్తి. ఒకరిపేరు హమద్మరొకరి పేరు మౌలానా హసన్.

హమద్: గురువర్యా! క్రీ.శ. 610 నుండి ప్రారంభమయిన సంపూర్ణ ఇస్లామీయ వ్యవస్థ 23 సంవత్సరాల (క్రీ.శ. 634 లోపలే)లోనే ఆకాశానికి నిచ్చెన వేయగలిగింది. ప్రపంచ చరిత్రలో  ఓ నూతన అధ్యాయానికి తెర తీసిందిఅన్న విషయం మనందరికీ విధితమే. అంతిమ ప్రవక్త ముహమ్మద్ (స) మరణానంతరం కనీసం 33 సంవత్స రాల వరకు సాటిలేని మేటిగా పూర్తి అందచందాలతో అలరారింది. ప్రజలందరి మన్నల్ని ప్రశంసల్ని చూరగొంది. ఒక్క మహాప్రవక్త (స)తో మొదలయిన ఈ విప్లవం. అన్ని వర్గాల ఆదరాభిమానాలను అందుకుంటూ సంపూర్ణ జీవన వ్యవస్థగాశాంతియుత సమాజంగా రూపుదిద్దుకోవడానికి 24 సంవత్సరాలు పట్టింది. ఆ తర్వాత ఖులపాయె - రాషిదీన్ కాలమంతా యావత్తు ముస్లింలు పిన్నా పెద్దాధనికా పెదావిద్యావంతులూ నిరక్షరాస్యులూపల్లెవాసులూ పట్టణవవాసులూ అందరూ ఇస్లాం అభ్యున్నతి కోసంసత్యకేతనాన్ని నేల నాలుగు చెరగులా ఎగురవేయడం కోసందైవసందేశాన్ని మానవాళినంతటికీ చేరవేయడం కోసంఒక్కతాటి మీద కలిసి కృషి చేశారు. అప్పుడు వారందరి ధ్యేయం ఒక్కటే. దాని మీదనే అందరి దృష్టి కేంద్రీకృతమై ఉండేది. శాంతి సంకేతనాల్ని సర్వవ్యాప్తం గావించి లోకశాంతి సాధించడమే లక్ష్యం.

హమద్:  హజ్రత్ ఇప్పుడు మనముందు అటు వంటి లక్ష్యమేదంటారులేదా మన లక్ష్యం ఏమయి ఉండొచ్చంటారు?

 

హసన్: గత కొన్నేళ్ళుగా ముస్లింల స్థితి దయనీయంగా తయారయ్యింది. అక్కడక్కడా కొంత అభివృద్ధి కనిపిస్తున్నా. మొత్తం మీద పతన బాటనే నడుస్తోంది ముస్లిం సమాజం. స్త్రీ పురుషులు విద్యా అవసరాన్ని సమానంగా తెలియజేసిన తొలి ధర్మం ఇస్లాం అయినా ముస్లింలలో మాత్రం అక్షరాస్యత అంతంత మాత్రంగానే ఉంది. సృష్టిసృష్టి రహస్యాల్ని శోధించి ఛేదించమని ప్రోత్సహించి మొదటి గ్రంథం ఖుర్ఆన్ అయినా- ముస్లింలు మాత్రం కొన్నెండ్లుగా ఆ దిశగా ప్రయత్నించడమే మానేశారు. అసలు పరిపూర్ణ మానవత్వంస్వాతిక ప్రేమ అంటే ఏమిటో పూర్తి లోకానికి పరిచయం చేసింది మహనీయ ముహమ్మద్ (స) గారే అయినా- ప్రజాసేవ విషయంలో అందరికన్నా వెనకబడివున్నది ముస్లింలే అనడం ఎంతో శోచనీయం!  విద్యాలేమిశిక్షణాలేమిధార్మిక అవగాహనాలేమిఆర్ధిక ఒనరుల లేమిసైన్స్ టెక్నాలజీల లేమిసాంఘీక సహకారలేమిరాజకీయ దిశా నిర్దేశ లేమి లాంటి ఎన్నో దీనికి కారణం అని చాలా మందే అంటారు. అయి వుండొచ్చు కూడా. కానీ ఇవన్నీ సమకూరాకే ప్రయత్నం ప్రారంభించాలి అన్నది సరైంది కాదు. మనం ఆర్ధికంగాసాంఘికంగారక్షణ పరంగాప్రణాళికల పరంగా వెనుకబడి వున్నాం అన్నది నిర్వి వాదాంశం కావొచ్చు. కానీ ఈ లేమిని కలిమిలో మార్చేందుకు ఓ పథకం ప్రకారం మనవంతు కృషి చేయడంలో తప్పు  లేదుఅని నా అభిప్రాయం.

