Thursday, August 22, 2024

సహనం స్వర్గానికి, సాఫల్యానికి సోపానం - Patience is the stairway to heaven, to success part 02

సహనం అంటే ఏమిటి : నిర్దిష్ట లక్ష్యాలను సాధించడానికి భావోద్వేగాల్ని అదుపులో ఉంచుకుంటూనిరంతరం అంకిత భావంతో చేసే కృషిఅవాంతరాలెదురైన సందర్భాల్లో సైతం పక్కకు తప్పుకోకుండా ఆత్మస్థైర్యంతో పట్టుదలతో ఎదుర్కోవడంపొగడ్తలకువిమర్శలకు ప్రాధాన్యమివ్వకుండా చేసే యజ్ఞం. కార్యక్షేత్రం ఏదైనా కోరుకున్న ఫలితాలను సాధించాలంటే శిఖరాలను అధిరోహించాలంటే సహనం తప్పనిసరి. ప్రపంచ మనుగడే సహనంతో ముడివడి ఉంది.



సహనం లోపించడంవల్ల కలిగిన అనర్థాలకు చరిత్ర ఘట్టాలే  మనకు సాక్ష్యాలు. గొప్ప గొప్ప సామ్రాజ్యాలు బుగ్గిపాలు కావడంగొప్ప నియంతలు మట్టిలో కలవడం లాంటివి ఎన్నో జరిగాయి. అసహనంతో నిండిన మనసు అసూయాద్వేషాలకు నివాసస్థలం.

శాంతం అవసరమని మన పూర్వీకులు నేర్పించారు. జీవితంలో ఆధ్యాత్మిక లక్షణాలను నేర్చుకోవాలన్నాభౌతికపరమైనవి దక్కించుకోవాలన్నా మనిషికి సహనం తప్పనిసరి. చాలామంది ఎన్నో ముఖ్యమైన విషయంలలో 'అది నాకు సంబంధించింది కాదుఅని కొట్టిపారేస్తుంటారు. మనిషి తన జీవన విధానాన్ని పరిశీలిస్తే ప్రతిరోజూ తమ ప్రమేయం లేకుండానే ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంతో కొంత తెలిసోతెలియకో అనుసరిస్తూనే ఉంటాడు. ఇందులో గమ్మత్తేమిటంటే తను అనుసరిస్తున్నది ఆధ్యాత్మిక సంబంధమైనదని భావించకపోవడం.

పరమత సహనం లేనందువల్లే ఎన్నో వికృతమైన పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. విచిత్రమేమిటంటే అన్నిమతాలు సహనాన్నే బోధిస్తాయి. వాటిని చదవడంవినడంతో సరిపోదు హితభోదలు చేసే గ్రంథాల మర్మం కనుగొన్న వాడే సహనాన్ని అర్ధం చేసుకోగలడు ! మనిషికి సరైన వైఖరివిశ్వాసం ఉంటే నిస్సహాయ పరిస్థితుల్లో సైతం అత్యద్భుతమైన మార్పులు చోటు చేసుకుంటాయి. సహనం నిండుగా ఉంటే దైవ సహాయం తోడై కొండలను సైతం కదిలించవచ్చునని గ్రహించాలి. ఈ విషయంలో మనిషి తప్పు కాని మతం కాదుసహనం ఉన్న వానికే తానేమిటితన కుటుంబంఊరుదేశం గురించి ఆలోచనవిచక్షణలు కలుగుతాయి !!

అల్లాహ్ ఆదేశం  సహనం

ఇమామ్ ఇబ్న్ తైమియా (రహ్మ) ఇలా అన్నారు: అల్లాహ్  తన గ్రంథంలోలో తొంభైకి పైగా చోట్ల సహనం గురించి ప్రస్తావించాడు. దానిని ప్రార్థనతో ముడిపెట్టాడు. ఇలా అన్నాడు: విశ్వాసులారా! సహనం వహించిప్రార్థనచేస్తూ (మా)సహాయం అర్థిస్తూ ఉండండి. నిశ్చయంగా అల్లాహ్  సహనం వహించేవారికే తోడుగా ఉంటాడు. (అల్-బఖరహ్: 153)

 ప్రవక్త (స) సంప్రదాయం సహనం:

అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ (రజి) కథనం: దైవ ప్రవక్త (స) ఇలా అన్నారు;  ఇప్పటికీ నాకు ప్రవక్తల్లో ఎవరో ఒకరి సంఘట  ప్రత్యక్షంగా చూస్తున్నానేమోననిపిస్తోంది. ఆ ప్రవక్తను ఆయన జాతి ప్రజలు రక్తసిక్తమయ్యేలా కొట్టారు. అప్పుడు ఆ ప్రవక్త “ఓ అల్లాహ్! నా జాతి వారు అమాయకులు. వారికేమీ తెలీదునువ్వు వారిని క్షమించు” అని ముఖం నుంచి కారుతున్న రక్తాన్ని తుడుచు కుంటూ దైవాన్ని వేడుకోసాగాడు. (బుఖారీ - ముస్లిం) - ఆయనెవరో కాదు స్వయంగా మన ప్రియ ప్రవక్త ముహమ్మద్ (స) వారే.

దైవ ప్రవక్త (స) ఇలా అన్నారు: ఎవడైతే యాచించకుండా ఉండటానికి ప్రయత్నిస్తాడో అల్లాహ్ అతన్ని కాపాడుతాడు. నిరపేక్షా భావం అలవరచుకోవాలనుకున్న వ్యక్తిని అల్లాహ్ నిరపేక్షాపరునిగా చేస్తాడు. సహనం కోరే వ్యక్తికి అల్లాహ్ సహనం వహించే సద్బుద్ధిని ప్రసాదిస్తాడు. మనిషికి ఇవ్వబడిన కానుకల్లో ఓర్పును మించిన మేలైనవిశాలమైన కానుక మరొకటి లేదు. (బుఖారీ- ముస్లిం)

మంచి కాలం మించిపోతుంది - మనము ఈ ప్రసంగ  వింటుండగానే కొన్ని నిమిషాలు దొర్లిపోయాయి. నిమిషాలే కాదు మన గతంవర్తమానంభవిష్యత్తు కూడా గడిచిపోతుంది.  ఈ చరాచర జగత్తు అంతా ఒక సమయలో  పుట్టి మరో సమయంలో ముగియానికే. 

  'గత యుగాల గురించి మనకేం పెద్దగా ఏమీ   తెలీదు. అలాగే భవిష్యత్తును తెలుసుకోలేం...  వర్తమానం  కొంత వరకు మన చేతుల్లో ఉంది..  దాన్ని  ఎలా సద్వినియోగ పర్చుకోవాలో  ఆలోచించాలి.  వందేళ్ల మనిషి జీవితం ఎంత స్వల్పమైందోజగత్తులో తన స్థానమెంటోస్థాయి ఏంటో తెలుసుకుని మనిషి ప్రవర్తించాలి. ఆనంతం విశ్వంతో పోల్చుకుంటే మనిషి ఎంత స్వల్పమో తెలుసుకుని నడుచుకోవాలి. కాలగమనం మనకో పాఠం నేర్పుతుంది. ముందుకు సాగడమే మన కర్తవ్యమని,  నిరాశ నిశ్ప్రుహలకు  అతీతంగా  విద్యుక్త ధర్మాన్ని ఆచరించేవారికి  సమయం కూడా  సహస్ర హస్తాలతో సహకరిస్తూనే ఉంటుంది.

 నాకు కాలం కలిసిరావడం లేదు. ఏం చేసినా పలితం ఉండడం లేదు. చోటు మారితే ఏమైనా ఫలితం ఉంటుందాతేదీ మారితే ఫలితం ఏమైనా ఉంటుందా?   'చోటు మారడం వల్ల జీవితంలో ఏ మార్పూ ఉండదు.  తేదీ మారడం వల్ల జీవితంలో ఏ మార్పూ చోటు చేసుకోదు.   మన  మనస్సు మారాలి,  మనోబలం లేనిదే ఆధ్యాత్మికంగానే కాదు. ప్రాపంచికంగా కూడా అభ్యున్నతి సాధించలేం. తనపై తనకు నమ్మకం లేనివాళ్లకు ఈ రమజాను శుభ కాలం కూడా ఏం సహకరిస్తుంది? దృఢమైన సంకల్పంతో ప్రయత్నం చేయడమే మన  కర్తవ్యం.

ఏజాతి అయినా తనను తాను సంస్కరించుకోనంత వరకూ అల్లాహ్  దాని పరిస్థితి మార్చడు. ఇదొక యదార్థం. (అర్-రాద్: 11)


కొందరు  నిద్ర పట్టక  అశాంతితో తన కష్టాల గురించి ఆలోచిస్తూ ఓ ఇటూ అటూ  తిరుగుతుంటారు . సంఘటనలు సముద్రంలో అలల్లా వస్తూపోతూ ఉంటాయి. ఎరుక లేకపోవడం వల్లనే ఇంత బాధ కలుగుతుంది. కొద్ది రోజులయ్యాక మనమేనా బాధపడింది! అని నవ్వుకుంటాము. నిద్రలో నుంచి మేలుకున్నాక కలకు ఎంత విలువనిస్తామో. జ్ఞానవంతులవయ్యాక జీవితంలో కష్టనష్టాలకు అంతే  విలువనిస్తాము.  (ఇంకా ఉంది)  


No comments:

Post a Comment