Saturday, August 24, 2024
ఏతెకాఫ్ ప్రాశస్త్యం- etikaf is recommended
మీరు మసీదుల్లో ఎతెకాఫ్ (తపోనిష్ఠ) పాటిస్తున్నప్పుడు మాత్రం మీ భార్యలను కలుసుకోకూడదు. ఇవి దేవుడు నిర్ణయించిన హద్దులు. వాటి దరిదాపు లకు వెళ్ళకండి. (బఖరః - 187)
రమజాను మాసం ఉందన్న భరోసాతో చెబుతున్నాను: పశ్చాత్తాపం చెందిన మనస్సుతో, అశ్రువులు నిండిన కళ్ళతో మీ ప్రభువు సన్నిధిన మోకరిల్లండి. పూర్తి ఏకాగ్రతతో ఆయన వైపునకు మరలండి. రమాజను మాసంలోని ప్రతీ రాత్రి అనేకానేక మందిని నరకాగ్ని నుండి ముక్తిని ప్రసాదించే ఆ మోక్ష ప్రదాత, ప్రతి రోజు యేడాది సాంతం ‘రాత్రి తప్పు చేసిన వారున్నారా! రండి నేను మీ తప్పులను మన్నిస్తాను, ఉదయం తప్పు చేసిన వారున్నారా? రండి నేను మీ తప్పులను మన్నిస్తాను’ అని క్షమాశీలి మీకిస్తున్న పిలుపు ఇది: ”తమ ఆత్మలపై అన్యాయం చేసుకున్న ఓ నా దాసులారా! నా కారుణ్యం యెడల నిరాశ చెందకండి. నిశ్చయంగా అల్లాహ్ సకల పాపాలను మన్నిస్తాడు. నిస్సందేహంగా ఆయన పరమ క్షమాశీలి, అపార దయా నిధి”. (జుమర్; 53)
ఈ ప్రభువు వరాల వసంతం మీ ప్రాంగణంలో లైలతుల్ ఖద్ర్ శుభాలతో పాదం మోపుతుంది. లైలతుల్ ఖద్ర్ రాత్రి ఒక్క ఘడియ 30 వేల ఘడియల కంటే విలువయినదిగా మారి పోతుంది. ఈ మాసంలోని క్షణక్షణం క్షమా వర్షం కురుస్తూనే ఉంటుంది. ఈ మాసంలో కురిసే క్షమను మీరు కోరుకున్నట్లే, మీ నుండి మీ తల్లిదండ్రులు, భార్య పిల్లలు, బంధు మిత్రులు, ఆప్తులు, సహుద్యోగులు, స్నేహితులు, మీ వద్ద పని చేసే వారు సయితం కోరుకుంటారు. వారిని క్షమించడం అలవాటు చేసుకోండి. కోపాన్ని ద్రిగమింగండి, అందరి యెడల ఉదార వైఖరి కలిగి వ్యవహరించండి. విశ్వాసం తర్వాత స్వర్గానికి అర్హుల్ని చేసేది మీ ఉత్తమ నడక, నడవడికే అని గుర్తించండి. ”బంధుత్వాన్ని బల పర్చేవారిని నేను బల పరుస్తాను, దాన్ని విచ్ఛిన్న పరచిన వారిని నేను విచ్ఛిన్న పరుస్తాను” అని స్వయం అల్లాహ్ మాటిచ్చాడు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి.
రమజాను మాసం మన ముంగిట వాలిన దైవ అతిథి. ఈ మాసాన్ని మీరు సత్కరించా లంటే, సహరీ, ఇఫ్తార్ వేళల్లో షడ్రుచులు మేళవించిన ఆహార పదా ర్థాలు పేర్చడం వల్ల కుదరదు. నిజంగా మీరు నన్ను సత్కరించాలంటే, ఖుర్‌ఆన్ పారాయణాల ద్వారా,తరావీహ్ నమజుల ద్వారా, దాన ధర్మాల ద్వారా, ఏతికాఫ్, లైలతుల్ ఖద్ర్ అన్వేషణ ద్వారా, నిరతం అల్లాహ్ నామ స్మరణ చెయ్యడం ద్వారా మాత్రమే కుదురుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మాసాన్ని సత్కరించడం అంటే మీ సత్కారానికి, ప్రభువు మీకు చేసే సన్మానానికి మార్గం సుగమం చేసుకోవడమే. ఈ మాసాన్ని మీరు ఎంతగా సత్కరిస్తారో అల్లాహ్ మీ యెడల అంతకు మించి ప్రసన్నుడవుతాడు. ఈ ప్రపంచానిదేముంది,ఇదో మాయా వస్తువు, మోసం, ఆట విడుపు అంతే. అసలు జీవితం పరలోక జీవితం. అసలు సంతోషం పరలోక సంతోషం, అసలు విజయం పరలోక విజయం. అవును, ‘ఎవరు నరకాగ్ని నుండి కాపాడ బడి స్వర్గంలో ప్రవేశం కల్పించ బడ్డారో వారే మహోన్నత విజయాన్ని సొంతం చేసుకున్న వారు”. (ఆల్ ఇమ్రాన్;185)