రాబోయే వందేళ్ళలో మనం మన సమాజాన్ని అభివృద్ధి చెందిన సమాజంగా ఎలా రూపాందించగలంమనం అందుకు కొన్ని కీలక రంగాల్ని గుర్తించాలి. అవి: విద్యవైద్య సేవలుఇన్ఫర్మేషన్ మరియు కమ్యూనికేషన్లుమౌలిక సదుపాయాలుకీలక సాంకేతిక పరిజ్ఞానమూను.

హమద్:  హజ్రత్ జీ! మనందరి సమస్య ఏమిటంటే- మనం మన ఈ ప్రణాళికకు కార్యరూపం ఎలా ఇవ్వగలంకాని అటువంటి బృహత్తర ఆదర్శాన్ని తలకెత్తుకోవడానికి తగిన విలువలతో కూడిన ప్రజల్నెలా తయారు చెయ్య గలంమనకు ఇప్పుడు కావలసింది ఇస్లామీయ విలువల్ని ఆదర్శంగా తీసుకునే నిజాయితీ గల పౌరదళాలు. అవిలేనినాడు వనరులు పుష్కలంగా ఉన్నా సద్వినియోగ పడవుఅదే కదా ప్రస్తుతం మనం చూస్తున్నది. హజ్రత్! దీనికి మీ సూచనలు కావాలి.

 

హసన్: వీటితోపాటు మరోకటి కూడా  కూడా కావాలి. అది దేవునిపై నమ్మకం. మనుషుల్ని ఆధ్యాత్మికత ద్వారా ఖుర్ఆన్హదీసుల ద్వారా వికసింపజేయటం. ఇది చాలా ముఖ్యం. ఇందుకు ముందస్తుగా మనం శీలవంతమైన ఆధ్యాత్మిక సంబంధ మైన వాతావరణాన్ని నెలకొల్పాలి. అలాగే నేడు నెలకొనివున్న నేర అవినీతిమయ వాతా వరణంలోమతజాఢ్యంలోపరమత ద్వేషంలో మార్పు తేవాల్సివుంది. అందుగ్గాను పరమ రహస్యం. కలాన్నిగళాన్నిసేవాభావాన్ని పదునుపెట్టే ధర్మబద్ధంగానున్యాయంగానుదేవుడిపై నమ్మకంతోనూ జీవించే మనుషులు కావాలి మనకి. అందుకు మనం వివిధ మార్గాల గుండా ప్రజల్లో విశ్వాసాన్ని జాగృతం చేయాలి. వారిని మానవతా మూర్తులుగాశాంతికాముకులుగా తీర్చిదిద్దాలి. అప్పుడే మన సమస్యలు తీరతాయి. మనం అనుకున్నది సాధించగలం. మనం కన్నకలలు నిజం కాగలవు. అయితే చెప్పేంతటి నులువైయింది కాదు ఇది. దీనికోసం తీవ్ర శ్రమపట్టువీడని కృషి ఎంతో అవసరం.

హమద్: హజ్రత్ జీ! ఇస్లామీయ విప్లవాన్ని వ్యవస్థకి నవీకరించాలనే మన బృహత్పథకం ముందు ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పిం చడంలో ఆరోగ్యంసైన్స్ టెక్నాలజీ వంటి వాటి అభివృద్ధితో మొదలు కావాలాలేదా   మనం వీటన్నింటినీ సమగ్ర పరచి ఏకకాలంలోనే ఈ రంగాలన్నింటిలో మన ప్రయత్నాలు ప్రారంభించాల్సి ఉంటుందా?

