అందరి అవసరం సజ్జన సహచర్యం
విశ్వాసులారా! అల్లాహ్ కు భయపడండి. నిజాయితీపరులకు తోడుగా ఉండండండి. (అత్-తౌబా: 119)
స్నేహం ఓ మధురమైన అనుభూతి. దీనికి వయసుతో నిమిత్తం లేదు. ఆటపాటలాడే బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు అందరిలో స్నేహ భావం ఉంటుంది. హృదయపు తలుపును ఒక్కసారి తడితే.. అందులోని మాధుర్యమంతా ప్రతి హృదిలో గుబాళిస్తుంది. ప్రతిఫలాన్ని ఆశించని ఆ బంధం మొగ్గలా ప్రారంభమై.. మహావృక్షంగా ఎదిగి జీవితాంతం తోడునిస్తుంది... ఇద్దరు వ్యక్తులకు, ఇరువురి మనసులకు సంబంధించిన ఈ 'స్నేహం' తరతరాలకు తీపిని పంచుతోంది.. కాలాలకతీతంగా మైత్రి మధురిమను పెంచుతోంది.
జన సమూహంలో సత్ప్రవర్తన కలిగినవారిని సజ్జనులని, దుర్మార్గంగా ప్రవర్తించేవారిని దుర్జనులని పిలవడం సాధారణం. సజ్జన సాంగత్యంలో చేరాలి, దుర్జన సహవాసం విడవాలి. మంచి, చెడు- మనిషికి రెండు రెక్కలు. వాటితో సమాజపు వీధుల్లో విహరిస్తాడు. కొందరితో మంచిగా, మరి కొందరితో చెడుగా ప్రవర్తిస్తాడు. తిరస్కారం, పురస్కారం రెండూ మనం చేసే పనుల వల్ల కలుగుతాయి. చుట్టూ చేరినవారు మంచి సలహాలతో ప్రభావితం చేస్తే వ్యక్తిగతంగా, సామూహికంగా ప్రయోజనం కలుగుతుంది. వ్యతిరేకంగా పెడదారి పట్టిస్తే అందరికీ దుర్గతి తప్పదు.
పిల్లల మస్తస్క వికాసానికి ప్రియ నేస్తం పుస్తకం
ఏ దేశంలోనైతే సమృద్ధిగా బాల సాహిత్యం వర్ధిల్లదో ఆ దేశ ఉజ్జ్వల భవిష్యత్తును కలగనటం వ్యర్థమే. పిల్లలు లేని ప్రపంచాన్ని మనం ఊహించలేనట్లే, పిల్లలకు పుస్తకాలు అందని లోకాన్ని కూడా ఊహించలేం. పిల్లలకు బాల్యం నుంచే మంచి సాహిత్యాన్ని అందిస్తే ఆ బాల్యం భవిష్యత్తులో చక్కని దేశాన్ని, భవిష్యత్తును నిర్మిస్తుంది. బాల సాహిత్య వికాసం, ప్రచారాల్లో తొలి పాత్ర పత్రికలదైతే తరువాత స్థానం సాహిత్య సాంస్కృతిక సంస్థలు, బాలల వికాస కేంద్రాలది.
ఒడి, బడి, ప్రార్థనాలయం, మద్రసా, మసీదు ఏదైనా కావచ్చు అక్కడికి వచ్చే బాల బాలికల కోసం సాహిత్యాన్ని అందుబాటులో ఉంచితే అది ఉత్తమ సమాజ నిర్మాణానికి దోహద పడుతుంది. పిల్లలకు సమృద్ధిగా పోషకాలు కలిగిన ఆహారాన్ని అందించేందుకు డాక్టర్లను సంప్రదిస్తాం. అదేవిధంగా పుస్తకాలను అందించాల్సిన బాధ్యత తల్లితండ్రులుగా, సామాజికులుగా మనపైనా ఉన్నది. అప్పుడే శారీరకంగానే కాక మానసికంగా పిల్లల ఎదుగుదల సాధ్యం. . నేటి బాలలే రేపటి పౌరులు. వాళ్ళకు సరైన దిశానిర్దేశం కోసం సంస్కారంతో పాటు సాహి త్యం దోహదపడుతుంది. బాలల కోసం సృష్టిస్తున్న సాహిత్యం ‘క్షమతా పూర్ణంగా, స్వభావ పూర్ణంగా ఉండాలి. బాలల ఆకాంక్షలకు అనుగుణంగా, సమస్యలకు సమాధానంగా ఉండాలి’ అప్పుడే ఆ సాహిత్యం వాళ్ళకు నచ్చుతుంది.
విదేశాల్లోని పాఠశాలల్లో తప్పని సరిగా పిల్లల చేత గ్రంథాలయాలను వినియోగింప జేస్తున్నట్టు మనం మన వీధుల్లో, ధార్మిక కేంద్రాల్లో, పాఠశాలల్లో బాలల గ్రంథాలయాలను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే కొత్త తరం సమున్నతంగా ఎదుగుతుంది. పండుగలకు కొత్తబట్టలు, పుట్టిన రోజులకు బొమ్మ లు ఇచ్చినట్టే పిల్లలకు ప్రతి సందర్భం లో పుస్తకాలను అందించినప్పుడు అందరి మేలు కోరే నేస్తం పుస్తకం అన్న మాట నిజం అవుతుంది.
మనిషిలో ఉండే నాలుగు అంతఃకరణాలు మనసు, చిత్తం, బుద్ధి, అహంకారం అని పెద్దలు చెబుతారు. మనసులో పరిపరి విధాల ఆలోచనలు వస్తాయి. మనం చూసే చూపు, వినే మాటలు, తినే ఆహారం- మనసులో ఆలోచనలకు మూలాలు. వివేకం, విచక్షణతో మంచి చెడులను విశ్లేషించేది చిత్తం. ఇటువంటి విశ్లేషణా వడపోతను సాంగత్యం తప్పనిసరిగా ప్రభావితం చేస్తుంది. సామిరీ పదేపదే చెప్పిన చెడు మాటలు ఒక జాతి చిత్తాన్నే మార్చేశాయి. తర్వాత ప్రవక్త మూసా (అ) జాతిని నిలదీయగా వారు ఇలా బదులిచ్చారు;
“మా అంతట మేము వాగ్దానభంగం చేయలేదు. అసలేం జరిగిందంటే మేము నగల బరువు మోయలేక చస్తున్నాం. అంచేత వాటిని కాస్తా తీసిపారేశాం, అంతే” అన్నారు వారు. ఆ తర్వాత సామిరీ తన పాత్ర నిర్వహించాడు. అతను వారికోసం ఒక ఆవుదూడ విగ్రహం తయారుచేశాడు. ఆ విగ్రహంలో నుంచి దూడ అరుపులాంటి ధ్వని వినవస్తుండేది. జనం (ఆ చోద్యం చూసి) “ఇదే మన దైవం. మూసా దైవం కూడా ఇదే. మూసా దీన్ని మరచిపోయాడు” అని అరిచారు. (కాని) అది తమకు సమాధానమివ్వ దని, ఎలాంటి లాభనష్టాలు కలిగించలేదని వారు గమనించడం లేదా? (తాహా: 87-89)
బుద్ధి మంచి నిర్ణయం చేసినా మనిషిలోని అహంకారం దాన్ని తొక్కిపట్టి తప్పుడు దారికి మళ్ళిస్తుంది. సరైన నిర్ణయం వెనక మంచి స్నేహితుల ప్రోత్సాహం ఉంటే అది సజ్జన సాంగత్యంగా మారి వ్యక్తిగతంగా, సామూహికంగా మేలు చేస్తుంది. అధికారం, ఐశ్వర్యం, కీర్తిప్రతిష్టలు మన చుట్టూ సమూహాన్ని ఏర్పరుస్తాయి. దాన్ని ఛేదించి ఎవరూ లోపలికి వెళ్ళలేరు.
ఒంటరిగా కన్నా పదిమందితో కలిసి చేసే సామూహిక కార్యక్రమాలు జనంలో స్ఫూర్తి నింపుతాయి. సామూహిక కర్మలకు, ఆరాధనలకు పెద్ద పీట వేస్తుంది. ఇస్లాం మూల స్తంభాల్లోని ఒక్క స్తంభము - సాక్ష్య వచనం మాత్త్రమే వ్యక్తిగతమైనది. మిగతా - నమాజు, జకాత్, ఉపవాసాలు, హజ్ - సామూహిక ఆరాధనలు. ముఖ్యంగా హజ్ మహారాధన సమయంలో లక్షలాది గొంతులు లబ్బయిక్ అల్లాహుమ్మ లబ్బయిక్ అన్న స్వచ్ఛమైన తౌహీద్ నినాదాన్ని ఆలపిస్తాయి. ఏడాది సాంతం విశ్రాంతి లేకుండా, ఆవిరళంగా 24 గంటలూ ఉమ్రాకు వచ్చే జన సంద్రం నోట తౌహీద్ స్వర్ణకార ధ్వని నిజ దైవమైన అల్లాహ్ ఘనకీర్తిని చాటుతుంది. తవాఫ్ మరియు సయీ సందర్భంగా ముస్లిం జనం చేసే అల్లాహ్ స్త్రోత్త గానంతో పవిత్ర పరిసరాలన్నీ మారుమోగుతాయి.
బలమైన సజ్జనుల సమూహం ఏదైనా సాధించగలదు. బలవంతమైన సర్పం కూడా చలిచీమల చేత చిక్కితే మరణం తప్పదు. అన్నారు పెద్దలు. అడవిలో సమూహంగా మేతమేసే పశువులను పులి ఏమీ చేయలేదు. సంఘటితంగా ఎదిరిస్తే తోక ముడిచి పారిపోక తప్పదు. ఇస్లామీయ తొలి సంగ్రామం బద్ర్ లో అవిశ్వాసుల సంఖ్య 1000 మంది అయితే, ముస్లింల సంఖ్య 313, ద్వీతీయ సత్య సమరంలో అవిశ్వాసుల సంఖ్య 3000 మంది అయితే, ముస్లింల సంఖ్య 850, కందక సంగ్రామంలో అవిశ్వాసుల సంఖ్య 10000 మంది అయితే, ముస్లింల సంఖ్య 3000, ఖైబర్ యుద్ధంలో అవిశ్వాసుల సంఖ్య 10000 మంది అయితే, ముస్లింల సంఖ్య 1400, మొతః యుద్ధంలో అవిశ్వాసుల సంఖ్య 200000 మంది అయితే, ముస్లింల సంఖ్య 3000, హునైన్ సంగ్రామంలో అవిశ్వాసుల సంఖ్య 25000 మంది అయితే, ముస్లింల సంఖ్య 12000, తబూక్ యద్ధంలో అవిశ్వాసుల సంఖ్య 40000 మంది అయితే, ముస్లింల సంఖ్య 30000, పై యుద్ధాలన్నింటిలోనూ ఉహద్ యుద్ధాన్ని మినహాయించి అంతిమ విజయం ముస్లింల కైవసం అయ్యింది. సజ్జన సమూహంతో ఏర్పడే సాంగత్యం ఎప్పటికైనా విజయాన్ని ప్రసాదిస్తుంది. పశు గుణాలు తొలగితే మనిషి పశుపతి కాగలడు. సద్గుణాలు, సత్ప్రవర్తన, మానవత్వం- ఇవే సజ్జనుల లక్షణాలు.
సహచర్యం - అది మనల్ని ఉన్నత ఆశయాల పూర్తికై, ఉత్తమ గుణాల పరిపక్వతకై, అత్యుమ నైతిక ప్రమాణాల పరిపూర్తికై తోడ్పడాలి. మంచిని పెంచాలి, చెడును తుంచాలి. న్యాయం కోసం పోరాడాలి. ధర్మం కోసం ధ్వజమెత్తాలి. హక్కుల పరిరక్షణకై పరిశ్రమించాలి, పీడిత ప్రజలకు అండగా నిలవాలి. అనాథలను అనుఁగు సంతానంగా భావించాలి. నిరాశ్రయులకు ఆశ్రయమివ్వాలి. అభాగ్యులను అక్కున చేర్చుకోవాలి. గాడి తప్పిన బ్రతుకుల్ని గాడిలోకి తేవాలి. మార్గం తప్ని మనుషుల్ని మాధవుని బాటన నడిపించాలి. ప్రేమించాలి, క్షమించాలి, అందరితో అత్యుత్తమంగా వ్యహరించాలి. అది విధరాలి కన్నిటిని తుడవాలి. బాధాతప్త హృదయుణ్ణి ఓదార్చాలి. సమాజ శ్రేయం కోసం, దేశ సంక్షేమం కోసం, లోకశాంతి కోసం అలుపెరగని కృషి చేసేలా మనల్ని తీర్చిదిద్దాలి.అలా మనం చేసి నాడు విశ్వకారుణ్య ప్రభువయిన అల్లాహ్ మన విషయంలో చేసిన వాగ్దానం అక్షర సత్యమయి నిలుస్తుంది. ”విశ్వసించిన ఇలాంటి స్త్రీ-పురుషులకు క్రింద కాలువలు ప్రవహించే స్వర్గ వనాలను ప్రసాదిస్తానని అల్లాహ్ వాగ్దానం చేశాడు. అక్కడ వారు కలకాలం ఉంటారు. శాశ్వత స్వర్గ వనాలలో అందమైన భవనాలు వారి కొరకు ఉంటాయి. వీటన్నింటికి మించి గొప్పదయిన అల్లాహ్ ప్రసన్నత వారికి లభిస్తుంది. గొప్ప సాఫల్యం, మహా విజ యం అంటే ఇదే”. (9: 71,72)
ఓ సహాబి మదీనా వచ్చి రాగానే అల్లాహ్ సమక్షంలో మోకరిల్లి చేసిన దుఆ”ఓ శుభకరా! అపరిచిత ప్రాంతంలో నాకో మంచి సావాసిని అనుగ్రహించు” అని. ఫలితంగా అల్లాహ్ అబూ హురైరా (ర) వంటి మిత్రుణ్ణి ఆయను ప్రసాదించాడు. కాబట్టి మనమూ ఆ అనుగ్రశీలిని వేడుకుందాం రండీ! ”అల్లాహ్‌ా ఓ దయాకరా! మా తప్పిదాలు బ్రోవరా, మా జీవితాలు మలచరా! కేవలం నీ ప్రసన్నత కోసం పరస్ప రం ప్రేమించుకునేవారి జాబితాలో చేర్చి మహోన్నత నీ అర్ష్ నీడలో చోటుననుగ్రహించు స్వామీ!
No comments:
Post a Comment