రమజాను మాసం దుఆల మాసం కూడా. లేవండి! అల్లాహ్‌తో మీ బాధల్ని చెప్పు కోండి. మీరు పడ్డ కష్టాల్ని, నష్టాల్ని ఆయనతో షేర్ చేసుకోండి. మీ మొరలను ఆలకించేవాడు ఆయన, మీ అక్కరలను తీర్చేవాడు ఆయన. ప్రపంచంలో జరుగుతున్న దాష్టికాన్ని, ఫలస్తీనాలో సాగుతున్న పైశాచికాన్ని, సిరియాలో రగులుతున్న మారణ హోమాన్ని, ఇరాక్‌లో సాగుతున్న కీచక క్రీడను, యమన్‌లో రాజేయబడిన నిప్పు కుంపటిని, జాతీయ స్థాయిలో జరుగుతున్న దౌర్జన్యాన్ని, అంతర్జాతీయ స్థాయిలో జోరు మీదున్న దుష్ప్రచారాన్ని – అంతా అల్లాహ్‌తో చెప్పుకొని ఏడ్వండి. అంతా వినేవాడు, ఎవరికి ఎప్పుడు ఏది ఇవ్వాలో ఇచ్చేవాడు ఆయనే. ఆయన అందరికన్నా అధిక ప్రేమ గలవాడు, అందరికన్నా అధిక కరుణ గలవాడు, అందరి కన్నా అధిక క్షమ గలవాడు, అందరికన్నా ఎక్కువగా మనల్ని రక్ష్షించే వాడు, అందరికన్నా ఎక్కువగా మనల్ని అనుగ్రహించే వాడు. అందరి కన్నా గొప్ప ఉపాధి ప్రదాత, విధి విధాత, మహోన్నత ఆర్ష్‌కి యజమాని. ఇవన్నీ మనం నిష్టగా చేసుకోవాలంటే - ఏతికాఫ్ కు మించింది ఏది లేదు.
హజ్రత్ ఇబ్నె ఉమర్ (రజి) కథనం: దైవప్రవక్త (సల్లం) రమజాన్ మాసంలోని చివరిదశకంలో ఏతెకాఫ్ పాటించేవారు. (బుఖారీ-ముస్లిం)
హజ్రత్ ఆయిషా (రజి. అన్హ) కథనం: దైవప్రవక్త (సల్లం) జీవితాంతం రమజాన్ మాసంలోని చివరి దశకంలో ఏతెకాఫ్ పాటించారు. ఆయన తర్వాత ఆయన సతీమణులు (కూడా) ఏతెకాఫ్ పాటించారు. (బుఖారీ-ముస్లిం)
రమజాన్ మాసంలోని చివరి దశకంలో ఏతెకాఫ్ పాటించటం దైవప్రవక్త సంప్రదాయం. స్త్రీలు కూడా ఏతెకాప్ లో కూర్చోవచ్చు. అయితే ఏతెకాఫ్ ఇంట్లో కాదు, మస్జిద్లోనే పాటించాలి. అందుకని ఒకవేళ మస్జిద్లో స్త్రీల కొరకు పురుషుల నుండి వేరుగా ప్రత్యేకంగా, పూర్తి కట్టుబాట్లతో ఏతెకాఫ్ పాటించటానికి అవకాశముంటే అలాంటి చోట్ల స్త్రీలు ఏతెకాఫ్ పాటించవచ్చు. లేకపోతే వారు ఏతెకాఫ్ పాటించకపోవటమే మంచిది.
హజ్రత్ ఆయిషా (ర.అ) కథనం : “(రమజాన్ నెల) చివరి దశకం మొదలైందంటే చాలు, దైవప్రవక్త (సఅసం) రాత్రి జాగారం కోసం ఉపక్ర
మించేవారు. తన సతీమణులను కూడా మేల్కొనమనేవారు.” (బుఖారీ, ముస్లిం)
హజ్రత్ ఆయిషా (ర.అ) కథనం : “దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ‘ఏతెకాఫ్' కొరకు సంకల్పిం చుకుంటే ఫజ్ నమాజ్ చేయగానే 'ఏతెకాఫ్' స్థానంలోకి వెళ్ళిపోయేవారు." (బుఖారీ, ముస్లిం)
మరో హదీసు : దైవప్రవక్త (సఅసం) జీవితాంతం - రమజాన్ చివరి దశకంలో ఏతెకాఫ్ పూనేవారు. ఆయన (స) మరణించిన తరువాత ఆయన (స) సతీ మణులు ఏతెకాఫ్ పాటించసాగారు. (బుఖారీ, ముస్లిం)
ఏతెకాఫ్ సున్నత్ అన్న దానికి ఈ హదీసు తార్కాణం. దైవప్రవక్త (స) తన జీవితకాలంలో దీనిని ఏటేటా పాటించగా, ఆయన (స) తదనంతరం ఆయన (స) సతీమణులు దీనిని అనుసరించారు.