హసన్: అసలు ఆధ్యాత్మిక వాతావరణం అన్నదే ప్రాపంచిక వాతావరణాన్ని ప్రక్షాళనంగావించేది. ఆ రెండింటి మధ్య అవినాభావ సంబంధం ఉంది. లోకశాంతి కోసం ధర్మ అవసరం ఎంతైనా ఉంది. పోతే మనం ఏకకాలంలో ముందుకు సాగాల్సి వుంది. పైన పేర్కొనబడిన రంగా ల్లోనూ ఖచ్చితంగా పురోగతి సాగవలసిందే. అదే సమ యంలో నైతిక అంశాలు కూడా అందులో భాగం కావాలి. మనిషి కళ్ళెం లేని గుర్రం కాకూడదు. ఇస్లాం సంస్కృతి సంప్ర దాయం మనకు పరాఅపరా విద్యలు రెండింటిని నేర్వడం గురించి చెప్పింది. పరా విద్య ఆధ్యా త్మిక జ్ఞానం కాగాఅపరా విద్య ప్రాపంచిక విజ్ఞానం. కాబట్టి పరా విజ్ఞానంతో అపరా అలీమ్ మియాఁ వీటన్నిటితో పాటు మరొకటి విజ్ఞానంఅపరా విజ్ఞానం నేర్వాల్సి వుంది. ఒకసారిగాని ధార్మిక విద్యని గాని నేర్చామాఅప్పుడు మన ప్రాపంచిక విజ్ఞానం మాన వాళికి ప్రయోజనం కాగలిగే విధంగా పూర్తి ధర్మంపైనాన్యాయం పైనా దృఢంగా నిల్చి ఉండ గలుగుతుంది. మనం గుర్తుంచుకో వలసింది ఇదే. ప్రతి ఒక్కరూప్రతి ఒక్క ఆత్మ కూడా దివ్యానందాన్నిఆత్మశాంతిని అందుకోవడమే దైవసృష్టి క్రమం వెనుక ఉన్న పరమ రహస్యం.

హమద్: ఇటువంటి మహత్తర ఆశయం నిద్రించడానికి మనకు మూడు రకాల వ్యక్తులు అవసరమవుతారు. 1) పుణ్యాత్ములుఅంటే అబ్దుల్లా బిన్ అబ్బాస్అబ్దుల్లా బిన్ మస్వూద్అబ్దుల్లా బిన్ ఉమర్ లాంటి సహజంగానే శీలవంతులు. 2) పుణ్య నేతలుఅంటే శీలవంతులైన ఉమర్అబూబకర్ఉస్మాన్అలీ (రజి) లాంటి నాయకులు. 3) పుణ్యాధికారులు: అంటే సత్ప్రవర్తనతో తమ విధులను నిర్వర్తించే అబ్దుల్లా బిన్ ఉమ్మె మక్తూమ్హసన్హుసైన్విశ్వాసుల మాత ఖదీజాజైనబ్ఆయిషా (రజి) లాంటివారు. ఈ మూడు రకాల మనుషులు వృద్ధి చెందితే ఇస్లాం నిజంగా సాటిలేని సంపూర్ణ శాంతి వ్యవస్థ కాగలుగుతుంది. ఇన్ షా అల్లాహ్అయితే ఇటువంటి ఆణిముత్యాలుపుణ్యశీలురు వృద్ధి చెందడమెలాగా?    

హసన్:  విద్యా బోధనలో భాగంగా వైజ్ఞానిక బోధనల్లో భాగంగా మన పాఠశాలల్లో కాలేజీల్లో ఆధ్యా త్మిక శిక్షణ కూడా ఇవ్వాలి. ఈ రోజుల్లో నైతిక విద్యని మన పాఠశాలలుకళాశాలలు సిలబస్ నుంచి తీసే శారు. శైశవప్రాయం నుంచే బోధించవలసిన ఆ ముఖ్య మైన విద్యని మనం నిర్లక్ష్యం చేస్తూ కేవలం పుస్తక విద్యకే పరిమితం అయిపోయాం. కానీ నిజానికి పుట్టి నప్పటి నుంచి మనుషులకు బోధించబడుతూనే ఉండాలి. ఇది. అప్పుడు మాత్రమే మనుషులు శీల వంతులవు తారు. ఇస్లాం ధర్మశాస్త్రం గురించి పరిజ్ఞానంమన పూర్వీకుల సాధుస్వభావులసత్పురుషుల గురిం చిన అంశాలు ప్రాథమిక పాఠశాలల్లో పొందుపరచాలి. అప్పుడే సాంఘీకసామాజికరాజకీయఆర్థిక నేతల జీవితాలు అటువంటి విలువలతో నిండివుంటాయి.

పూర్వం అటువంటి విలువలే బోధించబడేవి. రాజు ప్రజాధనికా పెదా అన్న తారతమ్యం లేకుండా అందరూ సమానంగా విద్యార్జన చేసేవారు. వస్తు పరిజ్ఞానంతో పాటు సత్యం వద (నిజాన్నే పలుకు), 'కూనూ మఅస్సా దిఖీన్' (సత్యవంతుల సాంగత్యాన్నే కోరుకో)ధర్మం చర (సక్రమమైన దారినే నడు) 'ఇత్తబి సబీల మన్ అనాబ ఇలయ్య' (నా మార్గాన్ని నడిచేవారినే అనుసరించు) వంటి ఆదేశాల్నీపరోప కారత్వాన్ని పరలోక విశ్వాసాన్ని అక్కడ ఉగ్గుపాలతో రంగరించేవారు. మరో ముఖ్య విషయం ఏమిటంటే ఇటు ధార్మిక పాఠశాలల్లోని సిల బస్ని సైతం నవీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బోధించే పాత పద్ధతులను వదలి కొత్త టెక్నాలజీని ఉప యోగిస్తూ కొత్త పద్ధతులను ప్రవేశపెట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇంకా ధార్మిక విద్యతో పాటు వైజ్ఞానిక విద్యను సైతం చేర్చితే ఎంతో మంచిది.

హమద్ : ఉత్తమ పౌరులు ప్రభుత్వ చట్టాల వల్ల ఉత్పత్తి కారని మనకు తెలుసు. అయితే అటువంటి పనిని ఆధ్యాత్మిక కేంద్రాలు చేయగలుగు తున్నాయాఅన్నది ప్రశ్న. ఇక ప్రాథమిక పాఠశాలల విషయమంటారాఅక్కడి ఉపాధ్యాయులు కూడా ఆ విలువల్ని విద్యార్థులకు అలవర్చ వలసిందిగా మనం కోరవచ్చు. కానీ మనం ఈ పని చెయ్యలేకపోతే అప్పుడు ప్రభుత్వాలు ఉత్తములైననిజా యితీపరులైన పౌరుల్ని తయారు చెయ్యడంలో విఫలమై పోతాయి... నా అంచనా సరయినదే అంటారా.?

హసన్: అవును నిజమే. నిస్సందేహంగా సరయినదే. ఇస్లాం సైతం చెబుతున్నది ఇదే. విలువలు మొదట తల్లిదండ్రులతో బోధించబడాలి. తొలిబడి అమ్మఒడి అవ్వాలి. తర్వాత పాఠశాలల్లో ఉపాధ్యాయులు బోధించాలి. తదనంతరం జీవితంలో గురువు ద్వారా బోధించ  బడాలి.

హమద్: నాడు ఉహద్ హునైన్ సంగ్రామాల్లో ముస్లింలు తాత్కాలికంగా విఫలులయ్యారు. దానికి గల కారణాలు కూడా మనకు తెలుసు. అయితే అప్పటి ప్రవక్త (స) గారి సహచరుల తోడ్పాటుమహాప్రవక్త (స) వారి సమయ స్ఫూర్తిధైర్యసాహసాలతో అప్పటి సమాజం ఆ వైఫల్య పునాదిపై నుంచే తదనంతరం విజయాన్ని నిర్మించుకుంది. అందుకే అన్నారు: వైఫల్యం సంభవించి నప్పుడు దాన్ని సవాలు చెయ్యిఅని.

హసన్: అటువంటి ఉత్తమ భావాలు. కలిగివున్న మనుషులకి ప్రజాభిమానందేశాభిమానం సహజ గుణమే. అందుకే అన్నారు. అన్ని విద్యలకు పునాది ధార్మిక విద్య కావాలిఅనిఆధ్యాత్మిక జ్ఞానాన్ని తొలి నుంచే ఇవ్వగలిగినప్పుడు ధర్మం పట్లప్రజల పట్లదేశం పట్లసంఘం పట్ల ప్రేమాభిమానాలు సహజంగానే సిద్ధిస్తాయి. శీల విద్య జీవితం పునాది కావాలి.

 

హమద్: నైతిక బలం ప్రధానం. దానితో పాటే ఆర్ధిక బలం కూడా జతకూడాలి. ఈ ప్రపం చంలో బలానికే ఆధిక్యం. అందుకని శీలమూఆర్థిక సంపన్నత రెండూ సమి శ్రిత కావాలి. ఆ రెండింటినీ ఏకకాలంలో సాధించడానికి మార్గం ఒక్కటే. అదే ఇస్లాం. శాంతి మార్గం. ఈ మార్గాన కఠోర శ్రమ తప్పనిసరి.

ఇస్లాం అభ్యున్నతి కోసం మేము 'విజన్ 2111' పేరిట ఓ ట్రస్టు స్థాపించాలనుకుంటున్నాము. దానికి సమ మనస్కులైన ప్రముఖుల్ని సభ్యులుగా తీసుకోవాలనుకుంటున్నాం. అందుకు మీ ఆశీసులు కోరు తున్నాము.

హసన్; దైవాశీర్వాదం ఎప్పుడూ మీకుంటుంది. మీ ఆశయాలు జయప్రదం కావాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఇస్లాం అన్ని విధాల  వృద్ధి చెందుగాక! ఆమీన్.

ఆధ్యాత్మికత ఎంత బలంగా ఉంటే తక్కిన సంపదలు అంతగా వృద్ధి చెందుతాయి. మనం కేవలం వస్తు సంపదనే పెంచుకుంటూపోతే మనిషి ప్రాపంచిక భోగాల్లోనూవిలాసాల్లోనూ కొట్టుకుపోతాడు. అటువంటి సందర్భంలో ఆధ్యాత్మికత అతనికి దారి చూపుతుంది. ఐహికానందాలకు మించి పైకి లేపుతుంది. యధార్థంగా మనకు ఏది అవసరమో అది మనం మనకు ఇచ్చుకోలేం. మనం తక్కినవన్నీ సమకూర్చుకుంటూ ఉంటాం. కూడుగూడుగుడ్డ కానీ వీటంన్నటితోపాటు ఆధ్యాత్మిక సంపదని కూడా 'మనం పోగు చేసుకోవాల్సి ఉంటుంది. మనిషి తనకు కావాల్సిన దాన్నిమించి అధికంగా అధికారాన్నిగానీసంపదనిగానీ పోగుచేసుకున్నాడా..! అప్పుడతను తన చేజేతులారా వినాశాన్నీఅశాంతినీవిధ్వంసాన్నీ కొని తెచ్చుకునేట్లనని మనం మరువకూడదు. అప్పుడతను అదుపు తప్పుతాడు.

 

వెనుకటి పెద్దలన్నారు. 'ఎవరు నదుల ఔదార్యంసూర్యుణ్ణి పోలిన దయాభూమి కుండే వినయం కలిగి వుంటారో వారే ఉత్త ములుఅని.

పేదరికంలో కూడా గంభీరంగా ఉండగలడంఆకలిగొన్నప్పుడు కూడా తృప్తిగా ఉండగలగడంశోక సమయాలో కూడా చిరునవ్వు చిందించగలగడం. సంతోషంలో శృతిమించక ఉండగలగడంశత్రుత్వం మధ్య కూడా స్నేహ హస్తం వాడ గలగడం ఇవే నరకాగ్నిని  తప్పించుకోగల మార్గాలు అని ప్రియప్రవక్త (స) బోధించారు. ఆకలిగొన్న వారికి అన్నం పెట్టడం. దుఃఖ సమయంలో ఓదార్చడం. దీనులకు చేయూతనివ్వడంమృత్యువును ప్రేమించడంభోగభాగ్యాలకు దూరంగా ఉండి సదా ద్వైధ్యానంలో గడిపేవాడు అల్లాహ్కు అత్యంత ప్రియుడు అని హితవు చేసిందో. ఆయన (స) గారే..

 

హమద్! చివరి మాటగా నేను చెబుతున్నది. బాగా గుర్తుంచుకో.... ఒక పని చేపట్టక  ముందు నిన్ను ఈ విధంగా ప్రశ్నించుకో. ఎందుకు ఈ పని చేస్తున్నానుదీని వల్ల ఫలితమేంటిఇందులో విజయం సాధించగలనా?  అలాగే ఈ మూడు ప్రశ్నలు వేసుకోకుండా ఏ పనీ మొదలు పెట్టొద్ధు... నేను చెప్పబోతున్నదిగానీచెయ్యబోతున్నదిగానీ నాకు శాంతినివ్వబోతున్నదాదాని మూలంగా ఇతరులకు ఎలాంటి హానీ లేదు కదానేను చెయ్యబోయే ఆ పని దైవ ధర్మానికిదైవ ప్రవక్త (స) వారి సత్సంప్రదాయానికి అనుగుణంగా ఉందా?  సమాధానం 'అవునుఅని వచ్చిందా ఇక ఆ పనిలో హృదయ పూర్వకంగా ముందుకు దూసుకుపో. ఆ నిజ దేవుని  అండదండలు నీకు సదా ఉంటాయి. ఒకవేళ సమాధానం 'కాదుఅని వచ్చిందా. నీ పనిలో అహంకారం ముందుకొచ్చినట్టు. జాగ్రత్త వహించు! ఎందుకంటే అహంకారం వేదనని అధికం చేస్తుంది. అది ప్రతి ఒక్కరి నుంచీనీ నుంచిచివరకు దైవం నుంచి కూడా దూరం చేస్తుంది. మనం ప్రతిరోజూ ఐదుపూటల నమాజులో వినేది దైవవాణి. మనకు మనతో సమాధానం కలిగించాలని కోరుకునే వాణి అదొక్కటే.

అయితే ఇక్కడ ముస్లిం అయిన ప్రతి పౌరుడికీ కలచి వేస్తున్న ప్రశ్న ఒకటుంది. అది నేడు మనం ఇంతటి దుర్భర స్థితిలోఅన్నీ తెలిసి కూడా ఏమీ చెయ్యలేని దయనీయ స్థితిలో ఉన్నాం. ఇటువంటి సంక్లిష్ట స్థితిలో మనం ఆ మహోద్యమాన్ని కొనసాగించగలిగేకనీసం శ్రీకారం చుట్టగలిగే స్థితిలో ఉన్నామాఇస్లామీయ సంపూర్ణ శాంతి వ్యవస్థను తిరిగి పునరుద్ధరించుకోగలమామన వద్ద కావాల్సిన అత్యంత వైవిధ్యభరిత ఆధునిక పరికరాలున్నాయామీడియా ఉందావీటన్నిటికీ సమాధానం ఒక్కటే మనం మన ప్రస్తుత ఆశయాల స్థాయిలోనే ఉండిపోయేటట్లయితే పైన ఊహించినవన్నీ పగటి కలలుగానే మిగిలిపోక తప్పదు.

అలాకాక ఇటువంటి సవాళ్ళను ఛాలెంజిగా స్వీకరించి ఛేంజీకి అడ్డుపడుతున్నవేవో ఆలో చించాలి. మన ప్రతిభనుపనితీరునుకొత్త సామర్థ్యాన్ని ఎట్లా ఆవిష్కరించాలో విశ్లేషించాలి. వివిధ మస్లక్లపరిశ్రమలసంస్థల వ్యక్తిగత ప్రయోజనాల్ని దాటి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను ఆచరించాలి. వీటన్నిటికీ ప్రేరక శక్తి దైవం పట్లధర్మం పట్లసర్వజీవ రామల పట్ల మనకున్న సాత్విక ప్రేమ కావాలి. మొత్తం ప్రపంచమంతా పంచుకోగలిగే స్వప్నం కావాలి మనకు.

నాడు ప్రవక్తశ్రీని పట్టుకొని 100 ఎర్ర ఒంటెల్ని బహుమతి పొందాలన్న ఆత్రంతో బయలు చేరి వెళ్ళిన 'సురాజా'తో నీ చేతిలో రోమ్ఈరాన్ చక్రవర్తుల కడియాలుంటాయిఅని ప్రవక్త (స) భవిష్యవాణి చెప్పినప్పుడు అతనికి కలిగిన ఆశ్చర్యం కూడా ఇటు వంటిదే. వారం పదిరోజుల నుంచి అన్నం మెతుకులేక బక్కచిక్కిన శరీరాలతో ఆత్మరక్షణ కోసం మదీనా చుట్టూ కందకం తవ్వుతున్నప్పుడు - ఏ ఒక్కరూ పగులగొట్టలేని బండరాయిని ప్రవక్తశ్రీ (స) ముక్కలు చేస్తూ, 'ఖైసరోకిస్సారా '(రోముపారసీ) రాజ్యాల తాళపుచెవులు నా చేతికివ్వబడ్డాయి అన్నప్పుడు సహచరులకు కలిగిన ఆశ్చర్యం కూడా బహుశా ఇటువంటిదే ఆయన (స) చెప్పిన ప్రతి అక్షరం నిజం అయింది. ప్రళయం వరకు అవుతూనే ఉంటుంది. 'సూర్యుడు అస్తమిస్తున్నాడంటే మరుసటి రోజు ఉదయించడానికే.' 'మీరు ఇస్లాం స్వీకరించండి. పూర్తి ప్రపంచాన్ని ఏలగలరుఅని ప్రవక్త (స) అంటే అవిశ్వాసులకు అది హాస్యాస్పదంగానే తోచింది. దానికి వారు చెప్పింది ప్రవక్త (స) పిచ్చాడు అనిమతి స్థిమితం లేని ఓ కవినా మీరు అనుసరించేది?' అనేగా!

మరింత స్పష్టంగా అర్థం -అవ్వాలంట- అహంఆత్మకి  మధ్య గర్భంలో జరిగిన సంభాషణను చదవండి. ఆత్మ అహంతో అంటుంది- 'నీకిది వినడానికి . కష్టంగా ఉండవచ్చు. కానీ పుట్టుక అనంతరం మనకు ప్రాణం ఉంటుందని నేను నమ్ముతున్నాను.'

 

అహం: 'మూర్ఖంగా మాట్లాడకు. నీ చుట్టూ చూడు) ఏది కనబడుతుందో అదే ఉంది. ఈ వాస్తవాన్ని దాటి మరేదో ఉందని ఆలోచిస్తావెందుకుఇక్కడ నీకెంత ప్రాప్తమో అంతవరకే తృప్తిపడు లేనిదాని కోసం ఆశ  పడితే ఉన్నది కూడా కాస్త ఊడుతుంది. జాగ్రత్త సుమా!

ఆత్మ కాసేపు ఆలోచిస్తుంది. ఆ తర్వాత తలెత్తి, 'మిత్రమా! కోపం తెచ్చుకోకు. నేను నమ్మింది చెప్పాలి. నా నమ్మకం ప్రకారం మనం పుట్టాక ఒక తల్లి కూడా ఉంటుంది మనకు.'

 

'తల్లిమాట వినగానే  అహం నవ్వుతుంది: ఏలా చెప్తావు ఇలాంటి మాటలు. ఆ తల్లి ఎవరో నువ్వెప్పుడూ చూడలేదు. ఆ తల్లి ఎవరో కూడా నీకు ఎంత మాత్రమూ తెలియదు. ఎందుకప్పుకోవు మనకు ఉన్నదంటూ ఎదన్నా ఉంటే అదంతా ఇదేననినువ్వు ఒంటరిగా నాతోనే ఉన్నావు. ఇదే యదార్ధంసత్యం.

ఆత్మ నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తుంది. 'మిత్రమా! నా మాట విను. మనం నేడు అనుభవిస్తున్న ఈ నిరంత ఒత్తిడి మాటేమిటిమనల్ని అప్పుడప్పుడు ఇబ్బందికి గురిచేస్తున్న ఈ కదలికల మాటేమిటిమనం పెరుగుతున్న కొద్దీకాలం గడుస్తున్న కొద్దీ మన నెవరో పట్టి గుంజుతున్నట్లుందే ఈ స్పందన మాటేమిటి? (ఇక్కడ ముస్లిం సమాజంపై జరుగుతున్న దాడుల్నిఉగ్ర వాదం పేరిట వారిని ఉచకోత విధానాన్నిఇస్లాంకు వ్యతిరేకంగా కొనసాగిస్తున్న దుష్ప్ర చారాన్ని ఊహించుకోవచ్చు.) మనకు తప్ప కుండా కొత్త జన్మ ఉంటుందిఅని నేను నమ్ముతున్నాను. మనం తప్పక వెలుగుని చూసి తీరతాం!

అహం: ఆ వెలుతురేమిటో నువ్వెప్పుడూ చూడనేలేదు. అటువంటి లేనిదాన్ని గురంచి ఎలా మాట్లాడగలవుఈ చీకటిఈ ఒత్తిడిఇదే మన జీవితం అంతకుమించి ఏమీ లేదు. ఏదో ఉంది అన్న భ్రమను ముందు విడనాడు.

ఆత్మ ఆహాన్ని మళ్ళీ మాట్లాడించకూడదనుకుంటుంది గానీఉండబట్టలేక చివరి ప్రయత్నం చేస్తుంది. 'మిత్రమా! నేను నిన్ను మరీ విసిగించదలచలేదు. కానీ నేను నమ్ముతున్నది మాత్రం నిజం. ఈ అసౌకర్యమంతటి తరువాత మనం వెలుతురిని చూడగలగడమే కాదుమన తల్లిని సైతం చూడగలిగే దివ్యానందాన్ని కూడా అనుభవించబోతున్నాం అనిసరేదానికి అహం చెప్పగలదల్లా 'ఆత్మ పిచ్చి దనే కదా!

అదిగో! అటు చూడండి!! అయిదు ఎగురు మహనీయులుప్రవక్త నూహ్ ప్రవక్త ఇబ్రాహీమ్ప్రవక్త మూసాప్రవక్త ఈసాఅంతిమ ప్రవక్త ముహమ్మద్ నల్లల్లాహు అలైహి వ నల్లం. వారితో పాటు మరో అయిదుగురు కూడా ఉన్నారు గమనించండి. వారేఖలీఫా అబూబకర్ఖలీఫా ఉమర్ఖలీఫా ఉస్మాన్ఖలీఫా అలీఖలీఫా ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ (రజియల్లాహు అన్హుమ్). వారందరూ అక్కడ వలయాకారంగా నిలుచున్నారు. గాలికి వారు ధరించిన దుస్తులు రెపరెపలాడుతున్నాయి. వారందరూ మనకు విజయం తథ్యం అని వెన్ను తడుతున్నారు. ముక్త కంఠంతో అందరూ దైవ సూక్తిని ఆలపిస్తున్నారు: 'అలా ఇన్న నర్రల్లాహి ఖరీబ్' 'వినండి! బాగా వినండి! అల్లాహ్ సహాయం (విజయం) అతి సమీపంలోనే ఉంది.'

No comments:

Post a Comment