హజ్రత్ ఆయిషా కథనం : దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మస్జిద్ (ఏతెకాఫ్ స్థితిలో) నుండగా తన తలను నా వైపునకు జరిపే వారు. నేను ఆయన (స) తల దువ్వే దానిని. ఆయన (స) ఏతెకాప్ లో ఉన్నప్పుడు - కాలకృత్యాలు తీర్చుకోవటానికి తప్ప ఇంటికి వచ్చేవారు కాదు. (బుఖారీ, ముస్లిం-)
హజ్రత్ ఆయిషా (ర.అన్హా) ఇలా వివరించారు : “ఏతెకాఫ్ వ్రతానికి పూనుకున్నవారు వ్యాధిగ్రస్తులను పరామర్శించరాదు, అంత్యక్రియల (జనాజా) నమాజులో పాల్గొనరాదు, భార్యను ముట్టుకోవటం గానీ, సంభోగించటం గానీ చేయరాదు. కాలకృత్యాలు తీర్చుకోవటానికి తప్ప
మస్జిద్ బయటికి వెళ్లరాదు. జామె మస్జిద్ తప్ప ఏతెకాఫ్ పాటించరాదు. ఇది సున్నత్ (ప్రవక్త సంప్రదాయం).” (అబూ దావూద్,)
ఏతెకాఫ్ మొత్తానికి మస్జిద్ లోనే పాటించాలి. జామె మస్జిద్ అంటే ఇక్కడ భావం ఏమిటీ? ఏ మస్జిద్లో సామూహిక నమాజ్ జరుగుతుందో ఆ మస్జిద్ నిస్సంకోచంగా 'ఏతెకాఫ్' పాటించ వచ్చునని ఇమామ్ అహ్మద్, ఇమామ్ అబూ హనీఫా (రహ్మ) అభిప్రాయపడ్డారు.
హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు - “ఏతెకాఫ్ లో ఉన్న వారికై ఉపవాసం అనివార్యం కాదు. ఒకవేళ వారు దాన్ని తమపై విధించుకుంటే విధించు కోవచ్చు.” (దీనిని దారెఖుత్నీ, హాకిమ్ ఉల్లేఖించారు )
రమజానేతర మాసాల్లో 'ఏతెకాఫ్' పాటించేవారు ఉపవాసాన్ని విధిగా పాటించాలా? పాటించకపోయినా ఫరవాలేదా? ఈ విషయమై విద్వాంసుల మధ్య భేదాభిప్రాయముంది. ఉపవాసం పాటించాల్సిందేనని అత్యధిక మంది భావించారు. అయితే దీనికి సంబంధించి స్పష్టమయిన మూలాధారం ఏదీ లేదు. దైవప్రవక్త (స) ఉపవాసం పాటించకుండా 'ఏతెకాఫ్'లో కూర్చున్నట్టు కూడా ఎలాంటి ఆధారం లేదు. ఉపవాసం పాటించగలిగిన పక్షంలోనే 'ఏతెకాఫ్'కు పూనుకోవాలన్న నిబంధన కూడా ఏదీ లేదు.
లైలతుల్ ఖద్ర్ ను పొందే పునీత ప్రాతం ఎతికాఫ్
సజ్జనులయిన మన పూర్వీకులు మూడు పదులను గొప్పవిగా భావించేవారు. రమజాను చివరి దశకం, జుల్‌హిజ్జహ్ తొలి దశకం, ముహర్రమ్ మొధటి పది రోజులు. ఈ మూడు పదుల్లో రమజాను చివరి దశకానికి అగ్ర పీఠం కట్టబెట్టేవారు. కారణం ఈ పది రాత్రుల్లో లైలతుల్ ఖద్ర్ ఉండటమే. ఈ రాత్రి దైవ దూతల నాయకుడ యిన జిబ్రీల్ (అ) ఇతర దైవ దూతల తోడు దివి నుండి భువికి దిగి వచ్చి ఫజ్ర్ వేళ అయ్యేంత వరకూ ఉంటారు అంటుంది ఖుర్‌ఆన్. లైలతుల్ ఖద్ర్ చివరి దశకంలో బేసి సంఖ్య గల రాత్రుల్లో ఉంటుంది అని స్వయంగా ప్రవక్త (స) వారు తెలియజేశారు. ఇతరత్రా ఉల్లేఖనాల ద్వారా రమజాను 27వ తేదీ ఉండే అవకాశాలు ఎక్కువ గా ఉన్నా అన్య రాత్రులలో సయితం అన్వేషణ కొన సాగాలి. ఆ రాత్రికే పరిమితం అయి పోవడం సబబు కాదు. చివరి దశకంలోని ప్రతి రాత్రి-”అల్లాహుమ్మ ఇన్నక అఫువ్వున్ తుహిబ్బుల్ అఫ్వ ఫఅఫు అన్నీ” అని దుఆ చేస్తూ ఉండాలి. రమజాను చివరి రాత్రి అల్లాహ్ ముస్లిం సముదాయానికి క్షమాభిక్ష పెడతాడు. వారికి చెందాల్సిన వెతనాన్ని ఆ రాత్రినే పంచి పెడతాడు. అల్లాహ్ మనందరి తప్పిదాలను మన్నించి, ఇహపరాల మనల్ని
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment